top of page

శాపవిమోచనం - పార్ట్ 1

Updated: Aug 30, 2023


'Sapavimochanam - Part 1/2' - New Telugu Story Written By Mohana Krishna Tata

'శాపవిమోచనం - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సిటీ లో ఆక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం, అలంకరించు కోవడం, అందమైన చేపలు వెయ్యడం చాలా మందికి ఇష్టం. అలా, రంగు రంగుల చేపలు వేసి, వాటిని రోజూ చూస్తూ వుంటే, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చాలా మందికి తెలుసు. ఈ మధ్య, ప్రతి చోట ఆక్వేరియం షాప్స్ డిమాండ్ కు తగ్గట్టు వెలుస్తున్నాయి. ఆక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే, వాస్తు కూడా సాయపడుతుందని కొంతమంది నమ్మకం. అందులో, గోల్డ్ ఫిషెస్ ఉంటే, ఇంకా మంచిదని చెబుతారు.


రాహుల్ తన అమ్మ నాన్న లతో కలిసి, ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఇంతకుముందు, ఒక పల్లెటూరు లో వాళ్ళ నాన్నగారు ఒక బ్యాంకు లో పనిచేసేవారు. ప్రమోషన్ రావడంతో, సిటీ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా, ప్రశాంతంగా ఉండే పల్లెటూరు నుంచి, సిటీ కు రాక తప్పలేదు.. సతీష్ సంధ్య దంపతులకు.


సిటీ లైఫ్ అలవాటవడానికి కొంచం టైం పట్టిందనే చెప్పుకోవాలి ఆ ఫ్యామిలీ కు. అపార్ట్మెంట్ లో ఉండే ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆక్వేరియం రాహుల్ తరచూ చూసేవాడు. అలా.. చాలా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, చూడగా, రాహుల్ కు తనకూ ఆక్వేరియం సొంతంగా ఉండాలని అనుకున్నాడు.


రాహుల్ చాలా తెలివైన అబ్బాయి. దేనికి భయపడకుండా, ముందు అడుగు వేసే స్వభావం ఉన్న అబ్బాయి. చదువుతున్నది ఏడవ తరగతి అయినప్పటికీ, తెలివితేటలు చాలా ఎక్కువ. వాళ్ళ నాన్నగారికి ఆఫీస్ వర్క్ లో కూడా సహాయం చేస్తాడు.


ఇంక సతీష్, ఎప్పుడూ.. ఆఫీస్ వర్క్ తో చాలా బిజీ గా ఉంటాడు. చిన్నప్పుడు సతీష్ ఇంట్లో ఆక్వేరియం ఉండేది. కానీ, ఇప్పుడు ఆక్వేరియం చూసే అంత టైం లేదు సతీష్ కు. ఎప్పుడైనా, అవకాశమొస్తే చూద్దాం అనుకున్నాడు సతీష్. ఇంక సంధ్య మహా ఇల్లాలు. భర్త చెప్పినట్టే చేస్తుంది. కధలు చదవడము బాగా ఇష్టపడుతుంది.


రాహుల్ ఒకసారి తన పేరెంట్స్ తో కలసి, ఒక రెస్టారంట్ కు డిన్నర్ కు వెళ్ళాడు. న్యూ ఇయర్ కు ముందు హోటల్ కు.. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తుంటారు. అలాగే, ఆ సంవత్సరం ఒక కొత్త రెస్టారెంట్ కు తీసుకుని వెళ్లారు. ఇయర్ చివరి లో వెళ్ళే రెస్టారెంట్ లో.. ఏది కావాలంటే అది తిని, ఒక మంచి సినిమా చూసి రాత్రికి ఇంటికి వస్తారు.


రెస్టారంట్ ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఆక్వేరియం ఉంది. అక్కడ ఆక్వేరియం లో రంగు రంగు చేపలు చూసి చాలా ఆనందించాడు రాహుల్. అలాంటి ఆక్వేరియం కావాలని వాళ్ళ నాన్న ని అడిగాడు రాహుల్.


"అలాగే! ముందు నువ్వు ఆక్వేరియం గురించే తెలుసుకో" అన్నాడు తండ్రి.


"చిన్నప్పుడు మీ ఇంట్లో, ఆక్వేరియం ఉండేదని అమ్మ చెప్పింది. ఇంటికి వెళ్ళాక, నాకు మీ చిన్ననాటి ఆక్వేరియం గురించి చెబుతారా?" అని అడిగాడు రాహుల్


"అలాగే రాహుల్" అన్నాడు తండ్రి


ఇంటికి వచ్చాక రాహుల్ సోఫా లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.


"ఏమిటి రాహుల్ ఆలోచిస్తున్నావు?" అన్నది అమ్మ

"ఆక్వేరియం గురించి" అన్నాడు రాహుల్


"అమ్మా! నీకు నాన్నగారు చిన్నప్పుడు చూసుకున్న ఆక్వేరియం గురించి తెలుసా?"

"మీ నాన్నగారినే అడుగు"


"నాన్న! నాకు చెబుతానన్నారుగా! చెప్పండి!"


"అది నా చిన్ననాటి మాట. నేను నీ అంత ఉన్నప్పుడు, నాకు ఆక్వేరియం అంటే మహా సరదాగా ఉండేది.. అప్పట్లో ఆక్వేరియం అంటే చాలా మందికి తెలియదు. ఎక్కడో, రెస్టారంట్ లోని మాత్రమే ఉండేవి. ఇంట్లో పెట్టుకోవడం ఆలోచన తక్కువనే చెప్పాలి.


మా ఇంట్లో ఆక్వేరియం అంటే తెలియదు. మా నాన్నగారికి ఇష్టం కూడా ఉండేది కాదు. కానీ, నాకు ఇష్టం ఉండడం చేత, నాకిచ్చే పాకెట్ మనీ తో, ఆక్వేరియం ఒకటి కొనుక్కున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి రంగు రంగుల చేపలు తెచ్చి, అందులో వేసేవాడిని. ఆక్వేరియం బాగా అలంకరించుకుని, సొంతంగా నేనే లైట్ అమర్చుకున్నాను.


నేను స్కూల్ నుండి, కాలేజీ నుంచి వచ్చాక, దాని ముందు కూర్చొని కొంత సేపు చేపలను అలా చూసేవాడిని. చాలా రిలీఫ్ గా ఉండేది.


"మరి మీ నాన్నగారు ఏమి అనే వాళ్ళు కాదా?" అడిగాడు రాహుల్


"అంతా నేనే చూసుకునే వాడిని కనుక, ఏమి అనేవారు కాదు. అయినా, మా నాన్నగారు చాలా బిజీ గా ఉండేవారు. ఆయనకు అంత టైం ఉండేది కాదు.. ఆక్వేరియం చూడడానికి. తర్వాత.. తర్వాత.. నేను కూడా చాలా బిజీ అయిపోవడం చేత, ఆక్వేరియం పెట్టుకోడానికి అవలేదు.


మళ్ళీ.. మీ అమ్మ తో పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు తన ఇంట్లో ఒక ఆక్వేరియం చూసాను. దాని గురించి మీ అమ్మనే అడుగు చెబుతుంది. "


"అమ్మ!, మీ ఇంట్లో ఆక్వేరియం ఉండేదా?"


"అవును రాహుల్"


"మీ నాన్నగారు, పెళ్ళిచూపులకు వచ్చినప్పుడు, ఫస్ట్ ఆక్వేరియం నే చూసారు. అప్పుడు నన్ను ఎక్కువ.. దాని గురించే అడిగారు.. అంత ఇష్టం అతనికి. ఆ ఆక్వేరియం మా అన్నయ్య చూసుకునేవాడు. వాడికి వెరైటీ చేపలు తెచ్చి వెయ్యాలంటే చాలా ఇష్టం.. అన్నీ రకాల చేపలు అందులో ఉండేవి"

"మరి నువ్వు ఏమైనా చేసేదానివా?

"అప్పడప్పుడు ఫుడ్ వేసేదానిని, వాటర్ మార్చడానికి మా అన్నయ్యకు హెల్ప్ చేసేదానిని"


తర్వాత మా పెళ్లయింది.. ఇప్పుడు నువ్వు ఇంటరెస్ట్ చూపిస్తున్నావు.


రాహుల్, తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా, తన అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ ఫ్లాట్స్ లో ఉన్న ఆక్వేరియం లు చూస్తూ వాటి గురించి అడిగి తెలుసుకునేవాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత..


"నాన్న! ఆక్వేరియం ఎప్పుడు కొంటారు" అని అడిగాడు"

"సండే షాపింగ్ కు వెళ్ళినప్పుడు కొందాం అని చెప్పాడు తండ్రి"


సండే ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసాడు రాహుల్..

సండే సాయంత్రం, రాహుల్ వాళ్ళ నాన్న తో కలిసి కార్ లో ఆక్వేరియం షాప్ కు వెళ్ళాడు. అక్కడ అనేక సైజ్ లో ఆక్వేరియం ఉన్నాయ్. రాహుల్ కు ఒకటి బాగా నచ్చింది. దానిని కొనమని అడిగాడు.


ఇందులో అయితే, గోల్డ్ ఫిషెస్ వేస్తే, చాలా బాగుంటుందని షాపువాడు అన్నాడు.


"అలాగే! ఇవ్వండి" అని రాహుల్ అన్నాడు. రాహుల్ కు గోల్డ్ కలర్ ఫిషెస్ బాగా నచ్చాయి. ఈ గోల్డ్ ఫిషెస్ మొన్ననే వచ్చాయి.. అని ఒక రెండు గోల్డ్ ఫిషెస్, తీసి ప్యాక్ చేసి ఇచ్చాడు.. వాటికీ ఫుడ్ ఎలా వెయ్యాలో చెప్పి కార్ లో పెట్టించాడు షాపువాడు.


రాహుల్.. నాన్న తో కలిసి, ఇంటికి చేరుకున్నాడు. దారిలో రాహుల్ చేపల గురించి తనకు తెలిసిన విషయాలన్నీ నాన్న తో చెప్పాడు.


ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ ఆనందానికి అవధులు లేవు.


"అమ్మా! నాన్న ఆక్వేరియం కొన్నారు. నేను ఇప్పుడు ఫిషెస్ వేస్తాను" అన్నాడు రాహుల్

"అలాగే! రాహుల్.. ముందు స్నానం చేసి రా.. తర్వాత చూద్దాం.. "


ఈలోపు సతీష్ ఆక్వేరియం సెటప్ చేసాడు. అన్నీసెట్ చేసిన తర్వాత, గోల్డ్ ఫిషెస్ ఆక్వేరియం లో వేసాడు. కవర్ లోంచి స్వేఛ్ఛాలోకం లోకి వెళ్ళినట్టు గా ఈదుతున్నాయి గోల్డ్ ఫిషెస్.


రాహుల్ వాటిని చూసి చప్పట్లు కొట్టాడు.


రాత్రి 10 అయినా, రాహుల్ ఇంకా పడుకోకుండా, ఫిషెస్ చూస్తూనే వున్నాడు.

"రాహుల్! వెళ్ళి పడుకో.. రేపు స్కూల్ కు వెళ్ళాలి" అన్నది అమ్మ


ఒకరోజు రాత్రి, రాహుల్, బాత్రూం కు వచ్చినప్పుడు, ఆక్వేరియం లో కి చూసాడు. చేపలు లేకపోవడం తో కంగారు పడి, అటు ఇటు చూసాడు. మళ్ళీ నిద్ర రావడం తో, అక్కడే సోఫా లో పడుకుండిపోయాడు. మర్నాడు ఉదయం, చూసేసరికి చేపలు ఉన్నాయి.


ఎలాగైనా, రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు రాహుల్..


************************************************************************************

ఇంకా వుంది..

************************************************************************************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



Comments


bottom of page