'Sara Maruvu Sodara' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
'సార మరువు సోదరా' తెలుగు కవిత
రచన: సుదర్శన రావు పోచంపల్లి
సార మరువు సోదరా
సంసార మెరుగు తమ్ముడా
కల్లు సార వద్దురా నీ
ఇల్లు గుల్ల జేయ బోకురా
వెన్నె అంటు తన్నె అంటు
కన్ను మిన్ను గానకుండ
పరికరాలు బట్టి నీవు
పగలు రాత్రి దెలియకుండ
పాడు సార తాగి నీవు
కీడు ఏంటొ దెలియకుంటె
కూడు గుడ్డ కరువగును
గూడు నీకు మిగులకుండు
తోడు గూడ దూరమై ఏ
నీడ గూడ దొరుకకుండు
పైక మెంతొ వెచ్చించి
మైక మొందు మార్గమని
కంపుగొట్టు సార నీవు
ఇంపుగా తాగివచ్చి
కదులుకుంటు తూలుకుంటు
కాళ్ళు నిలువ లేకుండ
కళ్ళు చూపు నిలుపలేక
ఒళ్ళు పట్టు వదిలిపోయి
సుళ్ళు దిరుగు నీ మదికి
సూర్యుడే చంద్రుడగును
మైక మంత వదిలి నీవు
మనిషిగా బతుక నెంచి
మంచి మార్గ మెంచుకొని
మరి మరచి పోర సార గోడు
కన్న పిల్ల లందు నీవు
కరుణ జూపి బతుక బూను
ఆలు యందు ప్రేమ తోడ
అసలు మనిషిగుండ జూడు.
సంఘములో గౌరవము
సాధించ బూనుకొమ్ము.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Kommentare