top of page
Writer's picturePeddada Sathyanarayana

 సరదా మిత్రులు 



'Sarada Mithrulu' - New Telugu Story Written By Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 11/09/2024

'సరదా మిత్రులుతెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి





సాదారణముగా ఉద్యోగస్తులు కష్టసుఖాలు, సరదా కబుర్లు చర్చించు కునేందుకు మధ్యాహ్న భోజన సమయము అనువైన ప్రదేశము అని చెప్పుకోవచ్చు. మిత్రులందరూ కూర్చొని టిఫిన్ బాక్స్ లు తీస్తున్నారు. ఇంతలో రాజేష్ వచ్చి బాక్స్ తీసి చూస్తే పచ్చడి అన్నము కనిపిస్తుంది. 


 పచ్చడి అన్నము చూసి “ఏంటిరా సంగతి?” అంటాడు రాజు. 


 “నిన్నటి నుంచి మా అమ్మకి జ్వరము. దానికి తోడు మా చిన్నకొడుకు క్రికెట్ లో దెబ్బ తగిలించుకొని వచ్చాడు. మని కట్టు దగ్గర కట్టు కట్టించుకొని మా అమ్మకి మందులు కొని రావలసి వచ్చింది. పెండింగ్ వర్క్ ఎక్కువగా ఉందని బాసు అక్షింతలు, రుచి చూడవలసి వచ్చింది” అని క్లుప్తముగా చెప్తాడు రాజేష్. 


ఇంతలో మోహన్ హుషారుగా వచ్చి అందరకి స్వీట్స్ ఇచ్చి “మాపెద్ద అబ్బాయికి ఐఐటి లో సీట్ వచ్చిం”దని చెప్తాడు. అందరు శుభాకాంక్షలు చెప్తారు. కిరణ్ కూడా శుభాకాంక్షలు చెప్పి నవ్వుతాడు. 


“ఎందుకురా నవ్వుతున్నావు?” అని అడుగుతాడు రాజు.


పవన్ స్టార్ స్టయిల్ లో, “మన జీవితములో కష్ఠాలు గుంపులు గుంపులుగా వస్తాయి. సుఖాలు మటుకు సింగల్ గా వస్తాయి” అంటాడు. అందరూ నవ్వుతారు.


“ఏమయిందిరా, అన్నము తినకుండా కుడి అరచేయి గోక్కుంటున్నావు?” అంటాడు రాజు, రమణతో. 


ఇంతలో కిరణ్ అంటాడు “కుడి చెయ్యి దురద పెడితే ధన ప్రాప్తి అంటారు కదా, మన రమణకి అదృష్టము వరించబోతోంది అని అర్ధము” అంటాడు. 


 రమణ హుషారుగా “నాకు ధనప్రాప్తి కలగక పొతే నీవు డబ్బులు ఇస్తావా” అంటాడు కిరణ్ తో. 

“డబ్బులు ఇవ్వను గాని, నీకో సహాయము చేస్తా” అంటాడు కిరణ్. 


 “డబ్బులు ఇవ్వడము కంటే పెద్ద సహాయము ఏమిటో” అంటాడు రమణ. 


“నీ అరచేయి దురద తగ్గేవరకూ గోకుతా” అంటాడు కిరణ్, రమణతో. అందరు నవ్వుతారు. 


“నీతో మాట్లాడటము కష్టమురా” అంటాడు రమణ, కిరణ్తో. 


 "కిరణ్ , నీవు ఎప్పుడు సంతోషముగా ఉండేందుకు చిట్కా ఏమిటి” అని అడుగుతాడు రాజు. 


 కిరణ్ ఉబ్బిపోయి ఉత్సాహముగా చెప్తాడు, “ఇంట్లో మేమిద్దరమూ ఆడుతూ, పాడుతూ హుషారుగా పనులు చేసుకుంటాము”. 


కిరణ్ మాటలు ఎవ్వరికీ అర్ధము కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. 

“వాళ్ళావిడ పాడితే మన కిరణ్ పని ఆడటమే” అని చెప్తాడు రమణ. 


 కిరణ్ కోపముగా ‘రమణ!’ అని అంటాడు.


ఇంతలో రాజు “రమణ చెప్పింది నిజమే కదా” అంటాడు.


అందరు ఒక్కసారిగా నవ్వి, సారీ రా, అని కిరణ్ ని కూల్ చేస్తారు. 


 అందరు బ్యాగులు సర్దుకొని వాళ్ళ వాళ్ళ సెక్షన్స్ కి వెళ్లి పోతారు. 


రాజేష్ సాయంత్రము ఇంటికి వెళ్లేసరికి మేనత్త, మావయ్య విజయవాడ నుంచి కొంపల్లి లో అత్తయ్య బంధువుల పెళ్లి చూసి, వీళ్ళని చూసేందుకు వచ్చారు. 


 మరుసటి రోజు అత్తయ్య మావయ్య తిరుగు ప్రయాణము అవుతారు. రాజేష్, భార్య, ఇద్దరు పిల్లలు సాగనంపేందుకు, వీధి చివరి దాక వెళ్లి టాటా చెప్పి తిరిగి వస్తారు. 


 రాజేష్ చిన్న కొడుకు, పెద్ద కొడుకుతో, “అన్నయ్యా ఇంటికి వచ్చిన బంధువులను వీధి చివరి దాక ఎందుకు సాగనంపుతారు?” అని అడుగుతాడు.


 “వచ్చిన బంధువులు మరల తిరిగి వస్తారేమోనని, వీధి దాక సాగనంపుతారనుకుంటా” అని జవాబిస్తాడు పెద్ద కొడుకు. 


 రాజేష్ పిల్లలకి అర్ధమయేట్టు చెప్తాడు. బంధువులను సాగనంపడము మర్యాద మరియు సంస్కారము అని . 


 “రాధా! ఈకాలము పిల్లలకి చిత్ర విచిత్రమయిన ఆలోచనలు వస్తాయి” అంటాడు భార్యతో. 


 --------------------------------------------------------------------------------------------------------------------------

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


133 views0 comments

Comments


bottom of page