top of page
Writer's pictureMohana Krishna Tata

సరదా షాపింగ్



'Sarada Shopping' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 22/08/2024

'సరదా షాపింగ్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పావని, రాణి మంచి ఫ్రెండ్స్. ఏది చేసినా కలిసే చేస్తారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించే పావనికి.. ఈసారి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎప్పుడూ మొగుడు తో చేసే షాపింగ్.. ఈసారి ఫ్రెండ్ తో సరదాగా షాపింగ్ చేస్తే, ఫ్రీడమ్ ఉంటుందని అనుకుంది. అదే విషయాన్ని ఫ్రెండ్ రాణి కి ఫోన్ చేసి చెప్పింది పావని. ఫ్రెండ్స్ ఇద్దరూ కలుసుకోవడానికి పాపం రెగ్యులర్ గా అవదు. ఒక్కకరు సిటీకి నలో దిక్కులో ఉంటారు మరి. తక్కువ రేట్ కి వస్తాయని.. ఊరు చివర వాళ్ళ భర్తలు విల్లాలు కొనేసారు. 


"ఏమండీ.. ! నేను మా ఫ్రెండ్ తో షాపింగ్ కు వెళ్తున్నాను. మీకేమైనా కావాలా చెప్పండి?" అడిగింది పావని.


"నాకు క్షవరం చేసుకోవడానికి ఒక రేజర్ తీసుకురా.. చాలు"


"అంతేనా.. !"


"అంతే.. బిల్ ఎక్కువ చెయ్యకుండా వుంటే నాకు అదే చాలు.. " అన్నాడు భర్త.

 

"ఏముందండి! నాకేం ఉంటాయి.. మహా అయితే ఒకటో రెండో.. కొంటాను.. అన్నీ కొనేసాము కదా లాస్ట్ టైం"


"నువ్వు బిల్ ఎక్కువ చెయ్యకుండా వస్తే.. నెల మొత్తం నీ కోసం నేనే వంట చేస్తాను.. షాపింగ్ కి వెళ్లక ముందే నీకు నేను ఇస్తున్న రిపబ్లిక్ డే ఆఫర్ అనుకో.. "


"అయితే వంట చెయ్యడానికే రెడీ గా ఉండండి మరి! తక్కువ బిల్ తో గంటలోనే వచ్చేస్తాను.. " అని అంది పావని.

 

"మీ ఫ్రెండ్ తో వెళ్తున్నావు కదా.. ఈ ప్రపోజల్ ఎవరిదో.. ?"


"నాదే.. "


"అయితే నువ్వే అనమాట లీడర్"


"ఏదో లెండి.. మరీ ఆట్టే పొగడకండీ.. "


"ఏమండీ.. ! నేను షాపింగ్ కి వెళ్తున్నా! మీకేమైనా కావాలా?" అని భర్త ని అడిగింది రాణి.


"మా మగాళ్ళకు ఏముంటాయి చెప్పు.. ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. మేకప్ అక్కరలేదు, జ్యువలరీ అసలే అవసరం లేదు. ఒక షర్టు వేసుకుని బయటకు వెళ్లిపోతాము. ఒక జీన్స్ తో నెల గడిపేస్తాము.. మరీ అడుగుతున్నావు కాబట్టీ.. నాకు ఒక బ్లేడ్ ప్యాకెట్ తీసుకుని రా.. అంతే!"


"అలాగే.. !"


పావని తన ఫ్రెండ్ తో కలిసి సిటీ లో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్ కు వెళ్ళింది. 


"పావని.. ! ఇక్కడకే ఎందుకు తీసుకుని వచ్చావు.. ఇది మన ఇళ్ళకి చాలా దూరం కదా ? మన ఇంటి దగ్గరే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా.. " అడిగింది రాణి.


"ఇది కొత్తగా ఓపెన్ చేసారు.. సినిమా హీరోయిన్ జుమంక ఓపెన్ చేసింది.. మరి రాకపోతే ఎలా.. ?"


"అదా సంగతి.. ఇక్కడ ఏమిటి ఉంటాయో.. ?"


"ఒకో ఫ్లోర్ లో ఒక్కొకరికి బట్టలు.. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే జ్యువలరీ.. ఆ చివర ఒక రెస్టారెంట్ కుడా ఉంది.. ముందు ఎక్కడ నుంచి మొదలెడదాం చెప్పు రాణి.. "


"ఆకలి వేస్తోంది పదా.. మా ఆయనతో బయటకు వస్తే ఏమీ కొనరు.. పద ఎంజాయ్ చేద్దాం.. " అంది రాణి.


"బిల్ గురించి ఏమీ ఆలోచించకు రాణి.. ఇది మా ఆయన క్రెడిట్ కార్డ్.. నిన్నే బిల్లింగ్ డేట్ కుడా అయిపోయింది.. మళ్ళీ రెండు నెలల వరకూ మా ఆయనకు ఏమీ తెలియదు.. రెండు నెలల తర్వాత తెలిసినా.. ఒక మంచి రోజు చూసి, బెడ్ రూమ్ లో మా ఆయనని ఐస్ చేసేస్తాను.. అంతే.. !"


"ఈ ట్రిక్ ఏదో చాలా బాగుందే.. ! మా ఆయన మీద కుడా ప్రయోగిస్తాను.. " అంది రాణి. 


"కడుపు నిండా తిన్నాం.. అరిగేదాకా పద షాపింగ్ చేద్దాం.. ముందు బట్టలు చూసేద్దాం.. " అంటూ చీరల సెక్షన్ వైపు పరుగులు తీసారు ఇద్దరు. 


"బాబూ.. ! చీరలు చూపించు.. " అని అక్కడ ఉన్న చీరలన్నీ తీయించింది పావని.. 


"ఏమిటోనే.. కలర్ బాగుంటే, బోర్డర్ బాగోదు, రెండు బాగుంటే, డిజైన్ బాగుండదు.. " అంది పావని. 


"ఇప్పటికే ఒక రెండు వందల చీరలు చూసారు మేడం.. చీరలు మడత పెట్టడానికి మాకూ కష్టమే కదా.. !" అన్నాడు దీనంగా పడేసిన చీరలు మడతపెడుతూ. 


"చీరలు మడత పెట్టడానికి ఒక టీమ్ ని పెట్టుకోండి. ఆడవారంటే.. చీరలు ఇలానే చూస్తారు మరి.. ఇంకా చూపించు బాబు.. " అంది పావని. 


"అదేమిటే అప్పుడే సాయంత్రం అయిపోయింది.. ఇంతా చేస్తే మనం రెండు చీరలే కొన్నామా.. ? ఈ టైం లో ఇంటికి వెళ్లడం కుడా కష్టమే.. " అంది రాణి. 


"ఇంటికి ఎలా వెళతామే.. మళ్ళీ ఇంత దూరం రావడం కుడా కష్టమే.. అయినా, ఇంకా సగం కుడా కాలేదు మన షాపింగ్.. " అంది పావని. 


ఈ లోపు పావని భర్త ఫోన్.. 


"పావని.. ! అయ్యిందా షాపింగ్.. ?"


"లేదండీ.. ! ఇప్పుడే ఇంటికి వస్తే, మళ్ళీ రేపు ఇంత దూరం రావాలి.. షాపింగ్ చేసే మూడ్ కుడా పోతుంది.. అందుకని.. "

"అందుకని.. ?" దీర్ఘం తీసాడు భర్త.

 

"మా లాంటి వారికి ఇక్కడ షోరూంలో వారు రూమ్స్ కుడా ఏర్పాటు చేసారు. ఒక రూమ్ తీసుకుని.. రేపు కుడా షాపింగ్ చేసుకుని.. వచ్చేస్తాము.. ఎలాగో రేపు ఆదివారమే కదా.. ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ చేసుకుని తినేయండి.. "


"అయితే.. రూమ్స్ ఇచ్చి మరీ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారా.. అక్కడ షోరూం వాళ్ళు.. "


"ఏదో లెండి.. మా ఆడవారంటే, ఎప్పుడూ ఈ షాప్ వారికీ గౌరవమే మరి.. "


"అవును మరి.. వారు బతుకుతున్నది మీ మీదే కదా పాపం.. " అన్నాడు భర్త మనసులో రాబోయే బిల్ లెక్క వేసుకుంటూ.


"చెప్పడం మరచానండీ.. ! ఇలా రెండు రోజులు వరుసగా షాపింగ్ చేస్తే, పది శాతం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారంట.. "


"అవునా.. ?"


"ఇంక ఉంటాను.. రేపు మాట్లాడుతా.. అసలే టైం తక్కువ ఉంది" అని ఫోన్ పెట్టేసింది పావని.


"మీ ఆయనకి కుడా ఫోన్ చేసి చెప్పెయ్యవే రాణి.. "


"మా ఆయనకి నైట్ షిఫ్ట్. ఆయన బిజీ గా ఉంటారు.. చెప్పకపోయినా పర్వాలేదులే.. "


రాత్రంతా షోరూం వారు ఇచ్చిన రూమ్ లో ఫుడ్ తెప్పించుకుని.. తిని ఎంజాయ్ చేసి.. మత్తుగా పడుకున్నారు ఇద్దరు.. 


మర్నాడు షాప్ ఓపెన్ చేసే టైం కు రెడీ అయి.. జ్యువలరీ షాపింగ్, మిగతా షాపింగ్ అంతా అలసిపోయే వరకూ చేసారు. షాప్ వారు జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చి.. కూల్ చేస్తూ.. బిల్ పెంచుకున్నారు. అంతా అయ్యాక.. రాత్రికి ఇంటికి పెద్ద వ్యాన్ లో చేరుకున్నారు ఇంటికి.. 


"ఏమండీ.. ! బిల్ తక్కువే అయ్యిందండీ.. ఒక సంవత్సరం వరకూ ఇక షాపింగ్ చేయనవసరం లేదండీ.. "


"ఇది తక్కువ బిల్ అంటారా.. ? అయినా ఇన్ని కొంటే, డేట్ అయిపోయి పాడయిపోవు.. ? ఎంత డిస్కౌంట్ ఇస్తే మాత్రం ఇలా కొనేస్తారా చెప్పు.. ?"


"మీరు ఎప్పుడూ ఇంతే.. నన్ను ఎప్పుడూ మెచ్చుకోరు.. " అంది పావని 


"ఏమండీ.. ! మీకు రేజర్ కొనకుండానే ఫ్రీగా ఇచ్చారండీ.. "


"నువ్వు చేసిన క్షవరం కాకండా.. షాప్ వాడు మళ్ళీ ప్రత్యేకించి క్షవరం కోసం నాకు ఫ్రీ గా ఇచ్చాడా.. ?"


"అదేమీ కాదు లెండి. అక్కడ ఇలా షాపింగ్ చేసిన ఆడవారికి.. భర్తల కోసమని రేజర్ సెట్ ఫ్రీగా ఇస్తారుట.. రాణి కి కుడా ఒక సెట్ ఫ్రీ గా ఇచ్చారు గా "


"మీకు ఫ్రీగా రూమ్ ఇచ్చి.. మీ చేత షాపింగ్ చేయించి.. మగాళ్ళకు క్షవరం చేసుకోడానికి రేజర్ సెట్ ఫ్రీ గా ఇచ్చి.. సూపర్.. " అని తల పట్టుకున్నారు ఇద్దరు భర్తలు. 


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


134 views0 comments

Comments


bottom of page