top of page

సెలవు రోజు పాఠం లేదు

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SelavuRojuPatamLedu, #సెలవురోజుపాఠంలేదు, #TeluguChildrenStories

సెలవు రోజు పాఠం లేదు.. (కానీ:- జీవిత పాఠం)


Selavu Roju Patam Ledu  - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 01/02/2025

సెలవు రోజు పాఠం లేదు - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


మరునాడు ఆదివారం. 


ఆరవ తరగతి విద్యార్థిని 'అందాల వింధ్య' తరగతి గది లో ఇలా ప్రకటించింది. 


"రేపు ఆదివారం. సెలవు రోజు కదా. పాఠాలు లేవు. రేపు నా పుట్టిన రోజు ఈ పాఠశాలలోనే జరుపు కుంటాను. విందు - పార్టీ ఇస్తాను అందరికీ..ఇక్కడే.. పాఠశాల ప్రాంగణంలోనే.. 6 వ తరగతి యొక్క అన్ని సెక్షన్స్ పిల్లలు రావాలి". 


"క్లాసులు, చదువులు రోజూ ఉండేదే కదా. రేపు మానస వికాసం పొందండి. విందు భోజనం ఆరగించండి. కొన్ని ఆటలు ఆడుదాం - పాటలు పాడుకుందాం. ఉల్లాసం, ఉత్సాహం, స్ఫూర్తి పొందండి. మీ ఆశీర్వాదాలు నా జీవిత రథ చక్రాలకు స్ఫూర్తి - ఇంధనం".


"మీ మీ స్టీల్ గ్లాస్ లు, చిన్న సైజ్ వి.. ఇంటి నుండి తెచ్చుకోవాలి.. జేబు లో లేక బ్యాగ్ లో పెట్టుకొని..రేపు విందు భోజనంలో.. ఇక్కడ మంచి నీళ్ళు తాగటానికి "


అని తియ్యగా నవ్వుతూ ముగించింది (అందాల చిన్నారి వింధ్య). 

--- X X X ---


2)

అందరూ తూచా తప్పకుండా వచ్చారు.


ఇక పార్టీ - విందు విషయానికి వెళదాం..



1వ - మొట్ట మొదటి కార్యక్రమం:-


పాఠశాల స్టేజ్ పై, కేక్ కట్ చేసింది ముద్దుల గుమ్మ - చిన్నారి 'అందాల వింధ్య'.


అందరికి బాదాం ఆకులలో కేక్ ముక్కలు పెట్టి ఇచ్చింది. తనూ తిన్నాక, బాదం ఆకును అక్కడె పడేయ లేదు. కాస్త దూరంగా ఉన్న చెత్త బుట్టలో పడేసింది. అందరూ అలాగే చేశారు. ఇక్కడ - అక్కడా వెయ్యలేదు ఆకులను.

----------


2వ కార్యక్రమం:-


హాల్ లో టి.వి. లో ఓ అర గంట సినిమా చూపించింది. సినిమా పేరు "పుట్టిన రోజు పండగే అందరికీ..".


"ఇక సినిమా చాలు. గది బయిటికి వెళ్లి స్టేజీ పైన కూర్చోండి, తదుపరి 3వ కార్యక్రమానికి", అన్నది (అందాల చిన్నారి వింధ్య).

--------------


3వ కార్యక్రమం:-


"అందరూ వచ్చేసారా స్టేజ్ మీదికి.. అయ్యోయ్యో!.. ఆ హల్ గది లో విద్యుత్ దీపాలు అలాగే వెలుగుతున్నాయి, ఫ్యాన్ కు - పంఖాలు కూడా అలాగే తిరుగుతున్నాయి.. టి.వి. అలాగే ఆన్ ఉంది. ఆన్నటినీ స్విచ్ ఆఫ్ చేసి వస్తాను", అంటూ వెళ్లి.. ఆఫ్ చేసి.. వచ్చింది.. "చూసారా విద్యుత్ దుబారా చేయొద్దు, అదా చేయాలి, పొదుపుగా వాడాలి", (అన్నది అందాల చిన్నారి వింధ్య). 

---------------------


4 వ కార్యక్రమం: 


"పుట్టిన రోజు అంశం పై రెండు బొమ్మలు గీయండి. ఒక్కో బొమ్మ ఒక్కో పేజీ లో గీయాలి.. అంటే వేరు వేరు పేజీలలో గీయాలి, అర గంట లో.. నేనూ ఇక్కడ కూర్చుని గీస్తాను", అన్నది.


తెల్ల కాగితాలు (A4 సైజ్ వి) తన బ్యాగ్ నుండి తీసింది 'అందాల వింధ్య'.


"మీ ఊహా శక్తి మరియు ఆవిష్కరణ శక్తి, సృజనాత్మకత శక్తి పురి విప్పండి.. రెండు మంచి బొమ్మలు గీయండి.. వేరు వేరు పేజీ లలో", అన్నది (అందాల చిన్నారి వింధ్య).


అందరికీ ఒక పేపర్ - తెల్ల కాగితం ఇచ్చింది. ఒక బొమ్మ - చిత్రం గీసాక, ఇంకో తెల్ల కాగితం అడిగి తీసుకొని.. ఇంకో చిత్రం గీసారు. 


"అర గంట సమయం అయిపోయింది. ఇక చాలించాలి. బొమ్మలు గీసిన పేపర్లు - కాగితాలు ఇవ్వండి", అని తీసుకుంది చిన్నారి అందాల వింధ్య.


తన గీసిన బొమ్మల కాగితం - పేపర్ చూపించింది. "నేను ఒకే తెల్ల కాగితం కి రెండు వైపులా బొమ్మలు గీసాను, రెండో తెల్ల కాగితం తీసుకోలేదు - ఉపయోగించ లేదు - వృధా చేయలేదు", అన్నది.


"ఆకలి దంచేస్తోంది", అని అందరూ అరిచారు.


"తదుపరి 5 వ కార్యక్రమం అదే", అన్నది అందాల చిన్నారి వింధ్య.. చిరు నవ్వు చిందిస్తూ.

-------------------


5 వ కార్యక్రమం) కేటరింగ్ వారు సిద్ధం చేశారు స్టేజ్ పై.. ఓ టేబుల్ మీద ఇలా:- 


ప్రతి పింగాణీ ప్లేట్ పై అరటి ఆకులు అమర్చి ఉన్నది. 


టేబుల్ మీద 7 రకాల తినే రకాలు పెట్టారు:- i) అన్నం, ii) ఒక్క రకం కూర మాత్రమే iii) ఒకే రకం టమాట - పప్పు, iv) ఒకే రకం స్వీట్, v) ఒక గిన్నెలో కాస్తే బిర్యానీ.. Vi) అప్పడాలు.. Vii) ఒక గిన్నెలో పెరుగు పెట్టారు. 


"బిర్యానీ కాస్తే చేయించాం. కేటరింగ్ వారి చెత్త.. మొదటి సారి మాత్రమే, అంటే ఒక్క సారే, ఒక్క గరిటె మాత్రమే వడ్డిస్తారు.. వేరే తిను పదార్థాలు ఎన్ని సార్లయినా వడ్డిస్తారు.. మీ మీ స్టీల్ గ్లాస్ లు, మంచి నీరు త్రాగేవి.. బ్యాగ్ నుండి తీసి తెచ్చుకోండి", అని ప్రకటించింది అందాల చిన్నారి వింధ్య.


అందరూ తినే కార్యక్రమం అయ్యాక, తెలివైన అందాల చిన్నారి వింధ్య, ఇలా అన్నది:-


"కేటరింగ్ వారు.. 7 పదార్థాలే పెట్టారు, ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు.. వృధా తగ్గించాలి అని.. అన్నం పరబ్రహ్మము.. కొసరి కొసరి వడ్డించారు. పొదుపు గా.. మంచి నీళ్ళు కూడా అర గ్లాస్ యే పోశారు. పొదుపు గా.. వృధా గాకుండా".


"పేపర్ ప్లేట్లు వాడలేదు, పేపర్ గ్లాస్ లు వాడలేదు. కాగితం - పేపర్ ను చెట్లు కొట్టి తయారు చేస్తారు. పేపర్ వాడుక తగ్గిస్తే చెట్లు నరకటం అదా చేసినట్టు, తగ్గించి నట్టు.. పర్యావరణానికి మేలు చేసినట్టు. ఎక్కువ గా చెట్లు ఉండాలి. అవి ప్రాణ వాయువు (ఆక్సిజన్: O2) విడుదల చేస్తుంది దినం లో.. మరియు రెండింతల ఉపయోగం - లాభం లా కాలుష్యం పీలుస్తుంది.. చెట్లు ఎక్కువగా ఉంటే భూమి ఉష్ణం - ఉష్ణోగ్రత - వేడి ఎక్కువ కాదు.. తద్వారా వరదలు - క్షామం.. అనే.. అతి వృష్టి - అనా వృష్టి రావు.. ప్రాణ నష్టం, ధన నష్టం, పంట నష్టం జరగవు".


"ప్లాస్టిక్ కూడా వాడలేదు ఈ రోజు.. ఎందుకు?.. అప్పుడే 8 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉన్నది నెల పై - భూమి లోపల,.. నది, సముద్రపు నీటి పై - నీటి కింద.. ప్లాస్టిక్ లోని విష రసాయనాలు మొక్కలకు, జీవాలకు హాని చేస్తుంది.. పర్యావరణానికి కష్టం - నష్టం కలిగిస్తుంది".


"పింగాణీ ప్లేట్ ల మీద అరటి ఆకులు వేసి వడ్డించారు కేటరింగ్ వాళ్ళు. ఎందుకు? మేమే చెప్పాము అలా చేయమని. ఎందుకలా?.. బాగా కడగని కంచాల లో తినటం వల్ల జ్వరాలు - రోగాలు - వ్యాధులు వస్తాయి. అరటి ఆకులు పైన పెడితే, ప్లేట్లను కడగక్కర లేదు. ఒక వేళ కడిగినా నీళ్ళ వాడుక తగ్గుతుంది.. నీళ్ళు అదా అవుతుంది"


"అరటి ఆకులు కొనటం వల్ల, చిన్న - చితక దుకాణాల వారికి మరియు రైతులకు మేలు చేసిన వాళ్ళ మవుతాం.. జీవనోపాధి ఇచ్చిన వాళ్ళవుతాము".


"తినే పదార్దాలు కూడా తక్కువగా మిగిలాయి. 7 ఐటమ్స్ - పదార్థాలు మాత్రమే చేయించాం - పెట్టాము కదా.. అందుకే". 


అని చిరునవ్వుతో ముగించింది. 


"ఇక తదుపరి 6వ కార్యక్రమం కి వెళదామా.." అని ప్రకటించింది. 

------------------------


6వ కార్యక్రమం)


ఫోన్లో ఫుడ్ చైన్ వాళ్ళను పిలిచింది 'అందాల వింధ్య'.


ఎందుకు?


మిగిలిన తినే పదార్థాలను వారి వాన్ లో వచ్చి పట్టికెళ్ళమని చెప్పింది. 

 వాటిని వృధా గాకుండా.. పడేయకుండా.. పేదల శరణాయం లో - అనాధ శరణాయం లో ఇచ్చేయమని కూడా చెప్పింది.


వాళ్ళు అలాగే వారి వాన్ లో వచ్చి తీసుకెళ్లారు. 


"అన్నం పర బ్రహ్మం. మిగిలిన తినే పదార్థాలను పడేయ కూడదు.. ఇంట్లో కాని, విందులలో కానీ.. తక్కువగా మిగిలితే ఇంటి దగ్గరే పేదలకు ఇచ్చేయవచ్చు".


"ఎక్కువగా మిగిలితే.. 'మిగిలిపోయిన - తిండి సేకరించే' సంస్థల వారిని పిలిస్తే.. వారే వచ్చి తీసుకెళ్ళి.. పేదల ఆశ్రమాలలో ఇచ్చేస్తారు". 


"ఇక ఈ సెలవు రోజు.. విందు.. ఆట - పాట అయిపోయాయి. అందరూ ఇంటికి వెళ్లి పోవచ్చు". 

-------- X X X ----


3)


"ఒక్క నిమిషం ఆగండి.. ఆలోచించండి.. తుదకు 

..

ఈ రోజు మనందరం ఏ ఏ పాఠాలు నేర్చుకున్నాం" 

అని అందరినీ ఉద్దేశించి అడిగింది "చిన్నారి అందాల తెలివైన వింధ్య". 


అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. నవ్వారు ఇలా అంటూ..

 "ఈ రోజు సెలవు రోజు గా!.. నీ పుట్టిన రోజు పండగ విందు రోజు గా!.. పాఠాలు లేవు గా!.. మానస వికాసం కార్యక్రమాలు మాత్రమే గా!", 

అన్నారు చకితం వ్యక్త-పరుస్తూ.


చిన్నారి అందాల వింధ్య ఇలా ప్రకటించింది, 

"ఈ రోజు జీవిత పాఠం మరియు ఎన్నో నీతులు నేర్చుకున్నాం.. 


నీతులు: పొదుపు, అదా, పర్యావరణానికి మేలు చెట్లు కొట్టకుండా".


"పొదుపు అన్ని విషయాలలో (తిండి, నీరు, పేపర్, విద్యుత్ వగైరా).. రెండు వైపులా పేపర్ వాడాలి (పొదుపు గా).. మరియు పర్యావరణానికి మేలు చేసే పనులు (తక్కువగా ప్లాస్టిక్ మరియు చెక్క మరియు కాగితం వాడటం)".

.. 

"ప్లేట్ పై / కంచాల పై అరటి ఆకు లేక బాదం ఆకును వేసి వడ్డించాలి తినే పదార్దాలు.. అప్పుడు, ప్లేట్లు సరిగ్గా కదక్కున్నా.. జబ్బులు - జ్వరాలు రావు మనుషులకు.. ప్లేట్లు కడిగే నీరు కూడా అదా అవుతుంది.. మంచి నీళ్ళు అర - గ్లాస్ యే వేసుకొని తాగాలి పొదుపుగా, పారపోయ కుండా.. కొసరి - కొసరి వడ్డించాలి తినే పదార్దాలు వృధా గాకుండా.. చెట్లను రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తుంది వచ్చే కాలం లో (కూరగాయలు, పండ్లు, ఔషధాలు, నిల్చునెందుకు నీడ ఇచ్చి మరియు ఆరోగ్య కరమైన ప్రాణ వాయువు విడుదల చేసి.. మరియు కాలుష్యం పీల్చి)"

.. 

"భూమిపై ఎక్కువ మొక్కల వల్ల - చెట్ల వల్ల, భూమి ఉష్ణోగ్రత - వేడి ఎక్కువ గా హెచ్చదు:- అప్పుడు అతి వృష్టి - అనా వృష్టి ఉండవు.. వరదలు, క్షామం రావు.. పంట - నష్టం, ధన- నష్టం, ప్రాణ నష్టం జరగవు", 

అని తెలివిగా ముగించింది (అందాల చిన్నారి వింధ్య). 

--- X X X ----


4)

అప్పుడు, సరిగ్గా అందాల సంధ్యా సమయం (సాయింత్రం వేళ).. అక్కడ ఆ ప్రాంగణంలో అప్పటి దాకా స్థిరంగా నిల్చున్న చల్లగాలి.. అప్పుడే హోరుమని కదిలింది సంతోష దాయకంగా (కొత్త.. మంచిని పంచే - పెంచే విషయాలు తెలుసుకున్న ఊపులో).. అక్కడ ఉన్న వారందరి హృదయాలను చల్లగా తాకింది.. హాయిని చేకూరుస్తూ.. ఆనందం పంచుతూ. "అందాల చిన్నారి వింధ్య దేవత" అని గాలి పాట పాడుతూ. 


----- X X X -------- 



నీతులు: 1) అన్నీ పొదుపుగా వాడాలి తరచూ.. అన్ని వస్తువులు అదా చేయాలి (నీరు, తిండి, డబ్బు, విద్యుత్, కాగితం, ప్లాస్టిక్ ఇతరత్రా)

.. 

2) పర్యావరణానికి మేలు చేయాలి చెట్లు కొట్టకుండా

.. 

3) ప్లాస్టిక్, కాగితం, కట్టెల తో / చెక్కతో చేసిన వస్తువులను వాడటం తగ్గించాలి


4) చెత్త బుట్ట - చెత్త కుండి లో మాత్రమే చెత్త వెయ్యాలి, ఇక్కడ - అక్కడ కాదు


------ సమాప్తం -----------



పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






 
 
 

1 Comment


mk kumar
mk kumar
Feb 03

ఈ కథలో "అందాల వింధ్య" అనే పఠశాల విద్యార్థిని తన పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలవు రోజు పార్టీగా నిర్వహించింది. ఈ సందర్భంగా వింధ్య పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు, పొదుపు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సృజనాత్మకత, సమాజం పట్ల బాధ్యతను ప్రేరేపించింది.వింధ్య తన పుట్టిన రోజు వేడుకలలో పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఆహ్వానించి, విందు ఏర్పాటు చేసింది. కానీ, కేవలం సరదా లేకుండా, కొన్ని అనుభవాలు, జీవిత పాఠాలను కూడా అందించింది.


విద్యార్థులకు వింధ్య విద్యుత్తు పొదుపు, నీటి పొదుపు, చెత్త వేయడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెట్లు నరికకుండా వాడకం వంటి విషయాలు గురించి పాఠాలు ఇచ్చింది.


వింధ్య పారిశుధ్యంపై దృష్టి పెట్టి, వృధా తగ్గించే చర్యలు చేపట్టింది. పాఠశాల వేడుకల్లో వాడిన విందులో కొన్ని సరళమైన, సులభమైన ప్రక్రియలను వాడడం ద్వారా, ప్రతీ ఒక్కరూ వాటిని అనుసరించవచ్చు.


Like
bottom of page