top of page
Mana Telugu Kathalu - Admin

SEPTEMBER 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల ఫలితాలు


Results Of Non- Stop ( weekly ) Prizes For The Month Of September 2021

రచయితలకు, పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు.

మనతెలుగుకథలు.కామ్ లో విజయదశమి మరియు నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే.

విజయదశమి కథల పోటీల ప్రచురణ 15/10/2021 తో ముగిసింది.

ఫలితాలు ముందుగా ప్రకటించినట్లుగా 24/10/2021 తేదీన ప్రచురింపబడతాయి.

అందుకు అనుగుణంగా సెప్టెంబర్ నెలతో పాటు, అక్టోబర్ 15 వరకు ప్రచురింపబడ్డ కథలనుండి కూడా వారం వారం బహుమతులను ఎంపిక చేసి ఇక్కడ ప్రచురిస్తున్నాము.

విజయదశమి కథల పోటీ ముగిసినా వారం వారం బహుమతులు ( NON STOP PRIZES ) ఎప్పటిలానే కొనసాగుతాయి.

16/10/2021 నుండి 30/11/2021 వరకు ప్రచురింపబడ్డ కథల నుండి ఎంపిక కాబడ్డ వారం వారం బహుమతుల వివరాలు 15/12/2021 తేదీన ప్రచురింపబడతాయి.

తదుపరి కథల పోటీ వివరాలు త్వరలో ప్రకటిస్తాము. ఎప్పుడు ప్రకటించినా 16/10/2021 నుండి ప్రచురింపబడ్డ కథలన్నీ ఆ పోటీలకు పరిశీలింపబడతాయి.

రచయితలకు ముఖ్య గమనిక: మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథల పైన మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉంటాయి.ఇప్పుడు కథతో పాటు పోడ్కాస్ట్ విడుదల చేస్తున్నాము. అలాగే ప్రచురింపబడ్డ కథలను త్వరలో ప్రారంభించబోయే మా యు ట్యూబ్ ఛానల్ లో ఉంచాలనుకుంటున్నాము.

ఇందుకు అభ్యంతరం లేనివారే రచనలు పంపవలసినదిగా కోరుతున్నాం.

కానీ ఎవరన్నా రచయితలు స్వయంగా పోడ్కాస్ట్ చెయ్యాలనుకున్నా, వారి స్వంత చానెల్స్ లో ఉంచాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.

August 2021 వరకు గెలుపొందిన కథలకు ఇదివరకే బహుమతులు అందజేశాము.

September 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను తెలియజేస్తున్నాం.

వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నాం. కానీ మా అంచనాలకు మించి, మంచి కథలు రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేశాం.

విజేతల వివరాలు :

05/09/2021 ఆంతర్యం - అంతరంగం బివిడి ప్రసాదరావు


12/09/2021 లైఫ్ స్కిల్స్ గొర్తి వాణిశ్రీనివాస్

19/09/2021 విజ్ఞత అన్నపూర్ణ


26/09/2021 స్వేచ్ఛ సీత మండలీక


03/10/2021 ఆఖరి కోరిక జీడిగుంట శ్రీనివాస రావు

10/10/2021 సార్థకత కమల పారిజాత


10/10/2021 స్వర్ణ తాంబూలం M R V సత్యనారాయణ మూర్తి

15/10/2021 మేలుకొలుపు ఎన్.శివ నాగేశ్వర రావు


(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)

మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులకు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)

రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 22/10/2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


59 views0 comments

Comments


bottom of page