top of page

సేవకు సైనికుడు


'Sevaku Sainikudu' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 18/11/2023

'సేవకు సైనికుడు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


పరాగ్ ఒక రైల్వేస్టేషన్ లో బోజనం దుకాణం నడుపుతున్నాడు


అక్కడికి చాలామంది బోజన ప్రియులు వచ్చి బోజనం చేస్తారు.

ఒకరోజు రైలు ఆగగానే పరాగ్ దుకాణం ఎదురుగా ఆగిన ఏ. సి పెట్టెలోంచి పెద్ద హడావుడి చేస్తూ ఒకతను శంకరం దిగాడు.

అతని వెనుక కొంత పరివారం, సెక్యురిటి ఉంది.

ఆ సెక్యురిటి తాను ప్రవేటుగా పెట్టుకున్నదో లేక గవర్నమెంట్ దో తనకు తన పరివారానికే తెలుసు.


శంకరం ఒక పారిశ్రామికవెత్త. తన తండ్రి నుండి బాధ్యతలు అందుకున్నాక మంచి లాభాల కోసం మెలుకువలు నేర్చుకోవాలని అనుకుంటాడు.


ఎవరు అంతగా పరిచయం లేక ఎప్పటినుంచో వెనుకడుగు వేస్తు వచ్చాడు.


తన తండ్రికి ముఖ్య సలహాదారు ఒకరు పక్క రాష్ట్రంలో ప్రశాంత్ అనే యువ వ్యాపారవేత్త అయినా. !

పలుకుబడి వ్యాపార మెలుకువలు తెలిసిన గొప్ప వ్యక్తి ఉన్నాడని తెలపడంతో అతడిని కలవటానికి బయలుదేరాడు.


శంకరం ఎంత డబ్బు సంపాదిస్తున్నా కొంత పిసనారితనం ఉంది. ఆ కారణంగా డబ్బులు శంకరం పరిశ్రమ నుండి కానీ, ఇంటి నుండి కానీ అంతగా వ్రుధా కావు.


అతనికి ఫ్లైట్ లో వెళ్ళే సత్తా ఉన్నా ఈ పిసనారి తనం కారణంగానే రైలుకు వచ్చాడనేది తనతో వచ్చిన పరివారంనకు తెలుసు.


అయితే ఎంత పిసనారి అయినా.. దూరపు ప్రయాణాలకు ఖచ్చితంగా కొంత పరివారాన్ని తీసుకెళ్తాడు. అది అతని అర్బాటం కోసమో.. లేక పదిమంది తన గొప్పతనం చూడాలనో దేవుడికే ఎరుక.


ఇక శంకరం తనకు తన పరివారానికి బోజనం కోసం పెద్ద హొటల్స్ కి వెళ్తే బిల్లు దండగని దిగగానే ఎదురుగా ఉన్న దుకాణంలో బోజనానికి సిద్దపడ్డాడు.


శంకరం తమకు కావల్సిన బోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. అప్పటికే అక్కడ కొందరు చిన్న ప్లాస్టిక్ కుర్చీల పై కూర్చుని తింటున్నారు.


శంకరంకు కనీసం కూర్చోటానికి కూడా ఏమి లేదు.

" ఇంత పరివారంతో గొప్పవాడు వస్తే ఇలాగేనా మర్యాద చేసేది " అంటు పరాగ్ పై చిందులు తొక్కాడు శంకరం. ఎలాగో మెల్లగా బతిమాలాడి శంకరాన్ని శాంతింపజేయటానికి పరాగ్ ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. తన మనుషులుతో గొడవ పెద్దది చేశాడు.

అక్కడితో ఆగకుండా త్రుప్తిగా తినేసి బోజనం రుచిగా లేదని వంక పెట్టి కేవలం సగం బిల్లు మాత్రమే చెల్లించాడు శంకరం.


పరాగ్ ఎంత బతిమాలాడుకున్నా..

కనికరించకుండా తన దారిన పోయాడు.


ఇక తనకు కావల్సిన గొప్ప యువ పారిశ్రామికవేత్త ప్రశాంత్ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది


ప్రశాంత్ ఇల్లు చాలా విశాలంగా, అందంగా ఉంది. బయట ఏదో బోర్డు ఉంది ఆత్రతలో దాన్ని గమనించకుండా లోపలికి పోయారు.


పనివాళ్ళు చాలామంది ఉన్నారు.

లోపలికి వెళ్ళగా అక్కడ కుటుంబ సమేతంగా కింద కూర్చొని రాత్రి బోజనం చేస్తున్నారు. వారందరికీ ప్రశాంత్ తల్లి వడ్డిస్తుంది.

అటు పక్కగా ఒక డన్నింగ్ టేబుల్ పై ఒకే ఒక వ్యక్తి తింటున్నాడు అతనికి కాస్త వయసు పైబడిన ఆవిడ వడ్డిస్తుంది. బహుశా ప్రశాంత్ నాయినమ్మ అయి ఉంటుంది.

శంకరం కళ్ళు ఆ వ్యక్తి పై పడ్డాయి.

చూడగానే షాక్ కి గురయ్యాడు.


రైల్వేస్టేషన్ దుకాణం వద్ద గొడవపెట్టుకుని సగం డబ్బులే ఇచ్చింది ఈయనకే.

అంతుపట్టని విషయం ఏంటంటే..

ఇంత ధనవంతుడు అయి ఉండి స్టేషన్లో దుకాణం నడపటం ఏంటీ.. కొంపదీసి ఇలాంటి వ్యక్తులు ఇద్దరు లేరు కదా అనుకున్నాడు శంకరం.


బోజనం పూర్తి చేసుకుని ఏదో వ్యాపారం నిమిత్తం వచ్చి ఉంటారని ముందే తెలుసుకుని ప్రశాంత్

" నమస్కారం అండి " శంకరంను పలకరించాడు.


తమకు కావల్సిన ఏర్పాట్లు చేసి శంకరం వ్యాపారం మూడింతలు లాభసాటిగా మారేందుకు తగిన సూచనలు సలహాలు ఇచ్చాడు.


ఆ పని అవ్వగా శంకరం ప్రశాంత్ ని తన తండ్రి గూర్చి అడిగాడు


తన తండ్రి పేరు పరాగ్ అని ఆయన ఒక సేవకుడు.

" ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ఎన్నెన్నో కష్టాలుపడి తనకు ఈ స్థానంలో పెట్టాడని డబ్బులు సంపాదించాక తన తండ్రి ఋణం తీర్చుకోటానికి

తనకు ఏం చేయాలనుంటే అది చేయండి ఎంత ఖర్చు అయినా, ఏ పనైనా చేయటానికి నేను మీకు సహకరిస్తానన్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మన ఇష్టాల కోసం అతను ఎన్నో త్యాగాలు చేశాడు కదా మరీ.

ఆయన మనసులో మాటను స్పష్టంగా బయటపెట్టి ఆపదలో ఉన్న పదిమందికి సహాయం చేయాలి. నా కొడుకుగా నువ్వు సంపాదించటం నేర్చుకున్నాకా నా శక్తి, నా శ్రమ పూర్తిగా పరులుకోసం పెట్టాలని అనుకున్నాను. వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ఏం చేయటానికి అయినా సిద్దంగా ఉండాలి. అదే ఈ జన్మ కి నా కోరిక "అన్నారు.


"అందుకే ఇంత గొప్ప వ్యాపారవేత్తగా పేరుగాంచి నాన్నగారి కోరిక తీర్చలేపోతే మనమెందుకు ఆయనకు ఏం చేయాలనుంటే అది చేయు వెనుక నేనున్నాను అన్నాను. నిజంగా ఆయన సేవకు ఒక సైనికుడు లాంటివాడు.


ఆపదలో ఉండేవాడికి సహాయం అందించటమే కాదు.. !

తన ఇంటి గోడ బయట i help you. ఇక్కడ మీకు ఎటువంటి ఆపద ఉన్నా సహాయం చేయబడుతుంది అని బోర్డు పెట్టాడు.


ఒక్కోసారి ఆయనే శ్రమదానం చేస్తూ తోపుడు బండ్ల వారికి ఇంకా చాలామంది కుటుంబ భారం మోసేవాళ్ళు అనారోగ్యం పాలైతే వారు చేసేపని స్వయంగా ఆయనే చేస్తూ అందరికీ అండగా ఉంటారు.


సేవతోనే ఆయన త్రుప్తి పడుతున్నప్పుడు ఆయన మాటకు నేను ఎదురు చెప్పలేను. ఆయనంటే మా కుటుంబంనకే కాదు బయట సమాజానికి ఎంతో గౌరవం ఉంది.


నాయకులుకు, లేదా అదికారులకు ఎంతో సైన్యం, సెక్యురిటి ఉంటుంది కానీ గౌరవం తక్కువగానే ఉండవచ్చు. అదే సేవకుడికి మాత్రం ఏ సైన్యం, సెక్యురిటి ఉండదు కానీ గౌరవం వందరెట్లు ఎక్కువే ఉంటుంది " అన్నాడు ప్రశాంత్.


జరిగింది ప్రశాంత్ కి తెలుసిందని శంకరం మనసులో అనుకున్నాడు.


"అయ్యా... నిస్వార్థంగా సేవ చేస్తున్న నీ తండ్రికి కలిసే అవకాశం ఇప్పించండి మన్నించమని వేడుకోవాలి " అన్నాడు శంకరం.


“దయచేయండ" న్నాడు ప్రశాంత్.


పరాగ్ ని చూసి శంకరం, తన పరివారం చేతులు జోడించి క్షమాపణలు కోరారు.


" నేను ఒక సేవకుడినని అక్కడే తమకు ఎందుకు చెప్పలేదు.. ? సార్ " అన్నాడు శంకరం.


"చూడండి సేవ చేసేవాడు ఎప్పుడూ తాను మంచిపని చేస్తున్నానని చెప్పుకోడు. నిజంగా నేను చేసిన సేవే మీలాంటి మనుషులు ఈ సమాజంలో ఎందరో ఉన్నారని తెలుపుతున్నాయి. అయినా.. వాళ్ళు ఏమన్నా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మన పని మనం చేసుకోవటం ఉత్తమం.


మనం ఎంత మంచోళ్ళం అయినా..

ఎంత సేవ చేసినోళ్ళం అయినా..

కొందరికి మంచోళ్ళంగా, ఇంకొందరికి చెడ్డవాళ్ళంగా కనపడక తప్పదు.


చనిపోయాక నా గూర్చి అందరూ గొప్పగా చెప్పుకోవాలని నేను నా శరీరాన్ని, నా శ్రమని, నా ధనాన్ని, పరులకు ఇవ్వటంలేదు.


ఏదో సాటి మనిషిగా పక్కోడికి నాకు వీలైనంత సహాయం చేయాలన్నదే నా ఆశ. అదే స్ఫూర్తితో సహాయం అందిస్తున్నాను. వారి కళ్ళలో ఆనందం చూడటం నా కల.

ఆ కల నా కొడుకు వలన సాద్యం అయింది.

మీరు మీ తప్పు తెలుసుకుని పదిమంది వద్ద మంచిగా మెలగండి మీ కార్యం తప్పక నెరవేరుతుంది.


జీవితంలో ఎవరిని తక్కువగా అంచన వేయకండి ఎందుకంటే భగవంతుడు కూడా బిచ్చగాడిగా రాగలడు" అని ముగించాడు పరాగ్.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





Comments


bottom of page