'Shh Tasmath Jagrattha' New Telugu Story
Written By N. Dhanalakshmi
రచన: N. ధనలక్ష్మి
(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ప్రీతి ఈవెంట్ మేనేజర్. ఓ బాంబ్ బ్లాస్ట్ లో భర్త విజయ్ చనిపోయాడు. వారి ఇద్దరి ప్రేమకు ప్రతి రూపమైన మోక్షజ్ఞ అంటే తనకి పంచప్రాణాలు..
మోక్షజ్ఞను అందరు ముద్దుగా బన్నీ అంటారు. ఎన్ని పనులున్నా బన్నీను స్కూల్ లో దింపడం,అలాగే తీసుకొని రావడం తానే చేస్తుంటుంది. ఆదివారం ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉంటూ బన్నీతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తుంటుంది.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్కూల్ లో జరిగిన ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటుంది..
అలా రోజులు సరదాగా గడిచి పోతుండగా..
“రేయ్ బన్నీ! స్కూల్ కి లేట్ అవుతుంది. త్వరగా లేవరా! లేదంటే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను…”
“మమ్మీ!!!!! ప్లీజ్ ఇంకా కొంచం సేపు నిద్రపోతాను…”
" సరే నీ ఇష్టం! ఇలాగే నిద్రపో. అయితే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నేను తీసుకొని వెళ్ళలేదని ఫీల్ అవ్వకూడదు. మనం ఈ వీకెండ్ పార్క్ కి వెళ్ళాలి అనుకున్నాము కదా... అది కాన్సిల్. నువ్వు తీరిగ్గా లేచి ఫ్రెష్ అయి మీ గ్రానీతో స్కూల్ కి వెళ్ళి మీ మామ్ చేత తిట్టించుకో.. బై రా కన్నా. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్తున్న.. ”
“నో మమ్మీ ! నేను నీతో పాటు రావాలి! మనం
పార్క్ కి కూడా వెళ్ళాలి.. నేను 20 మినిట్స్ లో రెడీ అయి వచ్చేస్తాను. నేను బ్యాగ్ ని ఆల్రెడీ నైట్ చెక్ చేసుకున్న.. సో నో మోర్ వర్రిస్ మమ్మీ.. నువ్వు చెప్తూ ఉంటావుగా మన పనిని మనమే చేసుకోవాలని.. అందుకే ముందుగా నా పనులని చేసేసా”నని చెప్తూ స్నానం చేయడానికి వేగంగా వాష్ రూం లోకి వెళ్ళిపోయాడు...
అల్లరి చేస్తాడు కానీ చెప్పిన ప్రతి మాట వింటాడు. ‘బంగారం రా నువ్వు’ అని మురిసిపోతుంది ప్రీతి.
“అమ్మ, కొడుకు రెడీ అయితే టిఫిన్ తినండి” అంటు కిచెన్ రూం నుండి అరుస్తారు ప్రీతి వాళ్ళమ్మ లక్ష్మీ గారు...
“వచ్చేస్తున్నాము వెయిట్ అమ్మా.... ”
బన్నీ ఫ్రెష్ అయ్యేసి వచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని “గ్రాని.. పిచ్చ ఆకలిగా ఉంది త్వరగా పెట్టు” అంటూ అరుస్తాడు...
“రేయ్ బన్నీ... స్నానం చేసిన తరువాత ఏమి చెయ్యాలని చెప్పాను.. ”
“నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా ప్రేయర్ చేశానా మమ్మీ…”
“సరే దా చేద్దాము…” దేవుడి వద్ద బ్లెస్సింగ్ తీసుకొని సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేసేసి ప్రీతి తన ఆఫీసుకు,బన్నీ స్కూల్ కి స్టార్ట్ అయ్యారు.
“ఇంకా ఏమిటా రా స్కూల్ లో విశేషాలు.... ”
“మమ్మీ.. నా ఫ్రెండ్ సోనీ ఉంది గా. తను ఎందుకో ఈ మధ్య సైలెంట్ గా ఉంటుంది! నేను ఏమైనా మాట్లాడిన కౌంటర్ వేసేది.. అలాంటిది నేను ఎన్ని కౌంటర్స్ వేస్తున్న సరే సైలెంట్ గా ఉంటుంది. ఇంకో విషయం మమ్మీ. నీకు తెలుసు కదా.. మేము ఇద్దరం మార్క్స్ గురించి ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటామని.. ఈ మధ్య జరిగిన హాఫ్ యేర్లీ పరీక్షలో తనకి క్లాస్ లో అందరికన్న తక్కువ మార్క్స్ వచ్చాయీ. ”
“అవునా?? నువ్వు ఫ్రెండ్ వి కదా తనని అడగవచ్చు కదా పైగా తను నీ పక్కనే కదా కూర్చునేది.. ”
“అది ఒక్కప్పుడు మమ్మీ ! ఇప్పుడు అలా లేదు. లాస్ట్ బెంచ్లో వెళ్లి అది ఒంటరిగా కూర్చుంటుంది. టీచర్ అడిగిన ఏమి చెప్పడం లేదు... నేను మాట్లాడితే నాతో గొడవ పెట్టుకుంది. మమ్మీ.. ప్లీజ్ తనతో మాట్లాడి మా ఇద్దరికీ ప్యాచ్ అప్ చేయవా!!!”
“సరే బన్నీ నేను మాట్లాడతలే!”
“లవ్ యూ మమ్మీ…”
“లవ్ యూ రా కన్నా…”
స్కూల్ రాగనే బన్నీ దిగి “అదిగో సోనీ వస్తుంది…”
“హాయ్ సోనీ బంగారం !ఎలా ఉన్నావు?????”
“ఐ యాం ఫైన్ ఆంటీ!”
“ ఎందుకు రా డల్ గా ఉన్నావు.. ”
సోనీ సైలెంట్ గానే ఉంటుంది..
“చెప్పు రా కన్నా! నువ్వు బంగారం కదా”
“అది ఆంటీ.. ” అంటూ సోనీ చుట్టూ చూసి భయపడడం గమినిస్తుంది ప్రీతి....
“సరేలే.. నీ ఎనిమి ఫ్రెండ్ ది ఈ ఆదివారం బర్త్డే ! నువ్వూ తప్పకుండా రావాలి !”
“ఓకె ఆంటీ!” అంటు బన్నీ వంక చూస్తూ తన క్లాస్ కి వెళ్ళిపోయింది సోనీ!!
బన్నీ డల్ గా ఉండటం చూసి " నీ బర్త్డే రోజు ఇద్దరికి ప్యాచ్ అప్ చేస్తాను.. నో మోర్ వర్రీస్.. ”
“ఓకె మా! థాంక్స్ యూ…”
“బై కన్న” అంటు తన ఆఫీసుకు వెళ్ళిపోయింది ప్రీతి...
అదే రోజు సాయంత్రం స్కూల్ టైం అయిపోవడంతో ప్రీతి కోసం ఎదురు చూస్తున్నాడు బన్నీ... సోనీ ఏమో వాళ్ళ నాన్న కోసం చూస్తుంటుంది... వాళ్ళ నాన్న రాగేనే బైక్ ఎక్కింది...
వెళ్తున్న సోనీ వైపు చూసి "బై సోనీ!” అని బన్నీ చెప్పగా ఏమి చెప్పకుండా ఫేస్ పక్కగా తిప్పుకొని వెళ్లిపోయింది. పాపం వాడు హర్ట్ అయ్యాడు
ఈ లోపు ప్రీతి వచ్చేసింది...
“బన్నీ కన్న.. నేను వచ్చేశా!!!!”
డల్ గ ఉండడం అబ్జర్వ్ చేసి !!!
“ఏమైంది ! మా బన్నీ కి ఎందుకు అంత డల్ గా ఉన్నాడు!???. సోనీ తో గొడవ అయిందా!!”
“నో మమ్మీ!!! నేను బై చెప్పినా తను నుంచి ఏమి రెస్పాన్స్ లేదు అందుకే నాకు బాధగా ఉంది…”
‘ఎప్పుడు చలాకీగా ఉండే అమ్మాయీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది.. ఎదో జరిగింది అది ఏంటో నేను తెలుసుకోవాలి’ అని మనసులో అనుకుంటూ..
“నాన్న... నీ బర్త్డే లోపు నీ ఫ్రెండ్ తో నీకు ప్యాచ్ అప్ చేస్తాను.. తెలుసు కదా మమ్మీ మాట అంటే మాట!!!”అని ప్రీతి చెప్పగానే.... బన్నీ ఫేస్ మతాబుల వెలిగిపోయింది....
మరుసటి రోజు....
బన్నీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సోనీ కోసం వెయిట్ చేయసాగింది...
సోనీతో మాట్లాడాడని ప్రీతి ఫిక్స్ అయి స్కూల్ ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకొని విజిటర్స్ రూంలో వెయిట్ చేయసాగింది...
సోనీ రాగనే వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పడంతో ప్రీతి ఉన్న విజిటర్స్ రూం వైపు అడుగులు వేసింది....
“హాయ్ సోనీ బంగారం! ఎలా ఉన్నావు????
దా నా పక్కన వచ్చి కూర్చో.. ”
“నేను బాగానే ఉన్నాను ఆంటీ…”.
సోనీ డల్ గా ఉండటం చూసి.....
“ఏమైంది రా ! చూడు.. నేను నీకు ఇష్టమైన ఆంటీని కదా! ఏమీ జరిగింది.. అసలు నాకు చెప్పవా... నీకు ప్రామిస్ చేస్తున్న.. ఎవరికి చెప్పను???”
“నిజంగా చెప్పరు కదా.. మీరు ఎవరికైనా చెప్పితే తమ్ముడిని,బన్నీ ని చంపేస్తారు. ప్రామిస్ చేయండి ఆంటీ???”
“ఎవరికి చెప్పను !!! ప్రామిస్.... !!!”
సోనీ చెప్పింది విని ప్రీతి కంట్లో నీళ్లు తిరిగాయి....
తను ఏమి చేస్తే ఈ సమస్యకి పరీష్కారం దొరుకుతుందో అర్థం చేసుకొని సోని పేరెంట్స్ కలవడానికి వెళ్ళింది...
“ఎన్నడూ లేనిది మీరు ఆఫీసుకి వచ్చి మమల్ని కలవాలి అన్నారు. ఎందుకు అండి…”
“కావ్య,విక్రమ్ గారు.. నేను చెప్పేది మీరు కాస్త అవేశం తెచ్చుకోకండి వినండి…”
“ఏమిటి విషయం? మీరు అలా మాట్లాడుతున్నారు.. ”
“నేను డైరెక్ట్ గా అసలు విషయం చెపుతున్న...
వీరయ్య తెలుసా మీకు !!!”
“హా అండి.. తన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అండి.. మా ఫ్లాట్ ఎదురుగ ఉంటారు.. అప్పుడప్పుడు మా అమ్మాయి తో ఆడుకుంటూ ఉంటాడు... చాలా మంచి వ్యక్తి అండి…”
“ఆ మంచి వ్యక్తి మీ అమ్మాయి ని భయపెట్టి మరి వారం రోజుల నుంచి వాడు పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
సోనీని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అంటా... ఎవరికైనా చెప్పితే ప్రీతి కడుపులో ఉన్న బాబుని,అలాగే తన ఫ్రెండ్ అయిన నా బిడ్డ బన్నీని
చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు అంటా..
పాపం సోనీ భయపడి వాడు పెట్టే టార్చర్ భరిస్తుంది అంటా... నేను ఎంతో అడిగితే తప్ప తను చెప్పలేదు అసలు విషయం.. ”
విక్రమ్,కావ్య ఇద్దరు షాక్ అయ్యారు... మంచితనం ముసుగులో మనషులు ఇలా కూడా ఉన్నారా అని..
విక్రమ్ ఆవేశంగా “వాడిని అసలు వదిలి పెట్టను. వాడి అంతు చూస్తాను” అని కోపంగా బయలుదేరారు...
ప్రీతి తన వెనకే పరుగెత్తుతూ...
" ప్లీజ్ విక్రమ్ గారు నేను చెప్పేది వినండి....
ఇప్పుడు మీరు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సఫ్ఫెర్ అయ్యేది సోనీ అండి... తన గురించి టీవీలో,న్యూస్ పేపర్స్ లో వస్తూ,తన చుట్టూ ఉన్న జనం ఎందుకు తన వైపు జాలిగా చూస్తూన్నారో తెలియక,కొందరు అడిగే తిక్క సమాధానాలు చెప్పలేక తనలో తానే నలిగిపోతుంది.... ఆ చిన్ని హృదయం ఇప్పటికీ ఎన్నో భరించింది.. ఇంకా చాలు అండి.. దయచేసి ఇది పెద్దది చేయడం వద్దు.. అర్ధం చేసుకోండి”
“అలా అని వాడిని వదిలిపెట్టమంటార.... ?????”
"అలా నేను ఎప్పటికీ అనను... వాడికి తగిన శిక్ష.. పాప పేరు బయటకి రాకుండా వాడు ఈ ఊరు వదిలి పోయేలా, ఇంకా ఎప్పుడు ఇంకొకరి పై చేయి వేయాలన్న వాడు భయపడి చావలి వాడు.... ”
“అంటే ఏమి చేస్తున్నారు…”
ప్రీతి ఫోన్ తీసుకొని ఒక విడియో ప్లే చేసింది.
న్యూస్ ఛానల్ లో వీరయ్య స్టూడెంట్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అని,తనకు అడ్డు వచ్చారు అని ఇద్దరినీ చంపెసినట్టు కథనాలు వస్తున్నాయి... వాడిని కొడుతూ తీసుకువెళ్లడం కనపడుతుంది...
డిఎస్పి నా ఫ్రెండ్. వీరయ్య గురించి ఎంక్వైరీ చేయిస్తే వాడు గతంలో చేసిన నేరాలు బయటకు వచ్చాయి. వాటిని ఆధారం చేసుకొని వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు... వాడికి ఇప్పుడు కొట్టింగ్ పడుతూ ఉంది.. చూడండి అంటు వీరయ్యను స్టేషన్ లో కొడుతున్న దృశ్యాన్ని చూపించింది..
అంతవరకు బాధపడుతున్న కావ్య పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది..
అక్కడ నుంచి స్కూల్ కి వెళ్లి సోనీ నీ హత్తుకొని ఏడిచి తనని ఇంకోసారి ఎవరైనా బెదిరిస్తే అమ్మ,నాన్నకు చెప్పాలి అని చెప్పారు విక్రమ్,కావ్య.
సోనీ కి కూడా వీరయ్యను కొడుతున్న దృశ్యాన్ని చూపించారు...
ప్రీతి స్కూల్ ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకొని పిల్లలందర్నీ
సమావేశ పరిచింది...
"చూడండి పిల్లలు.... మీకు ఈ రోజు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పపోతున్న....
అమ్మ,నాన్న మనల్ని టచ్ చేస్తే అది గుడ్ టచ్.....
ప్రీతి తననే ఉదాహరణగా,అలాగే కొన్ని ఫోటోలను ప్రెజెంటేషన్ లో తీసుకొని ఎక్కడక్కడ టచ్ చేయకూడదొ వాటి గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది..
“ఇలా మిమ్మల్ని ఎవరైనా సరే బ్యాడ్ గా టచ్ చేసినా ఒకవేళ ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే కొడతామని చంపుతామని మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే మీరు భయపడకూడదు. వెంటనే మీ అమ్మ నాన్నకు చెప్పాలి.. మనం భయపడితే ఎదుటి వాళ్ళ మనల్ని భయపడుతునే ఉంటారు...
స్కూల్ ఉండే మీ టీచర్ తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు”
ఇంతలో కిరణ్ అనే అబ్బాయీ ఏడుస్తూ వెళ్ళిపోయాడు.. ప్రీతి తన వెంటే వెళ్ళింది.. ఆ అబ్బాయీ ఏడుస్తూ వాళ్ళ అంకుల్ ఎలా తనని బాధ పెడుతున్నారో మొత్తం చెప్పాడు... (54% అబ్బాయిల పైన ముఖ్యంగా చిన్న పిల్లల పైన హత్యచారాలు జరుగుతున్నాయని ఒక సర్వే చెబుతోంది)....
దేవుడా!!!!!ఇలాంటి కామాంధులు అడుగడుగున ఉన్నారా!?బాధ పడి, వాడిని కూడా అరెస్ట్ అయ్యేలా చేసింది ప్రీతి....
బన్నీ కి ప్రామిస్ ఇచ్చినట్టుగా తన బర్త్డే కి సోనీ తో ప్యాచ్ అప్ చేసింది... సోనీ కూడా కొద్ది కొద్దిగా ఆ సంఘటన నుండి బయటకి వచ్చి మామూలు మనిషి అయింది..
వారం రోజుల తరువాత......
స్కూల్ లో జరిగిన స్పోర్ట్స్ లో బన్నీ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది....
ప్రీతి హ్యాపీగా ఫీల్ అయి,”కన్న నీకు ఏమి కావాలో చెప్పు కొనిపెడతాను…”
“మమ్మీ నాకు ఓ గిఫ్ట్ కావాలి ఇస్తావా ????”
“అడుగు కన్న…”
“మా స్కూల్ కి వచ్చి గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి
చెప్పావు కదా... మన ఊరిలో ఉన్న అన్ని స్కూల్ కూడా అవేర్నెస్ కలిగించు మమ్మీ... అదే నాకు నువ్వు ఇచ్చే గిఫ్ట్. నేను పెద్దయ్యాక పోలీసును అయి సోనీ లాగ ఇంకోకరు బాధ పడకుండా చూసుకుంటాను...
నాన్నల ఇంకోకరు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోకుండా చూస్తాను. ఇదే నా ప్రామిస్ అమ్మా” అని నవ్వుతూ చెప్తాడు బన్నీ....
ఐదో తరగతి చదువుతున్న బన్నీ లో అంత గొప్పగా ఆలోచించే గుణం చూసి తన పెంపకాన్ని చూసి గర్వపడుతుంది ప్రీతి. వాడిని హగ్ చేసుకొని ‘అలాగే కన్న’ అని ప్రామిస్ చేసింది..
ప్రీతి అటు వర్క్ ను చూసుకుంటూ వీకెండ్స్ లో స్కూల్స్ కి వెళ్ళి అవేర్నెస్ కలిగిస్తుంది....
ఇది కేవలం కల్పిత కథ కానీ..... ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి!????
అమ్మాయీ లో అమ్మ ఉంది అని భావిస్తే ఎవడు కూడా పరాయి ఆడవాళ్ళను తప్పుడు దృష్టితో చూడడు.
ఎన్ని చట్టాలు వచ్చిన... మనషుల్లో మార్పు రాన్నంతవరకు ఇలాంటివి ఆగవు.. బాల్యం నుండే ఆడపిల్లలను. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పాలి.. ఆడపిల్లలకి ఎలా జాగ్రతలు చెపుతామో అలాగే మగపిల్లలకి కూడా పరాయి ఆడవాళ్లని ఎలా చూడాలో నేర్పించాలి అప్పుడే ఇలాంటివాటికి అడ్డూకట్ట వేయాగలం
. మార్పు రావాలి...
మార్పు ఎక్కడ నుండో రాదు మన నుండే రావాలి..
ఆడపిల్లలకి బాల్యం నుండే తనని తాను రక్షించుకునే విధంగా కరాటే, కర్రసాము నేర్చుకోవాలి.
అమ్మాయిలు, అబ్బాయిలను నిరంతరం తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి.. చెడు మార్గం వైపు అడుగులు వేస్తుంటే ఆదిలోనే తుంచే చేయాలి..
బాగా సంపాదించి పిల్లలకి కష్టం తెలియకుండా పెంచటం ఒకటే తల్లిదండ్రుల బాధ్యత కాదు పిల్లల బాగోగులు కూడా దగ్గరుండి పర్యవేక్షించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
స్నేహితులుగా వాళ్ళ దగ్గర ఉంటూ ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటూ మంచి ఏంటో, చెడు ఏంటో తెలియచెప్పాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయగలం..
ఇలాంటి మార్పు త్వరగా రావాలని ఆశిద్దాం....
***
N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.
Commenti