top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

సింధుర రాజ బంధ విముక్తి - 1


'Sindhura Rajabandha Vimukthi - 1' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 09/10/2023

'సింధుర రాజ బంధ విముక్తి - 1' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


{1} నానావిధ మృగమయమగు యడివిన్నేలేడి

గజనాథుండొక్కడు పానీయంబులు ద్రావనెంచి

ఏనాదంబును బోలిన కొలనుంగని తానా దరిజేర

సేనాముఖము తోడన్ జనె స్నానంబాచరించ సంబరమొప్పన్.


{2} చేగల మెకముల చేష్టల నెంచంగ

పూదీగలంగళముల దీటుగ నివురుచు నెరపునారీ

నాగములతొడన్ వలపు నిలుపుటెరిగి

రాగముప్పొంగ తీగ యింటను దాగుండి తిరుగుచుండు.


{3} కరివల్లభుండరిగెన్ బరి

పూరిత నిర్మల నిశ్చల కాసారమున్

దరిజేరన్ నట గాంచె కమల కల్ హార

సుపరిమళ మనోల్లాస సుమాలతల్.


{4} శుండాలములు దమ తొండంబుల నీరు

నిండు నటులంజేసి గండంబుల జల్లుకొనుచున్

మెండుగ సరసి యండన గ్రీడించి నిక

నిండంగడుపుల నీరు నా వేదండంబుల్ ద్రావెన్.


{5} నిశ్చల కాసారంబున్ కరుల్

అనిశ్చల బరుచంగ పొడగాంచి

దానచ్చెరువొందుచున్ మకరేంద్రుడొచ్చె

దరిజేరె నిభరాజు నొడసి పట్టె.


{6} వారణమప్పుడు నిబద్ధ పద

నివారణ మొందన్ వారి చరంబుతోడ నూరక

వారము వారము వాటులాడుచున్

పరివార మదుర పోరాడె వన గ్రాహము తోడన్.


{7} కరినొడసి పట్టి మకరియు

సరి దూగుచు మకరికిన్ కరి మరి

పురిగొల్పన్ మది మకరి కరి

కరి మకరి మరి మరి పోరెన్.


{8} కుంభి కుంభీరముల్ సల్పిరిక

గంభీరముగన్ బోరు కుంభిని యదురన్

సంభావనన్ దల్చె స్తంబేరము

శంభువు గొల్చుటె క్షేమ సంభవమనుచున్.


{9} నక్రగ్రాహము తోడన్ పెక్కేండ్లు పోరాడి

చిక్కి శల్యంబగుచున్ ఎక్కుడు మెకంబు

దిక్కెరుంగని విధంబున దీనతన్

మ్రొక్కన్ బూనె మొరాలించ మురారిన్ హరిన్


{10} వెతలొందుచున్ మతంగజము

గతజన్మ పుణ్య ఫలంబు జ్ఞానంబునన్నేటి

దుర్గతికిన్ చింతించుచున్ శ్రీ

పతినిన్ వేడ చిత్తంబునన్ బొడ సూపెన్.

=================================================================================

ఇంకా ఉంది..

సింధుర రాజ బంధ విముక్తి - 2 త్వరలో

========================================================================

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


20 views0 comments

Comments


bottom of page