#SkimmingMosamGuru, #స్కిమ్మింగ్, #మోసంగురూ, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Skimming Mosam Guru - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 06/03/2025
స్కిమ్మింగ్ మోసం గురూ - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
భాస్కర్ ప్రతినెల జీతం పడ్డాక ఏటీఎం దగ్గరికి వెళ్లి నెల ఖర్చులకు సరిపోయే డబ్బులను డ్రా చేసుకొని వచ్చేవాడు. అలా ఈసారి కూడా వెళ్లి డబ్బులను తీసుకొని వచ్చాడు. కాసేపటికి భాస్కర్ కి ఎస్ఎంఎస్ లు వచ్చాయి. ఎలాంటి ఎస్ ఎం ఎస్ లు అంటే 10000 మీ ఖాతా నుంచి డెబిట్ చేయబడింది, 10000 మీ ఖాతా నుంచి డెబిట్ చేయబడింది అంటూ మూడు దఫాలుగా 30000 డ్రా అయినట్టు మెసేజ్ లు వచ్చాయి.
అక్కడికి ఆరోజు లిమిట్ అయిపోయింది. ఆ ఎస్ ఎంఎస్ లను చూసిన భాస్కర్ ఆశ్చర్యపోయాడు. నేను ఈరోజు కేవలం ఒకసారి మాత్రమే కదా ఏటీఎం కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక జరిగింది అంతా తన కూతురు ఉష కి చెప్పాడు. అది విన్న ఉష, భాస్కర్ తో "నువ్వు ఈరోజు ఎంత డబ్బులను డ్రా చేశావు నాన్నా ?" అని అడిగింది.
దానికి భాస్కర్ “నేను ఈరోజు పదివేలను మాత్రమే డ్రా చేశాను” అని చెప్పాడు.
దానికి ఉష "సరే, ముందు అర్జెంటుగా ఏటీఎం కార్డుని బ్లాక్ చేద్దాం నాన్నా! దానిని మొబైల్ తో కూడా సులభంగా
చేయొచ్చు" అని చెప్పి బ్లాక్ చేసింది.
“అలాగే నీ బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేద్దాము” అని బ్యాంకు కి ఒక రిక్వెస్ట్ ని పంపించింది. ఆ తర్వాత భాస్కర్ తో "నాన్నా! నువ్వు నీ ఏటీఎం కార్డు యొక్క వివరాలని కానీ లేదా ఏదైనా ఓటీపీలను కానీ, లేదా బ్యాంకు వివరాలని కానీ ఎవరితోనైనా షేర్ చేశావా" అని అడిగింది.
దానికి భాస్కర్ "లేదమ్మా నేను ఏం చేయలేదు" అని చెప్పాడు.
"సరే నాన్నా! నువ్వు ఏ ఏటీఎంలో నుంచి డబ్బులు తీశావో వెళ్లి చూద్దాం పద" అని అంది.
వెంటనే భాస్కర్ “పద వెళ్దాము" అంటూ ఇద్దరూ ఆ ఏటీఎం దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆ ఏటీఎం ని చూశాక ఉష
భాస్కర్ తో "అక్కడ చూడు నాన్నా! ఏటీఎం కార్డును పెట్టే దగ్గర స్కిమ్మింగ్ డివైస్ ఉంది" అని చూపించింది.
అది చూసిన భాస్కర్ షాక్ అయ్యాడు. “స్కిమ్మింగ్ డివైసా? అంటే ఏంటి?” అని అడిగాడు.
దానికి ఉషా భాస్కర్ తో "నాన్నా! స్కిమ్మింగ్ డివైస్ అనేది ఒక కార్డు రీడర్. మోసగాళ్లు దీని ద్వారా కార్డు నెంబర్లను
సేకరించి, వాటితో నకిలీ కార్డులను తయారుచేస్తారు. ఆ తరువాత వాటిని అక్రమ లావాదేవీల కోసం ఉపయోగిస్తారు”
అని చెప్పింది.
అది విన్న భాస్కర్ అక్కడి నుంచి బ్యాంకు దగ్గరకు వెళ్లి ఒక కంప్లైంట్ ని రిజిస్టర్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఉషా తండ్రితో ఇలా చెప్పింది "ఏటీఎం యంత్రాలలో ఏమైనా లావాదేవీలను ప్రారంభించేముందు స్కిమ్మింగ్ డివైస్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. స్కిమ్మింగ్ డివైస్లు అంటే మోసగాళ్లు ఉపయోగించే ఒక కార్డు రీడర్స్. ఆ స్కిమ్మింగ్ డివైస్ లను ఉపయోగించి చేసే ఏవైనా మోసాలు జరిగినపుడు వీలైనంత తొందరగా బ్యాంకుకు వెళ్లి మనం కంప్లైంట్ ని రిజిస్టర్ చేయాలి.
లావాదేవీలను తరచుగా గమనిస్తూ ఉండాలి. మీ తరపున లావాదేవీలను చేయడానికి ఏటీఎం ప్రాంగణంలో ఎవరికీ
ఏటీఎం కార్డు ని ఇవ్వద్దు"
"ఇకనుంచి ఏటీఎంలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కార్డు పెట్టేముందు కార్డు
స్లాట్ ను ఒకసారి తనిఖీ చేసి తరువాత ఉపయోగించడం మేలు" అనుకున్నాడు భాస్కర్.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
Veeraiah Katam
•20 hours ago
nice story
@The leo tv
•1 day ago
❤