#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SnehamKosamThyagam, #స్నేహంకోసంత్యాగం, #TeluguChildrenStories

స్నేహం కోసం త్యాగం.. (వజ్రపు విలువైన జంట)
Sneham Kosam Thyagam - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 19/02/2025
స్నేహం కోసం త్యాగం - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1). అది ఒక మంచి పాఠశాల. 'చిన్నారి అందాల వింధ్య' ఆరవ తరగతి విద్యార్థిని. ఆమె ధనవంతురాలు - గుణవంతురాలు. ఎవ్వరికీ ఆవగింజంత - ఇసుక రవ్వంత కూడా హాని చేయదు.. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ. వింధ్యని 'తేనె మనస్సుల మూర్తి' అనటం సబబు. అందుకే నేమో ఆమె నవ్వు కూడా తియ్యగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. హాయి చేకూరుస్తుంది. ఆమెవి మృదు పలుకులు, కోకిల కంఠం. అతిలోక సుందరి దివి నుండి భువికి దిగి వచ్చిందా ?.. అన్న సందేహం కలుగుతుంది.. ఆమెను తొలి సారిగా చూసిన వారికే కాదు.. ఎప్పుడు చూసినా.. ఎన్ని సార్లు చూసినా. ప్రపంచపు మొదటి వింత ఏమంటే "అందాన్ని మించిన అందాల వింధ్య యే" అనటం విచిత్రం కాదు. అతిశయోక్తి కాదు.
--- X X X ----
2). ఆరోజు ఉదయం మొట్ట మొదటి తరగతి లో హింది మాస్టారు గిరి గారు వింధ్య ను ఇలా అడిగారు, "ఏంటమ్మా వింధ్య? ఈ రోజు కార్ లో రాలేదు? నడుచుకుంటూ వచ్చావు పాఠశాలకు. నిన్ను ఉదయాన పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద చూసాను. నడుచుకుంటూ రావటం", అని ఆశ్చర్యం గా అడిగారు.
వింధ్య తియ్యగా చిలుక పలుకులు ఇలా పలికింది,
"నడిచి వస్తె శరీరానికి మంచి వ్యాయామం లభ్యమవుతుంది. అందరూ చిన్న దూరం కు నడవాలి లేక సైకిల్ తొక్కుతూ రావాలి. పెద్ద దూరం కు సమూహ వాహనం అయిన బస్సు లో, రైలు లో మాత్రమే ప్రయాణం చేయాలి. కార్లు, ద్విచక్ర వాహనాలు (స్కూటర్, మోటార్ - సైకిల్, స్కూటీ) వాడుక తగ్గించాలి. మూడింతల లాభం. I) డబ్బు ఆదా - పొదుపు
ii) శరీర వ్యాయామం లభ్యం iii) వాతావరణంలో పొగ - కాలుష్యం తగ్గుతుంది. అనారోగ్యం, గ్లోబల్ వార్మింగ్, అతి వృష్టి - అనా వృష్టి తగ్గుతాయి.
--- X X X ----
3). ఉండ బట్ట లేక గిరి టీచర్ మళ్లీ ఇలా అడిగారు, "ఈ రోజు చవక బారు కాటన్ - డ్రెస్ లో వచ్చావు? ఎందుకలా?"
అందాల వింధ్య ఇలా జవాబు చెప్పింది,
"దూది - కాటన్ బట్టలు చర్మానికి మంచిది సార్. చర్మం మీద వచ్చిన చమటను పీల్చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యం గా - చల్లగా ఉంచుతుంది. మరియు మనిషికి ఉత్సాహం - ఉత్తేజం - మంచి ఆరోగ్యం చేకూరుస్తుంది. అందరూ అలాగే రోజు కాటన్ - దూది బట్టలే ధరించాలి సార్. అప్పుడు దూది పండించే కర్షకులకు సహాయం చేసినట్టు కూడా ఉంటుంది".
"సింథటిక్ బట్టల్లో రసాయనాలు ఉంటాయి. అవి చర్మానికి చికాకు, ఎలర్జీ దద్దుర్లు, దురద ఇస్తాయి. అందులోని మైక్రో - ప్లాస్టిక్ పర్యావరణ సమస్య ను ఎక్కువ చేస్తుంది. మంచి నీటిలో మైక్రో - ప్లాస్టిక్ సునాయాసంగా చేరుతుంది. మన కళ్ళకు కనపడదు. అలాగే ఆ నీరు తాగేస్తే, క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల - ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనుషులకు. అందరూ ఎల్లప్పుడూ కాటన్ బట్టలే వాడాలి. డబ్బు కూడా అడా అవుతుంది. ఎలాగు చలి కాలంలో వులెన్ - స్వెట్టర్ వేసుకోవచ్చు. వానాకాలంలో రెయిన్ - కోట్ ఎలాగు వాడవచ్చు కదా", అన్నది
--- X X X ----
4). హిందీ టీచర్ గిరి గారు ఇలా పొడిగించారు సంభాషణ ను,
"ఏమ్మా వింధ్య.. నిన్న అందరితో కలసి మధ్యాన విశ్రామ సమయం లో ఆట లాడావట? అలాగే అందాల సంధ్యా సమయాన కూడా కాసేపు పాఠశాల గ్రౌండ్స్ - ఖాళీ స్థలం లో స్నేహితులతో కలసి ఆడుకున్నావట. అసలే కోమలాంగివి" అన్నారు.
అందాల వింధ్య ఇలా తెలివిగా జవాబు ఇచ్చింది.
"ఆటలు - పాటలు మంచి ఉత్సాహం, ఉల్లాసం, శక్తి, మానస వికాసం ఇస్తాయి. మనస్సును సంతోష పరుస్తోంది. అలాగే జట్టు రీతి, నాయకత్వపు లక్షణాలు కూడా వస్తాయి మనుషుల్లో. రేపటి మంచి పౌరులు, నిర్మాణాత్మక త నిర్వహణ కారులు (constructive మేనేజర్ లు) అవుతారు. కష్టం - నష్టం - కీడు - హాని ఇచ్చే మేనేజర్లు అవ్వరు భవిష్యత్తులో. స్నేహ భావంతో పాటు సహాయం చేసే తత్వం కూడా చిగురిస్తుంది ఆలోచనా తీరు లో. మనుషులు 'మమతలు - అనురాగాలు' తో జీవిస్తారు. కల్లా కపటం, కుళ్ళు కుతంత్రం తో కాదు. మనుషులు అన్నాక మట్టి బొమ్మల్లా, రాక్షసుల్లా జీవించరాదు"
"అన్ని విద్యా కేంద్రాలు (పాఠశాలలు, కళాశాలలు) రోజూ ఆటలు - పాటలు పెట్టాలి. గ్రౌండ్స్ - స్థలం లేక పోతే, మిద్దె మీద ఆటలు పెట్ట వచ్చు. ఇండోర్ గేమ్స్ పెట్ట వచ్చు. డిబేట్ - ఎలోక్యూషన్ క్లాస్ లు నిర్వహించ వచ్చు. ఇవన్నీ సిలబస్ 30-40 శాతం (%) తగ్గిస్తే - కుదిస్తే సాధ్యమవుతుంది. పిల్లలు ఇష్టపడి చదువుతారు. అయిష్టంగా పరీక్షల కొరకు - మార్కుల కొరకు బట్టీ పట్టే - కంటస్తం చేసే చదువులు అదృశ్యం అయిపోతాయి. పరిశోధనా తీరు, మంచి ఆలోచనా తీరు వస్తుంది విద్యార్థుల్లో, అందరి లో (చిన్న - పెద్ద - ఆడ - మగ). సొంత వాక్యాల్లో జవాబులు వ్రాస్తారు పరీక్షల్లో.. విషయం అర్ధం చేసుకొని", అని మృదువుగా - కాంతివంతంగా - సూర్య తేజస్సుతో ముగించింది అందాల వింధ్య.
--- X X X ----
5). గిరి టీచర్ గారు "భేష్ వింధ్య" అన్నారు. "పాఠశాల క్యాంటీన్ కు వెళ్ళటం మానేసావు ఆట. ఎందుకు?" అని అడిగారు.
వింధ్య తియ్యటి చిరునవ్వు తో ఇలా చెప్పింది,
"ఎక్కువగా చెక్కర, ఉప్పు, నూనె, కారం, కొవ్వు, నెయ్యి ఉండే పదార్థాలు తినటం ఒంటికి - ఆరోగ్యానికి మంచిది కాదు. హోటల్ తిండి ఎప్పుడైనా తింటే పర్వాలేదు. తరచు తింటే ఆరోగ్యం చెడుతుంది. ఇంటి వంట తిండి యే ఆరోగ్యానికి మంచిది", అని కిల కిల నవ్వుతో ముగించింది తెలివిగా ' 'చిన్నారి అందాల వింధ్య'.
------ X X X ----
6). వెంటనే ఒక కాగితం మీద ఇలా (నీతులు లా) వ్రాశారు హింది టీచర్ గిరి గారు:
---- అందరికి సూచన (నీతులు కూడా.. అందాల వింధ్య ఇచ్చినవి) ----
i). కాటన్ - దూది బట్టలే ధరించాలి. అది చర్మానికి క్షేమం - ఆరోగ్యకరం. దూది పండించే కర్షకులకు సహాయం చేసినట్లు కూడా అవుతుంది. దూది తేలికగా చమట పీల్చి, చికాకు - దురద - ఎలర్జీ లేకుండా చేస్తుంది.
ii). సింథటిక్ బట్టల్లో రసాయనాలు ఉంటాయి. అవి చర్మ క్యాన్సర్, అలెర్జీ,
దురద, చికాకు ఇస్తుంది. అందులోని మైక్రో ప్లాస్టిక్ నీటిలో చేరి మన శరీరంలోకి పోయి క్యాన్సర్, శ్వాస సమస్యలు, ఇతరత్రా వ్యాధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సింథటిక్ బట్టల వాడుక నిరోధించాలి లేక తగ్గించాలి.
iii). నడక లేక సైకిల్ తొక్కడం చేయాలి చిన్న దూరాలకు.
వ్యాయామం - ఆరోగ్యకరం.
iv). పెద్ద దూరాలకు సమూహ వాహనం అయిన బస్సు లో, రైలు లో ప్రయాణం చేయాలి. కార్లు, ద్విచక్ర వాహనాలు (స్కూటర్, మోటార్ - సైకిల్, స్కూటీ) వాడుక తగ్గించాలి.
(iii & iv) వల్ల నాల్గింతల లాభం.
1) డబ్బు ఆదా - పొదుపు
2) శరీర వ్యాయామం లభ్యం
3) వాతావరణంలో పొగ - కాలుష్యం తగ్గుతుంది. అనారోగ్యం, గ్లోబల్ వార్మింగ్, అతి వృష్టి - అనా వృష్టి తగ్గుతాయి.
4) ఇతరుల - పేదల - మధ్య తరగతి కుటుంబాల కష్టాలు - సాధక - బాధకల పై అవగాహన వస్తుంది
-----------------
V). ప్రతి విద్యా కేంద్రం లో [పాఠశాలల్లో, కళాశాలల్లో.. (కార్యాలయాల్లో కూడా)].. రోజూ క్రీడలు - అభిరుచుల తరగతులు ఉండాలి. సిలబస్ 30-40% కుదిస్తే ఇది సాధ్యం. ఎందుకు???.. మానస వికాసం, నాయకత్వపు లక్షణాలు, జట్టు రీతి, సహాయం చేసే గుణం, సంతోష మనస్సు, సంతోష పూరిత నిర్వహణ, ఆనంద పూరిత పరిష్కారాలు కనుక్కునే గుణం, ప్రగతి శీల తత్వం, అభ్యుదయ ఆలోచనా తీరు.. అదీ ఇతరుల తప్పులు ఎంచకుండా.. (పెక్కు మంచి గుణాలు, మానవత్వం) అలవడుతాయి చిన్నప్పటినుండే.
---------------
VI). ఎక్కువగా చెక్కర, ఉప్పు, నూనె, కారం, కొవ్వు, నెయ్యి ఉండే పదార్థాలు తినటం ఒంటికి - ఆరోగ్యానికి మంచిది కాదు. హోటల్ తిండి ఎప్పుడైనా తింటే పర్వాలేదు. తరచు తింటే ఆరోగ్యం చెడుతుంది. ఇంటి వంట తిండి యే ఆరోగ్యానికి మంచిది
పై ఆరోగ్యకరమైన - పొదుపు ఇచ్చే (చిన్నారి అందాల వింధ్య) సూచనలు అందరూ పాటించాలి.
ఇట్లు పాఠశాల యాజమాన్యం.
----- అందాల వింధ్య ఆరోగ్యకరమైన సూచనలు సమాప్తం ----
-------- X X X ----------
7). హిందీ టీచర్ గిరి గారు ఇలా అన్నారు.
"ఈ కాయితం ను నోటీస్ బోర్డ్ మీద పెడతాము. అలాగే ఈ 'చిన్నారి అందాల వింధ్య' వజ్రాల్లాంటి మాటలను - సూచనలను అనౌన్స్మెంట్ కూడా చేస్తాము ప్రతి తరగతి గది లోని విద్యార్థికి, పెద్ద చిన్న - ఆడ మగ కు వినపడేటట్టు.. తెలియ చేయటానికి. ఈ సూచనలను రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వానికి, విద్యా - బోర్డ్ కు, ఐక్య రాజ్య సమితి కి (UNO కు) కూడా పంపిస్తాము. వింధ్య పేరు మీదనే", అంటూ ముగించారు చిరు నవ్వుతో.
అందరూ పిల్లలు చప్పట్లు కొట్టారు అందాల వింధ్యని, ఆమె తేనె మనస్సును అభినందిస్తూ.
------ X X X ---------
8). సాయింత్రం అందాల సంధ్యా సమయం వేళ.. బడి అయిపోయింది అనే సూచన గా గంట కొట్టారు. అందరూ ఇళ్ళ వైపు దౌడు తీశారు.
మంచి మాధవ్ అనే ఆరవ తరగతి విద్యార్థి తన తరగతి గది బయిట నిల్చున్నాడు.. తన సహ పాటి, క్లాస్ మేట్, సహ విద్యార్థిని 'చిన్నారి అందాల వింధ్య' బయిటికి రాగానే ఇలా అన్నాడు
"నాకు తెలుసు వింధ్య. చాలా మంది ఈ పాఠశాలలో.. నా లా.. ఖరీదైన బట్టలు - వస్తువులు - కార్లు కొనలేరు. అందుకే నువ్వు స్నేహం కోసం అవి త్యాగం చేసావు. మా లాంటి వారి మనస్సులు నొప్పించకుండా ఉండటానికి. నీది తేనె మనస్సు", అని కొని-యాడడు.. కృతజ్ఞతా భావంతో చూస్తూ.
అప్పుడే అటు వైపు వెళుతున్న వారిరువురి శ్రేయోభిలాషి హింది టీచర్ గిరి గారు ఈ మాటలు విన్నారు. ఇలా అన్నారు చిరు నవ్వుతో..
"చిన్నారి అందాల వింధ్య మరియు మంచి మాధవ్ లోకోద్దారకులు. ప్రపంచ మేలు కోసం పుట్టిన జంట. నిజమైన - అసలు సిసలైన వజ్రపు విలువ గల అమూల్యమైన జంట. మీది అమూల్యమైన స్నేహం (జంట)" అని ఆశీర్వదించారు.
--- X X X ---- కథ సమాప్తం --- X X X ----
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Commentaires