top of page
Writer's pictureMutyala Laxma Reddy

స్నేహం



'Sneham' - New Telugu Poem Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 23/05/2024

'స్నేహం' తెలుగు కవిత

రచన: M. లక్ష్మా రెడ్డి


కాలం అలానే ఉంటుంది..

మనమే పరిగెత్తుతుంటాం..

అందిన తీరాలను ఆస్వాదించక

అందని దూరాలను తాకి గెలవలేక


అనుక్షణం శ్రమిస్తుంటాం..

కొత్తగా అలసిపోవడానికి

ఆ అలసటలో నిద్దరోవడానికి..


కాలం అలానే ఉంది.. 

మనమే పరిగెత్తుతున్నాం.. ఈ పరుగులో

కొన్ని బంధాలు జీవిత కాలం

ఇంకొన్ని జ్ఞాపకాలు ఎల్ల కాలం

కొన్ని పరిచయాలు మనని మరిపిస్తూ

మరిన్ని కలయికలు మదిని మురిపిస్తూ


కాలం.. ఓ అద్భుతం..

ఇన్ని జ్ఞాపకాల సంపదకి

ఊపిరైన  ఆ జ్ఞాపకాలకి..

ఈ పరుగులో..

 పెదాల మాటున నవ్వులెన్నని

కళ్ల వెనక దాగిన కన్నీరెంతని

మాటల్లోకి మారలేని భావాలెన్నని

మది రాసే కథా కావ్యాలెన్నని.. 


ఒక్క మాటలో 

కాలం  కనిపించని ప్రియురాలు

కానీ జ్ఞాపకాలు..విడవని స్నేహితులు

జ్ఞాపకాల కోటలో 

మనసు ప్రియ బంధనమే స్నేహం

విహార వేడుకలో 

వీడని చెలి బాహు బంధనమే స్నేహం


దోస్తులే ..దూరమైనా భారమైనా

మిత్రులే.. మంచైనా .. మందైనా..

కాలం తెంచలేని బంధమే ..స్నేహం

కనుమరుగవని భావనే స్నేహం


Expiry లేని టానిక్ స్నేహం

Expression అక్కర్లేని feeling స్నేహం..

Direction ఉండని..

Dimensions లేని..

Dilution అవలేని..

Definition అవసరం లేని..

ఓ గొప్ప ఫీల్... Friendship...


***

M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...


57 views0 comments

Comments


bottom of page