top of page
Writer's pictureA . Annapurna

స్నేహశీలి!

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #Snehaseeli, #స్నేహశీలి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Snehaseeli - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 16/01/2025

స్నేహశీలి - తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఆనాడు నిన్ను చూడగానే సంతోషపు అల నా హృదయాన్ని తాకింది

మన స్నేహన్ని వదిలి నీవు టో వెళ్ళిపోయావు

ఎందుకంత తొందర

కొత్త స్నేహం దొరికిందనా కొత్త లోకం చూడాలనా

నీకోసం అపురూపం దో వెలిసిందనా

నీ తలపులతో నాగుండె తలుపులు తడుతూనే వుంటావు

ఆ తలుపుకు చేరబడి గతంలోకి వెళ్ళిపోతాను


నాఎదుటనే ఉంటావు

గతకాలపు జ్ఞాపకాలతో మురిపిస్తావు

నీకు గుర్తు ఉందా నువ్వు చేసిన అల్లరి?

నీ పుట్టినరోజున పార్టీ ఇచ్చి నాకు ఇష్టమైంది నువ్వు తిన్నావు 

నీకు ఇష్టం అయినది నా చేత తినిపించావు

నీకు నచ్చిన డ్రెస్ నాకు ఇచ్చావు

నాకు నచ్చిన చీర నువ్వు కట్టుకున్నావు


ఇలా అన్ని తిక మక పనులు చేసావు

నేను మెచ్చిన వాణ్ణి నీ జీవిత సహచరుడిగా ఎంచుకున్నావు

నీకు ప్రాణమైన అన్నను నాకు కానుకగా ఇచ్చావు

ఇంతగా ఇష్టపడిన నన్ను

ఎందుకు వదిలి వెళ్ళావో అర్ధం కాదు


నా పొరబాటు ఏమిటో తెలియడంలేదు

నా తలపుల్లో జొరబడుతూనే ఉంటావు

నావెనుకనే నడిచివస్తావు

నిన్ను మరువలేను

నీవు జీవించే వున్నావు నా మనసులో

నా హృదయమనే 'ఆల్బమ్ చిత్రాలలో' నెచ్చెలి!



********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





31 views2 comments

2 Comments


స్నేహశీలి: ఎ. అన్నపూర్ణ

ఇది చదువుతున్నప్పుడు .. కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. అందరూ కనీసం ఒక్క స్నేహితుడిని అయినా .. ప్రేమను అయినా .. వీడి ఉంటారు .. దాని కోసం నిరీక్షిస్తూ ఉంటారు.

పి. వి. పద్మావతి మధు నివ్రితి

Like

mk kumar
mk kumar
2 days ago

జ్ఞాపకాలతో నిండిన భావోద్వేగ కవిత.

మీ హృదయానికి అక్షరరూపమిచ్చిన తీరు అద్భుతం.

భావపూరితమైన స్నేహం, నమ్మకం, అనుబంధం ప్రతీ పంక్తిలో ప్రతిఫలించాయి.

"నా హృదయమనే 'ఆల్బమ్ చిత్రాలలో' నెచ్చెలి" అని మీరు చెప్పినది

మీ జ్ఞాపకాలను మరింత ఉజ్వలంగా ప్రతిబింబిస్తోంది.

ఇలాంటివి మరిన్ని రాయాలని ఆశిస్తున్నాను!

Like
bottom of page