#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #Software Sarigamalu, #సాఫ్ట్వేర్సరిగమలు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Software Sarigamalu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 14/12/2024
సాఫ్ట్వేర్ సరిగమలు - తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రవళికి తన మేనత్త కొడుకు రాజీవ్ తో రెండేళ్ళక్రితమే పెళ్లయింది. రాజీవ్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడు నిరంతరం మీటింగులు, చాటింగులతో తీరిక లేకుండా ఉండేవాడు.
రవళి పల్లెటూర్లో పుట్టి పెరిగింది. పెద్దగా చదువుకోలేదు. అందువల్ల ఎవ్వరితోనూ పరిచయాలు పెంచుకోలేదు.
కాలక్షేపం అవక సాయంత్రం భర్త రాకకోసం ఎదురు చూస్తుకూర్చునేది రవళి. తీరా ఆఫీసు నుండి వచ్చాక భర్తతో కలిసి కాసేపు కబుర్లు చెప్తూ భోజనం చేద్దామంటే మీటింగులతో రాజీవ్ కి వీలయ్యేది కాదు.
భర్త తనను పట్టించుకోకుండా వేరొకరితో కాలక్షేపం చేస్తున్నాడనే అనుమానం పెరిగిపోయింది.
ఒకరోజు “రాజీవ్! నేను నీనుంచి ఏమీ ఆశించలేదు కాసేపు నాతో సరదాగా మాట్లాడమన్నాను. కానీ అది కూడా నీవల్ల కాలేదు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. లేదంటే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు. నన్ను పట్టించుకోలేదు. ఇంతకాలం ఓపిక పట్టాను. ఇక నావల్ల కాదు. ఇలాగే కొనసాగితే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను” అంటూ నిలదీసింది.
“ఏం చెయ్యను.. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అటువంటివి. నువ్వు అనుకున్నట్లు నాలో నేను మాట్లాడుకోలేదు. మీటింగ్ లో ఉన్నాను నా చెవుల్లో బ్లూ టూత్ లు ఉన్నాయి” అంటూ తన చెవిలో బ్లూటూత్ లు తీసి భార్య చెవిలో పెట్టాడు రాజీవ్. అయినా రవళికి నమ్మకం కలగలేదు. రాజీవ్ అమ్మాయిలతో మాట్లాడుకుంటూ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానం పెరిగిపోయింది. తన అనుమానంతో రాజీవ్ ను ఇబ్బంది పెట్టేది.
ఒకరోజు వీధిలో కళ్ళాపి చల్లి ముగ్గువేసి ఇంట్లోకి వస్తున్న ఆమెకు “ఓ స్త్రీ రేపు రా” అన్నం వాక్యం కనిపించింది. కోపం నషాలానికెక్కింది.
‘ఇక లాభం లేదు, తాడో పేడో తేల్చుకోవాలి’ అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళింది.
“రాజీవ్ ఏ స్త్రీని రేపు రమ్మన్నావు. నేనుండగా నీకు రోజుకో స్త్రీ కావలసి వచ్చిందా? నువ్వు దువ్విన తలనే దువ్వుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అది ఇప్పుడు నిజమని తేలింది. నిజం ఒప్పుకో” అంటూ రాజీవ్ పీక గట్టిగా పట్టుకుంది రవళి.
ఒక్క సెకండు ఊపిరి అందక గిజ గిజలాడాడు రాజీవ్. బలంగా ఆమె రెండుచేతులను దూరంగా నెట్టి బలవంతంగా వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళాడు.
వైద్యుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆమె చెప్పిన జవాబులు విన్నాడు.
“రాజీవ్ ఈమెకు ఉన్న జబ్బు అనుమానం. లేనిది ఉన్నట్లుగా, జరగనిది జరిగినట్లుగా ఊహించుకోవడమే ఈ జబ్బు లక్షణం. ఇది ఒక మానసిక రుగ్మత. ఈ అనుమానం పెరిగి పెరిగి పెను భూతంగా మారి మనిషిని దహించి వేస్తుంది. నువ్వు అప్రమత్తంగా ఉండకపోతే చనిపోయేవాడివి. ఆమెను జాగ్రత్తగా చూసుకో” అని చెప్పి మందులు రాసి ఇచ్చాడు వైద్యుడు.
వైద్యుని సలహా పాటించాడు రాజీవ్. అనతి కాలం లోనే రవళి ఆరోగ్యం కుదుటపడింది. వాస్తవాన్ని గ్రహించింది రవళి. నాటి నుంచి రవళి, రాజీవ్ అన్యోన్యంగా జీవించసాగారు.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
Comments