top of page
Writer's picturePenumaka Vasantha

శ్రావణికి మళ్ళీ పెళ్లా!?



'Sravaniki Malli Pella' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 08/06/2024

'శ్రావణికి మళ్ళీ పెళ్లా!?' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత




‘అదేంటి? మొగుడు పోయి సంవత్సరము కూడా కాలేదుగా.. !’ సెల్ ఫోన్సులో బందువులందరూ ఒకటే గుసగుసలు. 


 అన్లిమిటెడ్ అని సెల్ ఫోనుకి ఒక ఐదువందలు కడితే చాలు! ఎంత గాలి వార్తలు పోగుచేస్తున్నారు జనాలు. 


"యేడాది అయిందిట.. వదినా.. ! ఉంటా ఛార్జ్ అయిపోతుంది. మనం కలుస్తాముగా. అపుడు మాట్లాడుకుందాం వివరముగా” అనుకునేవారు. 

 

రిలయన్స్, ఎయిర్టెల్ వాళ్ళు మీరు ఎంత గాలి పోగుచేసుకొంటే అన్ని సదుపాయాలు మేము కలిపిస్తాం అంటే జనాలు మన కొంపలో ఎన్ని కన్నాలు ఉన్నా అవి వెదకటం మానేసి ఎదుటివాడి కన్నాలు వెదికితే పని లో ఉన్నారు. ‘హాయ్ హాయిగా ఫోన్లు మోగే అని పాట’ హాయ్ హాయిగా అనే పాటకు పేరడీ లెండి. , . అలా ఫోన్లు మోగుతూనే ఉంటాయి ప్రతి కొంపలో. 


అపుడు కాని వీళ్లకి మనసు చల్లబడదూ. మనమే కాకుండా.. ఎదుటి వాళ్ళు కూడా బాధ పడితే ఆ కిక్కే వేరయా. ఆ పిల్లకి కాస్తా పొగరులే! దేవుడు తిక్క కుదిర్చాడులే! అని ఆత్మ శాంతితో ఫోన్ పెట్టేసారు. 

 

 ఇవాళ ఏమిటి? ఈమె ఫోన్లను ఆడిపోసుకొంటుంది అంటారా. అదేనండి నా వీక్ నెస్ ఒక పాయింట్ చెపుతూ దానికి లింక్ పాయింట్ సోది చెప్పటం నా అలవాటు. 

 

 మెయిన్ సోదిలోకి వద్దాము. శ్రావణికి ఘనంగా అభినవుతో పెళ్లి చేశారు శ్రావణి అమ్మానాన్న గీత, హరిలు. పెళ్లి అవగానే ఆషాఢమాసం మొదలు. అందువల్ల శ్రావణి పుట్టింట్లో ఉంది. అభినవు, ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి హైదరాబాద్ వెళ్ళాడు. శ్రావణమాసం ఎపుడు వస్తుంది శ్రావణిని ఎపుడెపుడు? చూస్తానా! అని అభినవ్ కి ఒకటే తొందర. 

 

 ఇంట్లో అందరూ శ్రావణిని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో! అని ఒకటే ఏడిపిస్తున్నారు. ట్రెయిన్ లేట్, బస్ బుక్ చేసుకోవటం ఎందుకుని? తన కొత్త బుల్లెట్ బండిపై బయలుదేరాడు మన హీరో అభినవ్. 

 

 మేఘాలలో శ్రావణీతో తేలిపోతున్నట్టు కలలు కంటూ హైస్పీడ్లో హైవే మీద డ్రైవ్ చేయటం వల్ల ఎదురుగా వచ్చే లారీని ఢీకొని.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

 

 ఇక్కడ శ్రావణి చేతిమీద గోరింటాకుతో అభి అని పేరు రాసుకుంటూ ఎపుడెపుడు అభి వస్తాడా.. ! బయట కుర్చీ వేసుకుని గేట్ చప్పుడైతే బావుండని ఒకటే.. వెయిటింగ్. 

 

 ఆ రోజున అర్థరాత్రి తెలిసింది శ్రావణి వాళ్లకు అభినవ్ పోయాడని. హరి, గీతలు ఏడుపు దిగమింగుకుని అభికి ఆక్సిడెంట్ అయిన హాస్పిటల్ వెళ్దామని శ్రావణిని తీసుకెళ్లారు.

 

 అక్కడ శ్రావణి, అభినవును, చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఎలాగో అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. కొన్నాళ్ళు మా ఇంటిలో ఉంచండని శ్రావణిని అత్తామామా, అడిగి ఇంట్లో అట్టి పెట్టుకున్నారు. అభినవు తమ్ముడు అనిల్, శ్రావణి దిగులు పోగొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. 

 

 అభినవ్ రూంలో అభి ఫొటోస్ చూస్తూ ఇంకా దిగులుగా ఉంటున్న శ్రావణిని, గీతా, హారిలు వచ్చి తమ ఇంటికి, తీసుకెళ్లారు. శ్రావణికి ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరంలో పెళ్లి చేశారు. ఇపుడు మళ్ళీ ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేస్తే మంచిదని కాలేజ్లో జాయిన్ చేశారు. 

 

 గీత, హరి శ్రావణిని కాలేజికి పంపితే కాస్త మనుషుల్లో పడుతుందని అలా చేశారు. అపుడప్పుడు అత్తా, మామ వచ్చి పలకరించి వెళ్తున్నారు. 

 

 ఇపుడు కూడా గీత బందువులు.. ! 

"శ్రావణి అత్తగారు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఇంకొకరయితే ఈ పిల్లను ఏ ముహూర్తాన చేసుకొన్నామో? గాని మా పిల్లాడిని మింగింది అనకుండా వచ్చి మరీ చూసి వెళ్తున్నారు. మా పిల్లల అత్తగార్లు, అయితే మా పిల్లలని ఎపుడు ఒకటే సూటిపోటి మాటలు అంటుంటారు" అని ఏడుపు. 

 

 అభినవ్ పోయి ఏడాది అయింది. శ్రావణీ ఇంజనీరింగ్ పట్టా తీసుకొని ఉద్యోగాలకు అప్లై చేస్తున్నది. అపుడపుడు అత్తవారింటికి వెళ్లి వస్తున్నది. వాళ్లకు అమ్మాయిలు లేక పోవటం వల్ల శ్రావణిని బాగా చూసుకుంటున్నారు. 

 

 ఒకరోజు శ్రావణి అత్తమామ వచ్చారు శ్రావణిని చూద్దామని. అపుడే వాళ్ళు హరి, గీతలతో మీకు అభ్యంతరం లేకపోతే మా రెండో అబ్బాయి అనిల్ కి శ్రావణిని చేసుకుంటామన్నారు. మీరు ఒకసారి శ్రావణితో మాట్లాడి మాకు చెప్పండని వెళ్ళారు. 

 

 వాళ్ల మంచితనం చూసి స్టన్ అయ్యారు హరి, గీతలు. ఇప్పటికీ హరి పెద్దకూతురు, స్వాతి అత్తమామలు, ఇప్పటికీ వీళ్ళని వేధిస్తున్నారు. మాకు అది చేయలేదు ఇది చేయలేదు పెళ్ళిలో అని. 

 

 వీళ్లు వాళ్ల అబ్బాయి పోయినా ఆదోషం మా పిల్ల మీద నెట్టకుండా వాడికి అంతవరకే రాసిపెట్టి ఉంది. మనమందరం బావున్నాము శ్రావణికి ఇంత కష్ట మొచ్చింది. శ్రావణీని ఒక దారి చేయాలి అది మేమే ఎందుకు? చేయకూడదనిపించింది. ఒకసారి మా ఇంటికి వచ్చిన పిల్లను తిప్పి ఇంకో ఇంటికి ఎందుకు? పంపటం, మా అనిలుకు చేసుకుని మా ఇంట్లో పెట్టుకుందా మనుకుంటున్నాము. 

 

 శ్రావణిని అడిగారు హరి, గీతలు నీకు అనిల్ చేసుకోవటం ఇష్టమేనా అని. శ్రావణి కూడా అక్క అత్తగారు, వాళ్ల ఫ్రెండ్స్ అత్తగార్లను, చూసి మా అత్తామామలు, మంచి వాళ్ళని ఎపుడో ఒక అభిప్రాయానికి వచ్చింది. 

"మీ ఇష్టం నాన్న.. !" అంది. 

 

 హరి, శ్రావణి అత్తామామకు "శ్రావణి ఓకే.. !" అందని చెప్పాడు. ఒక మంచిరోజు శ్రావణి, అనిల్ కి నిరాడంబరంగా గుళ్ళో పెళ్లి చేశారు. 

 

 మొదట్లో చెప్పాగా ఫోన్లు మోగుతున్నాయని ఈ విషయం గురించే.. ! శ్రావణికి మళ్ళీ పెళ్లి, అదే ఇది. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


 


67 views0 comments

Comments


bottom of page