#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#శ్రేష్టమైనదివిద్య, #SreshtamainadiVidya
Sreshtamainadi Vidya - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 24/11/2024
శ్రేష్టమైనది విద్య - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
విద్య ఎంతో పదిలము
దోచలేరు దొంగలు
దానికుంది స్థానము
బాగు చేయు బ్రతుకులు
నేర్చుకుంటే చాలు
జీవితంలో మేలు
విద్యతో గౌరవము
అంతులేని లాభము
రకరకాల విద్యలు
బ్రతుకుటకు మార్గాలు
ప్రతిభకు సాధనాలు
మేధస్సుకు గుర్తులు
విద్య నేర్వని వాడు
వింత పశువు అన్నారు
అక్షర సత్యమేగా
మీరంతా విన్నారు
అక్షయమైన ధనము
వెలిగించును మనము
విద్యతో రాణింపు
సమాజాన గుర్తింపు
లోక కళ్యాణానికి
వాడాలోయ్! విద్యలు
దేశాభివృద్ధికిల
వేయాలోయ్! బాటలు
-గద్వాల సోమన్న
Comments