top of page

శ్రీలేఖ పుట్టగానే ఎం. బి. ఎ

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SrilekhaPuttaganeMBA, #శ్రీలేఖపుట్టగానేఎంబిఎ, #పిల్లలకథలు, #TeluguChildrenStories


శ్రీలేఖ పుట్టగానే ఎం. బి. ఎ (MBA).. . బోధన పద్దతి లో మంచి మార్పు


Srilekha Puttagane M. B. A. - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 06/01/2025

శ్రీలేఖ పుట్టగానే ఎం. బి. ఎ - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1) "టూచి ఎడ్యుకేషన్ అకాడెమీ" లో సమ్మర్ క్యాంప్ జరుగుతున్నది. ఆటలు పాటలు అయ్యాక "ఆంగ్లం క్లాస్" ఉంటుంది. ఆరోజు మదన్ టీచర్ అక్షరాలను గజి - బిజి గా చేసి 10 ఆంగ్ల పదాలు వ్రాశారు బోర్డ్ పై. 


విద్యార్థులు వాటిని సరి చేసి (సరి అయిన స్పెల్లింగ్ తో) వ్రాయాలి. అది ఆంగ్ల - చిన్న - పరీక్ష. 


ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. 

ASCSL = CLASS


శ్రీలేఖ అనే తెలివైన అమ్మాయి అన్నీ పదాల్లో అక్షరాలు సరి చేసి వ్రాసింది. 10/10 మార్కులు కొట్టేసింది ("స్పెల్లింగ్ పరీక్ష" లో). వేరే పిల్లలు కేవలం 2 లేక 3 పదాలు మాత్రమే సరిగ్గా వ్రాశారు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి దుఃఖం తో. మదన్ టీచర్ కూడా బాధ పడ్డారు. పిల్లలకు ఎలా 

ఆంగ్ల పదాల సరి అయిన స్పెల్లింగ్ నేర్పి, పరిజ్ఞానంలో మరియు పరీక్ష లో జయం సాధించే లా చెయ్యాలి???.. . అని సందిగ్ధం లో పడ్డారు (మదన్ టీచర్). 


చురుకైన శ్రీలేఖ వెంటనే "నేను అందరి చేత సరి అయిన స్పెల్లింగ్ వ్రాయిస్తాను మదన్ సార్" అన్నది. "సరే" అన్నారు మదన్ టీచర్ ఆశ్చర్యం తో. ఆమె డిక్టేషన్ తీరు లో, అదే.. . మంచి ఉచ్చారణ తో, ఒక్కో ఆంగ్ల పదాన్ని నోటితో నిదానంగా పలికింది. అది విని పిల్లలు సరి అయిన స్పెల్లింగ్ వ్రాయాలి. 


ఆశ్చర్యం ఈ సారి పిల్లలందరికీ 9/10 లేక 10/10 వచ్చాయి (ఆంగ్ల స్పెల్లింగ్ పరీక్ష లో.. . డిక్టేషన్ అనే బోధన పద్ధతి మార్పు ద్వారా). అందరి కళ్ళలో సంతోషం సృష్టంగా కనిపించింది. వారు శ్రీలేఖ ను "పుట్టగానే ఎం. బి. ఎ" అంటూ కొనియాడారు. 

---- X X X -----


2) మరు క్లాస్ లో గణితం విషయం. 


మదన్ టీచర్ కాసేపు రేఖ - రేఖ ఖండాలు అనే విషయం బోధించారు. ఆ పిమ్మట ఒక చిన్న పరీక్ష పెట్టారు. 


 బోర్డ్ పై ఒక పెద్ద రేఖ వేసి, 5 బిందువులు పెట్టి, వాటికి A B C D E అని పేర్లు పెట్టారు. 


ఇలా- A____B____C___D___E


 "ఇందులో మొత్తం ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి మరియు వాటి పేర్లు వ్రాయండి" అన్నారు మదన్ టీచర్. 


చలాకి శ్రీలేఖ సరి అయిన జవాబు వెనువెంటనే వ్రాసింది "10

రేఖాఖండాలు" అని. వాటి పేర్లు కూడా సరిగ్గా వ్రాసింది. 

AB, AC, AD, AE, .. . BC, BD, BE, .. . CD, CE, .. . DE అని. 

మళ్లీ 10/10 మార్కులు కొట్టేసింది. 


వేరే విద్యార్థులు 5 అని, 6 అని జవాబు వ్రాశారు. మళ్లీ అందరి ముఖాలలో బాధ తొంగి చూసింది, సరిఅయిన పూర్తి జవాబు వ్రాయనందుకు. 


శ్రీలేఖ "నేనందరి వద్ద నుండి సరి అయిన జవాబు రాబడతాను మదన్ సార్" అన్నది. "అలాగే చెయ్యమ్మా" అన్నారు మదన్ సార్ బాధ నిండిన కంఠంతో. 


శ్రీలేఖ ఇలా సూచన - జాడ తెలిసే క్లూ ఇచ్చింది పిల్లలకు:


"ముందుగా A బిందువు తో మొదలు పెట్టాలి. ముందడుగు వేస్తూ పోవాలి రేఖాఖండాలు లెక్కబెడుతు, వెనక్కి తిరగ కుండా. తరువాత B బిందువులతో మొదలు పెట్టి ముందడుగు వేయాలి, వెనక్కి తిరగ కుండా" అని


ఈసారి పిల్లలందరూ సరి అయిన జవాబు వ్రాసి 10/10 కొట్టేశారు. 


"శ్రీలేఖ పుట్టగానే ఎం. బి. ఏ (MBA)".. . "మెరుగైన - తేలికైన పద్ధతి లో బోధించే 'భలే టీచర్' ".. . " ఆనంద పూరిత పరిష్కారాలు కనుక్కునే ఎం బి. ఎ".. . "అందరికీ విజయం - సంతోషం కలగాలి అని కోరుకునే అనురాగ-పూరిత మంచి మనస్సు".. . అని మెచ్చుకున్నారు. 

--- X X X -----


నీతి:


i) అపాయం లో ఉపాయం ముఖ్యం. దిగులు కాదు. 

ii) ప్రతి మనిషి ఎప్పుడూ ఆనంద-పూరిత పరిష్కారాల రూపంలో ఆలోచించాలి. తప్పులు లెక్కపెట్టడం, తోయడం, హాని చేయరాదు. 

iii) రక రకాల మంచి - తేలికైన బోధన పద్ధతులు అవలంబిస్తే, పిల్లలకు జ్ఞానం (మరియు మార్కులు) తేలిగ్గా వస్తాయి.. . ఓ ఆటలా - పాటలా. 

iv) అందరికీ విజయం - సంతోషం కలగాలి అని కోరుకావటమే అసలైన ఆనందం - అసలైన నిర్వహణ - అసలైన మానవత్వం - మానవ జన్మ. 


----- X X X --- సమాప్తం --- X X X ---


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






24 views0 comments

Comments


bottom of page