శ్రీరామ ప్రార్ధన
- Yasoda Gottiparthi
- 1 day ago
- 1 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #శ్రీరామప్రార్ధన, #SriramaPrarthana

Srirama Prarthana - New Telugu Poem Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 06/04/2025
శ్రీరామ ప్రార్ధన - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
శ్రీ రామా జయరామా
ఓంకార పరంధామా!
రాక్షస రావణ సంహారా
శ్రీ సీతారామా!
తండ్రి ఆజ్ఞకు తల
వంచిన దశరథ రామా!
మా దైవం నీవని
నీ సేవలో తరించెదం
ఒకేమాట, ఒకే బాణం,
ఒకే పత్ని నీ ధర్మం
రామా రామా అంటే రాతల చింతలు తీరునయా
మా రాముల సేవ
మా తలరాతలు మార్చునయా!
కౌసల్యా సుత కామిత
ఫలముల నీయవయా
కారుణ్యముతో నాఆర్త
నాదాన్ని ఆలకించవయా!
అన్నదమ్ముల అనురాగానికి,
ఆదర్శ దాంపత్యానికి ఆరాధ్య దైవమా!
అరుణ రంజిత నేత్రాలు, దీర్ఘబాహువులు,
సర్వ శుభలక్షణ
సమలంక్రుతుడవు
మానవధర్మాల మమతానురాగాలతో
మా "నవ"తరానికి
నాంది వయ్యావయ్యా
సీతారాముల దాంపత్యం
సిరి సంపదలకు నిలయం
శ్రీరామ దివ్య చరితము
శాంతి, సౌఖ్యం సమతా
మమతల సౌభాగ్యం
మహాబలశాలి పరశురాముడి శక్తినే సాధించావు,
యజ్ఞాల విజయం కోసం ఋషులను కాపాడావే,
కష్ట జీవుల కడుపులు నింపే,
ఆర్ధిక బాధలు బాపుమయా
ఘనమైన నీకళ్యాణాన్ని కనులార వీక్షిస్తూ మదిలోనే నిల్పుకుని తరింతు మయా
మనుషుల తప్పిదాలను
మన్నించి మానవ లోకంలో
మళ్ళీ అవతరించు మయా
శ్రీరామా!
***

-యశోద గొట్టిపర్తి
Comments