కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 15' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
తనని గదిలోకి లాగిన వ్యక్తి గౌతమ్ అని తెలియడంతో రిలాక్స్ అయింది సమీర.
జరిగిన విషయాలు ఆమెకు వివరిస్తాడు గౌతమ్.
సందీప్ షర్ట్ వెనుక మైక్రోఫోన్ తగిలిస్తుంది జయా ఆంటీ.
ఇక చదవండి...
వినీత్ చెప్పేది శ్రద్ధగా వింటోంది స్నేహ.
"గౌతమ్ మెయిల్ పెట్టడంతో తండ్రిని ప్రశ్నించి సందీప్ నిజం తెలుసుకున్నాడట. వెంటనే ఇండియా వచ్చేసాడు. గౌతమ్ ప్లాన్ ప్రకారం నిన్ను చంపించమని జయా ఆంటీని కోరాడు. మరి కాస్సేపట్లో సందీప్, జయా ఆంటీ, ప్రవీణ్ ఇక్కడకు వస్తారు. ఆంటీవాళ్ళు నీ మీద మర్డర్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికే ఈ ప్లాన్. పక్కా ఆధారాలు లేకుంటే ఆంటీ తప్పించుకుంటుంది. అందుకే మా ముగ్గురిలో ఒకరు మొత్తం వీడియో తీస్తాం" అంటూ ఒక లాకెట్ స్నేహ చేతికి ఇచ్చాడు.
"ఇందులో హిడెన్ కెమెరా ఉంది. దీన్ని నీ మెడలో ఉన్న చైన్ కి తగిలించుకో" అని చెప్పాడు.
అలాగే చేసింది స్నేహ.
ఇంతలో బయటనుండి డోర్ తట్టిన శబ్దం వినిపించింది.
"సందీప్ వచ్చినట్లున్నాడు. వెళ్లి కీ హోల్ నుండి బయటకు చూస్తూ ఉండు. అదే సమయంలో మేము హాల్లోకి వచ్చి, సోఫా వెనుక పొజిషన్ తీసుకుంటాం. వాళ్ళు అటాక్ చెయ్యబోతుండగా వాళ్ళని పట్టుకుంటాం. వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. మరీ అవసరమైతే ఉపయోగించ వచ్చని ఏ సి పీ గారు వీళ్లకు పర్మిషన్ ఇచ్చారు. " చెప్పాడు వినీత్.
సరేనంటూ హాల్లోకి వెళ్తున్న స్నేహను తిరిగి వెనక్కి పిలిచాడు.
***
ఐసియు లో ఉన్నాడు ప్రమోద్. బయట వెయిట్ చేస్తోంది షాలిని.
గదిలోంచి బయటకు వచ్చిన డాక్టర్ వైపు ఆశగా చూసింది.
"నిన్నట్నుంచి రెప్ప వెయ్యకుండా ఎదురు చూస్తున్నావు. నీ నిరీక్షణ ఫలిస్తుందమ్మా! మరో అర గంటలో అతను కళ్ళు తెరుస్తాడు.స్టేట్ మెంట్ తీసుకోవచ్చని బయట వెయిట్ చేస్తున్న పోలీసులకు కూడా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను" అన్నాడు ఆ డాక్టర్ షాలిని వంక అభిమానంగా చూస్తూ.
"థాంక్ యు డాక్టర్" అంది షాలిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా.
ఆమె తలమీద ఆప్యాయంగా తట్టి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్.
అంతవరకు జీవచ్ఛవంలా ఉన్న షాలిని కాస్త తేరుకుంది.
ప్రమోద్ స్పృహలోకి వస్తాడన్న వార్త ఆమెలో శక్తిని నింపింది. దాదాపు ఒక రోజంతా ఆహరం లేకుండా గడిపిన ఆమెకు ఒక్కసారిగా ఆకలి వేసింది. ఏదయినా తిందామని అక్కడినుండి కదిలింది. కానీ ఈ సమయంలో తాను తినగలదా? నిన్న కాఫీ తాగుదామని ప్రయత్నించినా వీలు కాలేదు. మరో పావుగంటలో తన పేరెంట్స్, ప్రమోద్ పేరెంట్స్ వస్తారు. ప్రమోద్ స్పృహలోకి వస్తాడు. ఆ తరువాతనే తాను కాఫీ అయినా తాగగలుగుతుంది. ఈ ఆలోచన రాగానే తిరిగి ఐ సి యూ వద్దకు వెళ్ళింది.
అప్పుడే ఎవరో డాక్టర్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి లోపలి వెళ్లబోతున్నాడు.
ఏమైంది? మళ్ళీ ఏమైనా సీరియస్ అయిందా..
ఆందోళనతో అతన్ని "ఎక్స్క్యూస్ మీ" అంటూ పిలిచింది.
షాలినీ ని చూసిన అతను తడబడ్డాడు.
"నేను డ్యూటీ డాక్టర్ ని. విసిట్ కోసం వచ్చాను" అని చెప్తూ లోపలి వెళ్ళబోయాడు.
"అదేమిటి? ఇప్పుడే డాక్టర్ నిరంజన్ గారు చూసి వెళ్లారు కదా?" అనుమానంగా అంది షాలిని.
"చూసారా.. ఈ రోజు నా డ్యూటీ కదా .. అయితే సరే.." అంటూ వెళ్ళిపోతున్నాడు అతను.
"ఆగండి. మీ పేరేమిటి?" అడిగింది షాలిని.
"ఐ యామ్ డాక్టర్ గోవర్ధన్" అంటూ పరుగులాంటి నడకతో వెళ్తున్నాడు అతను.
షాలిని అనుమానం బలపడింది.
“అతన్ని పట్టుకోండి…” అంటూ గట్టిగా కేకలు పెట్టింది.
హాస్పిటల్ సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించారు.
అతను వాళ్ళను నెట్టేసి పరుగెత్తాడు.
ప్రమోద్ దగ్గర స్టేట్ మెంట్ తీసుకోవడానికి వస్తున్న పోలీసులు ఇది గమనించి అతన్ని గట్టిగా పట్టుకున్నారు.
***
సమీరకు హెడ్ మస్సాజ్ చేస్తూ, జరిగిన విషయాలు చెబుతున్న గౌతమ్ డోర్ తట్టిన చప్పుడు కావడంతో తియ్యబోతాడు.
అతన్ని ఆపుతుంది సమీర.
"ముందు ఎవరో కనుక్కొని, తియ్యి గౌతమ్" అంటుంది.
"బయటనుంచి పర్వీన్- " నేను పర్వీన్ ను. డిస్టర్బ్ చేసినందుకు సారీ" అంటుంది.
డోర్ తీసాడు గౌతమ్.
పర్వీన్, శిల్పలు వెంటనే లోపలికి వచ్చారు.
"డిస్టర్బ్ చెయ్యకూడదనుకున్నాను. కానీ తప్పలేదు.." అంటూ లోపలికి వచ్చింది పర్వీన్. ఆమె వెంటే శిల్ప కూడా లోపలికి వచ్చింది.
"జరిగిన విషయాలన్నీ గౌతమ్ చెబుతున్నాడు" అంది సమీర లోపల మరేమి జరగడం లేదన్నట్లుగా.
చిన్నగా నవ్వింది పర్వీన్. "ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను. కనకారావు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కదా! ఈ లోపల జయా ఆంటీ నుండి ఫోన్ వస్తే అటెండ్ కమ్మని, తన సీక్రెట్ ఫోన్ నా దగ్గరికి పంపించాడు. ఇప్పుడే జయా ఆంటీ కాల్ చేసింది. స్నేహ అనే అమ్మాయిని మర్డర్ చేయబోతున్నట్లు, సమయం కుదరక పోవడంతో ముందుగా చెప్పలేక పోయినట్లు, కనకరావుకు వీలు చూసుకొని చెప్పమంది. మనకు బైక్ లో ఎదురు వచ్చింది స్నేహ ఫ్రెండ్ సందీప్ అట. అతని కోరిక మీదే స్నేహను చంపబోతున్నదట. గౌతమ్ తో ఈ విషయం చెప్పాలనిపించింది" అని చెప్పింది.
"థాంక్ యూ పర్వీన్. సరిగ్గా మాకు సహాయం అవసరమైన సమయంలో నువ్వు మా వైపుకు వచ్చావు" అన్నాడు గౌతమ్.
"ఇంతకీ పర్వీన్ మనకెందుకు సహాయం చేస్తోంది?" గౌతమ్ ను అడిగింది సమీర.
అంతలోనే తనే "సర్లే. తరువాత చెప్పొచ్చు. ఇప్పుడు కనకారావు వచ్చేస్తాడేమో.." అంది.
"కనకారావు వచ్చేముందు నాకు మా వాళ్ళ దగ్గరనుండి సిగ్నల్ వస్తుంది. ఇంటర్వ్యూ చేసే నెపంతో న్యూస్ రిపోర్టర్లుగా వచ్చింది ఎవరనుకుంటున్నావ్? సాక్షాత్తు ఏ సి పి ప్రతాప్ గారి అన్న కొడుకు ఉదయ్, సి ఐ కిషోర్ లు. (వీరి గురించిన వివరాలు 'డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం' లో తెలుసుకోండి). ఉదయ్ కాబోయే ఐ పి ఎస్ ఆఫీసర్. కాబట్టి నువ్వేం భయపడనక్కర లేదు. ఇక పర్వీన్ మనవైపు ఎందుకు ఉంది అనేది పర్వీన్ మాటల్లోనే విను" అన్నాడు గౌతమ్.
పర్వీన్ తన కథ చెప్పడం ప్రారంభించింది.
పర్వీన్ ది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లల తల్లయిన పర్వీన్ మీద ఆమె భర్తకు చాడీలు చెప్పి వారిని విడదీసింది జయా ఆంటీ. పర్వీన్ ను తన గ్రిప్ లోకి తెచ్చుకుంది. మొదట్లో లొంగక పోయినా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆంటీ చెప్పినట్లు చేసేది పర్వీన్. ఆమె భర్త ఏ సి పి ప్రతాప్ గారి దగ్గర కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గౌతమ్ ఏ సి పి గారిని కలిసి, మార్ఫింగ్ చేసిన ఫోటోల విషయం చెప్పినప్పుడు తనకు కూడా ఒకప్పుడు పర్వీన్ కి సంబంధించి ఇలాంటి ఫొటోలే వచ్చినట్లు చెప్పాడు. తన తప్పు తెలుసుకున్నాడు. పర్వీన్ చేసిన పొరపాట్లకు తాను వదిలెయ్యడమే కారణం కాబట్టి తిరిగి ఆమెతో ఉండటానికి ఒప్పుకున్నాడు.
ఏ సి పి గారు పర్వీన్ ను పిలిపించి కనకరావును, జయా ఆంటీని పట్టుకోవడంలో సహకరిస్తే ఆమెను అప్రూవర్ గా పరిగణిస్తామని చెప్పాడు. పర్వీన్ అందుకు ఒప్పుకుంది. ఇక బ్యూటీషియన్ శిల్పను ప్రవీణ్ స్నేహితుడు లవ్ పేరుతో తనతో తిప్పుకున్నాడు. శిల్ప ఫోటోలు కొన్ని మార్ఫింగ్ చేసి డబ్బులిమ్మని బెదిరించాడు.
జయా ఆంటీ శిల్పకు సహాయం చేసే దానిలాగా ఆ డబ్బులిచ్చింది. బదులుగా బాగా డబ్బున్న లేడీ కస్టమర్లను తనకు పరిచయం చెయ్యమంది. ఆమెను మోసం చేసిన వ్యక్తి ప్రవీణ్ స్నేహితుడేనని, అంతా జయా ఆంటీ ఆడిన నాటకమని పర్వీన్ శిల్పకు చెప్పడంతో శిల్ప కూడా జయా ఆంటీని పట్టించడంలో సహకరిస్తానని చెప్పింది.
పర్వీన్, శిల్పాలను జయా ఆంటీ ఎలా మోసగించిందో విన్నాక సమీరలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"ఆ జయా ఆంటీ వల్ల పర్వీన్, శిల్పలు ఎంత బాధ పడ్డారో.. ఇంకెంతమంది ఆడవాళ్లు ఆమె స్వార్థానికి బలయ్యారో! ఆమె పాపం పండి మా జోలికి వచ్చింది" అని ఆవేశంగా అంది.
ఇంతలో గౌతమ్ ఫోన్ మోగింది.
"నేను.. షాలినీ ని. ఇప్పుడే ఒక వ్యక్తి ప్రమోద్ ఉన్న గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అనుకోకుండా నా కంట్లో పడ్డాడు. అతన్ని పట్టుకున్నారు" చెప్పింది షాలిని.
"అతను కావాలనే నీ కంట్లో పడి ఉంటాడు. అందరి అటెన్షన్ అతని మీద ఉన్న సమయంలో మరో వ్యక్తి ప్రమోద్ ను అటాక్ చెయ్యవచ్చు. రియాక్ట్ క్విక్ లీ" గౌతమ్ మాటలు పూర్తి కాకుండానే ప్రమోద్ ఉన్న గది వైపు చూసింది షాలిని. నర్స్ దుస్తుల్లో ఉన్న ఒక స్త్రీ ఆ గదిలోకి ప్రవేశించడం చూసింది.
"లోపలికి ఎవరో ఎంటరయ్యారు" అని అరుస్తూ ఆ గది వైపు పరుగెత్తింది షాలిని.
మూయబోతున్న డోర్ ను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది.
షాలిని లోపలికి రాగానే డోర్ మూసింది ఆ నర్స్. అప్పుడు చూసింది షాలిని.. అతడు నర్స్ దుస్తుల్లో ఉన్న పురుషుడని.
అతడు చాలా బలిష్టంగా ఉన్నట్లు గమనించింది.
"నాకు ఒక మర్డర్ కే డబ్బులు ఇచ్చారు. నువ్వు అనవసరంగా అడ్డు రావద్దు" అంటూ బెడ్ మీద ఉన్న ప్రమోద్ వైపు ఉరికాడు. తన దుస్తుల్లో దాచుకున్న పిడిబాకును బయటకు తీసాడు.
ఇంకా వుంది…
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Yorumlar