top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

శ్రుతి తప్పిన మోహనరాగం

#AyyalaSomayajulaSubrahmanyam, #SruthiTappinaMohanaRaga, #శ్రుతితప్పినమోహనరాగం, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguFamilyStory


'Sruthi Tappina Mohana Ragam' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/11/2024

'శ్రుతి తప్పిన మోహనరాగం' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


బంధువులు, స్నేహితులు సాక్షిగా పందిట్లో వేద మంత్రాల సాక్షిగా శ్రుతి మెడలో మూడు ముళ్ళు వేశాడు మోహన్. ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి కూతురి పెళ్ళి చేశాడు రాఘవరావు. స్విఫ్ట్ కారు కొనిచ్చి కూతురిని అత్తారింటికి పంపించాడు తండ్రి. 


కూతురిని చిన్నప్పటి నుంచి కాలు క్రింద పెట్టనీయకుండా అపురూపంగా పెంచాడు. శ్రుతి అందగత్తె, తెలివైనది, బి. టెక్ చదివింది. 


మొదటి రాత్రి పాలగ్లాస్ తో గదిలో అడుగుపెట్టింది. మంచానికి అలంకరించిన సుమమాలలను పట్టుకొని వాటిని నలుపుతూ ఏవో మధుర ఊహా లోకాలలో తేలియాడుచున్నాడు. తలుపు చప్పుడ కాగానే శ్రుతిని చూసి ఇంత అందం ఈ రాత్రికి తన సొంతం కాబోతున్నదని మంచం మీద నుంచి లేచి శ్రుతి దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకని నడిపించుకుంటూ వచ్చి 

మంచం మీద కూర్చో పెట్టి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. 


సిగ్గు పడుతూనే శ్రుతి మెల్లగా కళ్ళు పైకెత్తి “ఏమిటలా చూస్తున్నారు” అంది. 


“ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్సరసలా ఉన్నావు. ఆ తెల్లచీర, తల్లో మల్లెపూలు.. 

ఆ కట్టు చూస్తుంటే ఇలా నిన్ను కొరికేయాలనుంది” అన్నాడు చిలిపిగా. 


మరింత సిగ్గుపడింది. బయట వెన్నెల. కిటికీ ప్రక్కనే ఉన్న నైట్ క్వీన్ కొత్త జంట సరసా 

లని చూస్తూ ముసిముసిగా నవ్వుతూన్నాయి. శృతిని హృదయానికి హత్తుకోగానే చెప్పలేని 

హాయి ఏదో మైకం లా కమ్మింది. ఆ తొలిరాత్రి ఇద్దరికీ మరిచిపోలేని మధురానుభూతులని 

అందించింది. 


 భర్త ఒడిలో సేద తీరాక తెల్లవారినా మెలకువ రాలేదు శృతికి. అలసిపోయిన కనులతో ఎలాగో 

లేవబోతుంటే ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. 


“అబ్బ వదలండీ, త్వరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేటయ్యింది” 


భర్తను విడిచి వెళ్ళలేక గదిలో నుంచి బయటికి వచ్చింది. మూడు రాత్రులు ముచ్చటగా గడిచాయి. మోహన్ తో పాటు శృతికూడా హైదరాబాద్ వచ్చింది. కొత్త కాపురం. ముచ్చటైన జంట. శృతి తల్లిదండ్రులు కూతురిని దింపి వెళ్ళారు. పగలంతా ఇంటిపనులు, టీవి తో కాలక్షేపం చేసింది. సాయంత్రం భర్త రాగానే వేడిగా కాఫీ అందించి నవ్వూతూ నిలబడింది. 


ఇవేవీ పట్టించుకోకుండా, నేను అర్జంట్ గా బయటికి వెళ్ళాలంటూ వెళ్ళిన మోహన్ రాత్రి పదకొండూ గంటలకు ఇంటికొచ్చాడు. లోపలికి రాగానే ఏదో వాసన, కడుపులో తెమిలి నట్లయ్యింది. సరాసరి గదిలో కెళ్ళి అలానే పడుకున్నాడు. భోజనానికి పిలిచినా రాలేదు. శృతికి 

భూమి తలక్రిందులైనట్లుగా ఉంది. భయం భయంగా రాత్రంతా గడీపింది. మోహన్ కు తాగటం అలవాటుందా? ఏదైతే తనకిష్టం లేదో అదే తనని భయ పెడుతోంది. 


తెల్లారాకా మౌనంగా కాఫీ అందించింది. 


“ఏమిటీ, రాత్రి తాగొచ్చానని బాధగా ఉందా; నా కలవాటే. మొదటిసారి భయంగా ఉండొచ్చు. నాలుగు రోజులు పోతే నువ్వే సర్దుకుని పోతావు. ఈ రోజుల్లో ఇదంతా కామన్. సొసైటీలో మూవ్ అవ్వాలంటే డ్రింక్ చెయ్యాలి. అసలు మాకంటే మీ ఆడాళ్ళు ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు తెలుసా?స్నానం చేసి వస్తా. టీఫిన్ రెడీ చె”య్యమంటు బాత్ రూమ్ కి వెళ్ళాడు. 


అదేదో కామన్ విషయమన్నట్లు, ప్రతీరోజూ మోహన్ డ్రింక్ చేసి వస్తున్నాడు. భార్య తిందా లేదా పట్టించుకోడు. కొత్తపెళ్ళాంతో సినిమాలు, షికార్లు ఏవీ లేవు. 


ఓ రోజు నోరు విప్పి అడిగింది సినిమా కెళదామని. ఆదివారం కదాని. 


“కావాలంటే నువ్వొక్కదానివే వెళ్ళు. నీతో రావటానికి నాకు వీలుపడ”దంటూ తనపని తను 

చేసుకుపోసాగాడు. 


"కొత్తగా పెళ్ళయిన వాళ్ళం, మనకు సరదాలుండవా? భర్తగా తీర్చాల్సిన బాధ్యత మీది. 

నేను ఒక్కదాన్నే ఎలా వెళతాననుకున్నారు? ఇంతవరకూ నన్ను మీ ఫ్రెండ్స్ ఇంటికి తీసు 

కెళ్ళలేదు. మనింటికి ఎవరినీ పిలవలేదు. పెళ్ళయిన కొత్తల్లో ఇద్దరూ సరదాగా వెళ 

తారు. నన్నెందుకు పరాయిదానిలా చూస్తున్నారు. అసలు మీరు నన్ను ఇష్టపడే పెళ్ళి 

చేసూకున్నారా. మీలో ఏదో మార్పు చూస్తున్నాను. నిజం చెప్పండి. దాచినంత మాత్రాన 

ప్రయోజనం లేదు. మీరు నన్ను పరాయి దానిలా చూస్తుంటే నేను భరించలేకపోతు

న్నాను. మనసులో ఏదో పెట్టుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అదేంటో ఇప్పుడే చెప్పా” లంటూ పట్టుబట్టింది. 


మోహన్ మంచం మీద పడుకుని ఉన్నాడు. కొత్తగాపెళ్ళయిన జంట ఎలా వుంటారు. ఒకరినొకరు విడిచి ఎడబాయకుండా వుండలేరు. మొక్కుబడిగా రాత్రులు గడీచిపోతున్నాయి. శ్రుతికిది అవమానకరంగా వుంది. ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడుతోంది. 


"మౌనమే మీ సమాధానమైతే, మీ మనసులో ఏదో ఉందనిపిస్తోంది. నేను భరించలేకపోతున్నాను. పెళ్ళి కి మీరు అడగకపోయినా మావాళ్ళు ఏలోటూ లేకుండ పెళ్ళి చేశారు. లాంచనాలన్నీ జరిపించారు. ఏమైనా లోటు వుంటే చెప్పండి. "


"నీకెలా చెప్పాలో తెలియటం లేదు శ్రుతీ, నీమీద ప్రేమ లేక కాదు. నిన్ను బాధ పెట్టాలని అంతకన్నా లేదు. "


“మరెందుకలా ప్రవర్తిస్తున్నారు. మీ బాధలో నేను పాలు పంచుకోకూడదా?”


“నిన్ను కూడా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేక పోతున్నాను. నా గురించి మీ వాళ్ళేమను కుంటారో నేనేదో డబ్బుకోసం ఆశపడి నిన్ను చేసుకున్నాననుకుంటారు. నా దురదృష్టం ఒక కేసులో ఇరుక్కోవలసి వచ్చింది. ”


'కేసా?’ ఆశ్చర్య పోయింది శృతి. 


“ఏం కేసది చెప్పండి. మా నాన్న గారితో మాట్లాడి సెటిల్ చేయిస్తాను”


“చెప్పాక నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు”


“చేసుకోనులేండి. ముందా విషయం చెప్పండి. టెన్షన్ భరించలేకపోతున్నాను”


“నేను బిజినెస్ చేస్తున్న విషయం మీనాన్నగారికి ముందే తెలుసు. మా ఫ్రెండ్ క్కూడా ఇందులో వాటా వుంది. పెట్టుబడికి డబ్బు లేకపోతే, ష్యూరిటీ సంతకం పెట్టి ఐదులక్షలు డబ్బు అప్పు ఇప్పించాను. ఈ మధ్య వ్యాపారము సరిగా జరగక చాలా నష్టం వచ్చింది. వాడది భరించలేక ఐ. పి. పెట్టి ఎటో పారిపోయాడు. 


వాడెక్కడున్నదీ ఆచూకీ లేదు. ఫోన్ స్విచ్చాఫ్. ఇప్పుడ నాపీకల మీదకొచ్చింది. లేకపోతే అరెస్ట్ చేస్తారు. ఇంక జైల్ పాలైతే తలెత్తుకుని తిరగ్గలమా?అందుకే ఈ విషయం నీ దగ్గర దాచాను' అన్నాడు. 


“ఇదా మీ బాధకు కారణం. నేనేదో మనసులో ఊహించు కున్నాను. మా నాన్న గారికి చెప్పి సమస్యను పరిష్కరిస్తాను” అని వెంటనే తండ్రికి ఫోన్ చేసింది. 


రాఘవరావుగారు అంతా విన్నారు. అల్లుడు బిజినెస్ చేస్తున్న మాట నిజమే. ష్యూరిటీ సంతకం పెట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ముందు గానే జాగ్రత్తగా ఆలోచించాలి. జరగాల్సింది జరిగిపోయాక ఇప్పుడు అనుకుని ఏం లాభం?కూతురిని ఇచ్చుకున్నాక ఇలాంటీ ఇబ్బందులని తట్టుకోక తప్పదు. ఆ ఐదు లక్షలు సర్దుబాటు చేశాడు. 


ఆరోజు రాత్రి ఇద్దరి మధ్యా వలపు ద్వారాలు తెరుచుకున్నాయి. 


“ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే బోర్ గా ఉంది. నేను కూడా జాబ్ లో చేరతా”నంది శృతి. బి. టెక్ చదివిన శృతికి మంచి కంపెనీలో ఉద్యోగం. నలభై వేలు జీతం. 


మోహన్ కి శృతి బంగారు గుడ్లు పెట్టే బాతులా కనిపించింది. శృతికి మరో చెల్లెలుంది రాగిణి. అల్లుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. 


ఉన్న ఆస్తంతా వాళ్ళ చేతుల్లో పోస్తే తన గతేంటీ? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పైకి కనిపించే మనిషి వేరు. లోపల దాగిన మనిషి వేరు. గోముఖ వ్యాఘ్రంలా ఉంటారు. అల్లుడు గారు గిల్లుడు కార్యక్రమం మొదలెట్టారుగా. 


శృతి నెలజీతం తీసుకురాగానే అడక్కుండానే బీరువాలోంచి ఇరవైవేలు తీసుకున్నాడు. 


డబ్బు లెక్క చూసుకుని 'మీరేమైనా తీశారా ' అని అడిగింది. 


"అవును. తీశాను. అయితే ఏమిటీ? తరువాత చెప్పొచ్చులే అనుకున్నాను. నువ్వొక్కదానివే సంపాదిస్తున్నానని పొగరా; నిన్నడగకుండా తీసుకునే అధికారం నాకు లేదా; మార్కెట్ లోకి కొత్త బండి వచ్చింది. కొనాలని బయానా ఇచ్చాను. బైక్ కొంటే నువ్వు మాత్రం తిరగవా?”


“మనకి కారుంది కదాండి. ఇంక బైకెందుకు?”


“ఏం? కారుంటే బైక్ మీద తిరగ్గూడదని రూలేమైనా ఉందా; అయినా కారు అమ్మేశాను. అందుకే బైక్ కొనాలనుకుంటున్నాను ". 


“అమ్మేశారా?నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. మానాన్న మన పెళ్ళికి కొనిచ్చారు. దాన్ని అమ్మాల్సిన అవసరం ఏ మొచ్చింది?మళ్ళీ ఏమైనా బాకీలు నెత్తిమీద వేసుకున్నారా?”


“బిజినెస్ దెబ్బతింది. షాపు మూసేశాను. అప్పులు తీర్చటం కోసం నాకిచ్చిన కారే కదా అమ్మేశాను. నేను కూడా ఏదైన జాబ్ వెతుక్కుంటాను. లేకపోతే నీ సంపాదన మీద ఆధారపడి బ్రతుకు తున్నానంటావు”


“ఏంటండి, ఆ మాటలు. నేనెప్పుడైనా మిమ్మల్ని వేరు చేసి మాట్లడానా. మీరూ నేనూ ఒకటే కాదా. ఇంకెప్పూడు అలా అనకండి”


“సంపాదన లేని వాణ్ణి చూస్తే ఏ భార్య కైనా లోకువే; ఇంటల్లుడని కూడా చూడరు”


“మీ కొచ్చిన అగౌరవం ఏమీ లేదు. ఏదో ఊహించుకొని రాద్దాంతం చేయకండి. నాకు ఆఫీస్ కు 

టైమవుతున్న”దంటూ వెళ్ళింది శృతి. 


ఉద్యోగం లేక, బిజినెస్ లేక మనసులో ఏవో ఆలోచనలు వస్తూన్నాయి మోహన్ కు. వ్యసనాలు 

మొదలయ్యాయి. మళ్ళీ తాగటం మొదలు పెట్టాడు. 


ఆఫీసు నుంచి గంట ఆలస్యంగా వస్తే చాలు శృతికి నరకం చూపిస్తున్నాడు. ఇప్పటీదాకా ఎక్కడున్నావు? ఎవరితో కులుకుతున్నావంటూ అసభ్యంగా మాట్లా డడం మొదలుపెట్టాడు. 


“భర్త కదా అని విలువ, గౌరవం ఇస్తున్నాను. ఆఫీసన్నాక అటు ఇటు ఆలస్యం కాకుండా ఎలా ఉంటుంది. మీరు లేటుగా వచ్చినప్పుడ మిమ్మల్ని అడిగానా? కాస్త సంస్కారం నేర్చుకుని మాట్లాడండి. మాటలు హద్దు మీరితే బాగుండ”దంటూ హెచ్చరించింది. 


“నాకే వార్నింగ్ ఇస్తావా?ఏం చూసుకుని నీకింత పొగరు. అవునులే. నీ అసలు రంగు నాకు తెలీదనుకున్నావా: ఉద్యోగం, వ్యాపారం లేని వాడితో కాపురమేమిటీ? డబ్బున్నవాడిని తగులుకుని మొగుణ్ణి వదిలించుకోవాలని చూస్తున్నావు. ?”


"పిచ్చి పిచ్చిగా మాటలాడకండీ. మీలాగా రంగులు మార్చేదాన్ని కాదు. మీది నాటకం. మీ వికృత 

చేష్టలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మనసులో అసహ్యాన్ని దాచుకొని పైకి మంచిగా 

నటీస్తున్నారు. ఎవరెలాంటి వాళ్ళో మీకే తెలియాలి. మిమ్మల్ని నమ్మడం నాదే పొరపాటు. 

ఇలాంటివారని అస్సలు తెలియదు”


'ఇప్పుడు తెలిసిందిగా; కాదని వెళ్ళిపోతావా; నీ ఇష్ట”మన్నాడు. 


‘ఛీ; ఇలాంటి వాళ్ళననటం అనవసర’మనుకొంది. రోజులు గడిస్తే మార్పు వస్తుందనుకుంది. ఎవరో ఒకరు వెనక్కు తగ్గితే మంచిది. తెగేదాకా తెంచుకోకూడదనే మనస్తత్వం శృతిది. 


రెండు రోజులుగా శృతి ఇంట్లోనే ఉంటున్నది. వంట్లో నలతగా ఉంది. కనీసం అప్పుడైనా ఏమిటిలా ఉన్నావని అడగలేదు. అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. 


ఓపిక తెచ్చుకుని ఎలాగో హాస్పిటల్ కి వెళ్ళింది. టెస్ట్ లన్నీ చేసి, కంగారు పడవలసిన పనిలేదు. తల్లివి కాబోతున్నావని తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి మందులు వ్రాసిచ్చింది. 


పుట్టబోయే బిడ్డ కోసమైనా మోహన్ లో మార్పువస్తుందేమోనని ఊహించింది. శుభవార్త చెప్పగానే 

సంతోషిస్తాడనుకొంది. విషయం చెప్పగానే అబార్షన్  చేయించుకోమన్నాడు. ఒక్కసారిగా పాతాళం లోకి కూరుకుపోయింది. 


“మొదటిసారి మన రక్తం పంచుకొని పుట్టబోయే బిడ్డను అప్పుడే హత్య చేయమంటారా, తండ్రి కాబోతున్నాననే సంతోషం మీకు లేదా?”


“అవన్నీ నీకనవసరం. అబార్షన్ చేయించుకోవలసిందే”


“అదే ఎందుకు అంటున్నాను?”


“ఎందుకో నీకు తెలుసు. నానోటి నుంచి చెప్పించాలని చూడకు?”


"అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం "?


“పెళ్ళికి ముందు పోగొట్టుకున్న శీలానికి ఫలితమే నీకీ గర్భం వచ్చింది. నా వల్ల రాలేదు. ఎవరో బజారు రౌడీ నిన్ను తీసుకెళ్ళి పాడుచేసిన విషయం నువ్వు మరిచిపోయినా నేనెలా మరిచిపోతాననుకున్నావు. చెడిపోయిన దాన్ని మీనాన్న నాకు అంటగట్టాడు” అంటూ విషం కక్కాడు మోహన్. 


“భర్త అనే గౌరవం తో ఊరుకొన్నాను. లేకపోతే ఏం చేసే దాన్నో నాకే తెలీదు. ఆరోజు అన్ని విషయాలు ముందే చెప్పారు నాన్న. నా శీలం పోయిందన్న మాట నిజం కాదని ఎన్నోసార్లు చెప్పాను. ఆటోలో ఆరోజు చీకటి పడ్డాక ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వస్తూంటే దారి మళ్ళించి తీసుకెళ్ళి బలవంతం చేయబోతుంటే, పెద్దగా నేను అరుస్తూంటే, అక్కడ ఫాక్టరీ వర్కర్స్ 

పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటీకే పోలీసులకి నెంబర్ డయల్ చేశాను. 


ఇక లాభం లేదనుకుని ఆటో అక్కడే వదిలి పారిపోయాడు. నాకెటువంటి హానీ జరగలేదు. నామీద అత్యాచార ప్రయత్నం చేసిన మాట నిజమే కానీ, అత్యాచారం జరగ

లేదు. కావాలంటే అక్కడ కొచ్చిన పోలీసులను అడగండి. నేను పవిత్రం గానే ఉన్నాను”


“నువ్వు పవిత్రంగా ఉన్నానంటే ఎవరు నమ్ముతారు. ఎవరికి తెలుసు. ఏదో జరిగే ఉందనుకుంటారు. ఏదో జాలిపడి చేసుకున్నాను”


“మీరు నా మీద జాలిపడలేదు. నామీద ప్రేమతో కాదు. నా ఆస్తి చూసి చేసుకున్నారు. ఈ వంకతో నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తూన్నారా. ఇంతకాలం నాతో ఎందుకు కాపురం చేశారు. మీరొక త్యాగమూర్తులని చెప్పుకోవటానికా? నలుగురిలోనూ మెప్పు పొందాలనా. ఆరోజే పెళ్ళి చేసుకోనంటే సరి పోయేదా. పెళ్ళి కాకుండా ఉండేదాన్ని”


'పీటలదాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే జీవితం నాశన మవుతుందని చేసుకున్నాను. బయటికి వెళితే చాలు, నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారో తెలుసా. ఎంగిలి కూటికోసం ఆశపడతావా, అని నన్నొక లేకి వాడిలా చూస్తున్నారు. నీతో కలిసి బయటకు వెళ్ళలేక తల దించుకోవలసి వస్తోంది”


“మీతో అన్నవాళ్ళు ఎవరైనా చూశారా?నేను శీలం పోయినదాన్నని చెప్పమనండి. ఋజువులు, సాక్ష్యాలు చూపించమనండి”


“ఇలాంటి వాటికి సాక్ష్యాలుండవు. నిన్ను బలవంతంగా తీసుకెళ్ళాడంటే నిన్ను పాడుచేయటానికే. ఆ చీకటిలో ఎవరు చూశారు. తప్పు జరగలేదంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే అంతా అయిపోయాక అందరూ వచ్చి ఉండవచ్చు. నాకు మాత్రం నమ్మకం 

లేదు. ఈ గర్భం నావల్ల వచ్చింది మాత్రం కాదు. అబార్షన్ చేయించుకుంటేనే కలిసి ఉండవచ్చు. తరువాత నిర్ణయం నీదే” నంటూ నిష్కర్ష గా చెప్పేశాడు. 


“అయితే నామాట వినండి. తప్పు జరగనప్పుడు నే నెందుకు భయపడాలి. నేను మాత్రం అబార్షన్ చేయించుకోను. పదినెలలు మోసి కని నాబిడ్డ గానే పెంచుతాను. ఇక్కడుండాల్సిన అవసరం నాకు లే”దంటూ శృతి పుట్టింటికి వెళ్ళిపోయింది. 


రాఘవరావు, చిన్న కూతురు రాగిణి పెళ్ళికి పిలిచారు. పెళ్ళికి వచ్చిన మనిషి నెలరోజులు గడీచినా వెళ్ళలేదు. మామగారింట్లో తిష్ట వేశాడు. శృతి మాట్లాడటం మానేసింది. ఆడదంటే మగాడికి ఇంత చులకనా;


“పుట్టబోయే బిడ్డను అనాథను చేయడం దేనికీ? తండ్రి లేేని వాడిగా పెంచుతావా. నీ బిడ్డకు తండ్రిగా నేనుంటాను. నీకంటూ ఉద్యోగం ఉంది. మీనాన్న గారిని అడిగి ఈ ఇల్లు నాపేరు మీద వ్రాయించు. మనం కలిసుందాం. జరిగినదంతా మరిచిపోదా”మన్నాడు. 


భర్త వైపు అసహ్యంగా చూసింది శృతి. “ఛీ, నువ్వు ఓ మనిషివేనా, నేను శీలం పోయినదాన్నని నా మీద జాలిపడి నన్ను చేసుకొన్నాక నన్ను అడ్డం పెట్టుకుని బ్రతకాలని చూశావు. నా శీలం మీద నీకు నమ్మకం పోయాక నీతో కలిసి కాపురం చేయటం అసంభవం. నాకెవరి తోడూ అవసరం లేదు. నేను బ్రతగ్గలను. 


ఇప్పటిదాకా ఎంతో దోచి పెట్టాను. మీ నిజస్వరూపం తెలిసాక నీతో కలిసి కాపురం చెయ్యలేను. ఇవాళ ఇల్లు రాసివ్వమన్నారు. రేపు నన్ను అమ్మినా అమ్ముతారు. నన్ను నన్నుగా ప్రేమించ లేనప్పుడు నామీద నమ్మకం లేనప్పుడు, నీ కాళ్ళ దగ్గర పడి అవమానంతో బతకాల్సిన అవ

సరం లేదు. మనం త్వరలో విడాకులు తీసుకో బోతున్నాం. మనిద్దరి మధ్యా మాటలు రాయబారాలు లేవు. ఇక తమరు వెళ్ళవచ్చు "అంది ముక్కుసూటిగా. 


సంగీతమన్నాక శృతి, లయ, రాగం ఉండాలి. ఉంటేనే పాట వినసొంపుగా ఉంటుంది. సంసారం లో కూడా సరిగమలు ఉండాలంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ప్రధానం ఆలుమగల మధ్య. 


-------------శుభంభూయాత్-------------------------------‐


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








143 views0 comments

コメント


bottom of page