top of page
Writer's pictureBVD Prasada Rao

సు...ధీర ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Su... Dheera Episode 4' New Telugu Web Series Written By BVD Prasada Rao

రచన: బివిడి ప్రసాదరావు





గత ఎపిసోడ్ లో…


కొత్త సీరియల్ లో నటించడం కోసం ఒప్పుకోమని చెబుతాడు ఏజెంట్ సుదర్శనం.

వాళ్ళు భారీ మొత్తం ఇస్తారని కూడా చెబుతాడు.

తన అంగీకారం తెలుపుతుంది సు.

ధీరకు కాల్ చేసి కాస్సేపు మాట్లాడుతుంది.

ఇక చదవండి...



సు సూచన మేరకు.. సుదర్శనం వచ్చాడు.. ప్రొడ్యూసర్.. డైరక్టర్ లని వెనుకేసుకొని.

సు తన కారు దిగింది. అప్పటికి లంచ్ బ్రేక్ నడుస్తుంది.

పరిచయాల పిమ్మట.. డైరక్టర్ టూకీగా ఫ్రేం స్టోరీని చెప్పాడు.


"అమ్మాయ్.. మొదట నూరు ఎపిసోడ్ లని అనుకున్నా.. నువ్వు ఒప్పుకొనే సరికి.. డైరక్టర్ మరో వంద పెంచుదాం అంటున్నాడు. నేను అలాగే అనేశాను. థాంక్స్ అమ్మాయ్." చెప్పాడు ప్రొడ్యూసర్.


"పైకం విషయం.. నేను నీకు చెప్పింది హండ్రడ్ ఎపిసోడ్ లకే. అవి పెరిగితే నీదీ పెరుగుతోంది." సు తో.. అప్పుడే అన్నాడు సుదర్శనం.


"అంతేగా.. తప్పక అదే జరగాలి." అంది సు నవ్వుతూనే.

"అయ్యో.. అమ్మాయ్.. కాదా మరి. తప్పక అలానే పేపర్స్ రాయిస్తాను." చెప్పాడు ప్రొడ్యూసర్.


"డైలీ సీరియల్ మేడమ్. వచ్చే ఆరు నుండి షూటింగ్ మొదలవుతుంది. బిల్డింగ్స్.. లొకేషన్స్ ఎంపిక ఐపోయాయి. మీ వీలు చెప్పితే రైటర్ ని పంపుతాం. మీకు అతడు పూర్తి స్టోరీ చెప్పుతాడు." చెప్పాడు డైరక్టర్.

'అలాగే' అన్నట్టు తలాడించింది సు.


"కథ బాగుంది మేడమ్. మంచి కథ.. పైగా మీరు హిరోయిన్. అలాగే మంచి నోటెడ్ ఛానల్.. అదిరిపోతుంది. నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను." డైరక్టర్ తెగ ఇదైపోతున్నాడు.


అంతలోనే.. సు కి షూటింగ్ స్పాట్ నుండి కాల్ వచ్చింది.

"నేను షూటింగ్ కి వెళ్లాలి" చెప్పింది సు.


"సరే అమ్మాయ్.. ఇది అడ్వాన్స్.." అన్నాడు ప్రొడ్యూసర్.. చెక్ ని ఇస్తూ.

"లేదు లేదు. నేను కమిట్ అయ్యాను. అగ్రిమెంట్ టైంలో అన్నీ కానీయండి. నేను చెప్తాను.. ఒకటి రెండు రోజుల్లో రైటర్ ని పంపేలా చూడండి." చెప్పింది సు.


"అది కాదు అమ్మాయ్.." అంటున్నాడు ప్రొడ్యూసర్.

"కథ విననీయండి." అంది సు.


"కథ మాకు నచ్చింది అమ్మాయ్. నీ పోర్షన్ బాగుంటుంది. ఐనా కథ నచ్చకపోతే వాపస్ తీసుకుంటాను. ముందు అడ్వాన్స్ పుచ్చుకో. మాకు ధీమా వస్తుంది." చెప్పాడు ప్రొడ్యూసర్ ఆత్రంగా.


సు తల తిప్పి సుదర్శనంని చూస్తుంది.

"లేదు. ఈవిడ మాటంటే మాట. ఈవిడే మీ హిరోయిన్." గబుక్కున కలగచేసుకున్నాడు సుదర్శనం.


"మీ సీరియల్ హిరోయిన్ ని" టక్కున అంది సు.

"అవునవును.. అంతే అంతే." తడబడ్డాడు సుదర్శనం.

"మీరు ఒప్పుకున్నారు. మా యూనిట్ అంతా సంతోష పడ్డాం. ఏదో మా తృప్తికి ఇది పుచ్చుకోండి." అన్నాడు డైరక్టర్.


సరళంగా తిరష్కరించింది సు.

ప్రొడ్యూసర్, డైరక్టర్ తంటాలు పడుతుంటే..

"డోన్ట్ వర్రీ. నన్ను కావాలనుకున్నారు. నేను మిమ్మల్ని నిరుత్సాహ పర్చను." చెప్పింది సు.


వాళ్లు నమస్కరించి వెళ్లి పోయారు.

సు తిరిగి షూటింగ్ కి వచ్చేసింది.

షూటింగ్ పేకప్ అయ్యాక.. సు ఇంటికి వచ్చిన పాపు గంటకి..

అనుదీప్ నుండి కాల్ వచ్చింది.


"చెప్పు" అంది సు.

"వచ్చే సండే ఖాళీ ఉందా" అడిగాడు అనుదీప్.

"లేదు" అంది సు.

"అనుకున్నాను. అందుకే మరో ఆలోచన చేశాను." అన్నాడు అనుదీప్.


"ఎందుకు" అడిగింది సు.

"ఎ ఛానల్ వాళ్లు.. తమ గేమ్ షోలో.. ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కై.. పార్టిస్పెంట్స్ గా నలుగురుని అనుకుంటున్నారు. అందులో నువ్వు ఒకరు ఐతే బాగుంటుంది అన్నారు. నీ వీలు.. నీ పిక్క ఎంత వరకు ఉండొచ్చు అని నన్ను అడిగారు. నేను తెలుసుకొని చెప్తా అన్నా. అందుకే కాల్ చేశాను. సండే షూట్ ట." చెప్పాడు అనుదీప్.


"అవునా." అంది సు.

"ఛానల్ గట్టిది. సింగిల్ ఎపిసోడ్. పిక్క విషయం ఎంత వరకు వెళ్తావు." నవ్వేడు అనుదీప్.

"ముందు టైం కుదరదు గా" అంది సు.

"నువ్వు మరిన్నూ. నువ్వు సడలింపు చేస్తే.. నువ్వు అన్న టైంకి.. వాళ్లు షూటింగ్ పెట్టుకుంటారు. మరి నీ అవసరం వాళ్లకి అంత ఉంది. వాళ్ల మాటలు బట్టి నాకు తెలిసింది." చెప్పాడు అనుదీప్.


"అయ్యో.. టైం ఎలా కుదురుతుంది." అంది సు.

"నీ షూటింగ్ టైమింగ్స్.. ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఎనిమిది వరకే.. అన్నది నీ నియమం. కానీ.. నువ్వు ఉ అంటే.. రాత్రి ఎనిమిది నుండి మర్నాడు ఉదయం ఎనిమిది వరకు.. షూటింగ్ కి వాళ్లు ఒప్పుకుంటారు. నీ లెవల్ అంతటిది. వినియోగించుకో." చెప్పాడు అనుదీప్.


సు మాట్లాడలేదు.

"సు.. ఇది రోజు జరిపేది కాదుగా. అప్పుడప్పుడు వచ్చేది.. కొద్దిగా శ్రమ అవుతుంది. అవుతే ఐంది.. ఫలం.. ఫలితం బేష్ గా ముడుతుందిగా. ఒప్పుకో." అనుదీప్ ప్రయత్నిస్తున్నాడు.

"అలా అంటావా" సు నానుస్తుంది.


"అంతే అంతే.. నువ్వు ఉంటే.. నాకు అందే పిక్క కూడా బాగుంటుంది.. నాకూ హైపు పెరుగుతుంది.. ప్లీజ్." అనుదీప్ నిజంగా బతిమలాడుతున్నాడు.

సు ఒప్పేసుకుంది నిముషాల్లోనే. ఆమెపై అనుదీప్ మాటల ప్రభావం బాగా పని చేసింది.

పిక్క మాటలు సమ్మగా అనిపించాయి సుకి.


"కాల్ కట్ చేస్తాను. నువ్వు ఒప్పుకున్నట్టు చెప్పగానే.. వాళ్లే నీకు డైరక్ట్ గా కాల్ చేస్తారు. ఫైనల్ చేయి." చెప్పాడు అనుదీప్.

ఆ కాల్ కట్ ఐంది.

ఇరవై నిముషాలు గడుస్తుండగా..

సు కి కాల్ వచ్చింది.

"హలో" అంది.


"మిస్ సు.. నేను.. శ్రీధర్. ఎ ఛానల్ నుండి.. అనుదీప్ నీతో మాట్లాడేడుగా.. ఆ విషయమే మాట్లాడాలని కాల్ చేశాను." చెప్పాడు శ్రీధర్.

"ఓకే. ఓకే. చెప్పండి." సు అంది.


"నీ రెమ్యూనిరేషన్.. కోరినట్టే చెల్లిస్తాం. షూటింగ్ కూడా నువ్వు చెప్పిన టైమింగ్స్ లోనే కానిస్తాం. వెల్ కం మై ఛానల్ మిస్ సు." అన్నాడు శ్రీధర్.

"థాంక్యూ." అంది సు.


"నీకు ఫోన్ చేసి.. మా మనిషి నిన్ను కలుస్తాడు. జస్ట్ పార్మాలిటీస్. నీకు తెలిసిందే. పేపర్స్ మీద సంతకం చేయాలి. అప్పుడే నీకు చెక్కు కూడా ఇచ్చేస్తాడు." చెప్పాడు శ్రీధర్.

"సరే నండీ" అంది సు.


"మిస్ సు.. వచ్చే ఆదివారం షూటింగ్. ఆ రోజు నైట్ ఎనిమిదిన్నరకి నువ్వు షూటింగ్ లో ఉండాలి. స్పాట్ నీకు తెలియచేస్తాం. అలాగే.. తర్వాత.. ఏమైనా పేచ్ వర్క్స్ ఉంటే.. సహకరించాలి." చెప్పాడు శ్రీధర్.


"అయ్యో అలాగే. తప్పక." చెప్పింది సు.

"గుడ్ నైట్ మిస్ సు" అన్నాడు శ్రీధర్.

'గుడ్ నైట్' చెప్పి.. కాల్ కట్ చేసేసింది సు.


ఆన్లైన్ ద్వారా అందిన డిన్నర్ ని.. తినేసి.. మంచం పైకి చేరింది సు.

అప్పుడు టైం.. పది దాటి నలభై నిముషాలవుతుంది.

ప్రశాంతత కై ప్రయత్నిస్తుంది సు.

అంతలోనే.. తన ఫోన్ నుండి మెసేజ్ రిసీవ్ ఐనట్టు.. సౌండ్ వినిపించింది.


సు చూసింది.

ధీర నుండి.. వాట్సాప్ మెసేజ్.

కాస్తా చిరాకయ్యింది సు.

ఐనా.. మేసేజ్ వైపు చూసింది.


'గుడ్ నైట్' తో పాటు మరేదో మేసేజ్ గా పంపేడు ధీర.

ఐనా దానిని ఓపెన్ చేయలేదు.

ఓపెన్ చేస్తే.. 'నేను మెసేజ్ చూశానని.. చాట్ కొనసాగిస్తాడు. సో.. కామయ్యి పోవాలి' అనుకుంది సు.


ఫోన్ ని పక్కన పెట్టేసింది.

కళ్లు మూసుకుంది. నిద్రకై ప్రయత్నిస్తుంది.

ధీర నుండి మరెటువంటి స్పందన లేదు.


క్షణాల్లో కాక పోయినా.. నిముషాల్లో సు నిద్ర లోకి వెళ్లి పోగలిగింది.

నిద్ర లేచిన సు.. తన సదా పనుల్ని సాదా గా కానిచ్చేసి.. షూటింగ్ కి బయలు దేరింది కారుతో.


కారులో.. అప్పుడే గుర్తుకు వచ్చినట్టు.. ఫోన్ లోని రాత్రి ధీర పంపిన వాట్సాప్ మెసేజ్ తెరిచి చూసింది.

'గుడ్ నైట్ అండ్ ప్లీజ్ గివ్ మి ఎ ప్లేస్ ఇన్ యువర్ థాట్స్.'

మెసేజ్ చదివి.. అప్రయత్నంగా.. చిన్నగా.. నవ్వుకుంది సు.


'అలసి త్వరగా నిద్ర పోయాను. రాత్రి నీ మెసేజ్ చూడలేక పోయాను.' అంటూ రిప్లై ఇచ్చింది సు.

నిముషం లోపే ధీర నుండి ఫోన్ కాల్ వచ్చింది.

బ్లూటూత్ ఆన్ చేసి.. ధీరతో మాట్లాడుతుంది సు.


"సాహసించి ఆ మెసేజ్ పెట్టేశాను. డోంట్ థింగ్ అధర్వైజ్ ప్లీజ్" అన్నాడు ధీర.

"ఇట్స్ ఓకే. బట్.. డోంట్ రిపీట్ ప్లీజ్" చెప్పింది సు.

"సరే" నసిగాడు ధీర.

సు ఏమీ అనలేదు.


"నిన్ను కలిసే భాగ్యం ప్రసాదించేది ఎప్పుడు" అడిగాడు ధీర మెల్లిగా.

"నాకు కొత్త ఆఫర్స్ వచ్చి పడ్డాయి. నెక్ టు నెక్ షెడ్యూల్స్. చాలా బిజీయే.. సో.. ఒక వారం తర్వాత.. కలిసి మాట్లాడదాం" చెప్పింది సు.

"ఉహు. వారమా" గుణిచాడు ధీర.


కూల్ గా వ్యవహరించాలని తలుస్తున్న సు.. "ప్లీజ్" అంది.

ఆ వెంటనే.. "ట్రై టు అండర్స్టాండ్." అంది కూడా.

ధీర మెత్త బడ్డాడు. "సరే." అనేశాడు.

తర్వాత.. కాల్ ని కట్ చేసేసింది సు.


షూటింగ్ పేకప్ తర్వాత.. స్టూడియో ఆవరణలోనే.. తన కారులో కూర్చుని.. రైటర్ చెప్పిన.. తను నటించేబోయే సీరియల్ కథని విన్న సు..


"వెల్.. స్టోరీ సూపర్ గా ఉంది. నా కేరక్టర్ బాగుంది. నా అదృష్టం.. యాకరింగ్ తో పాటు.. ఇంత వరకు అడపా దడపా షార్ట్ ఫిల్మ్ స్.. సింగిల్ ఎపిసోడ్ స్టోరీస్ చేసిన నాకు.. మొట్ట మొదటి సీరియల్ మంచి కథతో చిక్కింది." ఆనందమైంది సు.


రైటర్ హాయి అయ్యాడు.

"ఇది మొదట మేము అనుకున్న నూరు ఎపిసోడ్స్ స్టోరీ మేడమ్.. దీని ఎక్స్టెన్షన్ మరీ బాగా వస్తుంది" గొప్పగా చెప్పాడు రైటర్.


"అవునా.. నిజమే.. మీ స్టోరీ రైటింగ్ బాగుంది. ప్లీజ్.. రాబోయేది కూడా మరింత బాగా రక్తి కట్టించండి. నన్ను మరెంతో మంది నచ్చేలా సహకరించండి." కోరింది సు.


"షూర్ మేడమ్.. మరింత మంది మిమ్మల్ని మెచ్చేలా రాస్తాను. నాకూ పేరేగా.. పైగా మీ లాంటి వారికి కథ రాస్తే నాకు ఎనలేని గుర్తింపు వస్తుందని నాకు తెలీదా.. నా స్టోరీ హిరోయిన్ మీరు కావడం నాకూ ఆనందమే.. అదృష్టమే." తెగ మురిసిపోతున్నాడు రైటర్.

తర్వాత అతడు వెళ్లి పోయాడు.

సుదర్శనంకి ఫోన్ చేసింది సు.


"స్టోరీ బాగుంది. మిగతా విషయాలు కానిచ్చేయ్" చెప్పింది.

సుదర్శనం సంబరమయ్యాడు.


"అలాగే.. పేపర్స్ తో కలిసేలా చూస్తాను" చెప్పాడు.

కాల్ కట్ చేసేక ఇంటికి బయలు దేరింది సు.


దార్లో ఉండగానే.. సుకి సీరియల్ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు.

"అమ్మాయ్.. కథ నచ్చేవటగా. చెప్పాగా. కథ బాగుంటుంది. రేపే పేపర్స్ తో కలుస్తాం. చెక్ తెస్తాను." చెప్పాడు ప్రొడ్యూసర్.


"అడ్వాన్స్ గా ఆఫ్ ముట్ట చెప్పేలా చూడండి" చెప్పింది సు.

"అలానే. సరే అమ్మాయ్. డేట్స్ మాత్రం మాకు ఆటంకం లేకుండా సర్దాలి." చెప్పాడు ప్రొడ్యూసర్.


"నా తీరు మీరు చూస్తారుగా" చెప్పింది సు.

"సుదర్శనం చెప్పాడు. నీతో పని అమోఘమని." నవ్వేడు ప్రొడ్యూసర్.

"సుదర్శనంతో ఫోన్ చేయించండి. నన్ను ఎక్కడ కలవాలో చెప్తాను." చెప్పింది సు.

"అలానే అమ్మాయ్." ప్రొడ్యూసర్ చెప్పాడు.

తర్వాత.. ఆ కాల్ కట్ చేసేసింది సు.


ఇంటికి చేరేక.. శ్రీధర్ నుండి సు కి కాల్ వచ్చింది.

"మిస్ సు.. ఉదయం మా మనిషి మిమ్మల్ని కలిసి.. ఫార్మాలిటీస్ అన్నీ కానిచ్చేశాడు. బిజీ వలన వెంటనే ఫోన్ చేయలేక పోయాను. ఒన్స్ ఎగేన్.. మీ కోపరేషన్ కి థాంక్యూ వెరీ మచ్." అన్నాడు శ్రీధర్.


"వెల్ కం." అంది సు.

"మా కాస్ట్యూమర్స్ వస్తారు. రేపు టైం కావాలి." అడిగాడు శ్రీధర్.

"మీకు రేపు ఫోన్ చేసి చెప్పుతాను." చెప్పింది సు.

"సరే" అన్నాడు శ్రీధర్.


సు కాల్ కట్ చేసేసింది.

డిన్నర్ కాగానే.. సు కి సుదర్శనం నుండి కాల్ వచ్చింది.

"ఆఫ్ అమౌంట్ ఇచ్చేయమన్నావట" అన్నాడు సుదర్శనం.

"అవును. నా హౌస్ లోన్ తీరిపోతుంది" చెప్పింది సు.

"గుడ్.. లెక్కల మనిషివి." అన్నాడు సుదర్శనం.


"నీ కమిషన్ కూడా.. నాకు ముట్టే దానికి సరిపడేలా లెక్కించి ఇచ్చేస్తాను." చెప్పింది సు.

"నీతో నాకు ప్రొబ్లమ్ కాదు. సంతోషం." నవ్వేడు సుదర్శనం.

'పోరా.. నీ లాజిక్ లు నాకు తెలియనివా. ఇప్పుడు కాల్ చేసింది.. అదడగడానికే గా.' నవ్వుకుంది సు.


ఆ కాల్ కట్ తర్వాత.. మంచం ఎక్కింది సు.

నిద్ర పడుతుందనగా.. ఫోన్ రింగవ్వడంతో.. లేచి.. ఫోన్ అందుకుంది సు.

అనుదీప్ నుండి కాల్.

"చెప్పు" అంది సు బడలికలోనే.

"శ్రీధర్ పంపిన కాస్ట్యూమర్స్ ఇప్పుడే నన్ను కలిసి వెళ్లారు. రేపు నిన్ను కలుస్తారట. మనిద్దరికీ డార్క్ గ్రీన్ కలర్ క్లాత్ క్లోత్స్ ఎలాట్ చేశారట." చెప్పాడు అనుదీప్.

"అలానా" అంది సు.


"నాకు ఆ కలర్ నచ్చదు. నేను చెప్పాను కూడా. వాళ్లు పట్టించుకోనేలా లేరు. కొలతలు తీసుకు పోయారు." చెప్పాడు అనుదీప్.

సు వింది.

"సు.. నువ్వు అబ్జెక్షన్ చెయ్. నీ మాట చెల్లుతుంది. నాకు సెంటిమెంట్ గా గ్రీన్ పడదు" చెప్పాడు అనుదీప్.

"భలే. ఇదేం చోద్యం." అంది సు.

"ప్లీజ్ సు" అన్నాడు అనుదీప్.


"నా మాట అవుతుందా" అడిగింది సు.

"తప్పక.. నీ ఛార్మ్ మీద నాకు నమ్మకం ఉంది." చెప్పాడు అనుదీప్.

"చూద్దాం" చెప్పింది సు.


"థాంక్స్ సు. నువ్వు అడ్డు చెప్పు.. కలర్ మారి తీరుతుంది." అన్నాడు అనుదీప్.

"సరేలే" అనేసింది సు.

ఆ కాల్ కట్ చేసేక.. సు తిరిగి నిద్రకి ఉపక్రమించింది.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.





320 views0 comments

Comments


bottom of page