top of page
Writer's pictureBVD Prasada Rao

సు...ధీర ఎపిసోడ్ 6

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Su... Dheera Episode 6' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు


గత ఎపిసోడ్ లో…


ధీర ఈమధ్య అన్యమనస్కంగా ఉండటంతో ప్రశ్నిస్తారు అతని తల్లి సావిత్రి, తండ్రి వెంకట రావు.

ఏమీ లేదని దాటవేస్తాడు ధీర.

అతను టివిలో ఏవో పాత ప్రోగ్రాం లు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండటం గమనిస్తుంది అతని తల్లి.

ఇక చదవండి...


షూటింగ్ పేకప్ అయ్యేక...

డైరక్టర్ తో.. "సార్.. సోమవారం మీ షెడ్యూల్ తిరిగి నాకు ఉంది. కానీ నేను ఆ రోజు గంట ఆలస్యంగా వస్తాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వాలి." అంది సు.


"అవునా. సరే అమ్మా. ఆ లోగా నేను మరోటి షూట్ చేసుకుంటాను." చెప్పాడు డైరక్టర్.


"థాంక్స్" చెప్పి.. తన కారు వద్దకి వచ్చింది సు.


ఎ ఛానల్ శ్రీధర్ కి ఫోన్ చేసింది.


"రేపు రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యన.. షూటింగ్ స్పాట్ లో ఉంటాను. కన్సిడర్ చేయండి." చెప్పింది సు.


శ్రీధర్ ఒప్పుకున్నాడు.


"థాంక్స్" చెప్పి.. కాల్ కట్ చేసేసి.. ఇంటికి బయలు దేరింది సు.. కారుతో.


అదే సమయంన.. ధీర ఇంటిలో..


తల్లిదండ్రులని పిలిచి.. వాళ్లతో.. "మీకు మా ఆఫీసర్ నుండి ఫోన్ కాల్ రావచ్చు." చెప్పాడు ధీర.


"ఎందుకట" అడిగింది సావిత్రి.


"నాకు ముంబై ట్రాన్స్ఫర్ అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఆయన ససేమిరా అన్నారు. నేను అమ్మకి బాగా లేదు.. ట్రీట్మెంట్ అవుతుంది. అది ఇక్కడే కొనసాగాలి.. అందుకు మరో ఆరు మాసాలు పడుతుంది అని గట్టిగానే చెప్పాను. ఆయన వాకబు చేస్తామన్నారు. ముందు జాగ్రత్తగా మీకు చెప్పుతున్నాను. మీరు ఇలానే చెప్పండి." చెప్పాడు ధీర.


"అదేమిట్రా.. ఆయన మమ్మల్ని కాక.. హాస్పిటల్ వాళ్లకై.. రిపోర్ట్స్ కై వాకబు చేస్తే మరేలా రా." అన్నాడు వెంకటరావు విస్మయంగా.


"ఆ ఏర్పాట్లు చేసుకున్నాను. అటు నుండి ఐనా.. మేనేజ్ అవుతుంది. మీ వైపైతే మీరు మేనేజ్ చేయాలి." చెప్పాడు ధీర.


"ఎందుకురా ఇన్ని అవస్థలు." అంది సావిత్రి.


"చాల్లే.. చెప్పింది చేయండి.. ఇక్కడే నేను ఉండాలి.. ప్రస్తుతం తప్పక నాకు అవసరం." అనేశాడు ధీర.


ఆ తల్లిదండ్రులు ఏమీ అనలేదు.

ధీర తన గది లోకి వెళ్లి పోయాడు.


వెళ్తూ.. "నేను బయట తినేశాను. పడుకుంటాను." చెప్పాడు.


గది తలుపు మూసేసి.. గడియ పెట్టేసు కొని.. గబగబా బట్టలు మార్చేసుకొని.. టివి ఆన్ చేసి.. కావలసిన ఛానల్ పెట్టుకొని.. కూర్చున్నాడు.


మరి కొద్ది నిముషాల్లో.. రాబోవు సు ప్రోగ్రాం కై వేచి ఉన్నాడు ఆత్రంగా.

అప్పుడే.. డిన్నర్ కై భార్యభర్తలు కూర్చున్నారు.


"ఏమిటే వీడి తీరు" అన్నాడు వెంకటరావు.

"మీలాగే నేనే కూడా.. సతమతమవుతున్నాను." చెప్పింది సావిత్రి.


"ప్రేమలో పడ్డాడా ఏం" సడన్ గా అన్నాడు వెంకటరావు.

భర్త మొహం చూసింది సావిత్రి.


వెంకటరావు భార్యనే చూస్తున్నాడు.


"కాకపోవచ్చండీ. అదే ఐతే.. బయటే పడి తిరిగే వాడుగా." అంది సావిత్రి.


ఆ వెంబడే.. "బయటికి వెళ్తున్నాడు.. వస్తున్నాడు. ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు." అంది కూడా.


"నిజమే మరి.. ఏమిటో వీడు.." అంటున్నాడు వెంకటరావు.


"ఆ టివి.. ఆ లేప్టాప్.. పిచ్చిలో ఉంటున్నాడు." చెప్పింది సావిత్రి.


"అదే.. ఏమిటో అంతగా వాటిలో చూస్తుంది." అనుమానంగా అన్నాడు వెంకటరావు.

"మరే.. అదే అర్ధం కాకుంటుంది. పైగా గతంలో చూసినవే మళ్లీ చూస్తున్నాడు. నేను ఈ మధ్య గమనించాను." చెప్పింది సావిత్రి.


వెంకటరావు తన ఎడమ చేతితో తల గొక్కుంటున్నాడు. భార్యనే చూస్తున్నాడు.

"అర్ధం కాకుంటుంది వీడి తీరు" అంది సావిత్రి.


"అంతు చిక్కడం లేదు స్మీ.. తల హీటెక్కి పోతుంది." అన్నాడు వెంకటరావు.


"వద్దొద్దు.. వంటికి తెచ్చుకోవద్దు. చూద్దాం. ఏమవుతుందో." అంది వెంకటరావుని సముదాయిస్తున్నట్టు సావిత్రి.


"అంతంతే. చేసేది ఏముందిలే. వాడే బయలు పడాలి." అన్నాడు వెంకటరావు.

"బయట పెడతాడని అనుకుందాం" అంది సావిత్రి.


పిమ్మట డిన్నర్ కానిచ్చేశారు.

అన్నీ సర్దుకొని.. పడక్కై వెళ్తూ.. ధీర గది వైపుకి చూసింది సావిత్రి.


ఆ గది తలుపు కింది సందులోంచి.. టివి వెలుతురులు ఆమె చూపున పడ్డాయి.


చేసేది లేక.. దీర్ఘంగా నిట్టూర్చేసి.. భర్త చెంతకి చేరిపోయింది సావిత్రి నిద్రకై.

అదే సమయంలో.. సు ఇంటిలో..


గాఢ నిద్రలో ఉంది సు.

అనుదీప్ ఇంటిలో..


అతడి పేరెంట్స్ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో.. తమకి కేటాయింపబడ్డ గదిలో.


థర్డ్ ఫ్లోర్ లో.. తన విలాసవంతమైన రూంలో.. అనుదీప్.. తన కో యాంకర్స్ ఇద్దరితో కబుర్లాటలో ఉన్నాడు.


"ఏమైనా సు లక్కీ పిరియడ్ లో ఉందిరా" అన్నాడు అనుదీప్ అప్పుడే.

"మరి.. తనకి తన ఫిగరే బంపర్ ఛాన్స్ రా." అన్నాడు నీలకంఠ.


"మరి.. తన కవ్వింతలకి కుప్పి గెంతులేసేవారు.. అబ్బో ఎంతో మంది రా. దాని అదృష్టమే అదృష్టంరా." అన్నాడు శేఖర్.


"మరే.. ఏ మాటకి ఆ మాటరా.. తనతో మాత్రం.. నాకు చేతి నిండా పనంటే అబద్ధం కాదురా." అనేశాడు అనుదీప్.


"పోరా.. చేతి నిండా అంటావేమిట్రా.. నీ జేబు నిండా పనను." నవ్వేడు నీలకంఠ.

"అవున్రా.. అదే నిజం." అనేసి గబగబా నవ్వేడు శేఖర్.


అనుదీప్ కూడా నవ్వేశాడు.


"ఏదేమైనా.. మీ పెయిర్ మాత్రం.. సూపర్రా.. అందుకే ఆడియన్స్ మీ కాంబినేషన్ కి సదా వెల్కమ్ చేస్తుంటారు." అన్నాడు నీలకంఠ.


"మరి అలా కుదిరిపోయింది వీళ్ల లక్కు. చాల్లే. ఎన్నాళ్లో చూద్దాం." అన్నాడు శేఖర్.

అనుదీప్ చిన్నగా కదిలిపోయాడు.


"మనకి లేనిది ఏదో.. వీడి దగ్గర ఉందిరా." అన్నాడు నీలకంఠ.. అనుదీప్ నే చూస్తూ.

"అదేమీ కాదురా.. సు తో జత కడితేనే నేను బ్రయిట్ అవుతున్నాను. ఇది పక్కారా." అన్నాడు అనుదీప్.


"ఎంతైనా మామా.. అది నీ లక్కే రా.. మాకు రానిది నీకు దొరికేస్తుంది.. అంతే." అన్నాడు శేఖర్.


నవ్వుకున్నాడు అనుదీప్.


"మరెందుకు.. మరెలా.. ఆ సు నీకు కనెక్ట్ ఐపోయిందోరా.. మామా.. నువ్వు నువ్వేరా." అన్నాడు నీలకంఠ.. అనుదీప్ భుజాలు పట్టి కుదిపేస్తూ.


అప్పుడే.. "నీతోనే ఎందుకు సు కలిసి చేస్తుందో." అనేశాడు శేఖర్.


'అది సు ఎత్తుగడరా.. మా కాంబినేషన్ హిట్ కావడంతో .. తన పక్కన నన్ను ఉండనిస్తుంది. ఆడియన్స్ ఫల్స్ తెలిసినది సు రా.' మనసులో అనుకున్నాడు అనుదీప్. బయటికి మాత్రం చక్కగా నవ్వేశాడు.


"ఏమైనా.. మరేమిటో.. సు బయట మాత్రం ఈ గురుడునీ తన చెంతకి రానీయదురా." నవ్వేశాడు నీలకంఠ.


"వీడ్నేమిటి కర్మ.. తన తోటి లేడీ యాంకర్స్ నే దరికి చేర్చుకోదు. పబ్బుకి రాదు.. పార్టీకి పోదు.. షూటింగ్.. ఇల్లే.. తనకి ముద్దు. ఛ." అన్నాడు శేఖర్.


అనుదీప్ అంతా ఆలకిస్తున్నాడు.


వీళ్ల తీరు.. చాలా సేపు ఇలానే కొనసాగి.. పిమ్మట.. వాళ్ల నిద్రలతో ముగిసింది మెల్లిగా.

సోమవారం..


ఉదయం ఏడూ ఇరవై అవుతుంది..


ఎ ఛానల్ వారి స్పెషల్ ప్రోగ్రాం షూటింగ్ సరళంగా ముగిసింది.

సు బడలికని తొక్కుపెడుతూ ఇంటికి బయలు దేరింది కారుతో.


ఇంటిని చేరేక.. తన దిన చర్యల్ని కొన్నింటిని బ్రేక్ చేసుకొని.. ఇంటిని మాత్రమే శుభ్ర పరిపించుకొని.. పిమ్మట.. చకచకా తెమిలి.. తిరిగి నేటి షూటింగ్ కై బయలు దేరింది కారుతో.


అప్పటి సమయం.. ఎయిట్ ట్వంటీ ఫోర్ ఏయం.

అదే సమయాన.. ధీర ఆఫీస్ కి బయలుదేరాడు బైక్ తో.


దార్లో.. రోడ్డు పక్కన.. కొట్టొచ్చినట్టు పెట్టిన బ్యానర్ ని చూశాడు.

బైక్ ని ఆపేశాడు.


బైక్ దిగి ఆ బ్యానర్ దరికి చేరిపోయాడు.

సు హిరోయిన్ గా రాబోతున్న సీరియల్ యాడ్ ఆ బ్యానర్ లో కానవస్తుంది. సు చిత్రాకృతి కనుల విందుగా ఉంది.


ధీర మురిసి పోయాడు.

సునే తెగ చూసేస్తున్నాడు.


పరిసరాల్ని గమనించే స్థితిని కోల్పోయాడు ఎప్పుడో.


చాలా యాంగిల్స్ లో.. ఆ బ్యానర్ ని బ్యాక్ గ్రౌండ్ గా చేసుకొని.. సెల్ఫీస్ తీసుకున్నాడు.

దారిన పోతున్న ఒక అపరిచయస్తుడ్ని ఆపి.. కోరి.. ఆ బ్యానర్ ముందు నించుని ఫోటోలు పరిసరాల్ని గమనించే స్థితిని కోల్పోయాడు ఎప్పుడో.


చాలా యాంగిల్స్ లో.. ఆ బ్యానర్ ని బ్యాక్ గ్రౌండ్ గా చేసుకొని.. సెల్ఫీస్ తీసుకున్నాడు.

దారిన పోతున్న ఒక అపరిచయస్తుడ్ని ఆపి.. కోరి.. ఆ బ్యానర్ ముందు నించుని ఫోటోలు తీయించుకున్నాడు.


ఆ బ్యానర్ నే చూస్తున్న వాళ్లని చూసి.. తబ్బిబ్బు అవుతూ.. మరి తప్పదన్నట్టు కదిలి.. వెళ్ల లేక వెళ్తున్నట్టు ఆఫీసు వైపుకి కదిలాడు బైక్ తో.


ఆఫీస్ కి వెళ్లగానే.. ఆఫీసర్ కబురుతో.. ఆయన్ని కలిశాడు ధీర.


"మీ అమ్మగారితో.. నాన్న గారితో మాట్లాడేను. సారీ.. మీ అమ్మగారు బాగా స్ట్రగుల్ లో ఉన్నారట. సర్లే.. ఆవిడకై నిన్ను ఈ టెర్మ్ కి ఇక్కడే ఉంచేస్తున్నాను." చెప్పాడు ఆఫీసర్.

"థాంక్యూ సర్" అనేశాడు ధీర.


"ఇట్స్ ఓకే. టేక్ కేర్.. అమ్మ జాగ్రత్త." చెప్పాడు ఆఫీసర్.

"అలానే సార్." అన్నాడు ధీర.


ఆ వెంటనే.. "సర్.. ఆఫీస్ కి రావడంలో కానీ.. ఆఫీస్ నుండి పోవడంలో కానీ.. టైమింగ్స్ అటు ఇటు కావచ్చు.. ఆవిడ కోసమే సార్.. మీరు సహకరించాలి." అడిగేశాడు.


"ఇట్స్ ఓకే. కానీయ్." ఆఫీసర్ ఒప్పేసుకున్నాడు.

ధీర ఠీవిగా తన సీట్ వైపు కదిలి పోయాడు.


సీట్లో కూర్చుంటూనే.. ఫోన్ లోని బ్యానర్ దగ్గరి ఫోటోలు చూడడం లో మునిగిపోయాడు.


తన రైట్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్ తో.. సు పోర్షన్ ఫోటోని ఫోన్ స్క్రీన్ మీద జూమ్ చేస్తూ.. మరి ఆమెనే పదే పదే.. పట్టి పట్టి చూస్తూ ఉన్నాడు ధీర.


అప్పుడు సమయం.. టెన్ టెన్ ఏయం.


సు కి ఒక బ్యానర్ ఫోటో పెట్టి.. అప్రిసియేషన్ మెసేజ్ ఒకటి వాట్సాప్ ద్వారా పంపాలనుకున్నాడు ధీర.. సడన్ గా.


కానీ జంకాడు.

'హద్దు మీరితే.. సు ఎలా రియాక్ట్ అవుతుందో' అనుకున్నాడు.


జవాబు తట్టక.. తగ్గిపోయాడు.

కానీ.. ధీర మనసు ఎగతోసేస్తుంది.


తాళలేక పోయాడు.

తర్జన భర్జనల నడుమన.. తన సెల్ఫీ ఫోటో తో పాటు.. 'నైస్' అని టైపు చేసి.. వాట్సాప్ మేసేజ్ సు కి పంపేశాడు.


అప్పుడు సమయం.. ట్వల్వ్ ఫిప్టీన్ పియం.

ఆ సమయంలో.. కారులో..


సు లంచ్ చేస్తుంది.

ధీర మెసేజ్ చూసింది.


ఎట్టి రియాక్షన్ లేకుండా కొద్ది సేపు ఉండిపోయింది.

తర్వాత.. ఫోన్ ని పక్కన పడేసింది.


సు లంచ్ ని పూర్తి చేసేసింది.

కాస్తా రిలాక్స్ ఐ.. ఫోన్ ని తీసుకుంది.


ధీర మెసేజ్ ని చూసింది. అతడి సెల్ఫీతో ఉన్న తన ఫోటో ని.. మళ్లీ చూసుకుంది.

ఈ మారు మొత్తం బ్యానర్ ని మాత్రమే చూసుకుంది.


చిన్నగా నవ్వుకుంది.


'నిన్న రాత్రి.. ఏరౌండ్ నైనో క్లాక్ అప్పుడు బ్యానర్ రిలీజ్ ఐంది. నా చేతే చేయించారు. సరే.. బిజిలో ఉన్న. కాల్ ఆర్ మెసేజ్ ఏమీ చేయకు' అని టైపు చేసి.. ధీర కి రిప్లై ఇచ్చింది.


తర్వాత.. కాల్ రావడంతో.. షూటింగ్ స్పాట్ ని చేరింది సు.

"ఉదయం రోడ్డు మీద బ్యానర్ చూశాను.. మీరు సీరియల్ లో నటిస్తున్నారా." అడిగాడు ఆ ఎపిసోడ్ ప్రొడ్యూసర్.


"అవునండీ" అంది సు.

"మంచిది తల్లీ. మీకు టాలెంట్ ఉంది. మిమ్మల్ని ఆడియన్స్ కోరుకుంటున్న ముమ్మర సమయం ఇది. గో హెడ్." చెప్పాడు ఆ ప్రొడ్యూసర్.


"ఈ సింగిల్ ఎపిసోడ్ ప్రొడక్షన్ తో పాటు.. మీరూ సీరియల్ లేదా వెబ్ సీరీస్ వైపు మొగ్గితే బాగుంటుందిగా." అన్నాడు ఆ ఎపిసోడ్ డైరక్టర్ ఆ ప్రొడ్యూసర్ తో అప్పుడే.


"అబ్బే. నాకు అవుతుందా. అంతేసి పెట్టుబళ్లు నా వల్ల కాదు." అన్నాడు ఆ ప్రొడ్యూసర్.

"అలా అనుకుంటే ఎలా. సాహసించాలి. తెగించాలి. రాబోయేవి ఇక అవే." అన్నాడు ఆ డైరక్టర్.


"చూద్దాం." అనేశాడు ఆ ప్రొడ్యూసర్.


"సు గారు మీకు బాగా తెలిసిన వారు. ప్రస్తుతం ఆమె మంచి పరుగులో ఉన్నారు. ఇప్పుడే తొందరగా ఆమెతో కానీవ్వండి. నాకు ఛాన్స్ ఇవ్వండి." నవ్వేడు ఆ డైరక్టర్.


"సు తెలియడమేమిటి. నా రాబడులకి గ్యారంటీ అవుతున్న మహాలక్ష్మి ఆమె. ఈ వేడి మీదే నీ మాట చేపడితే బాగుంటుందనిపిస్తుంది." అన్నాడు ఆ ప్రొడ్యూసర్.


"మరింకేం. అటు అడుగు పెట్టేయండి. నా దగ్గర మంచి కథలు రెండు ఉన్నాయి." చెప్పాడు ఆ డైరక్టర్.


"మనం అనుకుంటే సరిపోతుందా.. సు సరే అనాలి గా. ఇప్పటి వరకు ఆమెతో నేను నష్టపోయేది పిసరంత లేదు. నేనే కాదు సు ఉన్న ఏ ప్రొజెక్టు తుష్ మనలేదు. మిగతా వారు నాతో చెప్పుతున్నారుగా.. ప్రొడ్యూసర్స్ గోల్డెన్ స్పూన్ సు. సు డేట్లు ఇవ్వాలే కానీ.. ఎన్ని కష్టాలైనా లెక్క చేయక.. త్వరలోనే అట్టి ప్రొజెక్టు మొదలెట్టేయనూ." అన్నాడు ఆ ప్రొడ్యూసర్ నవ్వుతూనే.. సు నే చూస్తూ.


"అయ్యో. మీది మంచి ప్రొడక్షన్. నాకు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తున్నారు. మీరు అడిగితే డేట్లు కాదనగలనా." అంది సు నవ్వుతూనే.


"అయితే.. ప్రొసీడ్." అనేశాడు ఆ ప్రొడ్యూసర్.

ఆ డైరక్టర్ తెగ మురిసిపోయాడు.


"ఐతే.. మంచి రోజున.. కథ వినిపించేయ్. ప్లాన్ వేసుకొని రంగంలోకి దిగిపోదాం." అనేశాడు ఆ ప్రొడ్యూసర్.


"తప్పక సార్." పొంగిపోయాడు ఆ డైరక్టర్.

సు మెత్తగా నవ్వేసింది.


తర్వాత.. అప్పటి షూటింగ్ సాఫీగా సాగిపోతుంది.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



308 views0 comments

Comments


bottom of page