'Subhadra' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 25/08/2024
'సుభద్ర' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
దిగువ మధ్యతరగతి రైతు కుటుంబములో అగ్రహారంలో ఆరుగురి తోబుట్టువుల సరసన కడపటి బిడ్డగా ఇలపై కళ్ళు తెరిచింది అభాగ్యురాలు సుభద్ర.
ఆ కుటుంబానికి పరువు- ప్రతిష్టలు, అభిమానం ఆభరణాలు. మర్యాదలే మూలథనం.
గ్రాహ్యం తెలిసిన మొదలు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా సర్దుకుని పెరిగింది ఆ బాల.
చదువు- సంగీతం అంటే తనకు పంచ ప్రాణాలు. అయినా భయభక్తులతో, క్రమశిక్షణతో పెంచిన తండ్రికి తన మనసులోని మాట చెప్పే ధైర్యం, చనువు లేదు..
ఆ ఇంట్లో తండ్రి మాటే వేద శాసనం. తల్లి మాటకు విలువ లేదు. తోబుట్టువుల పిల్లలు తన వయస్సు
వారు. అంత వయస్సు తారతమ్యం తోబుట్టువుల తో. ఇంక తన మనసును ఎవరితో పంచుకోగలదు?
యుక్త వయస్సు రాగానే తండ్రి నిర్ణయించిన భాగ్యవంతుల సంబంధం. వరుడిని కూడా తను చూడకుండానే, చదువు, వ్యాపార వివరాలు తనకు తెలీకుండానే మూడుముళ్ళ తతంగం.
కోటి ఆశలు, మధుర ఊహలతో అడిగిడిన ఆ వధువుకు తొలి రాత్రే కాళరాత్రి. భర్త ప్రేమ గాధ, అయిష్టంగా తనని వివాహం, నిరాదరణ. వెరసి అది ప్రళయ కాళ రాత్రి.
గుండెల్లో గునపం లాంటి బాధని దిగమింగుకుని "ఇదే తన జీవితం - కడదాకా ఇక్కడే తన స్థానం " అనుకుందా ఇల్లాలు.
మనసులో కోటి కోరికల మల్లెల మాలలల్లుకుని వివాహమై క్రొత్త జీవితంలో ఉమ్మడి కుటుంబంలో అడుగిడిన పద్దెనిమిది ఏళ్ల నవ వధువు సుభద్రకు అత్త, పినత్తలు, పినమామగార్లు, బావగార్లు, మరుదులు వెరసి 30 మంది కుటుంబ సభ్యులు తన వాళ్ళని మురిసిపోయింది.
తొలినాళ్ళ నుంచే అత్తగారి ఆరళ్ళు, తోడేళ్ళు లాంటి తోడికోడళ్ళ కోరంటికం, అన్నిటికన్నా శాడిస్టు భర్త వేధింపులతో మనసు కుంగిపోయినా భూదేవి కున్నంత ఓర్పుతో థైర్యాన్ని కూడదీసుకుని అతనితో కాపురం చేసింది. తన పరిస్థితికి పినమామగార్లు, పినత్తలకు బాధ కలిగినా అత్తగారి హుంకరింపులకు, ఆధిపత్యానికి ఏమీ చేయలేని వాళ్ళ నిస్సహాయత. కాలగతిన వాళ్ళు గతించారు.
పైకి చెదరని చిరునవ్వుతో మొక్క వోని ఓర్పు తో ఆ కసాయి భర్తతో కాపురం. ఫలితం 23 సం..కే ముగ్గురు ఆడపిల్లల తల్లి.అయినా ఆ స్త్రీ తలరాత మారలేదు. సరికదా "ఆడపిల్లల తల్లీ ఒక తల్లేనా ? " అనే అవమానాలు, ఈసడింపులు. భాగ్యవంతుల కోరంటికం అంటే ఇదే నేమో మరి!
బానిస లాగా చాకిరీ చేయించుకుని కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు.భర్త తన వాడైతే ఎన్ని బాధలనైనా ఓర్చుకోగలదు కానీ కాలయముడే భర్త అయితే ఇంక ఆ ఇల్లాలి వేదన చెప్పనలవికాదు.
పోనీ ! కన్నవాళ్ళతో చెబుదామా అనుకుంటే వాళ్లకు కూతురు ఎన్ని బాధలు పడినా చచ్చేదాకా అత్తారింట్లోనే బాథలు భరిస్తూ ఉండాలి. వాళ్లకు పరువే ప్రాణం.
అత్త మామల తదనంతరం వ్యసన పరుడైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అన్నదమ్ములు ఆస్తి కాజేయటం. ఫలితం ఒక ఇల్లు, శాడిస్టు భర్త, ముగ్గురు ఆడపిల్లలతో కట్టుబట్టలతో వేరుకాపురం.
తన పిల్లలే తన లోకం అనుకుని వాళ్ళను కళ్ళల్లో పెట్టుకుని కష్టపడి పెంచి, చదివించి ప్రయోజకులను చేసింది. మంచి వరుళ్ళను చూసి వివాహం చేసింది. వాళ్ళ సంతోషమైన కాపురాలను చూసి ఆ కన్నతల్లి హ్రృదయం ఆనందంతో పొంగి పోయింది. మనుమలు- మనుమరాళ్ళు వచ్చి నా ఆ ఇల్లాలి నుదుటి రాత మారలేదు సరికదా నడివయసు వచ్చినా ఇంకా నిత్యం ఆ శాడిస్టు భర్త చేతిలో బాధలు, ఒంటి మీద వాతలు.
ఆరవైమూడేళ్ళ భర్త నుండి విడాకుల వత్తిడి. మారు మనువు కై ఆ మగాడి అంతులేని ఆరాటం.
తను ఒప్పుకుంటే తన పిల్లలకు సవతి తల్లి వస్తుందన్న మనోవేదన. తల్లి-తండ్రి వేరైతే కూతుళ్ళ కాపురాలు ఏమవుతాయో అనే బాధ ఆ అభాగ్యురాలి మనసుని కుంగదీస్తోంది.
మనోవేదనకు మందులేదు కదా!
పిల్లలు తండ్రికి నచ్చచెప్పే ప్రయత్నంలో విఫలమై" అమ్మా! నీ సమస్య ను నీవే సాల్వ్ చేసుకో ఇంక మేమేం చేయలేము. నీవు మావద్దకు వస్తే చూస్తాము " అని నిర్ణయం.
ఇప్పటి నుండే పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళకు భారమవటం సుభద్రకు ఇష్టం లేదు.
పైగా అలిగి అత్తింటికీ - చెడి కూతురింటికీ చేరకూడదనే సామెత. భర్త నొదిలేసిన స్త్రీ అంటే ఇంకా లోకువ అని ఆవిడ అభిప్రాయం.
ఇదే అలుసుగా తీసుకుని ఇంకా భర్త వేదనలెక్కువైనాయి.
తుది తీర్పు ఏంటి? అనే ప్రశ్నతో కలత చెదిరిన మనసు తో ఆకాశం వైపు చూస్తూ నిట్టూరుస్తోంది సుభద్ర. కాలానికీ, విధాతకు నిర్ణయాన్ని వదిలేసి జీవనయానాన్ని భారంగా కొనసాగిస్తోంది సుభద్ర.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
గత 5సం.. నుంచి “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో నేను కధలు వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు🙏.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Commentaires