top of page
Writer's pictureSammetla Venkata Ramana Murthy

శుభారంభం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Subharambham' New Telugu Story


Written By Susmitha Ramana Murthy


రచన : సుస్మితా రమణ మూర్తి



నగరానికి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ పార్కులో విశ్రాంత జీవులు లోకాభిరామాయణంలో బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం కలుసుకుని పలకరింపులు, కబుర్లు, వార్తలు, విశేషాలు, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వారికి పరిపాటి.


వారిది అరవై సభ్యులున్న సీనయర్స్ సంఘం. శ్రీరామ్ వారి ప్రెసిడెంట్. సంవత్సరానికి వెయ్యేసి రూపాయలు సభ్యుల నుంచి తీసుకుని, పుట్టిన రోజులకు, పిక్నిక్ పార్టీలకు ఖర్చు చేస్తూ మిగిలింది బేంకులో జమ చేసే బాధ్యత కేషియర్ సుదర్శనంది.


ఉదయం తొమ్మిదిన్నరకే చాలామంది కమ్యూనిటీ పార్కులో బెంచీలపై కూర్చున్నారు.


“ అందరికీ నమస్కారం! “ అంటూశ్రీరామ్ వచ్చి కూర్చున్నాడు .

“తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!...”

“పేపర్ల వాళ్ళు రాసేది వాతావరణ శాఖ వారి సమాచారమే!

ఒక్కోసారి చినుకులు కూడా పడవు!...”


“వారి లెక్కల ప్రకారం చెప్పిందే పేపర్లో వస్తుంది”

“అంతే! అంతే! పడితే పడొచ్చు. లేకుంటే లేదు “

“అవునవును. బొమ్మ బొరుసు వ్యవహారం!”

మిత్రుల కబుర్ల ప్రవాహం సాగుతోంది.


శ్రీరామ్ అందరిలో ఉన్నా, వారి మాటలపై ధ్యాస లేదు

నిన్నటి లోకల్ పేపర్ వార్తల ఆలోచనల్లోనే ఇంకా.


“ సహృదయులైన పాఠకులకు మనవి. ఈ సరస్వతీ పుత్రికకు

దయచేసి సహాయం చేయండి. ఇంటర్లో తొంభై అయిదు

శాతం మార్కులు వచ్చాయి పై చదువులు చదువుకోలేని పరిస్థితి!...”


“ దయగల మారాజులు మా అనాథ శరణాలయంలోని

పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయండి. నిరాదరణకు గురైన వారిని ఆదుకోండి”


ఆ వార్తలకు శ్రీరామ్ మనసు కకావికలమైంది

‘ డబ్బున్న వారికి చదువబ్బదు. బాగా చదువుకునే వారికి

డబ్బుండదు…అనాథ పిల్లలు,..ఆఖరి దశలో దాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్న వృద్ధులు…. దయనీయమైన పరిస్థితి!...


ఆశ్రమానికి, అమ్మాయి చదువుకి ఎలాగైనా సహాయం చేయాలి….

పార్టిలకు పిక్నిక్కులకు వేలకు వేలు తగలేస్తున్నాం!….,ఎంతోకొంత సహాయం చేయగల స్థితిలో ఉన్నాం కనుక, మిత్రుల దృష్టి సహాయ కార్యక్రమాల వేపు మళ్ళించాలి!....’


“ ఈరోజు అధ్యక్ష మహాశయులు దీర్ఘాలోచనలో పడ్డారు.

విషయం ఏమిటో!?...” ఓ మిత్రుడు నవ్వుతూ అడిగాడు.


శ్రీరామ్ లో స్పందన లేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.

‘ ముందుగా సామాజిక స్పృహ, సేవాబావం గల సుదర్శనం

గారితోను, కవిగారితోను మాట్లాడాలి…’


చినుకులు పడుతుంటే అందరూ వెళ్ళిపోయారు.


శ్రీరామ్ కవిగారిని, సుదర్శనంని వారి ఇంటిలో కలిసి

తన ఆలోచనలకు వారి ప్రశంసలు పొందాడు.

*****

మిత్రులు అందరూ మిర్చీ బజ్జీ పార్టీలో బిజీగా ఉన్నారు.

“ వచ్చే నెలలో మన సుబ్బారావు గారు పుట్టిన రోజు పార్టీ

స్టార్ హోటల్లో ఇస్తారట! “


“ గుర్నాథం గారు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.

వారు ఫారిన్ లిక్కర్ తో మంచి ఫార్టీ ఇస్తారు! “


“ అంత ఆనందం దేనికో?...ఆ సరుకు ఇక్కడ కూడా

దొరుకుతుంది. అంత ఎదురు చూడాల్సిన పని లేదు”


“ అంత కోపం ఎందుకు మిత్రమా!?...నాకు తెలిసింది చెప్పానంతే!”


“ఆ విషయం వదిలేయండి. వచ్చే వారం మన శ్రీరామ్ గారిచ్చే పార్టీ చాలా గ్రేండుగా ఉంటుందని అనుకుంటున్నాను ”


శ్రీరామ్ నోరు విప్పలేదు.


“ కవిగారీ రోజు మవునం వహించారెందుకో!?...ఎప్పుడూ

ఏదో ఒక విషయం గురించి అదరగొట్టేసే వారుగా?...”


“ మీరంతా మాట్లాడుతున్నారు కదా?...మధ్యలో మాట్లాడటం

సభ్యత కాదని...స్సరే! నాకు తోచింది చెబుతాను. విని

మీ అభిప్రాయం చెప్పండి “ అంటూ కవిగారు నోరు విప్పారు.

“ ప్రకృతిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. నదులు వాటి నీటిని త్రాగవు. చెట్లు వాటి ఫలాలను ఆరగింపవు. పువ్వుల పరిమళం మన కోసమే! తేనెటీగలు సేకరించే మధువూ మన కోసమే! ఇలా ప్రకృతిలోని ప్రతి చర్యా మానవాళి కోసమే! ….”


కొన్ని క్షణాలు కవిగారు ఆగి, అందరివేపు చూసి మరల నోరు విప్పారు.

“దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి?... స్వార్థ చింతన లేని సేవాభావం!...అవునంటారా?...”


మిత్రులకు కవిగారి ఆంతర్యం అర్థం కాలేదు

శ్రీరామ్ మాత్రం ‘ గురువు గారు అసలు విషయంలోకి

రాబోతున్నారు’ స్వగతంలా అనుకున్నాడు.


“సేవాభావం అంటే…ఆర్థికంగా వెనుకబడిన వారికి మనలాంటి వారు నిస్వార్థంగా సహాయం చేయడం”


కవిగారి మాటలకు అర్థం చెప్పాడు సుదర్శనం.


“ మనం అభాగ్యులను కొంతవరకైనా ఆదుకునే స్థాయిలో

ఉన్నాం కనుక సహాయ కార్యక్రమాలు ప్రారంభిద్దాం”


అందరికీ ఆ ప్రతిపాదన నచ్చింది.

“ ప్రెసిడెంటు గారూ! వచ్చే వారం మీ పుట్టిన రోజు పార్టీ

గురించి మీరేమీ చెప్పనే లేదు!...”


“ పార్టీ విభిన్నంగా ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతాను”

****

అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

పిల్లలు, వృద్ధులు అందరూ కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు.

పిల్లలు తమ బట్టలు చూసుకుంటూ మురిసిపోతున్నారు. పెద్దల ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది.

“ నిశ్శబ్దంగా ఉండండి. అందరి ఆనందానికి కారణమైన

మహానుభావుడి గురించి రెండు మాటలు చెబుతాను వినండి”

శరణాలయ నిర్వాహకుని మాటలకు అక్కడ నిశ్శబ్దం నెలకొంది.

“ అందరూ ఇంత సంతోషంగా ఉండటానికి కారణమైన ఆ మహనీయుని పెద్ద మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి కార్యక్రమం ఇలా ఇక్కడ జరగడానికి ఆ మహనీయునితో బాటు, సీనియర్స్ సంఘం సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను “

శరణాలయం నిర్వాహకుని మాటలకు అందరూ సంతోషించారు.


“ ఆ సరస్వతీ పుత్రిక మన ఏరియాలోనే ఉందండీ! మీరు చెప్పినట్లే ఫీజు కట్టి కాలేజీలో జాయిను చేసాను “

సుదర్శనం మాటలకు శ్రీరామ్ లో ఆనందం చోటుచేసుకుంది.

“ ఆ మహనీయులు శ్రీరామ్ గారు.. వారు నాలుగు మాటలు మాట్లాడుతారు”


శరణాలయ నిర్వాకుని అభ్యర్థనకు, శ్రీరామ్ వేదికపైకి వెళ్ళి అందరికీ నమస్కారం చేసాడు.


“అందరూ నన్ను మహనీయుణ్ణి చేసారు. నిజానికి నా అభిప్రాయాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న మా సంఘం మిత్రులు అందరూ మహనీయులే! నామీద గౌరవంతో అందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది”


మిత్రులందరూ సంతోషంతో చప్పట్ల వర్షం కురిపించారు.

“మిత్రులారా! మనకు అన్నీ ఉన్నాయి. మనశ్శాంతితో సంతోషంగా ఉంటున్నామా?...మనవలు, మనవరాళ్ళతో ఆనందంగా ఉంటున్నామా??

ఆ అదృష్టం మనలో చాలామందికి లేదు. రెక్కలు కట్టుకుని పిల్లలు విదేశాలకు ఎగిరిపోయారు. వారితోనే చిన్నారులు కూడా!...”


అందరూ నిశ్శబ్దంగా శ్రీరామ్ మాటలు వింటున్నారు.

“పిల్లలు, చిన్నారులు ఎప్పుడో వస్తారు. హాల్లో… హల్లో… పలకరింపులు!

పది రోజుల్లోనే బై!... బైలు!!... తిరుగు టపాలు!!!.... మరల మన జీవితాల్లో నిస్సారం!... నిస్తేజం!!... ఇంతేగా మన బతుకులు??....”

ఆ ప్రశ్నలకు వాతావరణం గంభీరంగా మారిపోయింది.


“ ఈ పిల్లలలో మన కొసర్లను….అదే మన మనవలను , మనవరాళ్ళను చూసుకుందాం . వీరు ఆనందంగా ఉండటానికి సహాయం చేద్దాం. వృద్ధులకు అండగా ఉందాం. వారి ఆశీస్సులు పొందుదాం.


మిత్రులు అందరూ పెద్ద మనసుతో, తమ పుట్టిన రోజులు

అనాథ శరణాయాల్లోనో, వృద్ధాశ్రమాలలోనో జరుపుకుంటే

మంచిదని నా అభిప్రాయం. నా పుట్టిన రోజు ఇక్కడ ఇలా

జరుపుకోవడం, మన సేవాకార్యక్రమాలకు శుభారంభంగా

భావిస్తున్నాను”.


మిత్రులందరిలో తాము చేయబోయే సేవా కార్యక్రమాల

గురించి ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి.


/ సమాప్తం /


సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

మీ సుస్మితా రమణ మూర్తి.



































82 views0 comments

Comments


bottom of page