top of page
Writer's pictureNeeraja Prabhala

సుధ - ఎపిసోడ్ 2



'Sudha Episode 2' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala

'సుధ - ఎపిసోడ్ 2' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కధ..

రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ డిగ్రీ చదువుతున్నది. తండ్రి హఠాన్మరణం మనసుకు చాలా బాధకలిగినా తనకి తనే నిబ్బరించుకుని తల్లిని ఓదార్చి నెమ్మదిగా మామూలు మనిషిని చేసింది. ఒకనాడు కాంతమ్మ తన గత స్మృతులను గుర్తు చేసుకుంది. సుధ తన క్లాస్ మేట్ విజయ్ తో సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చాక ఆరాత్రి అతని గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు..


ఇక సుధ సీరియల్ రెండవ భాగం చదవండి..


విజయ్ క్లాసులో క్రొత్తగా చేరిన ఆరోజు తనకింకా గుర్తుంది. డయాస్ మీదకొచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ చదువంటే తనకు ప్రాణమని చెప్పిన తీరు తనకు నచ్చింది. చూడ చక్కని రూపంతో ఉన్న అతన్ని అప్పుడే నిశితంగా గమనించింది సుధ. తర్వాత క్లాసులో అన్ని సబ్జెక్టులను శ్రధ్ధగా వినడం, తనతో పోటీగా అన్నట్లుగా మంచి మార్కులను తెచ్చుకోవడం చూసి అతనంటే సదభిప్రాయం ఏర్పడింది.


కాలేజీలో జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన బోయేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని లెక్చరర్ చెప్పడంతో కొందరు విద్యార్థులు లేచి వివిధ పోటీలలోకి తమ పేర్లను ఆయనకు ఇస్తున్నారు. తను లేచి వక్తృత్వ పోటీలోకి పేరుని ఇచ్చింది. తర్వాత విజయ్ కూడా లేచి తన పేరు ఇచ్చాడు.


కొన్నిరోజులకు కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వక్తృత్వ పోటీలలో తను, విజయ్ చక్కగా చెప్పి అందరినీ ఆకర్షించారు. తనకి ప్రధమ, విజయ్ కి ద్వితీయ బహుమతులు లభించగా వాటిని అందుకుంటున్నప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. స్టేజి దిగాక తనను సమీపించి అభినందనలు చెప్పిన అతని సంస్కారానికి ముచ్చటేసింది.


తను కూడా అతనిని అభినందించింది. ఇద్దరూ చదువులో ఒకరినొకరు సందేహాలు తెలుసుకోవడంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని నెలల తర్వాత విజయ్ తన గురించి సుధకు వివరించాడు.


బాంకులో ఉద్యోగం చేసే విజయ్ తండ్రి రాఘవరావు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన విజయ్ ని కష్టపడి పెంచుతూ కొడుకు భవిష్యత్ కోసం బంధువుల వత్తిడి మీద విజయ్ కి ఐదేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోక తప్పలేదు. 'సవతి తల్లి వస్తే తన బిడ్డని సరిగా పెంచదేమో' అనే అనుమానం మనసులో ఉన్నా దూరపు బంధువులు చూసిన 'రేవతి' అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు రాఘవరావు.


రేవతికి అది మొదటి పెళ్లి. ఆమెది బీద కుటుంబం. తండ్రి లేడు. తల్లి సుశీలమ్మే రేవతిని పెంచి పెద్దచేసింది. ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రేవతి పెద్దగా చదువుకోలేదు రెండవ పెళ్లి, కొడుకు ఉన్నా కూడా బాంకు ఉద్యోగి, ఆర్ధిక ఇబ్బందులు లేవని రాఘవరావుని చేసుకుంది.


స్వతహాగా రేవతి మంచిదవటంతో కాపురానికి వచ్చినప్పటినుండి భర్తనీ, విజయ్ నీ చక్కగా చూసుకోవడంతో రాఘవరావు మనసు కాస్త స్ధిమితపడింది. విజయ్ కూడా చక్కగా పెరుగుతూ స్కూలులో చక్కగా చదువుతున్నాడు.

కాలం సాఫీగా సాగుతోంది. రెండు సం..తర్వాత రేవతి గర్భం దాల్చింది. విజయ్ కి ఒక తోడు దొరకబోతోందని రాఘవరావు చాలా సంతోషించాడు. సుశీలమ్మ కూతురి పురిటికి వచ్చింది. రేవతి కి సుఖప్రసవం జరిగి చక్కటి ఆడపిల్లని కన్నది. ఆపాపకి 'దీప' అని పేరుపెట్టుకుని చక్కగా పెంచుకుంటున్నారు. విజయ్ తనకి చెల్లెలు వచ్చిందని చాలా సంబరపడ్డాడు.


దీపతో సమానంగా విజయ్ ని చూడటం సుశీలమ్మ మనసు తట్టుకోలేక ఆవిడ కాస్త కఠినంగా మారింది. దీపని ఎత్తుకొని విజయ్ ఆడించడంతో దీపకు విజయ్ తో ఎక్కడ అనుబంధం పెరుగుతుందో అని ఆవిడ విజయ్ పట్ల కాఠిన్యంగా వ్యవహరించేది. వీలు దొరికినప్పుడల్లా రేవతికి 'సవతి కొడుకు నీ కొడుకవుతాడా ? నీ కడుపున పుట్టిన దీపే నీ బిడ్డ ' అంటూ రేవతి మనసు మార్చ ప్రయత్నం చేసింది.


రేవతి తల్లి మాటలను పెడచెవిన పెట్టి "పచ్చగా ఉన్న నా కాపురంలో నిప్పులు పోయకు. పిల్లలిద్దరూ నాకు సమానమే. ఇక్కడ ఉండటం నీకిష్టం లేకపోతే నీవు మన ఊరు వెళ్లచ్చు" అని నిర్మొహమాటంగా చెప్పింది.

సుశీలమ్మ ఇంక చేసేదిలేక తన ఊరు వెళ్లింది. , విజయ్, దీపలు చక్కగా పెరుగుతూ ఉన్నారు. దీపకు మాట, నడక వచ్చి తన ముద్దుమురిపాలతో ఆందరినీ అలరిస్తోంది. దీపకి మూడవసం.. రాగానే విజయ్ చదువుతున్న స్కూలులోనే ఆమెని చేర్చారు. వాళ్లిద్దరూ కలిసిమెలిసి స్కూలుకు వెళ్లరావడం చూస్తున్న రాఘవయ్య దంపతులు సంతోషంగా ఉంటున్నారు. వాళ్లకు వారాంతంలో పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్లడం అలవాటుగా మారింది.


కాలం హాయిగా సాగుతోంది. దీప, విజయ్ లు కష్టపడి చదివి మంచి మార్కులతో పాసవుతున్నారు. విజయ్ డిగ్రీ మూడవ సం..చదువు, దీప ఇంటరు చదువుతున్నారు. విజయ్ ని గురించి ఇవన్నీ గుర్తుచేసుకున్నాక సుధ మనసు తృప్తి చెంది తెల్లవారుఝామున నిద్రపోయింది సుధ.


కిటికీ లోంచి వెచ్చని సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే హడావుడిగా లేచి తన దైనందిన కార్యక్రమాలను ముగించుకుని హాల్లోకి వచ్చింది. నవ్వుతూ తల్లిని పలకరించి "మా మంచి అమ్మ" అంటూ ఆమెకు ప్రేమగా ముద్దిచ్చింది. కాంతమ్మ నవ్వుతూ ముందే చేసి ఉంచిన బ్రేక్ఫాస్ట్ ను సుధకు పెట్టి తనూ తీసుకుంది. తల్లి ఇచ్చిన లంచ్ బాక్సును అందుకుని హడావుడిగా కాలేజీకి వెళ్లింది సుధ.


క్లాసులన్నీ శ్రధ్ధగా వింటూ కష్టపడి చదువుతున్న సుధ అంటే లెక్చరర్ లకు చాలా అభిమానం. తండ్రి గుర్తుకువచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి సుధకు. తను డిగ్రీ చదువుతున్నానని అందరితో చెప్పుకుని ఎంత మురిసిపోయేవాడో! 'మంచి మార్కులతో డిగ్రీ పాసయి ఏదైనా మంచి ఉద్యోగాన్ని పొందాలి' మనసులో అనుకుంది సుధ.

========================================================================

ఇంకా ఉంది...


========================================================================

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏








59 views0 comments

Comments


bottom of page