సూక్తులు-{కంద పద్యాలు}
'Sukthulu' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 17/11/2023
'సూక్తులు' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
నచ్చిన తిండినె దినుమన
నచ్చిన దనుచును అధికము నగుచును దినగన్
వచ్చును రోగము లధికమె
నచ్చిన దేదియు మితమన నదియే సౌఖ్యం
మితమగు మాటయె సుఖమగు
మితమును మీరిన జరుగును మిక్కిలి కీడున్
అతియను దెప్పుడు దలువకు
సతిపతు లైనను సరసము సభ్యత మేలున్
మొక్కుము దేవుని నిత్యము
మొక్కిన మొక్కుము ఒకరినె మోక్షము గలుగన్
దిక్కులు దిరుగుచు మొక్కకు
పెక్కుగ దేవుల వలననె పెన్నిధి అనుచున్
చేయుము స్నేహము మితముగ
చేయకు మైత్రిని అధికము చేటగు జూడన్
చేయుము దానము ధర్మము
చేయగ నదియును మితమను చెడుపన రెవరున్
వికలాంగు లంధుల గనగ
అకలంకసపర్య దలువు ఆప్తుని వోలెన్
నకనక లాడెడు బీదకు
సకలము సాయము విడుకొను శక్తియు తీరున్
పెద్దల తద్దిన మనుచును
పెద్దగ వ్యయమును దలువకు పేర్కొను నటులన్
కొద్దిగ నైనను దానమె
పెద్దల పేరిట ఒసగను ప్రేమతొ ఉంటున్
అడిగిన వెల్లను గొనకుము
కొడుకుల పైనను అనుగుతొ గొప్పని అనుచున్
కొడుకుల కనగను చదువులె
ముడుపులు అనుకొని చరించు ముందరి చూపున్
- సుదర్శన రావు పోచంపల్లి
Comments