top of page
Writer's pictureMohana Krishna Tata

సూపర్ హీరో

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #SuperHero, #సూపర్హీరో, #TeluguStories, #తెలుగుకథలు


Super Hero - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 19/01/2025

సూపర్ హీరోతెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"హలో మేడం.. ! ఇందాక జాయిన్ అయిన పేషెంట్ ఎక్కడ.. ?" అడిగాడు సుబ్బారావు ఆత్రుతగా.


"శ్రీహర్ష కదా.. ! అతను రూమ్ లోకి షిఫ్ట్ చేసాము.. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి జాయిన్ చేసారు. మీకు నన్నే కాల్ చేసి విషయం చెప్పమన్నారు.. "


"థాంక్స్ మేడం.. "


సుబ్బారావు, సుమతి దంపతుల ఏకైక కొడుకు శ్రీహర్ష. ఒక్కడే కొడుకు కావడంతో చాలా గారాబంగా పెంచింది సుమతి. ఈ విషయమై ఎప్పుడూ సుబ్బారావు పెళ్ళాంతో వాదిస్తూనే ఉన్నాడు. భర్త మాటల ముందుర తల్లి గారాబమే ఎప్పుడూ నేగ్గిది. 


"ఎందుకే సుమతి.. వాడు అడిగిందంత ఇచ్చి పాడుచేస్తావు.. "


"ఒక్కగానొక్క కొడుకు.. అలా అనకండి.. " అని సుమతి సర్ది చెప్పేది. 


"చూసావా సుమితి.. ! ఆ రోజు నేను చెబితే వినలేదు.. నీ గారబమే వాడిని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ లో మంచాన పడ్డాడు.. "


"ఏమిటండీ మనకి ఈ బాధ.. ఇది చూడడానికేనే మనం ఇంకా బ్రతికున్నది.. " అంటూ కంట నీరు పెట్టుకుంది సుమతి. 


"ఏంచేస్తాం చెప్పు.. ! ఎన్ని సార్లు మన అబ్బాయికి నేను చెప్పినా వినలేదు. మన అబ్బాయే కాదు.. ఈ రోజుల్లో సినిమా పిచ్చి లో పడితే.. ఎవరూ పెద్దవారి మాట వినట్లేదు. వాడొక సినిమా హీరో పిచ్చిలో పడి చదువు కూడా పాడు చేసుకుంటున్నాడు.. చెప్పినా వినలేదు"


ఆ మాటలకు తెలివి వచ్చిన శ్రీహర్ష.. 


"అవును నాన్నా.. ! మీరు చెప్పిన మాట వినుంటే, ఈ రోజు నా పరిస్థితి ఇలా అయ్యేది కాదు.. " అంటూ తన గతం గుర్తు చేసుకున్నాడు. 


******


"ఈ రోజు మన హీరో సినిమా రిలీజ్.. కట్ అవుట్ అదిరిపోవాలి.. మన హీరో కట్ అవుట్ కనీసం యాభై అడుగులు లేకపోతె, మన హీరో ఫీల్ అవుతాడు.. నువ్వే ఏదో చూడరా శ్రీహర్ష.. " అన్నాడు ఫ్రెండ్. 


"చిన్నప్పటినుంచి మా అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏది అడిగితే అది ఇచ్చేవారు. మా అమ్మని కాకాపట్టి, డబ్బు తెస్తాను.. అన్నీ ఏర్పాట్లు చెయ్యండి.. డబ్బులు చాలకపోతే, మా నాన్న జేబులోంచి ఎలాగో తీస్తాను.. ఏమైనా అయితే, మా అమ్మ కవర్ చేస్తుంది.. " అన్నాడు శ్రీహర్ష.


"మరి కట్ అవుట్ కి పాలాభిషేకం, కొబ్బరికాయలకి డబ్బులో.. ?" అడిగాడు మరో ఫ్రెండ్.


"మరీ అవసరమైతే, నా బర్త్‌డే గిఫ్ట్ ఉంగరం అమ్మేస్తాను.. మా నాన్న మళ్ళీ కొంటాడు.. " అన్నాడు శ్రీహర్ష ధీమాగా.


"నీ లాంటి ఫ్యాన్స్ ఊరికి ఒక్కడుంటే, మన హీరో సినిమాలకి పండగే రా.. "


అనుకున్నట్టుగా శ్రీహర్షకి డబ్బులు కుదిరాయి.. తన ఆనందానికి హద్దే లేదు. ఆ రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎగ్గొట్టి మరీ తమ హీరో కట్ అవుట్ కి పాలాభిషేకం హడావిడి చేసాడు శ్రీహర్ష తన ఫ్రెండ్స్ తో కలసి. ఈ లోపు తన సినిమా చూడడానికి హీరో ఫస్ట్ షో కి వస్తున్నాడని తెలిసింది. సినిమా హీరో తన సినిమా చూసి, జనాల స్పందన చూసి.. వెయ్యి కోట్లు గ్యారంటీ అనుకుని అందరికీ 'హాయ్' చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. హీరోతో పాటు వచ్చిన హీరోయిన్ సగం సగం బట్టలు వేసుకుని.. అందరికీ 'హాయ్' చెబుతూ వెళ్లిపోయింది. 


"ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి రా.. ! ఆ హీరోయిన్ ఒక దేవత.. నా హీరో సూపర్ హీరో.. ఈ జన్మకి ఇది చాలు.. " అన్నాడు శ్రీహర్ష ఆనందంతో.


తమ హీరోని చూడడానికి చుట్టుపక్కల ఉన్న సినిమా హాల్స్ లో జనం అంతా ఒకేసారి వచ్చేసారు. అప్పుడు జరిగిన ఆ తొక్కిసలాటలో ముందు వరుసలో ఉన్న శ్రీహర్ష కి గాయాలయ్యాయి. 


******


"ఒరేయ్ హర్ష.. ! ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను చూసి తిట్టడం నీ తండ్రి ఉద్దేశ్యం కాదు. ఇప్పటికైనా నిజాన్ని నువ్వు తెలుసుకుంటే, నాకు అదే చాలు. ఇంత చేసిన మీ హీరో కనీసం నువ్వు పెట్టిన ఖర్చులో రూపాయైనా ఇస్తాడా.. ? హీరో కనీసం నీ టికెట్ డబ్బులైనా ఇస్తాడా.. ? నువ్వేమో ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం, అమ్మ పోపుల పెట్టె లో, నాన్న పర్సు లో డబ్బులు తీస్తావు. మీ హీరో పేపర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసా.. ? 'నా ఫ్యాన్స్ యే నా ఊపిరి.. వాళ్ళు లేకపోతే నేను లేను.. ' తన సినిమా సూపర్ హిట్ అని మురిసిపోయాడు. 


నీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మనిషి ప్రాణం పొతే, స్పందిస్తారేమో.. తెలియదు. అప్పుడు కూడా కొంత డబ్బులిచ్చి చేతులు దులిపేసుకుంటారేమో.. ! మనిషి ప్రాణానికి, తల్లిదండ్రుల ప్రేమకి ఖరీదు కట్టగలరా.. ? ఎగ్జామ్స్ మానేసి సినిమా చూస్తే, మీ హీరో నిన్ను పాస్ చేయిస్తాడా.. ? నువ్వు దేవత అన్న ఆ హీరోయిన్ నీ కోసం వస్తుందా.. ? మీ అమ్మ చేస్తున్నట్టుగా నీకు సేవ చేస్తుందా.. ? 'అమ్మ' రా దేవతంటే.. ".


"నువ్వు చెప్పింది నిజమే నాన్న.. ! నేను ఇక మారతాను.. మా ఫ్రెండ్స్ అందరినీ మారమని చెబుతాను. సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే. ఏదైనా ఒక హద్దులో ఉంటేనే ఎవరికీ ఇబ్బంది ఉండదు.. లేకపోతే విషాదమే అని తెలుసుకున్నాను. కనీ పెంచి, నా కోసం ఇంత చేస్తున్న మీకన్నా నాకెవరు గొప్ప కాదు. ఎవరికైనా అమ్మే దేవత, నాన్నే సూపర్ హీరో అని లేట్ గా తెలుసుకున్నాను నాన్న.. క్షమించు!".


కొడుకులో వచ్చిన మార్పుకి సుబ్బారావు, సుమతి దంపతులు చాలా సంతోషించారు. 


*******


 తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


34 views0 comments

Comments


bottom of page