top of page

సుప్రీమ్ దైవము

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SupremeDaivamu, #సుప్రీమ్, #దైవము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

Supreme Daivamu - New Telugu Poem Written By Gadvala Somanna

Published In manatelugukathalu.com On 17/02/2025

సుప్రీమ్ దైవము - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


భగవంతుని కార్యము

నిర్లక్ష్యం చేయొద్దు

చేయుట ఉపకారము

ఎన్నడూ మరువవద్దు


విలువైనది సమయము

చేసుకోకు వ్యర్ధము

అతి చిన్నది జీవితము

చేసుకొనుము సార్థకము


నేర్చుకున్న విద్యలు

ఎంతో ఉపయోగము

కలిగియున్న విలువలు

కలుగజేయు గౌరవము


దేవునితో ఆటలు

ఎప్పుడూ ఆడొద్దు

నాశనమగు బ్రతుకులు

విరోధము వద్దు వద్దు


మహోన్నతుడు దేవుడు

పరికింప స్వయంభవుడు

ఆశ్రయించిన వారికి

ఇల ఆపద్బాంధవుడు


దైవాన్ని నమ్మితే

మనశ్శాంతి ఖాయము

మనసారగ! వేడితే

ఉండును! అతిసమీపము


-గద్వాల సోమన్న


 
 
 

Comments


bottom of page