top of page

సువర్ణావకాశాలు


'Suvarnavakasalu' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

'సువర్ణావకాశాలు' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అంతులేని ప్రకృతి ప్రసాదించిన సముద్రతీర ప్రాంతం 'భీమిలిపట్నం '. ప్రజలు సెలవు దినాలలో, తండోపతండాలుగా వచ్చి సేదదీరుతారు. నురగలు కక్కే సముద్ర కెరటాలు, చల్లని గాలులు అందరి మనసులను ఆహ్లాద పరుస్తాయి.


భీమిలి బీచ్ ప్రాంతానికి కొద్ది దూరంలో, ఒక పురాతన శివాలయం ఉంది. దానికి 'రాఘవరావు గారు ' ప్రధాన పూజారి, 65 ఏళ్ల వయసులో కూడా ఎంతో నియమనిష్టలతో, నిత్యము శివ ధ్యానం చేస్తూ భక్తి పారవస్యంలో ఉంటారు. అక్కడకు వచ్చే భక్తులు కూడా ఈ శివాలయ దర్శనం ఎంతో పుణ్యము అని పదేపదే వస్తూ ఉంటారు.


ఆ శివాలయానికి రాఘవరావు గారి భార్య 'శారదమ్మ' నిత్యము మడి కట్టుకుని, శుచి శుభ్రం చేస్తూ, ఆలయ ప్రాంగణాలకు పసుపు కుంకుమలు బొట్లు పెడుతూ, భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. వారికి ఇద్దరు పిల్లలు. చక్కగా చదువుకొని వేరే ఊళ్ళల్లో ఉద్యోగ నిమిత్తమై వెళ్లిపోయాక, శారదా, రాఘవరావు గార్లకు ఆ శివాలయం ఆసరాగా ఉంది. భక్తులు ఇచ్చే దక్షిణలతో వారిద్దరూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిత్యం శివ నామస్మరణ చేస్తూ జీవితం గడపసాగారు.


'ఏమోయ్ శారద !! మన పిల్లలు మూడు నెలల నుండి డబ్బులు పంపించడం లేదు, బాగా చితికిపోయాము. ఊళ్లో అందరూ మీకేమిటండి? ఇద్దరు కొడుకులు డబ్బు పంపుతారు కదా! మీరు అదృష్టవంతులు" అని అంటూ ఉండడం పరిపాటి.


కానీ వారికేం తెలుసు, ఒక మాటు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు ఊడిగి మనం ఉన్నాము! మన ఈతి బాధలు ఆ శివయ్యకు తప్ప ఎవరికి తెలియదు. భక్తులు కూడా 'కార్తీక మాసంలో ' తప్ప ఎక్కువ మంది రావటం లేదు. అయినా నేను ఏదో ఆశతో తెల్లవారుజాము నుండి భక్తులకు అభిషేకానికి, అర్చనలకు, అన్ని సిద్ధం చేసుకుని కూర్చుంటాను. పట్టుమని పదిమంది వచ్చి పూజలు చేసుకోవడం లేదు. మనకు దక్షిణాల పళ్ళెంలో కనీసం చిల్లర పైసలు కూడా రావటం లేదు. ఇంట్లో చూస్తే కిరాణా సరుకు నిండుకుంది. భోజనానికి కూడా అవస్థ అవుతుంది. ఏమోలే ఆ శివయ్య పరీక్ష పెడుతున్నారు?” అని బాధగా భర్త అనేసరికి.


"నారు పోసిన వాడు, నీరు పోయాడా స్వామి, " అంటూ బదిలీస్తూ, మడిగా చేసి తీసుకువచ్చిన పులిహార గిన్నెను చేతికి అందిస్తూ, పూజారి గారి భార్య శారదమ్మ ఎంతో నమ్మకంతో ఆ మాట అంది.


పూజారి రాఘవయ్య గారు మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ. భక్తుల కోసం ఎదురు చూడ సాగారు, అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది, ఇక వర్షం కూడా రాబోతుంది, ఇవాళ కూడా భక్తులు రాకపోతే పస్తులతో మాడవలసిందే! అని అనుకుంటూ ఉండగానే,


ఒక్కసారిగా పెద్ద పెద్ద మెరుపులు: విపరీతమైన సముద్రపు గాలి వీస్తూ ఆ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుంది, ఆ చిన్న భీమిలి గ్రామం సముద్రానికి దగ్గరలో ఉండడం వలన, ఎప్పుడైనా తుఫాన్లు వచ్చిన ప్రభుత్వాధికారులు ముందుగానే హెచ్చరిస్తారు.


అలా సాయంత్రం గడుస్తుండే సమయానికి, వాతావరణ కేంద్రం ‘తుఫాను వచ్చేస్తుంది, మన తీరానికి తాకుతుంది, గ్రామ ప్రజలు అందరూ ఖాళీ చేయవలసింది’గా వస్తున్న వార్తలు విని ప్రజలు హడాలెత్తిపోయారు. మూట ముల్లె సర్దుకుంటూ పిల్లా పాపలతో, ముసలి ముతక, అనారోగ్యంగా ఉన్న వాళ్ళతో కూడా ఆ గ్రామం దాటి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.


"120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, సముద్రపు అలలు 'మూడు నుంచి నాలుగు మీటర్లు 'ఎత్తు వరకు ఎగిసిపడటం, ఆ శబ్దాలకు ప్రజలంతా ఇది 'మహాప్రళయం బ్రతికి ఉంటే బలసాకు తినవచ్చు!! అనుకుంటూ చరో పక్క గ్రామం వదిలి పారిపోవడానికి సన్నద్ధమవుతూన్న సమయంలో కనబడ్డ ప్రతి వాళ్ళనీ ఇంటిలో నుంచి తీసుకువచ్చి NDRF( ప్రకృతి వైపరీత్యాలకు లోనైన ప్రదేశాలకు వచ్చి ప్రజలను రక్షించే టీములు) ఎంతో కృషి చేస్తూ, గ్రామ ప్రజలకు తమ సాయం అందిస్తున్నారు.


ఈలోగా గ్రామ ప్రజలు ఆ పురాతన శివాలయం మీద నుంచి వెళుతూ, పూజారి రాఘవయ్య గారిని 'రండి బాబు! మన ఊరు మునిగిపోతుంది, మీరు తప్పించుకోవడం కష్టం” అంటూ పిలిచినా, స్వయంగా భార్య ప్రార్ధించినా రాఘవయ్య గారు ఒకటే మాట, “నేను రాను! నా శివయ్య నన్ను రక్షిస్తాడు!, నాచివరి ప్రాణం వరకు పోరాడుతాను, మీరు వెళ్లిపోండి!” అంటూ చెప్పేసరికి, అందరూ ఆశ్చర్యపోతూ, ‘పోనీలే పిచ్చి పూజారి, పదండి మనం పోదాం!’ అంటూ వెళ్లిపోయారు.


సముద్రపు నీరు అంచలంచెలుగా మట్టాలు పెరిగిపోయి, గ్రామంలోని ప్రతి వీధిని, వాడను ముంచేస్తున్నాయి, మోకాళ్ళ లోతు నీరు చేరిపోయి బ్రతుకు దుర్భరంగా చేస్తున్నాయి. అలా ఇళ్ళు మునిగిపోయి, చివరకు పురాతన శివాలయం కూడా సముద్రపు నీరు ముంచేస్తుంది. అప్పటికే ఎంతోమందిని కాపాడిన ndrf బృందం చిన్న చిన్న పడవలు తో కనపడిన వాళ్లని ఎక్కించుకుని, ఎత్తు ప్రదేశాలకు తీసుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఒక ఇద్దరు మనుషులు ఉన్న పడవ ఆ పురాతన శివాలయం దగ్గర ఆగి, పూజారి మోకాలు లోతు మునిగిపోతుండడం చూసి, " అయ్యా రండి !ఈ పడవ ఎక్కండి, మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి చేరుస్తాము, కాసేపటికల్లా ఈ గుడి కూడా మునిగిపోతుంది” అంటూ మైక్ లో అరుస్తున్న, ఆ మంకు పట్టు, మూడవిశ్వాసం ఉన్న పూజారి రాఘవయ్య గారు గట్టిగా అరుస్తూ, “నేను రాను, నాకేమీ కాదు, నా శివయ్య నన్ను రక్షిస్తాడు!! మీరు వెళ్లిపోండి” అంటూ అరిచేసరికి, ఇది ఎవడో పిచ్చివాడిలా ఉన్నాడు పదండి రా పోదాం! ఇంకా ఎవరినైనా వెతికి పట్టుకొని తీసుకువెళ్దాం, అనుకుంటూ ఆ పడవ కూడా వెళ్ళిపోయింది.


ఇక పూజారి రాఘవయ్య గారు శివనామం జపిస్తూ, “స్వామి నువ్వే నన్ను రక్షించు, ఎలాగో తిండికి లేక మాడి చూస్తున్నాం, నువ్వు తుఫాన్ రూపంలో వచ్చి నన్ను పరీక్షించకు, నా భక్తి నీకు తెలియదు, నేను దేనికి భయపడను, నువ్వు స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తావని తెలుసు, అందుకే ఇంత మంది అడిగినా వెళ్ళలేదు” అని గట్టిగా అంటుండగానే, సముద్రపు నీరు గుడి గోపురం పైకి వస్తున్నది. అయినా ఆ పూజారి ఆ గోపురం ఎక్కి చూసేసరికి, అక్కడ తన గ్రామం లేదు, ఏమీ లేదు. అక్కడక్కడ చిన్నచిన్న పడవలు తిరుగుతున్నాయి.


"ఓహో శివయ్య! క్షణాలలో జీవితాలను మార్చే శక్తి నీకు ఉందయ్యా, గొడ్డు గోదాములు, పాడి పశువులు, నువ్వే పుట్టించిన మనుషులు ఒక్కరోజులో మాయమైపోయారు, అయ్యా!, నీ లీల అపారం, ! అంటూ గట్టిగా అరుస్తుండే సమయానికి..


ఇక చివరగా ఎవరైనా మిగిలినారని 'ప్రభుత్వ హెలికాప్టర్లు 'చక్కర్లు కొడుతూ, గుడి గోపురం మీద ఉన్న పూజారిని చూసి అక్కడికి చేరి, తాళ్లు విసిరి పైకి రమ్మన్నారు, అయినా పూజారి రాఘవయ్య గారు, 'నన్ను శివయ్యే కాపాడుతాడు, ! నేను రాను మీరు వెళ్ళండి! ' అంటూ వచ్చిన చివర అవకాశాన్ని కూడా వదిలేశాడు.


ఆ గుడి గోపురం కూడా సముద్ర జలాలలో కలిసిపోయింది. ' శివ, శివ 'అనుకుంటూ ఆ పూజారి గారు సముద్ర జలాలలో ఊపిరి ఆడక పరమపదించారు.


పూజారి రాఘవయ్య గారు మరణించి స్వర్గంలో ఉండగా, “నన్ను నువ్వు ఎందుకు కాపాడలేదు శివయ్య” అంటూ, కైలాసం వెళ్లి శివుడిని ప్రశ్నించేసరికి, పరమశివుడు నవ్వుతూ, "చూడు పూజారి!, నేను ఎందుకు నిన్ను కాపాడలేదు, నువ్వు ఎందుకు అంత మూఢవిశ్వాసంతో ఉన్నావు? కాపాడబడడానికి ఎన్నో అవకాశాలు నేనే ఇచ్చాను. వాటిని కూడా త్యజించి, నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకున్నావు, అని పరమశివుడు అనగానే

"అయ్యో శివ, ! నాకు నువ్వు అవకాశాలు ఇచ్చావా?, నిత్యం నేను, నా భార్య నిన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, నీ వల్ల కలిగే దివ్య ఆశీస్సులను ప్రజలకు అందజేస్తూ, వారి సౌభాగ్యాలను తీర్చిదిద్దుతున్న మమ్మల్ని, నువ్వు ఎందుకు రక్షించలేకపోయావు?” అంటూ ఎదురు ప్రశ్న వేసేసరికి, పరమశివుడు నవ్వుతూ, “ఓ పూజారి!, మొదటిది మీ ఊర్లో తుఫాను వచ్చి సముద్రపు నీరు పొంగిపొర్లుతున్నప్పుడు మీ గ్రామ ప్రజలు మీ భార్య నిన్ను ఎంతో వేడుకున్నారు, తమతో పాటు బయటికి వచ్చేయమని. కానీ నువ్వు రాలేదు.


రెండవ అవకాశం, ప్రభుత్వ సహాయకులు నీ గుడి మునిగిపోతూ ఉంటే, పడవ మీద వచ్చి కాపాడతామని చెప్పిన నువ్వు వెళ్లలేదు.


మూడవ అవకాశం, నువ్వు గుడి గోపురం మీద దిక్కు లేక నన్నే ధ్యానిస్తూ ఆకాశంలో ఎగిరే పక్షి (హెలికాప్టర్) లాగా వచ్చి నిన్ను పైకి రమ్మని పిలిచినా కూడా నువ్వు రాలేదు. ఇక నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన వృధానే కదా! కాబట్టి నీ వలన ఇతరులు తెలుసుకోవలసిన విషయం ఏమంటే,


"దేవుడనేవాడు, ప్రతి ఒక్కరికి ఎన్నో మంచి అవకాశాలు ఇస్తాడు. సమయానుకూలంగా, భయం వదిలి, ఆ అవకాశాల్ని సద్వినియోగపరుచుకున్న వాడే, ఈ భూమి మీద అత్యధిక విజయాలు సాధిస్తాడు. సువర్ణావకాశాలు ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తాయి. అది 'బ్రహ్మరాత

మూఢవిశ్వాసాలతో, అపనమ్మకాలతో, పరులు మీద అనుమానాలతో, మంచిని, ధర్మాన్ని మరిచిపోయి, బ్రతుకు సాగించడం దుర్లభం. వారు నరకానికి పోయి, అష్ట కష్టాలు పడతారు. కానీ నీ విషయంలో దేవుడే వచ్చి నన్ను కాపాడుతాడు, నేను ఎవరి సహాయం తీసుకోను, అనుకుంటే, ఆ దేవుడు కూడా ఇన్ని "లక్షల కోట్లు జీవరాశిని " కాపాడుతూ, అనుక్షణం భూమిని, ప్రకృతిని సమతుల్యం చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు! నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేయడం వలన, సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఆనందంగా స్వర్గంలోనే ఉండు, మరొక జన్మ పొందినప్పుడు, సర్వ మానవ కళ్యాణం కోసం కృషి చేయి" అని దీవిస్తూ పరమశివుడు అంతర్ధానమైనాడు.


పూజారికి జ్ఞానోదయం కలిగి తన మరుజన్మలో ఉత్తమ మానవుడిగా జన్మించి, శివయ్య చెప్పిన విధంగా మహా మనిషిగా లోక కళ్యాణం కోసం పాటుపడ్డాడు, పూజారి రాఘవయ్య గారు.


***


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.





Comments


bottom of page