#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThaginanthaKshemamu, #తగినంతక్షేమము
Thaginantha Kshemamu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 10/11/2024
తగినంత క్షేమము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
అతివృష్టి నష్టమే
అనావృష్టి నష్టమే
ఎప్పుడూ సమతుల్యము
ఎంతైనా క్షేమము
కడుపులే కాలినా
మెండుగా నిండినా
ఎటుచూసినా బాధ
జీర్ణం కాకున్నా
ధనము ఎక్కువైనా
కాస్త తక్కువైనా
దానితో ప్రమాదము
ఉండదోయ్! ప్రమోదము
తగినంత ఉన్న చాలు
సుఖమయం జీవితాలు
లేకున్న కుటుంబాలు
అగును అతలాకుతలము
-గద్వాల సోమన్న
Komentarji