top of page

తక్షణ కర్తవ్యం!

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TakshanaKarthavyam, #తక్షణకర్తవ్యం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 19

Takshana Karthavyam - Somanna Gari Kavithalu Part 19 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/02/2025

తక్షణ కర్తవ్యం - సోమన్న గారి కవితలు పార్ట్ 19 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తక్షణ కర్తవ్యం!


మాతృభాష శ్వాసగా

సదా అదే ధ్యాసగా

ఉండాలి! తెలుగోడా!

తెలుగు తల్లి పుత్రుడా!


తెలుగు వృద్ధి ధ్యేయంగా

దాని కీర్తి ప్రాణంగా

బ్రతకాలోయ్! ఓ రేడా!

చాటాలోయ్! వాడవాడా!


దేశభాషలందు ఘనము

తెలుగు భాష నిజము!నిజము!

చూడు చూడు రాయల నాటి

ఘన గత తెలుగు వైభవము


మాతృభాష పరిరక్షణ

మన బాధ్యత కావాలోయ్!

ఇక పూనుకో! తక్షణ

కర్తవ్యమిక నీదేనోయ్!


















ఉండాలి మనమంతా!

----------------------------------------

మల్లెపూవు తోటలా

మరుపురాని పాటలా

ఉండాలి మనమంతా!

బలమైన కోటలా


మధురమైన ఊటలా

అపరంజి మూటలా

ఉండాలి మనమంతా!

ప్రేమలొలుకు మాటలా


రవళించే మువ్వలా

పరిమళించు పువ్వులా

ఉండాలి మనమంతా!

కాంతులీను దివ్వెలా


విహరించే గువ్వలా

బొజ్జనింపు బువ్వలా

ఉండాలి మనమంతా!

సొగసులీను నవ్వులా


పంటనిచ్చు పొలంలా

పొలం దున్ను హలంలా

ఉండాలి మనమంతా!

కవీంద్రుల కలంలా


పలికేటి వీణలా

మేలు చేయు వానలా

ఉండాలి మనమంతా!

ఉపకరించు కోనలా

















అంతేగా! అంతేగా!!

----------------------------------------

ప్రతి పూట హాయిగా

ప్రతి చోట స్ఫూర్తిగా

బ్రతకాలోయ్! గొప్పగా

ఉండాలి మెప్పుగా


కొండంత అండగా

ప్రేమించు గుండెగా

ఉండాలోయ్! మహిలో

మంచి చేయు ఎండగా


ఆదర్శమూర్తిగా

అందరికి స్ఫూర్తిగా

నిలవాలోయ్! మదిలో

చెరిగిపోని కీర్తిగా


సత్యానికి సాక్షిగా

బుద్ధిలో మేటిగా

మసలాలోయ్! భక్తిగా

మారాలోయ్! శక్తిగా



















మేము చిన్న పిల్లలం

----------------------------------------

లేలేత కొమ్మలం

మాట్లాడే బొమ్మలం

చిన్నారి పిల్లలం

సన్నజాజి మొగ్గలం


విహరించే ఖగములం

చిగురించే తరువులం

ప్రకాశించు భానులం

వికసించే పూవులం


కొమ్మ మీద గువ్వలం

అమ్మ ఒడిని పిల్లలం

రమళించే మువ్వలం

సెలయేరుల తరగలం


సదనంలో వెలుగులం

వదనంలో నగవులం

భారతి ప్రియ పుత్రులం

గగనంలో తారలం


బడికెళ్లే బాలలం

గుడిలోని ఇలవేల్పులం

వడి వడిగా వృద్ధినొందు

మడిలోని చిరు మొలకలం


మేము చిన్న పిల్లలం

అందమైన పల్లెలం

తొలకరి చిరు జల్లులం

నింగిని హరివిల్లులం
















అమ్మ అమృత వాక్కులు

----------------------------------------

వెన్నెలమ్మ చల్లదనము

సన్నజాజి మెత్తదనము

మిన్నగా ఇల చాటలోయ్!

కన్నవారి గొప్పతనము


మల్లెపూవు తెల్లదనము

పల్లెసీమ పచ్చదనము

ఎల్లరికీ ఇష్టమోయి!

పిల్లల చిరు దరహాసము


వెన్నముద్ద నవనీతము

ఉన్న ఊరు ప్రాణ సమము

ఎన్ని ఉన్నా బ్రతుకులో

అన్ని సున్న లేక దైవము


గొప్ప వారి సహవాసము

అప్పులు లేని జీవితము

ఎప్పటికైనా క్షేమము

మెప్పు ఉండును ఖచ్చితము


తుచ్ఛమైన వాటి కొరకు

తచ్చాడ కూడదు తుదకు

మచ్చ లేని మానవులు

అచ్చంగా మహనీయులు



















బాలుని అభిలాష

---------------------------------------

పూవులోని తావినై

వెన్నెల్లో వెలుగునై

అందరికి సాయపడతా!

అమ్మలోని ప్రేమనై


పారిజాత పూవునై

నెలరాజు నగవునై

అందాలే రువ్వుతా,!

కొలనులోని కలువనై


మాలలోని దారమై

పాలలోని బలమునై

అభాగ్యులకు తోడవుతా!

ఆపద్బాంధవుడనై


మహాత్ముల మాటనై

జగతి ప్రగతి బాటనై

ఆదర్శం చూపుతా!

అనురాగాల తోటనై


జీవజలపు ఊటనై

మమకారాల కోటనై

ఆనందమందిస్తా!

మనసు దోచే పాటనై


సత్యానికి సాక్షినై

న్యాయానికి నేతనై

సహకరమందిస్తా!

ధర్మానికి కర్తనై















పెద్దయ్య మేలి పలుకులు

---------------------------------------

కలలోని కోరికలు

ఇలలోన పండాలి

గుండెల్లో ప్రేమలు

పండుగై జరగాలి


చిన్ననాటి బంధము

సన్నజాజి కావాలి

కన్నవారికి పేరు

మిన్నగా తేవాలి


ఎన్ని బాధలొచ్చిన

అన్నింటిని తరమాలి

పిన్న వయసు వారికి

కొన్ని శుభుమలివ్వాలి


గొప్ప మనసును కలిగి

మెప్పుగా బ్రతకాలి

తిప్పలెన్ని యున్నా

తప్పక జయించాలి















చిన్నారి పిల్లలు

---------------------------------------

అపురూప శిల్పాలు

అందాల కుసుమాలు

ముద్దులొలుకు బాలలు

ఉదయ కాల భానులు


పసి పిల్లల పలుకులు

జుంటితేనె ధారలు

నవ వీణ నాదాలు

సప్త స్వర రాగాలు


లేలేత హృదయాలు

నెలవంక వదనాలు

చిన్నారి పిల్లలే!

తిలకింప మల్లెలే!


పెంచాలి ప్రేమగా

ఎంచాలి గొప్పగా

ఈనాటి బాలలే !

రేపటి ఘన పౌరులే!











శ్రమైక్య జీవన సౌందర్యమే మేలు

---------------------------------------

మేలు కాదు పగటి కలలు

ఎగసిపడే వట్టి అలలు

కార్యరూపమే దాల్చవు

గుండె ఆశ నెరవేర్చవు


వద్దు వద్దు బద్దకము

ఉండదోయి! ఫాయిదా

ముద్దు ముద్దు చురుకుదనము

దానికుందోయి ప్రతిఫలము


సోమరిపోతుల ఆశలు

ఎన్నడూ! నెరవేరవు

వదరుబోతుల మాటలు

స్థిరంగా ఉండనేరవు


గొప్పదోయి శ్రమదానము

అందు ఉంది బహుమానము

శ్రమైక్య సౌందర్యమే

ఇచ్చును మేలి జీవితము
















ఉంది! ఉంది!!

---------------------------------------

ఎండలోన మేలు ఉంది

గుండెలోన ప్రేమ ఉంది

పండు వెన్నెల్లాంటి

పిల్లల్లో సొగసు ఉంది


పొలంలోన పైరు ఉంది

కలంలోన సిరా ఉంది

గళంలోన తీపి ఉంది

జలంలోన బలం ఉంది


గాలిలోన ప్రాణముంది

తరువులోన త్యాగముంది

యోచింపగ సృష్టిలోన

మహత్తర శక్తి ఉంది


పువ్వుల్లో అందముంది

నవ్వుల్లో వెలుగు ఉంది

విహరించే పక్షిలోన

అంతులేని స్వేచ్ఛ ఉంది


అందెల్లో నాదముంది

అంకెల్లో గణితముంది

అమ్మ చేతి వంటలో

అనురాగము దాగి ఉంది


-గద్వాల సోమన్న


17 views0 comments

Comments


bottom of page