top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

తస్మాత్ జాగ్రత్త!

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TasmathJagrattha, #తస్మాత్జాగ్రత్త, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Tasmath Jagrattha - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 30/11/2024

తస్మాత్ జాగ్రత్త - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శంకరం పేరుపొందిన బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. అతిజాగ్రత్త పరుడు. యింట్లో కూడా పిల్లల చదువుల విషయం లో కూడా అంతే జాగ్రత్తగా వుండేవాడు. బ్యాంకులో తనకు క్యాటాయించిన గదిలో కూర్చోకుండా బ్యాంకు స్టాఫ్ కూర్చొని పనిచేసే హాలు లో మధ్యలో కుర్చీ వేసుకుని బ్యాంకుకు పనిమీద వచ్చే కస్టమర్స్ కి స్టాఫ్ ద్వారా ఎటువంటి కష్టం కలగకుండా గమనిస్తోవుండే వాడు.


బ్యాంకు లో ఎవరైనా వ్యక్తి ఎక్కువ సేపు తచ్చాడుతున్న వెంటనే అతను ఎవ్వరు, ఎందుకు బ్యాంకు లో అంతసేపు వున్నాడు అడిగి తెలుసుకునేవాడు.


మేనేజర్ గారు యిలా తమ మధ్యలో కూర్చొని ఉండటం చాలా చిరాకుగా ఉండేది ఉద్యోగస్తులకి. కొంతమంది ఉద్యోగస్తులు బ్యాంకు కి వచ్చే కస్టమర్స్ కి తాము వూరికే సేవ చేస్తున్నట్టుగా మొహం మాడుచుకుని విసుగ్గా ఉండటం అలవాటు. యిది మేనేజర్ గమనించి అటువంటి వారికి కస్టమర్స్ తో సంబంధం లేని పని యిచ్చేవాడు. 


శంకరం తనకున్న అధికారం తో ప్రతీ కౌంటర్ దగ్గర రెండు బాల్ పాయింట్ పెన్నులు పెట్టించాడు. అలాగే రోజు ఒక క్లర్క్ ని రాయడం రాని వారికి ఫామ్స్ రాసి యివ్వడానికి వుంచాడు.


బ్యాంకు లో వాటర్ కూలర్ ఏర్పాటు చేసి కస్టమర్స్ కి దాహర్తి తీర్చాడు. యిన్ని మార్పులు బ్యాంకులో జరగటంతో గొడవ లేకుండా జరిగిపోతోంది. అయితే స్టాఫ్ కి మాత్రం కస్టమర్స్ ని ఏడిపించే అవకాశం రావడలేదు ఈ మేనేజర్ వలన అని ఒకటే బాధ పడిపోతున్నారు. శంకరం ఈ విషయం గ్రహించినా, తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు.


ఆ రోజు సోమవారం, బ్యాంకు కిటకిటలాడుతోంది. శంకరం స్టాఫ్ పనులలో సహకరిస్తో ఏ గొడవ రాకుండా చూస్తున్నాడు. అప్పుడు ఒక ముసలతను గుండెలు బాదుకుంటో బ్యాంకు లోపలికి వచ్చి మేనేజర్ రూమ్ లోకి చూసి కోపంతో, “ఎక్కడికి పోయాడు మేనేజర్” అంటూ అరవడం మొదలుపెట్టాడు.


“ఆగవయ్యా ఎందుకు అరుస్తావు, అదిగో ఆయనే మా మేనేజర్ గారు” అంది క్లర్క్.


ఉద్యోగస్తులు మధ్యలో కూర్చుని వారితో సమంగా పనిచేస్తున్న మేనేజర్ ని చూసి, ఆశ్చర్య పోయి, అరుపులు తగ్గించి మేనేజర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. శంకరం ఆ పెద్దాయనని చూసి, కుర్చీలో కూర్చోమని చెప్పి, అటెండర్ తో మంచినీళ్లు తెప్పించి యిచ్చి, “ముందు మంచినీళ్లు తాగండి. కంగారు పడకుండా మీకు ఏమి కావాలో, మీకు మావల్ల జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి” అన్నాడు. 


పదిసార్లు అడిగితే ఒక్కసారి మాట్లాడే స్టాఫ్ ని చూసిన ఆయనకి మేనేజర్ గారు యింత ఆప్యాయంగా అడగటం ఆనందం కలిగింది.


మెల్లగా కూర్చొని “అయ్యా! మధ్యాహన్నo అన్నం తిని పడుకున్నాను. కలత నిద్రలో వుండగా ఫోన్ వచ్చింది మీ బ్యాంకు నుంచి. డిపాజిట్ మీద ఇంటరెస్ట్ రేట్స్ ఒక సంవత్సరం కి టెన్ పెర్సెంట్ చేసింది బ్యాంకు అని, మీరు మా బ్యాంకు కు ముఖ్య కస్టమర్ కనుక మీకు ఒక సలహా ఏమిటి అంటే మీ డిపాజిట్ ని కాన్సల్ చేసుకుని మళ్ళీ ఒక ఏడాది కి చేసుకుంటే పది పెర్సెంట్ ఇంటరెస్ట్ అంటే ఫోర్ పెర్సెంట్ ఎక్కువగా తీసుకోవచ్చు అన్నారు.


మాట కూడా తెలిసిన వాళ్ళు లా అనిపించింది. సరే అన్నాను. నా పాన్ నెంబర్ అడిగి, ‘మీకు యిప్పుడు ఓటీపీ వస్తుంది. రాగానే చెప్పండి’ అన్నారు. 


ఒక పావు గంటకు నా ఫోన్ కి వచ్చిన ఓటీపీ వాళ్ళకి చెప్పాను. 


ఫోన్ మాట్లాడిన అమ్మాయి, ‘మీ పాత డిపాజిట్ రద్దు అయ్యింది. డబ్బులు మీ అకౌంట్ కి వేసాము. యిప్పుడు ఈ లింక్ ఓపెన్ చేసి ఆ డబ్బును కొత్త ఇంటరెస్ట్ తో డిపాజిట్ చెయ్యటానికి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది. అది చెప్పండి, అంతే. ఈ రోజు నుంచి పది పెర్సెంట్ ఇంటరెస్ట్ తో మీ డబ్బులు డిపాజిట్ అవుతాయి’ అంది.


అన్నీ ఆవిడ చెప్పినట్టు చేశాను. చివరిలో ఆవిడ కంగ్రాట్స్ చెప్పి, ‘మీకు యింకో అవకాశం, ఈ స్కీం లో చేరినందుకు ఒక నెల హాస్పిటల్ ఖర్చులు ఉచితం’ అని పెట్టేసింది. 


కాఫీ తాగుతో మెసేజ్ లు చూస్తో వుండగా బ్యాంకు నుంచి మీరు కోరినట్టుగా మీ డబ్బులు ఈ అకౌంట్ కు బదిలీ చేయబడినవి. ఒక వేళ మీరు అడగకపోతే అయిదు నిమిషాలలో బ్యాంకు ని సంప్రదించండి అని మెసేజ్ వచ్చింది. నా అకౌంట్ నుంచి నా పేరున డిపాజిట్ కాకుండా యింకో అకౌంట్ కి బదిలి అవ్వడం ఏమిటి అన్న అనుమానం తో గంట క్రితం ఫోన్ చేసిన అమ్మాయి కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ మీద ఎటువంటి కనెక్షన్ పని చెయ్యడం లేదు అని వచ్చింది.


నా కంగారు చూసి ‘బ్యాంకు కు వెళ్ళి అడగండి. ఈ రోజులలో మోసాలు జరుగుతున్నాయి’ అనడం తో వచ్చాను” అన్నాడు పెద్దాయన.


“మా బ్యాంకు నుంచి యిటువంటి ఫోన్ లు రావు. మీకు ఎక్కువ ఇంటరెస్ట్ యివ్వాలని మీకు ఫోన్ చేసే ఓపిక, అవసరం మాకు లేదు” అన్నాడు శంకరం. “మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఏమైందో చూసి చెప్తాను” అన్నాడు. 


అకౌంట్ నెంబర్ యివ్వడానికి సంశయిస్తున్న ఆ పెద్దాయన తో “అసలు వాళ్ళు అడిగితే ఇవ్వటానికి ఆలోచిస్తారు, దొంగలకు అన్నీ డీటెయిల్స్ యిస్తారు” అంటూ పాసుబుక్ తీసుకుని, అకౌంట్ నెంబర్ వెరిఫై చెయ్యగా యిరవై లక్షల డిపాజిట్ క్లోజ్ అవ్వడం, ఆ డబ్బులు వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. 


“కొంప ములిగింది, మిమ్మల్ని ఎవ్వరో మోసం చేసారు” అని ఆ పెద్దాయన కి చెప్పి, ఆ అకౌంట్ నెంబర్ ఎవ్వరిదో ఎంక్వయిరీ చేస్తే బీహార్ లో వున్న బ్యాంకు అకౌంట్ అది. అందులోకి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు విత్డ్రా చేసుకున్నారు అని అక్కడ మేనేజర్ జవాబు యివ్వడం తో, శంకరం బలంగా నిట్టూర్చి, “అయ్యా మీరు మోస పోయారు. మీ డబ్బులు గుర్తు తెలియని వ్వక్తి చేతిలోకి వెళ్లిపోయాయి. మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము కూడా పోలీస్ కంప్లైంట్ యిస్తాము” అన్నాడు.


దాంతో ఆ పెద్ద మనిషి మళ్ళీ పెద్దగా అరుస్తో “మీ బ్యాంకు వాళ్లే చేసారు ఫోన్. మీరే బాధ్యత వహించాలి” అని గొడవ మొదలుపెట్టాడు. 


“అసలు మీతో మాట్లాడిన వారి నెంబర్ ఇక్కడిది కాదు వేరే స్టేట్ ది. మీరు అరిచి లాభం లేదు. పోలీస్ కి ఫోన్ చేసాను. వాళ్ళు వచ్చిన తరువాత వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి” అన్నాడు శంకరం.


“అయితే యిప్పుడు నేను ఏం చెయ్యాలి, నా డబ్బులు నాకు వచ్చేడట్లు చెయ్యండి” అని శంకరం చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు. 


“మీలాంటి వయసు మళ్ళిన వాళ్ళని ఎన్నుకుని మోసం చేస్తున్నారు. అందుకే మేము ప్రతిసారి ఎవ్వరికీ మీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, యివ్వకండి అని మెసేజ్ పెట్టి మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నాము. యిప్పుడు పోలీసులు ఈ మొత్తం వ్యవహారం దర్యాప్తు చేసి మీ అదృష్టం బాగుంటే దొంగలని పట్టుకుని ఎంతో కొంత డబ్బులు దొరికేడట్లు చేస్తారు” అని బ్యాంకు లో వున్న కస్టమర్స్ ని హేచ్చిరించాడు, “తస్మాత్ జాగ్రత్త, మీ వివరాలు సేకరించి కొన్ని ముఠాలు మీ డబ్బులు తస్కరించు తున్నారు. మా బ్యాంకు ఎవ్వరికి ఎటువంటి ఫోన్ గాని, మీ వివరాలు యివ్వమని గాని అడగదు. మీకు ఎవ్వరికైనా అటువంటి మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంకు మేనేజర్ గారికి ఫోన్ చెయ్యండి” అన్నాడు.


పోలీసులు రావడం తో బ్యాంకు మేనేజర్ శంకరం జరిగిన విషయం అంతా చెప్పి, పెద్దాయన ఫోన్ కి వచ్చిన ఫోన్ నంబర్స్, మెసేజెస్ అన్నీ కాపీలు యిచ్చి పెద్దాయన తోను, బ్యాంకు తరుపున కూడా కంప్లైంట్ యిచ్చాడు.


తస్మాత్ జాగ్రత్త! రేపు మనల్ని కూడా మోసం చేసే వాళ్ళు రావచ్చు. ఎవ్వరికి మీ అకౌంట్ నంబర్స్, పాస్వర్డ్, పాన్ నెంబర్ యివ్వకండి. బ్యాంకులు మీ కోసం పనిచేస్తున్నాయి. ఎవ్వరైనా బ్యాంకు నుంచి అని వివరాలు అడిగితే ఇవ్వకుండా మీ బ్యాంకుని సంప్రదించండి. ఆన్లైన్ మోసం గుర్తించి జాగ్రత్తగా వుండండి.


 జాగ్రత్త 


శుభం 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













54 views0 comments

Comments


bottom of page