#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TeeyaniDrakshaTinalaniKanksha, #తీయనిద్రాక్షతినాలనికాంక్ష, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 20
Teeyani Draksha Tinalani Kanksha - Somanna Gari Kavithalu Part 20 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/02/2025
తీయని ద్రాక్ష--తినాలని కాంక్ష - సోమన్న గారి కవితలు పార్ట్ 20 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
తీయని ద్రాక్ష--తినాలని కాంక్ష
అందమైనది ద్రాక్ష
అందరికిష్టము ద్రాక్ష
తీయ తీయని ద్రాక్ష
నోరూరించే ద్రాక్ష
గుత్తులు గుత్తులుగా
దర్శనమిచ్చే ద్రాక్ష
అందచందాలతో కడు
కనువిందు చేసే ద్రాక్ష
'అందని ద్రాక్ష పుల్లనని'
సామెతకు పనికి వచ్చే
భువిని అందరు మెచ్చే
ఆరోగ్యమిచ్చే ద్రాక్ష
వంటకాల్లో వినియోగము
ద్రాక్ష రసము మాధుర్యము
ద్రాక్ష తోట పెంపకము
అద్భుతమైన ఒక కళ

చిన్నారి పంతులమ్మ పలుకులు
----------------------------------------
ఆకాశమే హద్దుగా
చదవాలోయ్! శ్రద్ధగా
అమూల్యమైన సమయాన్ని
వాడరాదోయ్! వ్యర్ధంగా
విజయాలే లక్ష్యంగా
సుగుణాలే పుష్కలంగా
నిన్ను నీవు మలచుకో!
సమాజాన ఉన్నతంగా
పేదోళ్లకు అండగా
వారిలోని గుండెగా
ఉండాలోయ్!ఆపదలో
భరోసానిచ్చు కొండగా
కన్నవారిని ప్రేమగా
ఉన్న ఊరిని ఘనంగా
తలవాలయ్! జీవితాన
పదే అదే ధ్యాసగా

బాలలు ద్రాక్ష తీగలు
----------------------------------------
ద్రాక్ష తీగలు బాలలు
దాని గుత్తుల సొగసులు
పచ్చ పచ్చని ఆకులు
తీయతీయని ఫలములు
ద్రాక్ష తోటలు అందము
పిల్లల పలుకుల వోలె
దాని రసమే మధురము
రోగాలకు ఔషధము
రాగి, ఇనుము, మాంగనీస్
వంటి సూక్ష్మ పోషకాలు
ద్రాక్షలో కోకొల్లలు
ఎముకల పుష్టికి మేలు
కేన్సర్ వంటి వ్యాధులు
అరికట్టునోయ్! ద్రాక్షలు
తరుచుగా తింటే చాలు
చాలా ఉపయోగాలు
రక్తప్రసరణ మెరుగుపడును
మల బద్ధకం తగ్గును
విటమిన్ సి,కె లూ ఎక్కువ
ఎండితే "కిస్మిస్"లగును
ఎండిన కూడా లాభము
వాడెదరు వంటల్లో
ద్రాక్ష వలన క్షేమము
అందరికీ బహు ఇష్టము

చిన్నారులు ధృవ తారలు
----------------------------------------
ఎదిగే చిన్నారులు
వెలిగే ధృవ తారలు
భువిని ఘనులు వారే!
సాటి ఎవరు లేరే!
గుణంలో శ్రీమంతులు
చెలిమిలో క్రొవ్వొత్తులు
చిరునవ్వుల పిల్లలు
మరుమల్లెల సొగసులు
తేనెలాంటి పలుకులు
వెన్నలాంటి మనసులు
పున్నమి వెన్నెల్లా
సదనంలో వెలుగులు
సెలయేరుల గలగలలు
మెరుపు తీగ తళతళలు
పసి పిల్లలు మహిలో
ఘటికులే మాటల్లో
స్నేహానికి సాక్షులు
స్వేచ్ఛ ఉన్న ఖగములు
అమూల్యమైన రతనాలు
ఉపకరించు విత్తనాలు
సత్యానికి చిహ్నాలు
చక్కనైన ముత్యాలు
దేశానికి బాలలే!
అభివృద్ధికి బాటలే!

చిన్నోడమ్మా !
----------------------------------------
చిన్నోడమ్మా ! చిన్నోడు
ద్రాక్ష తోటకు వెళ్ళాడు
తోటంతా తిరిగాడు
చెట్టు క్రింద కు చేరాడు
ద్రాక్ష గుత్తులు చూశాడు
సంబరమెంతో పడ్డాడు
దాని దగ్గరకు చేరుకుని
అందుకొన యత్నించాడు
చేయివేసి కోశాడు
జేబు నిండా నింపాడు
కడుపు నిండా తిన్నాడు
ఇంటికి తీసుకెళ్లాడు
చెల్లికి కొన్ని ఇచ్చాడు
మిగిలిన వన్ని పంచాడు
నాన్న మెచ్చుకున్నాడు
ముద్దులతో ముంచాడు
-గద్వాల సోమన్న
Kommentare