top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

తెలుగు తాలిష శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #తెలుగుతాలిషశతకము, #TeluguTalishaSathakamu, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Telugu Talisha Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 10/11/2024

తెలుగు తాలిష శతకము -  తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


1.) పూర్వము నుండియు తెలుగుయె

పూర్వపు భాషన మనదగు పూర్తిగ గనగన్

నేర్వగ నెంతయొ సులభము

పూర్వపు పురుషుని సతిదయ పూర్తిగ నుండన్.


2.) తెలుగన తెలుగగు పాళెము

వెలుగులు జిందెడి విశదము వెలగల భాషే

తెలుగుకు సాటియు గనమిక

ఇలలో దెలియగ ఇదెయగు ఇంపగు భాషే


3.) వంపుల సొంపుల సొగసరి

కెంపుల మోవిన మధురము కెలయుట కన్నన్

సొంపగు తెలుగగు భాషయె

ఇంపగు వ్రాయను పలుకను ఇలలో గనగన్


4.) మనిషన మరువని మూడన 

మనదగు ఊరును జననియు మరియును భాషన్

మనదగు తెలుగును మరువక

మనుగడ సాగగ సుఖమగు మనుసుల క గన్.


5.) తెలుగుకు చీడలు బట్టన్

తెలుగుకు తేజము కరువయె తెలుపగ నింకన్

తెలుగన చులకన భావము

తెలుగగు మనుషులె దెలుపుట తెలివన రెవరున్.


6.) చెరకుయు తేనియ చక్కెర

కరకము గుమ్మడి కిసిమిసి కన్నను ఇంకన్

పెరటిన అరటియు వరఫల

సురసము మించిన తెలుగగు సురభిలొ జూడన్


7.) భావము సరియగు భద్రత

చేవయు  గలిగిన పలుకన చెప్పగ తెలుగే

తావియు పూలకు వలెనన

మావిఫల రసపు మధురము మనదగు తెలుగే


8.) ధవళాంగి వరము తెలుగగు

కవనము కావ్యము కథలును కానగ నుండన్

అవనిలొ తెలగాణ మున

శ్రవమును బెంచెడి తెలుగుయె శ్రద్ధతొ నేర్వన్


9.) అమ్మను మరువకు ఎపుడును

అమ్మకు తోడుగ నిలిచిన అమ్మగు భాషే

కమ్మని తెలుగును మరువకు

సమ్మత మనరును ఎవరును  సహురిన కనగన్.


10.) పుడమిన భాషలు గడితము

ఇడుములు పడకను తెలుగును ఇంపుగ నేర్వన్

సడలును భారము జదువున

నడతయు మారును నరులలొ నాణ్యత నొందన్


11.) మనదగు భాషన తెలుగగు

కనగను తెలుగుకు ఉపమితి కర్వరి యందున్

గనమిక వెదకిన సరియగు

మినుకుల గొమ్మయె నొసగిన మిత్తగు భాషల్

12.) తెలుగను మూడక్ష రములె

వెలుగులు జిందును పుడమిన వెతలును బోవన్

తెలుగన తేటిలు యొసగిన

విలువగు మధురము సమముగ వీకన గనమున్


13.) భాగవ తమనగ వ్రాసెను

బాగుగ పోతన తెలుగులొ భాగ్యము గలుగన్

త్యాగము ధర్మము త్రాణము

యోగము లెరిగెడి విధమున ఉర్విన జూడన్


14.) తెలుగున ప్రక్రియ లెన్నియొ

తెలుపగ అధికము కనగను తేజము గనగన్

తెలుగులొ పాటలు కవితలు

తెలుగులొ పద్దెము వచనము తెలుపగ నెన్నో


15.) భాషయె సంగీత మనుచు

భాషగు తెలుగును అభినుతి బాగుగ జేసెన్

భాషను జూసిన టాగురు

దేశము నందున ఘనతన తెలుగే యనుచున్


16.) ద్రవిడపు భాషల నుండియె

భవనము తెలుగని పలువురు బాగుగ సెప్పన్

వివరము దెలియగ తెలుగు

శ్రవమగు భాషయె మనదన శ్రద్ధతొ వినగన్


17.) మిక్కిలి మధురము తెలుగన

ఎక్కడ కనగను దొరకదు ఎరుగగ నుండన్

చక్కటి భాషన తెలుగగు

మక్కువ గొల్పగ మనకది మన్నిక భాషే.

18.) అయిదగు వేయిల వర్షము 

మెయినను నిలిచెను తెలుగన మెరయుచు గానన్

జయమగు భాషన జనమున

నయముగ నలుగురు జదువను నవనీత ముగన్ 


19.) కనకపు సొమ్ములు ఎన్నియొ 

కననగు ఎంతయొ సొగసుగ కర్వరి యందున్

కనకము మాదిరి తెలుగుయు

కనగను తళుకులు అధికము కలుగుచు నుండన్ 


20.) తెలియగ మనభాష తెలుగు

తెలుగను నాడున వెలుగుల తేజము నిలువన్

ఇలలో ఎక్కడ లేనగు

తెలుగుయె మనదగు ముదముతొ తెలుపగ నుండన్


21.) ఏబది ఆరుగ అక్షర

మేబడి జదివిన తెలుగుయు మేలగు భాషే

గాబర యెరుగని భాషయె

ఏబరు వెరుగక అలవడు ఎరుగగ నుండన్.


22.) పప్పుయు చారుయు పెరుగుయు

చెప్పిన విధమున తినుటలొ చెప్పుము అటులే

ఒప్పుగ తెలుగగు భాషలొ

ఎప్పుడు రుచిగల ప్రకరణ మెరుగను దెల్వన్.


23.) తెలుగగు భాషకు జెందగ

తెలుపుము నీదగు వివరము తెలుగులొ ఇంకన్

తెలుపుము గర్వము తోడను

తెలుగగు వాడిని అనుచును తేటగు మాటన్


24.) ప్రక్రియ లధికము తెలుగున

సక్రమ పద్ధతి జదువగ సంకట మనకన్

వక్రపు దారియు పట్టక

విక్రము లగుదురు బలుకున విశదము గాగన్


25.) ఎందరొ కవులును ఎరిగిన

అందపు భాషన తెలుగగు అందరు గనగన్

స్యందన మెక్కిన విధముగ

కందురు సులభము తెలుగులొ కవితలు వ్రాయన్.


26.) తెలుగును మరువను జూచిన

తెలుగున పేర్లను మరువడు తెలుపగ నింకన్

తెలుగగు రాష్ట్రము విడిచిన

తెలుగగు పేర్లనె సుతులకు దెలుపుచు బెట్టున్


27.) మరువకు మీ తెలుగెప్పుడు

మరువకుమీ మాతృ పలుకు మదిలో ఇంకన్

మరువకుమీ మనమనుటయు

మరువకుమీ జన్మ స్థలము మనిషివి అగుటన్


28.) తెలుగను మాటను మరచిన

తెలువదు పూర్వపు చరితపు తేజము ఎంతో

తెలుగున లక్షల ఒయ్యిలు

తెలిపెడి భావము భవితలొ తెరమరు గవగన్


29.) దోషము ఎరుగని విధమగు

భాషన తెలుగుయె బతుకుయు భద్రము గుండన్

తోషము అధికము తెలుగన

భూషన మనగను పలుకుల భూషిత మనగన్


30.) తల్లియు నేర్పిన భాషయె

పిల్లలు నేర్వగ తెలివగు పిల్లలు అగుచున్

కల్లలు జెప్పుట మరిచియు

ఉల్లము నందున తెలుగునె ఉంచగ సుఖమున్


31.) అన్నము బెట్టెడు రైతులు

ఎన్నడు మరువరు తెలుగును ఎరుగగ నుండన్

ఎన్నగ రైతులె గొప్పన

జొన్నయు సజ్జయు దినుచును జొరబడ డెందున్


32.) పాలుయు మీగడ పాయస

మేలన దెలియగ తెలుగుయె మేలగు నింకన్

ఏలన ప్రక్రియ లధికము

మేలగు విధముగ మలుచను మేలగు తెలుగే


33.) కలుషిత మగుచును తెలుగిక

విలసిత మంతయు మరుగయె వీకమెరుగకన్

పులకిత పుండ్రము మాదిరి

తెలుగన అన్యపు పదములు తెగులుగ అంటన్


34.) సుధతో బోలిన భాషను

విధమును దెలియగ తెలుగగు వింతయు గాకన్

మధురపు పలుకులు గలిగిన

కుధరము ఎత్తుగ ఎదిగిన కుందన భాషే.---


35.) ద్రవిడపు భాషల నుండియె

అవనిన బుట్టెను తెలుగుయు అందరు అనగన్

వివరము దెలియగ తెలుగును

చివరకు అనెదర అజంత చిక్కుయు లేకన్.


36.) అచ్చులు హల్లులు తోడుగ

మెచ్చగ అక్షర ఉభయము మేలగు చోటన్

మచ్చయు లేనగు తెలుగుయె

అచ్చపు తేనియ విధమున అందరు మెచ్చన్


37.) బవిరిగ అక్షర ముండగ

సవివర స్థానము పలుకులు సాగుచు నుండన్

ఎవరికి అనువగు రీతిగ

కవులకు తెలుగున పదములు కానగ నుండున్


38.) భాషలు అధికము పుడమిన

భాషల యందున తెలుగగు భాషయె మనకున్

భేషజ మనకను నిలిచిన

భేషగు భాషయె తెలుగగు బెట్టుతొ నుండన్


39.) కంఠము తాలవ్య మనగ

కంఠపు తావల్యము లిక  కంఠము తోడున్

కంఠోష్ఠ్యము దంత్యములును

కంఠము దన్య్తోష్ఠ తెలుగు కందుము జూడన్


40.) సరళము పరుషము స్థిరముయు

మరవక పలికెడి విధముగ మనదగు తెలుగే

పరిపరి విధముల ప్రక్రియ

తరగని ధనమన తెలుగుయె తారల నంటన్


41.) మాటల మిటారి కందము

సాటియె తెలుగన ఇతరము సాటియు గాకన్

తోటలొ విరిసిన పూవుల

బాటన నడచిన విధమగు బాపతు తెలుగే


42.) అంచత త్తడిచెలియ తొడవు

ఎంచగ అక్షర ముతెలుగు ఎరుగగ నుండన్ 

అంచత త్తడి చెలియ దయతొ

అంచెలు అంచెలు తెలుగున అధికులు పుడమిన్


43.) మక్షిక లొసగిన తేనెను

భక్షణ జేసిసిన విధము భక్తితొ నేర్వన్

రక్షణ గలుగును తెలుగుతొ

అక్షరు కోడలు కదియగు ఆభరణ నగన్


44.) అమ్మయు అయ్యను మరిచియు

ఇమ్మహి పిల్లలు దలుతురు ఇంపుగ గురువున్

కమ్మని భాషలు నేర్పగ

సమ్మత మొందుచు తెలుగుయె సరిపడు ననుచున్


45.) ఎక్కడి కేగిన దెలుపుము

చక్కటి భాషగు తెలుగని చతురత తోడన్

దక్కగ కీర్తియు తెలుగుకు

నిక్కము నీవును ఎరుగగ నిశ్చల మందున్


46.) భాషయె బతుకుకు బాటగు

భాషయె లేకను ఎరుగము భావము ఎచటన్

భాషయె మనిషికి భద్రత

భాషన మనదగు తెలుగను భాషయె సుమ్మీ


47.) భావము దెలుపగ భాషన

భావము నిలుపగ లిపియును బాగన తెలుగే

చేవయు గలిగిన భాషన

పావకి జూపిన తెలుగగు పంటవలతినన్


48.) తెలుగను భాషలొ దెలుపగ

వెలుగులు మెండన తెలుగులొ వెలసెను ఎన్నో

విలువగు గ్రంథము లనగను

తొలుతన జరిగిన చరితము తోషము జెందన్


49.) తెలుగుయు తెనుంగు తెనుగుయు

కలసియు ఒకటియె తెలుగగు కాంచగ నింకన్

తెలుగుయు బుట్టెను పూర్వము

తెలుగుకు సాటన కనమిక తెలివిగ యెంచన్


50.) పండిన  మాకంద ఫలము

వండిన క్షీరేయి మధుర వంటయు కన్నన్

ఎండిన ద్రాక్షయు పనసయు

మెండగు సురసము తెలుగున మేదిని గనగన్


51.) తెలుగులొ తత్సమ తత్భవ

పలుకులు దేశ్యము మొదలగు పదములు ఉండన్

తెలుగులొ గ్రామ్యము కూడను

వెలుగుచు భాషకు విలువలు బెంచగ నుండెన్


52.) తెలుగున ఇతరము పదములు

పలుకగ జేరెను అనువగు పలుకులు లేకన్

తెలుగులొ ఎన్నియొ భాషలు

కలసియు పోయెను విధిగను కాలము తీరున్.


53.) అరువది నాలుగు కళలలొ

సరిగమ పదనియు అనగను సంగీత మనన్

సరిగను పలుకగ తెలుగులొ

సరిపడు శృతిలయ మొదలగు సంగీతంబుల్


54.) తెలుగుకు సాటియు తెలుగుయె

తెలుగున అవధాన క్రియలు తెలుపగ నుండన్

తెలుగుయు కానగు భాషలొ

తెలుపగ లేవన ఎచటను తెలుసుకొ సుమ్మీ


55.) తొమ్మిది కోట్లుగ జనముయు

సమ్మత మొందుచు బలికెడు సరియగు  బాషే

కమ్మని తెలుగగు మనకన

నిమ్మళ పడగను బతుకున నినదము అదియే


56.) పున్నమి వెన్నెల ధౌతము 

సన్నని జాజియు హిమముయు సాటిగ నుండన్

ఎన్నగ శతకోటి వెలుగు

మన్నిక తగునటు తెలుగన మనదగు భాషే


57.) కనకము కరుగగ సొమ్మగు

కనగను ఎన్నియొ విధముల కళుకుల తోడన్

కనకము తీరుగ తెలుగుయు

కననగు ప్రక్రియ లధికము కవనము సేయన్


58.) అవధాన నాటక నటన

కవితలు వ్యాసము కథలును కవనము ఇంకన్

వివరము సెప్పగ తెలుగున

అవనిలొ ప్రక్రియ లెరిగిన అన్నియు తగగన్


59.మనదగు భాషను మరిచియు

వినదగ దాంగ్లము ఇతరము విలువయు లేకన్

కనగను తెలుగుయె కాంచన

మనగను మరువకు తెలుగును మదిలో ఎపుడున్


60.) ఒయ్యిల గుడిలో అడుగిడు

ఒయ్యిలు తెలుగువె జదువుము ఓపిక తోడన్

నెయ్యము నీకవి గలుగును

మెయ్యను తీరిక దొరకదు మేలగు రుచితో


61.) తెలుగున ప్రతిపద ముయుగన

తెలుసును అచ్చుతొ ముగియుట తెలుగన గాకన్

తెలియగ ఇతరము భాషలొ

తెలుగుయు మాదిరి గనమిక తెలియగ నుండన్


62.) నోరుయు దెరిచియు పలికెడి

తీరుయు తెలుగులొ కలిగిన తీరన జూడన్

వేరగు భాషలొ గనమిక

దారుణి అదనపు కళయన దగులము కనగన్.


63.) సంగీతము సాహిత్యము 

అంగీకర మనుచు ఇముడ అదియన తెలుగే

కృంగేమి బోక కుదురుగ

సంగీతము సాహితి సరస సహురిన గనన్


64.) లోకము భాషల యందున

ఏకము పదునైదు ఉనికి ఎరుగగ తెలుగే

కాకను దేశము నందున

లోకులు దెలియగ అధికము లొసుగుయు లేకన్


65.) ద్రవిడము సంస్కృత కలయికె

అవనిన ఏర్పడె తెలుగన అందరు మెచ్చన్

కవనము కావ్యము రచనలు

అవిఇవి ఏలన అఖిలము అందము గుండన్


66.) తెలుగున వ్యాకర ణమనగ

తెలువగ అనుకూల మగుట తెలుగుకె తగగన్

తెలుగున ప్రత్యేక తదియె

తెలుగను భాషకు వరమది తేజము మెరయన్


67.) తెలుగన అమృతపు భాషగు

తెలుగన కమ్మని పదకళ తేజము తోడన్

తెలుపగ సుగంధ కవితలు

తెలుగును కాపాడ వలయు తెలివితొ జనులున్


68.) తెలుగున భాషయు యాసయు

తెలుగున మాండలి కమనగ తెలియగ నవియే

తెలుగున గలవన ప్రాంతము

తెలువగ జూడను అధికము తెలుగునె నుండెన్


69.) ఒకటే పద్యము నందున

ఒకటే అర్థము అనకను ఓపిక గనగన్

ప్రకటము అగునిక పలువిధ

వికటము అర్థము తెలుగున వివరించంగా


70.) పెదవులు గలిసియు ఒకపరి

పెదవులు కలువక ఒకపరి వెతలును లేకన్

పదములు గూర్చియు పద్దెము

కదలును వ్రాయగ తెలుగులొ కమ్మని భావం


71.) తొలినుండి చివరి వరకును

తెలువగ అటుదిటు జదువగ తెలుగున గానన్

తెలియును అర్థము ఒకటిగ 

తెలుగున ప్రత్యేకతనగ తెలువగ నుండున్


72.) లిపులలొ ప్రపంచ మందున

లిపియన రెండవ దనగను లిపియగు తెలుగే

లిపులలొ ఉత్తమ లిపియగు

విపులను తెలుగుయె రపణము వివరించంగా


73.) తెలుగను భాషను పలికిన

తెలియగ దేహము నడుమన తెరపియు లేకన్

కలుగును డెబ్బది వేలుగ

తలువగ నాడులు అధికము తన్మయ మొందున్


74.) అధికము సామెత లనగను

అధికము జాతీయ ములన ఆదరణుండన్

అధికము ఎందున జూసిన

అధికము తెలుగున కనగను అధికపు మాటే


75.) తెలుగన మాతృది స్వరమన

తెలుగును నలువయె యొసగెను తెలుగను వరమున్

తెలుగుకు సాటియు గనమిక

తెలుగున జదివెడి ప్రజలది తెలియగ భాగ్యం


76.) ఏడగు శాఖలు తెలుగున

కూడగ వ్యాకర ణమనగ కూర్పుయు దెలియన్

చూడగ అక్షర పదములు

తోడుగ సంధియు పలుకుయు తోచును ఇంకన్


77.) ఛందసు సమాస మింకను

పొందిక భూషణ మనగను పొసగగ నుండన్

ఎందును గొప్పదె తెలుగన

విందగు నిత్యము జదువగ విశదము గాగన్


78.) తొలుతనె భాషయు బుట్టగ

తెలువగ బ్రహ్మీ లిపియని తెలుగున జేరన్

తెలుగను లిపితో నిలిచెను

విలువగు భాషయు లిపియును విపులన గనగన్


79.) పదములు గ్రామ్యము నందునె

మొదలయి పిదపను శృతిపర మొందుచు వెలుగన్

పదములు గాసట బీసట

ఉదలెను తుదకును తెలుగున ఉత్తమ మగుచున్


80.) శాతవహుల సమయ ముననె

చేతన మొందెను తెలుగుయు చెప్పగ నింకన్

జాతిలొ ప్రజలది భాషన

ఊతము బొందక చదువరి ఉపయోగ ముకున్


81.) ఎంతగ జెప్పిన తెలుగని

అంతగ గొప్పగు కనగను అంతము  లేకన్

ఎంతయొ సుగుణము భాషలొ

దంతము కంఠము పెదవులు దగిలెడు భాషే


82.) అమ్మది నుడికార మనగ

కమ్మని భాషయె తెలుగన కవులును జెప్పన్

ఇమ్మహి భాషల యందున

సొమ్మును బోలిన తెలుగుయె సొగసుగ నిల్వన్


83.) తేనియ వంటిది తెలుగన 

తేనియ మధురమె తెలుగని తెలియగ నుండన్

తేనెను మించిన మధురము

తేనియ భక్షణ తెలుగన దెసయగు జూడన్


84.) తెలుగను భాషకు మూలము

తెలియగ యానాదు లనగ తెలుపుచు నుండన్

తెలుగుకు పుట్టుక సరిగను

తెలువదు నేటికి ఎవరికి తెలుపగ నుండన్


85.) తెలుగున గొప్పయు ఏమిటొ  

తెలియగ ఒయ్యిలు జదువగ దెలియును గాకన్

తెలుగులొ గేయము కవితలు

తెలుగులొ కథలును రచనలు తెలుపును కీర్తిన్


86.) తెలుగను మధురము వంటిది

తెలుపగ ఎచటను ఎరుగము తెలివితొ గనగన్

తెలుగున ఘనతయు జెందియు

వెలిగెడి పండిత ప్రవరులె వేరుగ గనమున్


87.) మాటలు నేర్చిన వయసున

మాటలొ అమ్మని పలుకెడి మాటన తెలుగే

పూటకు పూటకు తెలుగున

బాటలు పడగను మరుచుట భావ్యమ నరుడా


88.) అధికము అక్షర మనగను

అధికము మధురము తెలుగగు అందరు దెలియన్

అధికము ప్రక్రియ లుండెడి

విధమగు భాషయె తెలుగగు విధిగను నేర్వన్


89.) అక్షర మనగను గుండ్రము

అక్షర మోలెను పలుకులు అందము గుండన్

రక్షణ బతుకున తెలుగుతొ

దక్షత తోడను జదువగ ధనమన తెలుగే


90.) అన్నియు భాషల యందున

ఎన్నగ భాషన జననిదె ఎరుగగ నుండన్

ఎన్నడు మరచుట తగదిక

అన్నము మరువని విధముగ అమ్మది భాషే


91.) భాషలొ పట్టుయు లేకను

భాషన గౌరవ మనగను భావ్యము గాగన్

భాషన తెలుగను భాషయె

భాషగు మనకును భతుకుకు భద్రము గలుగన్


92.) తెలుగును మెచ్చిరి ఇతరులు

తెలుగును కీర్తించి దెలుప తెలుగగు భాషే

తెలుపగ ఎచటను లేదని

తెలుగన మనదగు గరువము తెలుపగ నుండన్


93.) మూడగు పుణ్యపు క్షేత్రము

తోడుగ లింగము లనగను తోరము తోడన్

వేడుకన వెలసెను తెలుగు

వాడుక కొచ్చెను దెలువగ  వాగ్దేవీయన్


94.) ఆమని కోయిల కూతయు

మామిడి ఫలముల రసముల మధురము కన్నన్

కాముని బాణము పరిమళ

మేమియు అధికము తెలుగుకు మేదిని గనమున్


95.) భావము తెలుపగ నుండగ

భావము సులువుగ దెలిసెడి భాషన తెలుగే

భావము అర్థము తోడుగ

చేవయు గలిగిన తెలుగగు చెప్పగ నెంచన్


96.) తెలియగ సంస్కృత భాషలొ

గలిగిన ప్రక్రియ లధికము గనగను దెలుసున్

తెలుగులొ భాషకు దగ్గర

కలసియు ఉండును ఉపమితి కానగ నుండన్


97.) తెలుగు అవధాన ప్రక్రియ

తెలువగ తమతమ పలుకులొ దేవను జూడన్

తెలుగున గల వ్యాకరణము

కలిగియు లేకను గుదురదు కాంచగ నుండన్


98.) తెలుగను భాషలొ సంధులు

తెలుగున సమసన తొడవులు తెలివితొ నేర్వన్

తెలియగ కష్టము గలిగిన

తెలుగుయె గొప్పగు తుదకును తెలువగ సుఖమే


99.) సుందర పదములు తెలుగున

అందము గుండెడు పలుకులు ఆదరణ నగన్

ఎందును లేనగు విధముగ

పొందిక సాహితి ప్రకరణ పొసగగ నుండున్


100.) మనదగు తెలుగను భాషయె

అనగను అమృతపు పలుకులు అనదగు భాషే

కనగను కమ్మని పదకళ

మనగను పరిమళ కవితల మన్నిక భాషే


101.) తెలుగున వాఙ్మయ మనగను

తెలుపగ మధురపు పలుకులు తేనియ వోలెన్

తెలుగన బంగరు సమమగు

తెలుగున అక్షర మనగను తెలుపగ గరిమే


102.) తెలుగున కళలన అధికము

తెలుగున ఆచర ణనగను తెలువగ నుండన్

తెలుగున పండుగ లధికము

తెలుగన ఎందులొ కనగను తెలుపగ గొప్పే


103.) తెలుగున ఆహార విధము

తెలుగున ఉత్సవ ములనగ తెలియగ నుండన్

తెలుగున పరిపరి విధములు

తెలుపగ నోములు వ్రతములు తెలుపగ మెండే


104.) తెలుగన బంగరు ఖనియగు

తెలుగన సుమముల పరిమళ తెరవగు భాషే

తెలుగున తేనెలు ఒలుకగ

తెలుగన నవరత్న తళుకు తేజపు భాషే


105.) అద్దము లాంటిది తెలుగన

అద్దము లోకము పటమును అందము జూపన్

అద్దము వోలెను తెలుగుయు

ఒద్దిక మానవ ప్రకృతిని ఒనరగ జూపున్


106.) చక్కటి జిగిబిగి పలుకుల

మక్కువ గొల్పెడి మనదగు మాతృది భాషే

పెక్కుగ జనముయు బలికెడి

అక్కర మధికము గలిగిన అందపు తెలుగే.


107.) తెలుగుకు హృదయము పెద్దది

తెలుగులొ కలియును ఇతరము తెలుపగ నింకన్

తెలుగన భేదము జూపదు

తెలుగను భాషను చవిగొన తేనియ తీపే


108.) తెలుగున పలుకుట మనవిధి

తెలుగున వ్రాయుట మనవిధి తెలుపగ నింకన్

తెలుగును అమ్మయె నేర్పగ

తెలుగును అమ్మను మరచుట తెలివన రెవరున్.

                                                                                

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


23 views0 comments

Comments


bottom of page