#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #తెలుగువెలుగులజిలుగులు, #TeluguVelugulaJilugulu, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems
'Telugu Velugula Jilugulu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 10/10/2024
'తెలుగు వెలుగుల జిలుగులు' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
ఉగ్గుపాలతో అమ్మ నేర్పిన భాష
తెలుగు భాష తీయదనం తెలుపంగ
మాగిన మాకంద ఫలముకన్న
కలకండకన్న కమ్మని జున్నుకన్న
చక్కెరకన్న చెరుకు రసముకన్న
పాయసంబుకన్న భ్రామరసముకన్న
పనసతొనలకన్న పాల మీగడకన్న
అమరుల బువ్వగు అమృతముకన్న
అధిక మాధుర్యమనగనుండు
అట్టి భాష మిగుల అందమనగ
ఎందులేనగు ప్రక్రియలెరిగియుండ
కుందనంబగు భాష కువలయమందు
ఉండనుండ పరభాషకురుకులేల
మనది యనుమాట మరచుటేల
దోసరహిత భాష దొరికియుండ
ఆసలేల ఆంగ్ల భాషయందు
మాతృభాషయందె మమకారముంచ
పాత్రమనుచు జీవిత యాత్రయందు.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments