'Telugunu Maruvaku Telugoda' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 10/01/2024
'తెలుగును మరువకు తెలుగోడా' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
1}మమ్మీ డాడీ అనకుము
అమ్మను నాన్నను ఎపుడును అదియన తప్పే
కమ్మని తెలుగులొ పలుకుము
అమ్మా నాన్నా అనుచును అదియగు ప్రీతే
2}మనదగు తెలుగును మరువకు
మనదగు యాసనె బలుకుము మరువక ఎపుడున్
ఘనమగు భాషయె మనదన
వినగను వ్రాయను జదువను విపులము బలుకన్
3}అక్కను చెల్లెను అన్నను
చక్కగ తమ్ముని బిలువుము చక్కని తెలుగున్
మక్కువ గొల్పెడి విధమున
హక్కగు నీదగు తెలుగుయె హాయిగ బలుకన్
4}మాతృ దేశ మందె మన్నన అధికము
అన్య దేశ మందు అడుగ రెవరు
అన్య ప్రాంత మరుగ అమ్మయు నాన్నయు
చెందు బాధ యెంతొ చెప్ప తరమ
5.నీదు దేశ మందు నీవెను రాజువు
అన్య దేశ మరుగ అచట నీవు
నీదు ఉనికి గనరు నిక్కము అనగను
భద్ర మున్న చోటె బాగు బాగు
6}స్వంత దేశ మనగ స్వర్గము అనగను
అమ్మ నాన్న అక్క అన్న చెల్లె
కలసి ఉండ నెంతొ కాంతియు ఇంటను
రాజు లాగ బతుకు రపణ మదియె
7}. నీదు దేహ మంత నీవును కడిగిన
అన్య ముఖము కడుగ అదియు తప్పె
మనది గంజి అయిన మనకును సుఖమన
పరుల గోరి తినకు పాయ సంబు
8}తల్లి తండ్రి మరియు తనదగు ఊరన
చెప్ప గొప్ప గాని చెడుపు గాదు
తనది దేహ మెంతొ తనకును ప్రీతన
చింత లేదు ఇంక చిత్ర మదియె
9}వలదు స్వార్థ మెపుడు ఒనరులు నీకున్న
పరుల కెంతొ కొంత పంచ బూన
ధర్మ మనగ నదియె ధరణిన గనగను
కలసి బ్రతుకు టందె కలుగు సుఖము
10}తెలుగు జనులు అనగ తెలివియు గలిగియు
ఇంగి తంబు జూపు ఇతరు లందు
ప్రేమ బెంచ జూడు పెద్దలు పిల్లలు
నీదు యందు గోము నిలుపు నట్లు
సుదర్శన రావు పోచంపల్లి
Σχόλια