'Thappevaridi' - New Telugu Story Written By Nagamanjari Gumma
Published In manatelugukathalu.com On 15/07/2024
'తప్పెవరిది?' తెలుగు కథ
రచన: నాగమంజరి గుమ్మా
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఇవాళ ఈ ప్రోగ్రాం పూర్తిచేసి వెళ్ళాలి. మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క గంట ఎక్కువ సేపు మనం పనిచేస్తే చాలు. దయచేసి అందరూ సహకరించండి.” టీం లీడర్ విశ్వ అభ్యర్థనను ఎవరూ కాదనలేకపోయారు. గబగబా తమవంతు ప్రోగ్రాం పూర్తిచేసి, ఎర్రర్ లను తొలగించి, విశ్వకు అప్పగించారు. విశ్వ అందరి ప్రోగ్రాం లను ఒక చోట చేర్చి, కోడింగ్, డి కోడింగ్ లను సరి చూసుకుని, అందరికి క్లియరెన్స్ ఇచ్చాడు. శీతాకాలం కావడంతో ఏడు గంటలు అనేసరికి అర్ధరాత్రి లా అనిపిస్తోంది. టీం లో మిగతా నలుగురితో కలిసి బయటకు వచ్చింది ప్రమీల. ఇద్దరు అబ్బాయిలు బైక్ ల మీద, ఇద్దరు అమ్మాయిలు కంపెనీ ఇచ్చిన హైర్ టాక్సీ లోను బయలుదేరారు.
ప్రమీల కూడా తన టు వీలర్ బయటకు తీసింది. హెల్మెట్ పెట్టుకుని, చున్నీ వంటినిండా బిగించి కట్టింది. సాధారణంగా ఆరు గంటలప్పుడు ట్రాఫిక్ కారణంగా చలి ఉండదు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ పల్చబడింది. ముప్పై కిలోమీటర్ల దూరం లోని తన ఇంటికి బయలుదేరింది ప్రమీల. హైర్ టాక్సీ సదుపాయం ఉన్నా, బండి ఉంటే ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం తండ్రి తో కలిసి వస్తుంది. తండ్రి ఆఫీస్ కి ఐదు కిలోమీటర్ల ముందు దిగిపోతాడు. వెళ్ళేటప్పుడు తండ్రి ప్రమీల వచ్చేవరకు వేచి ఉంటాడు. ఆరోజు గంట లేటవుతుందని, తండ్రిని వెళ్లిపోమని, ఫోన్ చేసి చెప్పింది ప్రమీల. కానీ ఆ లోగా మార్కెట్ పనులు పూర్తిచేసుకుంటానని, ప్రమీల వస్తే కలిసి వెళదామని చెప్పాడు తండ్రి. అందుకే చీకటి బాగా ఉన్నా, జనసంచారం తక్కువగా ఉన్నా భయపడలేదు ప్రమీల.
మూడు కిలోమీటర్లు ప్రయాణించేక బండి ఎందుకో ఆగిపోయింది. కొంచెం సేపు ప్రయత్నించింది ప్రమీల. బండి కదలలేదు. తండ్రికి ఫోన్ చేసింది. ‘ఫలానా చోట ఉన్నానని, బండి ఆగిపోయిందని’ చెప్పింది. ‘కంగారు పడొద్దని, తాను వస్తున్నానని’ చెప్పేడు తండ్రి. మెయిన్ రోడ్ కావడం వలన అప్పుడప్పుడు వాహనాలు వచ్చిపోతున్నాయి. ఎవరో ఇద్దరు అబ్బాయిలు బండి మీద ముందుకు వెళ్లి, మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చారు.
“ఏమైంది మేడం?” అడిగాడు ఒకడు.
“ఎందుకో ఆగిపోయింది. స్టార్ట్ కావడం లేదు.” చెప్పింది ప్రమీల.
“చూస్తానుండండి.” అని బండి దిగివచ్చి, ప్రమీల బండి స్టార్ట్ చేస్తున్నాడు ఒకడు.
అటే చూస్తున్న ప్రమీల రెండోవాణ్ణి గమనించలేదు. వెనుకగా వచ్చి, ప్రమీల నోరు నొక్కి, రోడ్డు వెనుకగా లాక్కుపోయాడు. బండి దగ్గర ఉన్నవాడు బండిని కూడా చీకటి వైపు తీసుకువచ్చాడు. ప్రమీల ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరూ అత్యాచారం చేశారు. ఇంతలో ఆటో ఆగిన శబ్దం, దానితో పాటే ప్రమీల ఫోన్ మోగడం గమనించి, ప్రమీలను అక్కడే వదిలి, వెనుక గా వచ్చి, తమ బండి తీసుకుని అక్కడ నుంచి పారిపోయారు ఆ వ్యక్తులు.
ప్రమీల ఫోన్ తీసే పరిస్థితి లో లేదు. తండ్రి ఫోన్ శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్లి చూసేసరికి అస్తవ్యస్తమైన దుస్తులతో దాదాపు అపస్మారక స్థితిలో ప్రమీల కనిపించింది. కంగారు పడి, దుస్తులు సరిచేసి, ముఖాన నీళ్లు జల్లి మెలకువ తెప్పించాడు తండ్రి.
గుక్కెడు నీళ్లు తాగి, పూర్తిగా తెలివి తెచ్చుకున్న ప్రమీల తనకు జరిగిన అన్యాయం తండ్రికి తెలిపింది. నెమ్మది గా లేచి, బండిని అక్కడే వదిలి, ఆటోలో ఇంటికి వెళ్లారు తండ్రి కూతురు. దారంట పోయేవాళ్ళని ఎలా గుర్తించగలరు? జరిగిన దారుణం జరగనే జరిగింది. కేసు పెట్టి, మీడియాలో ప్రచారం అయ్యి, నలుగురిలో నవ్వులపాలు అయ్యే బదులు మౌనంగా ఊరుకోడానికి నిశ్చయించుకున్నారు. తగిలిన గాయం నుంచి శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి చాలరోజులు పట్టింది ప్రమీలకు. ప్రమీల తల్లిదండ్రులు కూడా కూతురికి ధైర్యం కలిగిస్తూ వచ్చారు. పదిహేను రోజులు ఆఫీస్ కు సెలవు పెట్టింది ప్రమీల.
కొన్ని రోజులు గడిచాక తనలో కలిగిన మార్పును గుర్తించి, తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్ళింది ప్రమీల. అక్కడ తాను గర్భవతిని అని తెలిసి మరింత వేదనకు గురయ్యింది. ఇంటికి వచ్చాక, తల్లి తండ్రి ఎంత చెప్పినా గర్భవిచ్ఛిత్తికి ఇష్టపడలేదు. ఇంకా రూపుదిద్దుకోని ఆ పసిగుడ్డు చేసిన తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆ చిరుప్రాణిని నాశనం చేయడం ఇష్టం లేకపోయింది. ఒంటరి తల్లిగా ఆ బిడ్డను కనడానికే నిశ్చయించుకుంది. బిడ్డతో హాయిగా ఆడుకుంటున్నట్లు కలలు గంటూ నిశ్చింతగా నిద్రపోయింది.
******* ********** ********** **********
నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
పేరు: నాగమంజరి గుమ్మా
భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు
వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని
నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.
వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం.
విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం
పురాణ ప్రవచనం చేయడం
రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.
విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.
@nagarajubhallamudi2297
• 6 hours ago
కథ చాలా బాగుంది చదివిన విధానం కూడా బాగుంది అభినందనలు