top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 15

Writer: Pandranki SubramaniPandranki Subramani

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 15 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 16/02/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 

పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, నరసింహ మూర్తి ల వివాహం గురించి శ్రీరామ్, భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహ మూర్తికి. 


 ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 15 చదవండి.. 


ఆ పూట ఆదివారం. శ్రీరామ్ గారి వద్దనుండి నరసింహమూర్తికి ఫోను వచ్చింది; కారొస్తుందని, సిద్ధంగా ఉండమని. కాని ఆ రోజు ఉదయం రాలేనని, ఉదయం ఆస్ట్రేలియా నుండి నోబేల్ బహుమతి గ్రహీత ఒకాయన స్పెషల్ లెక్చర్ ఇవ్వడానికి వస్తున్నారని, అంచేత మధ్యాహ్నం రావడానికి వీలుపడవచ్చని చెప్పాడు. అంతేకాక, ఆక్షేపణ గాని లేక పోతే ఇస్లామియా మతస్థుడైన తన రూమ్ మేటుని ఒక రోజు వీలు చూసుకుని వెంట తీసుకొస్తానని కూడా తెలియజేసాడు నరసింహమూర్తి. 


శ్రీరామ్ గారు కాసే పు మౌనంగా ఉండిపోయి ఆతరాత ఒప్పుకున్నారు. అది గమనించి తనతో రాబోతూన్నరూమ్ మేటు పేరు చెప్పడానికి గాని, షేక్ అహ్మద్ పాకిస్థానీ అని చెప్పడానికి గాని అతడికి మనస్కరించలేదు. ఎలాగూ సుజాత ఉందిగా తనకు అండగా ఉండటానికీ-- అన్నిటినీ సర్దుబాటు చేసుకుపోవడానికీ. వంతెన యెదురొచ్చినప్పుడు దానిని దాటడానికి ప్రయత్నించవచ్చు-- 

ఒకే ఒకసారి షేక్ అహ్మద్ కి ధక్షిణ భారతీయ భోజనం తినిపిస్తే ఇక తన వంతు బాధ్యత తీరినట్టే! మనసు తేలిక పడ్డట్టే! 


ఆనాటి స్పెషల్ క్లాసు ప్రపంచ వ్యాప్తంగా వికటిస్తూన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై. ఇప్పటికే అభివృధ్ది చెందిన దేశా లు గాని, అభివృధ్ది చెందుతూన్న దేశాలు గాని- మానవ హక్కులను కాలరాయకుండా ముందుకు వెళ్తేనే, వెళ్ళ గలిగితేనే- అభివృ ధ్ది ప్రభంజనంలో అల్పసంఖ్యాకుల గొంతులు నొక్కబడకుండా ముందుకెళ్తేనే నిజమైన ముందడుగని, ప్రసంగపు ప్రతిలోని ముఖ్య సారాంశం. 


మరి మొన్న మొన్న తీసిన ప్రపంచ వ్యాప్త పరిశీలనలో తేలిన ఓ ముఖ్యమైన అంశం- ప్రతి పది మందిలోనూ ఒకరికి మంచి నీళ్ల భద్రత ఇప్పటికీ లేకుండా పోతుందట. అంటే— కనీస అవసరాలకు నోచుకోకుండా-- ప్రపంచంలో పెక్కుదేశాలు ఇంకా వెనుకబడి ఉన్నాయనేగా అర్థం! మరి ఇటు వంటి గడ్డు పరిస్థితిల్లో అభివృధ్ది చెందుతూన్న దేశాలను- ముఖ్యంగా అప్పుడప్పుడే ఆర్థిక రంగంలో కుదుట పడుతూన్న బీద దేశాలను మానవ హక్కుల పేరిట అతలా కుతలం చేయడం ఎంతవ రకు న్యాయమని పించుకుంటుంది? 


అంతెందుకు మొన్న మొన్న వెలువడిన వార్తల ప్రకారం భారత దేశంలో కొన్ని మందు తయారీ సంస్థలు గాని ఎయిడ్స్ మందులు చౌకగా తయారుచేసి పంపిణీ చేయడం ఆపితే-- కొన్ని వేల మంది నల్లజాతీయులు యురోపియన్ వాళ్ళ ఖరీదైన మందులు కొనుక్కోలేక ట్రీట్ మెంటుని కొనసాగించలేక మరణిస్తారట. మరి-- అందుకేగా- ‘ఆకలితో అలమటించే వాడికి మొదట వాడి ఆకలి తీర్చిన తరవాతనే ధర్మాచరణల గురించి చెప్పు‘అని ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన రోవింగ్ మాంక్ వివేకానందుడు తేల్చి చెప్పాడు! 


ఒక వేపు ప్రజాస్వామ్య వ్యవస్థంటూ- మానవ హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమంటూ నినాదాలు చేస్తూ- మరొకవేపు ధన మదాంధ దోపిడీ విధానానికి వత్తాసు పలుకుతున్నప్పుడు సముచిత సామాజిక న్యాయం ఎలా నిలనాటుతుంది! 


ప్రసంగ పర్వం పూర్తయిన తరవాత ఫ్యాకల్టీ మెంబర్లు అందిచ్చిన ప్రతిస్పందన పత్రంలో తన అభిప్రాయాలని మరీ ఉద్వే గభరితంగా కాకుండా సాధ్యమైనంత నిదానంగా వివరాలు వ్రాసిచ్చి మధ్యాహ్నం పన్నెండు కల్లా ఫ్రెషప్ అయి, శ్రీరామ్ గారి కారు కోసం ఎదురు చూడసాగాడు. కాని ఈసారి ఆయన గాని ఆయన గారి తమ్ముడుగాని రాలేదు. అక్కాచెల్లెళ్ళిద్దరూ జీన్స్ వేసుకుని లాంగ్ కోటులు తొడుక్కుని కారు నుండి దిగి అతడికి ఎదురొచ్చారు. ఎరుపు దనంతో బాటు మంచి పొడవేమో- చక్కగా కని పించారు ఇద్దరు అమ్మాయిలూ. 


“గుడ్ ఆఫ్టర్ నూన్ యంగ్ లేడీస్!” అంటూ వెనుక సీట్లో కూర్చోవడానికి తలుపు తెరవ బోయాడు నరసింహమూర్తి. కాని మోహన అడ్డు వచ్చింది- “హాఁ! ఇప్పుడు మీ స్థానం దాదాపు పదిలమై పోయినట్లే. ఇక పైన- అదిగో ఆ అందాల బరిణె ప్రక్కనే తమ అగ్రాసనం! ”అంటూ అతణ్ణి సుజాత ప్రక్కన కూర్చోబెట్టి తను వెనకు సీట్లోకి వచ్చి కూర్చుంది. 


కూర్చున్న వెంటనే అక్కాచెల్లెళ్ళిద్దరూ మంచి ఊపులో ఉన్నారన్న విషయం గమనించి షేక్ అహ్మద్ సంగతి వాళ్ల ముందుంచాడు. అతడు లేవదీసిన అంశానికి మొదట మోహనే స్పందించింది- “మా పెదనాన్నతో మీరు మీ రూమ్ మేట్ ముస్లిమ్ అన్నా రు- సరే! ఇంట్లోవాళ్లు ఏదోలా సర్దుకుపోవచ్చు. మరి మీరు ఆయనను పాకిస్థానీ దేశస్థుడంటున్నారుగా! ఈ విషయం మా పెదనాన్నకు చెప్పలేదంటున్నారుగా— అంటే అది అంత ఆహ్లాదకరమైన విషయం కాదని మీకే తోస్తుంది కదా! ఇప్పటికిప్పుడు మీ పాకిస్థానీ ఫ్రెండుని తీసుకు వెళ్తే- మా ఇంట్లో వాళ్లు డిస్టర్బ్ ఔతారేమో! ” 


అతడేమీ అనలేదు. నిశ్శబ్దంగా బండి తోలుతూన్న సుజాతను చూసి నిదానంగా అన్నాడు- “ఈ విషయంలో మీరేమీ చెప్పరా సుజాతగారూ! ”


“ఎందుకు చెప్పనూ! ఐతే ఒక షరతుపైన-- మరీ ఎక్కువగా ఫార్మాలిటీస్ ఫాలో చేస్తూ బహువచనం మాటిమాటికీ ఉపయోగిస్తూ నన్ను ఇబ్బంది పాలు చేయకండి. ఎడుబాటుని పెంచుతూ పోకండి. ఈజిట్ ఓకే! “


“సరే- అలాగే! ఇకపై ఏక వచన ప్రయాగంతోనే పిలుస్తాను. మరి నువ్వు కూడా అలాగే ఫార్మాలిటీస్ లేకుండా మూర్తీ- అని పిల వండి. సరేనా! ”


ఆ సూచనను సుజాత ఒప్పుకోలేదు. తల అడ్డంగా ఆడించింది. దానితో అతడు వాదించడం ఎందుకని ఊరకుండి పోయాడు. ఇప్పటికి ఈ ఇద్దరి భామామణుల అవసరం ఎంతైనా ఉంది. వీళ్ల వత్తాసు లేకపోతే షేక్ అహ్మద్ని ఇంటికి పిలిచి ఓపారి ధక్షిణ భారతీయ భోజనం తినిపించడం ససేమిరా సాధ్యం కాదు. అలగ్గాని అతడికి భోజనం పెట్టించలేకపోతే తనలో తనకే అంతుపట్టని వెలితి యెల్లోరా గుహలా నోరు తెరుచుకుంటుంది. ఇకపోతే-- సుజాత రఁవణమ్మగారి ప్రియ మనవరాలన్నది తను మరవ కూడదు. కాసేపు కారుని పోనిచ్చిన తరవాత సుజాత అందుకుంది-


“ఇక నా వంతు కాబట్టి నేను చెప్తాను. మీరనుకుంటున్నారు కాశ్మీర్ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఉద్రిక్తత ఉత్తి భారత దేశంలో మాత్రమే పరచుకుంటుందని. అలా కాదు. ప్రపంచం నలుమూలలా ఉన్న చాలా మంది ప్రవాస భారతీయుల ఇండ్లలో కూడా ఆ టెన్షన్ వ్యాపిస్తుంటుంది. పుట్టిన గడ్డను భారతీయులు యెలా మరచిపోతారని? వాళ్ల మూలాలను ఎలా విస్మరిస్తారని? 


మీరు ముందే షేక్ అహ్మద్ గారి గురించి పూర్తిగా మా నాన్నగారికి చెప్పి ఉండాల్సింది. కాని బాల్ ని మా కోర్టులోకి విసిరేసారు కాబట్టి- మేమే దానిని అందుకుని భద్రంగా దరిచేర్చి మీకప్పగిస్తాం. ఎందుకంటే అతను పాకిస్థానీ అని తెలిసి కూడా మీరు అతణ్ణి మనింటికి భోజనానికి పిలవాలనుకు న్నారంటే ఆయనలో ఏదో అనుకూల గుణాంశం ఉంటుందనే నమ్ముతున్నాను. బట్- ఇంత త్వరలో కాదు. మరొకసారి. సరేనా మూర్తిగారూ!” 


అతడు ఆనందపడిపోతూ తన చేతిని కారు నడపుతూన్న సుజాత చేతిపైన వేయబోయి చటుక్కున వెనక్కి లాక్కున్నడు; వెనుక కూర్చున్నదెవరో గుర్తుకు వచ్చి. ఐనా మోహనను యెత్తి చూపడం ఎందుకు గాని, తను కూడా ఈ మధ్య మాటి మాటికీ పట్టు తప్పి- ఎమోషనల్ ఐపోతున్నట్టే తోస్తూంది. ’కంట్రోల్ నరసింహా! కంట్రోల్ యువర్ సెల్ఫ్’ తనను తను సముదాయించు కున్నాడతను. సుజాత ప్రక్కన నిల్చున్నప్పుడల్లా అతణ్ణి యేదో అదృష్య శక్తి ముందుకు తోస్తున్నట్లనిపిస్తూంది. 


కాసేపాగిన తరవాత మోహన అంది- “మొత్తానికి నీ చెంతకు రాబోయే మన్మథుడి మెడ చుట్టూ మహబాగానే రంగు రంగుల పూలమాలలు గుదిగుచ్చి పసందుగానే వేస్తున్నావే అక్కాయ్!” 

అది విన్న సుజాత కోపం ప్రదర్శిస్తూ- “నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా!’ అని ఓ విసురు విసిరి ఇటు నరసింహమూర్తి వేపు తిరిగి అంది- “మనమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మూర్తిగారూ! ”

తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడతను. 

“తిన్నగా క్యారీ సిటీ పొలిమేర దాటి శ్రీవేంకటేశ్వరాలయానికి వెళ్తున్నాం”


నిజంగానా- అన్నట్టు ఆశ్చర్యంగా చూసాడతను. 


“ఔను. హోఫ్ మన్ రోడ్డు దాటి అటు వంపు తిరిగితే క్యారీ సిటీ పొలి మేర వచ్చేస్తుంది. మరొక పదినిమిషాల డ్రైవ్. మనముందు మన వేంకటేశ్వరాలయం ప్రత్యక్షమైపోతుంది. మరొక విష యం” 

ఏమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడు నరసింహమూర్తి. 


“అక్కడ తిరుపతిలో ఉన్నట్లే- ఇక్కడ కూడా తెలుగు అర్చకుల్ని చూస్తారు. అక్కడలాగే తమిళ అయ్యంగార్ల అర్చకులను కూడా చూస్తారు” 


సుజాత మాటలకు అతడు అసంకల్పితంగా కను రెప్పలు మూసుకున్నాడు. అతడికేదో క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లనిపించింది. ఎక్కడ హైద్రాబాదు! ఎక్కడ నార్త్ కరోలినా! ఇక్కడ శ్రీవారి ఆలయమా? అందుగలడిందులేడన్న సందేహమే వలదని ఊరకేనా అన్నాడు పోతానా మాత్యుడు! 

అతడలా మైమరచి ఆలోచిస్తున్నప్పుడు అతడికి చప్పున ఏదో స్ఫురణకు వచ్చినట్లనిపించి- “సుజాతా! ఓసారి కారు ఆపుతావా? ”అని అడిగాడు. 


సుజాత కాస్తంత విస్తుపోతూ రోడ్డుకి ఓరమ్మట కారాపుతూ ఏమిటన్నట్టు తలత్రిప్పి చూసింది. 

“మనమిప్పుడు హోఫ్ మన్ రోడ్డు కదూ దాటి వెళ్తున్నాం! ” ఔనని తలూపింది సుజాత. 


“ఇక్కడ నాకొక ఫ్రెండు ఉన్నారు. పేరు లేడీ గ్రేసీ! ” 


ఆమాటకు అక్కాచెల్లెళ్లిద్దరూ ఆశ్చర్యంగా చూసారు. కాని మోహన మాత్రం ఊరుకోలేదు. చురుగ్గా స్పందించింది. - “వచ్చిన కొద్దిరోజుల్లోనే అమెరికన్ లేడీ ప్రెండుని పట్టేసారన్నమాట రాజమండ్రి బావగారు! ”. 


అతడు వాళ్ల ఆశ్చర్యాన్ని పటాపం చలు చేస్తూ బదులిచ్చాడు- “లేడీ గ్రేస్, స్కూల్ ఆఫ్ ఫెర్ఫామింగ్ ఆర్ట్సులో అసోసియేట్ ఫ్రొఫెసర్. పెద్దావిడ"


చెల్లి ధోరణి చూసి సుజాత మందలించింది- “రాను రాను నీ ఆగడాలు మితిమీరి పోతున్నాయే మోహనా! కొత్త వాతావర ణానికింకా అలవాటు పడని వ్యక్తిని ఇలానే తెగ తెంపు లేకుండా చిరాకెత్తిస్తావు? ముందు నాకు కాదు- నీకు చేయాలి పెళ్ళి. అప్పుడు గాని నీతిక్క కుదరదు. తెలుగు గబ్బర్ సింగే నయం- తన తిక్కకు లెక్కుంటుందని కంట్రోల్ చేసుకుంటుంటాడు”


“చూడమ్మా రఁవణమ్మ ఏకైక వారసురాలా! నా కోసం మీరెవ్వరూ ఇండియానుండో రాజమండ్రినుండో పెళ్లి కొడుకుని ఇంపోర్ట్  చేయనవసరం లేదు. నేను అమెరికన్ ఇండియన్ ఉమన్ ని. అమెరికన్ అమ్మాయిల్లాగే పైన్ అడవుల్లోనుంచి వీచే స్వేఛ్ఛా వాయువుల్ని పీలుస్తూ, లేడీ ఆఫ్ లిబర్టీ శిలావిగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, ప్రణయ పరాగాన్ని తనువంతా పూసుకుంటూ నాకు సరైన తోడుని నేనే వెతుక్కుంటాను. 


రఁవణమ్మగారు ప్రవేశ పెట్టిన ఆచారం ప్రకారం నీకైతే తోడు కోసం మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం కావచ్చు. కాని అటువంటి ఆనవాయితీ ఇక్కడ చెల్లదు. ఎవరి పైనా రుద్దకూడదు కూడాను. స్వతంత్రతకీ స్వేఛ్చా ప్రణయ రాగానికే ఇక్కడు తొలి పీఠం. తెలుసు కదూ! ” 


“సరే- చెప్పవలసింది చెప్పేసావు కదూ! ఇక ఊరుకో. మన రఁవణమ్మ బామ్మగారిదే కాదు, మీ అమ్మదీ మా అమ్మదీ కుడా పెద్ద లు కుదిర్చిన సంబంధాలే! ప్రేమ వివాహాలూ- గాంధర్వ వివాహాలూ- రాక్షస వివాహాలూ ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉన్నవి. అంతెందుకు? అక్కడక్కడ లివ్- ఇన్- రిలేషన్ షిప్ లు కూడా చెలరేగుతూనే ఉన్నాయి. కాని అప్పటికీ ఇప్పటికీ పెద్దలు కుదిర్చి న సంబంధాలకున్న సార్థకత మరే ఇతర స్త్రీ పురుష సంబంధానికీ ఉండదని గుర్తుంచుకో! ”


ఏమనుకుందో ఏమో- దానితో మోహన ఊరకుండిపోయింది. సుజాత అలా కారుని పోనిస్తూ సర్రున మలుపు తిప్పి వెనక్కి మళ్ళించి తిన్నగా పువ్వుల దుకాణం వద్ద నిలిపి, పుష్ప గుఛ్ఛాన్ని కొని కారులో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసింది. 


“ఎందుకు సుజాతా?”- నరసింహమూర్తి. 


“మీకోసమే! లేడీ గ్రేసీ పెద్దావిడని అంటున్నారాయె. వట్టి చేతులతో వెళ్లడం బాగుండదు కదండీ. అందులో అమెరికన్లు సెన్సిటివ్. ఈ మర్యాదల్నిమేము సహితం బహు పసందుగా పాటిస్తాం”

“కాని— ఆమెగారు నాకంతటి క్లోజ్ కాదు సుజాతా! ప్లేను దిగేటప్పుడు ఆమెగారు కోరారు కాబట్టి జస్ట్ ఒకసారి హలో- అనాలనిపించింది. అంతే!” 


అప్పుడు మోహన అందిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ”చూడండి రాజమండ్రి బావా! ఇది ఖర్చుతో నిమిత్తం లేని మామూలు సంప్రదాయం. ఎటువంటిదంటే— అక్కడ మీ ఊరి వాళ్ళు పెద్దమనుషులింటికి వెళ్ళేటప్పుడు సవ్యంగా భవ్యంగా ఓ నిమ్మపండుని వాళ్ళ చేతిలో పెడ్తారట. అటువంటిదే యిది కూడాను. నౌ- ఈజిట్ ఓకే!” 


చెల్లి మాటకు సుజాత చిన్నగ నవ్వి కారు డ్రైవ్ చేసుకుంటూ లేడీ గ్రేసీ ఇంటిముందు ఆపింది. ముగ్గురూ కారు దిగి, గేటు తలుపు తోసుకొని నడవ వరకూ మెట్లెక్కి అక్కడ కాసేపు ఆగిన తరవాత-- డోర్ బెల్ నొక్కింది సుజాత. 


లేడి గ్రేసీ కిటికీ గుండా ఓసారి చూసి, మొదట పోల్చుకోలేనట్టు అదోలా చూపులు సారించి నిదానంగా తలుపు తీసి బైటకు వచ్చింది. ఆ తరవాత నరిసింహమూర్తిని చూసిన వెంటనే గుర్తుపెట్టి- కెవ్వున అరచినంత పనిచేసింది- “హాయ్ యంగ్ హ్యాండ్ సమ్! హౌడుయుడూ మైడియర్ యంగ్ ఇండియన్! “అంటూ ఎదురొచ్చింది. 


నరసింహమూర్తి ప్రత్యుత్తరంగా ఆంగ్లంలో విష్ చేస్తూ— పుష్ప గుఛ్ఛాన్ని ఆమెకు ఆప్యాయంగా అందించాడు. సుజాత చెప్పినట్లే ఆమె ముఖం తామరాకంత వెడల్పున విప్పారింది. “హౌ కైండాఫ్ యూ! హగ్ మీ! “అంటూ చేతులు చాచింది. 


నరసింహమూర్తి ఆమెను హత్తుకోలేదు. అభిమానంగా ఆమె రెండు చేతుల్నీ జత చేర్చి, తన రెండు చేతుల్లోకి తీసుకుని కరచాలనం చేసి— ఆ తరవాత రెండడుగులు వెనక్కి వేసి నమస్కరించాడు. అతడి ధోరణి గమనించిన లేడీగ్రేసీ- “యూ ఆర్ ఎ షై టైప్ ఇండియన్!” అంటూ ముగ్గురినీ లోపలకు తీసుకె ళ్ళి, లోపల ఏదో పనిలో ఉన్న భర్తను పిలిచింది- “జాన్! జాన్! ”అంటూ. 


భార్య పిలుపు అందుకున్న తోడనే మిస్టర్ జాన్ పరుగున వచ్చాడు. నరసింహమూర్తి గురించి చెప్పిన వెంటనే అతడు తేరుకుని- “ఓ మీరా! అలసట చెంది నీరసించిన మా ఆవిడకు ఒత్తిగిల్లమని సీటు ఖాళీచేసి, మరొక సీటుకు వెళ్ళి కూర్చున్నారు. వాట్ ఎ గ్రేస్ ఫుల్ యాక్ట్ యంగ్ ఇండియన్!” అంటూ నరసింహమూర్తిని కౌగలించుకున్నాడు. 


కౌగలింతలూ పలకరింపులూ అయింతర్వాత ఆ అమెరిన్ భార్యా భర్తలిద్దరూ ఒకేసారి అడిగారు- “ఇద్దరూ బ్యూటీలే! మరి వీళ్లలో ఎవరు మీ గార్ల్ ఫ్రెండ్? ” 


నరసింహమూర్తి సుజాత వేపు చూపులు సారించి చూసి, పెళ్ళి సంబంధాల విషయమై మాటలు సాగుతున్నాయని, ఇంకా విషయం ఒక కొలిక్కి రాలేదని తెలియ చేసాడు. అప్పుడు భార్యా భర్తలిద్దరూ సుజాత వేపు ప్రశ్నా బాణం సంధించారు- “మీ పెద్దలు మాట్లాడుతూన్న ఈ పెళ్లి సంబంధం నీకిష్టమే కదూ!” 


ఆ మాటకామె తలవంచుకుంది. అప్పుడు నరసింహమూర్తి కలుగజేసుకున్నాడు- “నిజం చెప్పాలంటే మిస్ సుజాత మా పెళ్లికింకా ఒప్పుదల ఇవ్వలేదు. మా ఇంట్లోవాళ్ళకూ వాళ్ల ఇంట్లోవాళ్లకూ సమ్మతం. కాని మిస్ సుజాతకు గాని ఇష్టం లేదంటే ఈ పెళ్లి జరగదు. ఐ ప్రామిస్-- “


“గుడ్! వెరీ గుడ్! మగాడి హుందాతనమంటే ఇలాగుండాలి” అంటూ ఇంటికేతెంచిన అతిథులు ముగ్గురినీ వాళ్లు కిచెన్ లోపలకు తీసుకు వెళ్ళారు- “ఫ్రెష్ టర్కీ. - ప్రొద్దుటే జాన్ మార్కెట్ నుంచి తీసుకు వచ్చాడు. టు డే యూ ఆల్ హేవిట్ విత్ అజ్” అని లేడీ గ్రేస్ ఆహ్వానించింది. 


అప్పుడు నరసింహమూర్తి వినమ్రంగా కల్పించుకుని— సారీ చెప్తూ మరొకసారి వీలు చూసుకుని వస్తామని- గుడికి వెళ్ళేముందు హైందవులు నాన్ విజ్ తీసుకోరని వివరించి కదిలాడు. అది విన్న లేడీ గ్రేస్ ఇక ఒత్తిడి పెట్టకుండా వాళ్ళను ఆపి ముగ్గురికీ ఆరెంజ్ రసం ఇచ్చి నడవ వరకూ వచ్చి సాగనంపించింది. 

=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





 
 
 

Comments


bottom of page