top of page
Writer's pictureGadwala Somanna

తాతయ్య చెప్పిన నిజాలు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#ThathaiahCheppinaNijalu, #తాతయ్యచెప్పిననిజాలు


Thathaiah Cheppina Nijalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 13/11/2024

తాతయ్య చెప్పిన నిజాలు -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


చక్కగా బ్రతికితే

చుక్కలా వెలుగుతాం

మొక్కలా  ఒదిగితే

మిక్కిలి  ఎదుగుతాం


నవ్వులే రువ్వితే

పువ్వులా మారుతాం

శ్రద్ధగా చదివితే

వృద్ధిలోకొస్తాం


బుద్ధులే మారితే

బుద్ధునిలా అవుతాం

పద్దతిగా ఉంటే!

అద్దమై కనిపిస్తాం


కష్టాన్ని నమ్మితే

నష్టాన్ని జయిస్తాం

ఓర్పు కల్గియుంటే

తూర్పున ఉదయిస్తాం


తల్లిని గౌరవిస్తే

మల్లెలా వికసిస్తాం

కల్లలే మానితే

ఎల్లరికి నచ్చుతాం


-గద్వాల సోమన్న



31 views0 comments

Comments


bottom of page