'The Killer Episode 12' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 14/03/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ది కిల్లర్ వెబ్ సిరీస్ ని చదివిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సిరీస్ కి సంబంధించి బోనస్ ఎపిసోడ్ రాయాలనిపించి రాస్తున్నాను. చదివి లైక్ చేయగలరు..
జరిగిన కథ :
ముసుగు మనిషిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్. చేసిన ఘోరాలకి...ముసుగు మనిషికి, నాయక్ కు కోర్టు శిక్ష విధించింది.
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 12 (బోనస్ ఎపిసోడ్) చదవండి...
పోలీస్ కస్టడీ లో ఉన్న నాయక్, తన గత జీవితం ఎంత ఉన్నతంగా ఉండేదో ఊహించుకున్నాడు. ఆ విలాసమైన జీవితానికి తెర పడిందని బాధపడ్డాడు. ఇదంతా చేసింది, తాను ఉన్నతంగా ఎదగడాని కోసమే. కానీ, తన మీద ఆధారపడే తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం అలోచిన చేయక వాళ్ళను ఇబ్బందుల పాలు చేసాడు నాయక్. తన మొదటి భార్య మాయ గురించే తెగ ఆలోచించాడు నాయక్. ముగ్గురు కూతురులు చనిపోయారు. ఇప్పటిదాకా, నాయక్ గురించి పూర్తిగా మాయకు ఏమి తెలియదు.
నేను చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు అర్ధమైంది.. ఆ రోజు లత ను చంపేసి ఉంటే, ఈ కథ ఇంతవరకూ వచ్చేది కాదు. స్నేహితుని భార్య అని వదిలేయడమే చేసిన పెద్ద తప్పు. లత పగ తన కొడుకు రూపంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కాటు వేసింది. తన ఫ్యామిలీకి పడిన శిక్ష కన్నా..కోర్ట్ వేసినది పెద్ద శిక్ష కాదని భావించాడు నాయక్.
"మిమల్ని కలవడానికి ఎవరో వచ్చారు" అని సమాచారం వచ్చింది నాయక్ కు..
"ఎవరా..?" అని నాయక్ ఆత్రుతగా వెళ్ళాడు..
"నువ్వా మాయ..ఇక్కడకు వచ్చావా..?"
"ఇప్పటికి కుడా రాకపోతే ఎలా..? మన అమ్మాయిలు ఇంత దారుణంగా హత్యలకు గురికావడానికి కారణమైన మనిషిని చూద్దాం అని వచ్చాను. గొప్పగా ప్రేమించే మనసు ఉన్న మీలో ఇంత క్రూరుడు ఉన్నాడని నేను అస్సలు అనుకోలేదు. డబ్బు కోసం ఇంత చేస్తారా..? ఏం చేసుకుంటారు ఆ డబ్బంతా ఇప్పుడు..? రేపు మీకు ఉరి శిక్ష పడినా పడుతుంది.. తెలుసా ?.."
"నన్ను క్షమించు మాయ.."
"నేను ఎవరిని క్షమించడానికి...? ఆ దేవుడిని అడగండి క్షమించమని.." అని అక్కడనుంచి వెళ్లిపోయింది మాయ..
నాయక్ ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు. మర్నాడు తన భార్య సీమా కోసం కబురు పెట్టించాడు. సీమా నాయక్ ని చూడడానికి జైలుకు వచ్చింది..
"ఎలా ఉన్నావు సీమా..? నన్ను చూడడానికి రావాలనిపించలేదా.. ?"
"ఎలా ఉంటానో మీకు తెలియదా..? భర్త ఇలాంటివాడని తెలిసాకా.."
"నేను చేసింది తప్పే...కానీ బిజినెస్ డెవలప్మెంట్ కోసమే చేసాను. విధి నన్నువేరే లాగ వెంటాడింది..ఇప్పుడు నాకు ఒక సాయం చేస్తావా..? "
"మాయ గురించి సీమాకు చెప్పాడు నాయక్. ఆమెకు ఎవరూ లేరు. ఆమెను నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. మీరు అందరూ హ్యాపీ గా ఉంటే, నాకు అదే చాలు.."
"మీరు స్వతహాగా చెడ్డవారు కాదని నాకు తెలుసు. మీ కోసం నేను అలాగే చేస్తాను. మన అందరినీ ఈ స్థితికి తీసుకుని వచ్చిన ఆ నందా కొడుకుకి అ దేవుడే పెద్ద శిక్ష వెయ్యాలని కోరుకుంటున్నాను. మిగిలిన ఈ నా జీవితం ప్రశాంతంగా జీవించాలన్నదే నా కోరిక.."
మరో పక్క ఇన్స్పెక్టర్ రామ్ కి అందరూ జై జై లు పలుకుతున్నారు. పెద్ద ఇన్స్పెక్టర్ సర్ అయితే.. కేసు సాల్వ్ చేసి నిందితుడిని పట్టుకున్నందుకు ప్రమోషన్ ప్రకటించాడు. ఇన్స్పెక్టర్ కి సన్మానం కుడా ఏర్పాటు చేసారు. ఆ రోజు సన్మాన సభ లో..
"మన ఇన్స్పెకర్ రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆయన ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పరిష్కరించారు. గతం లో కుడా ఆయన చాలా కేసులు సాల్వ్ చేసారు. సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి అతనే సొంతంగా కష్టపడి ఈ కేసు సాల్వ్ చేసారు. రామ్ ని సన్మానించుకోవడం మనందరి అదృష్టం. ఆయనకు ప్రమోషన్ మీద వేరే ఊరు బదిలీ అయింది. అక్కడ కుడా ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుందాము.."
"అందరికీ నా కృతజ్ఞతలు..! నేను ఆ ముసుగు మనిషిని పట్టుకోవడానికి ముఖ్య కారణం మీ అందరి సహకారమే. మీ సహకారమే లేకపోతే.. మేము ఏమీ చెయ్యలేము..ఏమీ సాధించలేము..ఈ విషయంలో గొప్పగా సహకరించిన సుబ్బారావుగారికి, వారి అబ్బాయి ఆనంద్ కి నా కృతజ్ఞతలు. అంకిత తన ప్రాణాలను ఫణంగా పెట్టి హెల్ప్ చేసిందనే చెప్పాలి. ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరపున సహకారాలు ఉంటాయి..అయినా ముగ్గురు అమ్మాయిల ప్రాణాలు పోయినందుకు చాలా బాధగా ఉంది.." అన్నాడు రామ్
నందా తన కొడుకు చేసిన పనికి ఒక పక్క మనసులో మెచ్చుకున్నా...ఉన్న ఒక్క కొడుకు పరిస్థితి ఇలా అయినందుకు చాలా బాధపడ్డాడు. సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి..కనీసం ఉరిశిక్ష పడకుండా ఉంటే చాలని దేవుడిని కోరుకున్నాడు. నాయక్ మీద పీకల దాకా కోపం ఉన్నా..వాడి పాపాన వాడే పోతాడని, పైగా స్నేహితుడు కుడా..అందుకే వదిలేసాడు.
ఇక్కడ సుబ్బారావు ఇంట్లో "పెద్ద గండమే తప్పిందే అమ్మాయి అంకిత..! రోజులు అసలే బాగోలేవు..అమ్మాయిలని ఒంటరిగా అస్సలు పంపలేము.. ఆ బులెట్ తగలరాని చోట తగిలి ఉంటే, మన అమ్మాయి మనకి దక్కేది కాదు.." అని కాంతం ఏడుస్తూ ఉంది..
"ఊరుకో అమ్మా..! ఇప్పుడు ఏమైందని..? మనం చేసిన సాహసానికి మనకి అవార్డు కుడా ప్రకటించారు..తెలుసా..? నేను చేసిన సాహసానికి నాకు పోలీస్ ఉద్యోగం కుడా ఇస్తానని చెప్పారు ఇన్స్పెక్టర్ రామ్..అంతా మంచే జరిగింది మరి.."
"అవును అనుకో..నేను చేసిన పూజలు వలన దేవుడు అనుగ్రహించాడు.." అంది కాంతం కళ్ళు తుడుచుకుంటూ..
"అక్కా..! అక్కా..!"
"ఎవరు..?!"
"నేను తేజాని..మీరందరూ నన్ను క్షమించాలి..ఇన్ని సంవత్సరాలు మీ మీద కోపంతో మిమల్ని ఇబ్బంది పెట్టడానికి చూసాను. బావగారు ఎంత గొప్ప మనసున్న వారో, ఎంత ధైర్యం కలవారో తెలిసింది. అమ్మా, నాన్న..మీ అందరినీ ఇంటికి రమ్మని పిలిచారు.."
"సంతోషం..! అందరం కలిసాము..." అని ఎంతో ఆనందించింది కాంతం.
=============================================================================
సమాప్తం
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ తాత మోహనకృష్ణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
=============================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments