'The Killer Episode 3' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 14/01/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాంతం అండ్ సుబ్బారావు..ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట. పెళ్ళి తర్వాత కలిసి వచ్చి..మంచి ఇల్లు కట్టుకుని, దానికి 'అంకితా నిలయం' అని కూతురి పేరు పెట్టుకున్నాడు. రత్నాల్లాంటి పిల్లలు...అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు.
వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు. ఇక మీదట ఒక్క ప్రాణం పోకూడదని, రామ్ కు ఫుల్ పవర్స్ ఇస్తాడు పెద్ద ఇన్స్పెక్టర్ సర్.
మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ముసుగు మనిషి పెట్రోల్ పోసి..నిప్పు పెట్టి పారిపోతాడు. సీసీ టీవీ లో రికార్డు అవుతుంది. రామ్ ఈ కేసు ని ఇంకా సీరియస్ గా తీసుకుంటాడు.ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి..అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని..కేరళ వెళ్ళారని తెలిసి..నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్..
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 3 చదవండి..
నాయక్ అతని భార్య హాస్పిటల్ లో ఉన్నారని తెలిసింది రామ్ కు..
రామ్ కేరళ చేరుకున్నాకా, హైదరాబాద్ పోలీస్ లను అలెర్ట్ చేసాడు. తనని దారిలో ముసుగు మనిషి ఫాలో చేసాడని..చంపడానికి ట్రై చేసాడని..అక్కడ హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కు అప్డేట్ చేసాడు.
"మీకేమి అవలేదు కదా సర్"
"లేదు..కాని అతని కోసం వెతకండి.."
"సీసీ కెమెరా ఆధారంగా ఆ ముసుగు మనిషి స్కెచ్ వేయించండి..ఈలోపు నేను ఇక్కడ పని చూసుకుని వస్తాను..స్కెచ్ ని వెంటనే, నాకు పంపించండి.." అన్నాడు రామ్
***
ఇక్కడ సుబ్బారావు బావమరది భవాని, చాలా సంవత్సరాలుగా తన లో ఉన్న పగ.. ఇంకా పెంచుకుంటూనే ఉన్నాడు. తన సొంత మేనకోడలి పైనే మనసు పడ్డాడు. ఆ రకంగా, కుటుంబం మీద కక్ష సాధించాలని ఫిక్స్ అయ్యాడు. దానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు.
ముసుగు మనిషి స్కెచ్ వెయ్యడానికి సరైనా ఆర్టిస్ట్ దొరకట్లేదు. ముసుగు లోపల ముఖం ఎలా ఉంటుందో ఉహించి వెయ్యగల టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కోసం పోలీస్ లు వెతుకుతున్నారు. అలాంటి ఆర్టిస్ట్ ఒక్కడే ఉన్నాడు..అతనే రవివర్మ. అతను చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అని అందరూ అంటున్నారు. అయితే అతనినే పిలిపించి...వేయించండి అని రామ్ ఆర్డర్.
"ఈలోపు సిటీ అంతా అలెర్ట్ చెయ్యండి..ఎవరు అనుమానంగా కనిపించినా కస్టడీ లోకి తీసుకోండి..మనకి ఆ హంతకుడి మోటివ్ తెలియట్లేదు. నేను ఇక్కడ అది తెలుసుకునే పని లోనే ఉన్నాను.." అన్నాడు రామ్.
***
"నాన్నా! రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీ లో...కొంచం తొందరగా వెళ్ళాలి..మీరు రేపు ఉదయాన్నే రెడీ గా ఉండండి..నన్ను కాలేజీ లో దించడానికి..రోజు కన్నా కొంచం ముందుగా దించాలి.."
"అలాగే అంకిత..ఎగ్జామ్స్ కి బాగా చదువుకో..దాని గురించి ఆలోచించకు..నేను నిన్ను డ్రాప్ చేస్తాను.."
"ఓకే నాన్న!"
మర్నాడు ఉదయం సుబ్బారావు నిద్ర లేవలేదు..
"ఏమండీ! లేవండి..అమ్మాయిని కాలేజీ లో దింపాలి కదా...అయ్యో! ఈ మనిషికి వొళ్ళు ఇలా మండిపోతుందేమిటి! ఇప్పుడేమిటి చెయ్యడం. ఒరేయ్ ఆనంద్! ఒకసారి రారా!"
"అన్నయ్య లేడమ్మా! బయటకి వెళ్ళిపోయాడు.."
"వాడికి ఫోన్ చేసి, నిన్ను కాలేజీ లో దించమని అడుగు...నాన్న కి జ్వరంగా ఉంది..నేను హాస్పిటల్ కు తీసుకుని వెళ్తాను"
"అమ్మా! అన్నయ్య ఫోన్ తియ్యట్లేదు...నాకు కాలేజీ కి టైం అయిపోతుంది...నేను ఆటో లో వెళ్ళిపోతానులే.."
"జాగ్రత్త తల్లీ!"
"నువ్వు కంగారు పడకు..నేను వెళ్తాను లే!"
అంకిత..సెంటర్ కి వెళ్లి ఆటో ఎక్కింది...కాలేజీ అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు. రోజూ నాన్న కాలేజీ కు దింపి...మరల..రిటర్న్ లో ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఒక పక్క కాలేజీ కి టైం అయిపోతుంది..ఈలోపే ఆటో సడన్ గా ఆగిపోయింది..
"ఏమైంది అన్నా! ఆటో ఎందుకు ఆగిపోయింది..."
"చూస్తున్నాను...ఒక్క ఐదు నిమిషాలు.."
కాలేజీ కు టైం అవడం తో...ఎవరినైనా లిఫ్ట్ అడిగి...వెళ్ళాలని అనుకుంది అంకిత..అటుగా వచ్చిన నల్లటి వ్యాన్ ను ఆపి లిఫ్ట్ అడిగి వెళ్ళింది అంకిత...
అక్కడ కేరళ అందాల చూసి తన పాత రోజులు గుర్తుకు వచ్చాయి..ఇన్స్పెక్టర్ రామ్ కి..
రామ్ పుట్టి పెరిగింది కేరళ లోనే..అప్పటికి ఇప్పటికి ఊరు చాలా మారిపోయింది. తను చదువుకున్న స్కూల్, ఆ పరిసరాలు అన్నిటినీ చూసి పాత రోజులు గుర్తు చేసుకున్నాడు..
రాణి..తన కాలేజీ లో బెస్ట్ ఫ్రెండ్. రాణి చాలా మంచి అమ్మాయి. కాలేజీ లో టాపర్. మొదటి చూపులోనే, రామ్ కు స్నేహం చెయ్యాలని అనిపించింది. అలా..ఇద్దరి స్నేహం రోజు రోజు కు పెరిగింది. రాణి ఎప్పుడూ రామ్ ఇంటికి వస్తూ పోయేది..ఇంట్లో పేరెంట్స్ కు రాణి చాలా దగ్గరైంది. రామ్ పేరెంట్స్ ఎప్పుడు రాణి లాంటి అమ్మాయి కోడలు అయితే, రామ్ లైఫ్ బాగుంటుందని ఆశ పడేవారు. కానీ రామ్ ఇంకా..పోలీస్ అవ్వాలని.. తన కోరిక తీరనిదే పెళ్ళి చేసుకోనని చెప్పేసాడు. దానికి తల్లిదండ్రులు కుడా ఓకే చెప్పారు.
ఒక రోజు రాణి తో ఇంట్లో అమ్మ అనుకున్న విషయం చెప్పాడు. తనకు కుడా ఇష్టమే అని.. తన మనసులో మాట చెప్పేసాడు. దానికి రాణి నవ్వుతూ..సరే..నువ్వు ముందు పోలీస్ అవ్వు. అప్పుడు చూద్దాం అని చెప్పింది.
"పోలీస్ అవుతాను కానీ..నాకు ఒక ముద్దు ఐనా లేదా మహారాణి గారు? ప్రియురాలంటే, ప్రియుడి పక్కనే ఉండేది..కోరిక తీర్చేది కాదా..చెప్పు..!"
పెళ్ళైన తరువాత..నీకు ఎన్ని కావాలంటే, అన్ని తీసుకో..ఏది కావాలంటే అది ఇస్తాను..అంతవరకు వెయిట్ చెయ్యాలి రామ్ గారు!
"ఈలోపు కనీసం సినిమా కు, పార్క్ కు వెళ్ళొచ్చు కదా..దానికైనా పర్మిషన్ ఇస్తార..రాణిగారు..."
"ముందు గా ఇలానే అంటారు..తర్వాత సినిమా లో కార్నెర్ సీట్ అంటారు, చేతులు వెయ్యడం అన్నీ చేస్తారు మీరు. ఇక పార్క్ అంటారా..అక్కడకు వచ్చిన జంటలు చూసి, మనం కుడా అలాగే చెయ్యాలని అంటారు!"
"ఇంత తెలిసిన దానివి..ఎందుకు వద్దంటావు చెప్పు..ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్ రాణి.."
"అయితే, రేపు సినిమా కు వెళ్దాము. టికెట్స్ బుక్ చేసి కాల్ చేస్తాను. రెడీ గా ఉండు. అయితే కార్నర్ సీట్స్ తీసుకుంటాను మరి..ఓకే నా?"
"ఒక నవ్వు నవ్వి...అలాగే లెండి.." అంది రాణి
సినిమా చూసిన తర్వాత..
"రాణి..చాలా ఆకలి వేస్తుంది..అలా హోటల్ కు వెళ్దామా? "
"సరే..నాకూ ఆకలి వేస్తుంది.."
అలా, హోటల్ కు వెళ్లి, మంచి ఫుడ్ తిన్నారు. తిన్నది అరగాలి కదా రాణి..ఇప్పుడు పార్క్ కు వెళ్లి అలా సరదాగా వాకింగ్ చేద్దాము."
"సరే..అలాగే..రామ్..ఈ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి.."
మర్నాడు రామ్ పేరెంట్స్ సడన్ ట్రిప్ ప్లాన్ చేస్తునప్పుడు రాణి అక్కడకు వచ్చింది. రాణి కుడా వస్తానని అడిగింది. రామ్ సిటీ లో లేడు..రాణి వస్తే, తోడుగా ఉంటుందని..ఒప్పుకున్నారు..
రామ్ అమ్మ తన కొడుకు పోలీస్ అవ్వాలని..వేరే ఊరులో ఉన్న గుడి కొస్తానని మొక్కుకోవడానికి వెళ్ళాలని భర్త తో చెప్తే..సడన్ గా ట్రిప్ ప్లాన్ చేసారు.
అలాగ, ఒక ట్రావెల్స్ బస్సు లో అందరూ..బయల్దేరారు. ఇదంతా రామ్ కు తెలియకుండానే ప్లాన్ చేసారు. కొంత దూరం ప్రయాణం తర్వాత అర్ధరాత్రి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సు లో ఉన్న వారంతా సజీవ దహనం అయ్యారని టీవీ లో బ్రేకింగ్ న్యూస్..అది విన్న రామ్ కు పెద్ద షాక్. తల్లి దండ్రులు..అటు ఇష్టపడిన అమ్మాయి ఒకే సారి దూరం అవడం..చాలా బాధ పడ్డాడు రామ్.
తన రాణి కోరుకున్నట్టుగా...ఎలాగైనా పోలీస్ అవ్వాలని, గట్టిగా చదివి పోలీస్ ఉద్యోగం లో చేరాడు రామ్.
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments