top of page
Writer's pictureMohana Krishna Tata

ది కిల్లర్ - ఎపిసోడ్ 5



'The Killer Episode 5'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 31/01/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. రత్నాల్లాంటి పిల్లలు 'అంకిత, ఆనంద్' అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు. 


వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి.. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని.. కేరళ వెళ్ళారని తెలిసి.. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్.. 


కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్. 


సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. 

తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. 

నాయక్ ఉన్న హాస్పిటల్ లో డాక్టర్ ని కలిసి విషయాలు తెలుసుకుంటాడు రామ్. తర్వాత నాయక్ భార్య సీమ ను కలుస్తాడు. 


ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 5 చదవండి.. 


నాయక్ కోమా నుంచి తేరుకున్నాక.. అతని భార్య తో మాట్లాడుతూ, విషయాలు తెల్సుకున్నాడు. ఇన్స్పెక్టర్ రామ్ గురించి చెప్పింది సీమ. "ఇన్స్పెక్టర్ నిన్న వచ్చి నన్ను ఏవో ప్రశ్నలు అడిగారు.. అతను చెప్పిన విషయం నాకు అర్ధం కాలేదు. ఈ రోజు వచ్చి మీతో మాట్లాడుతానని అన్నాడు.."

 

"మనకి పెద్ద గండం గడచిందండి.. అంత పెద్ద ఆక్సిడెంట్ నుంచి.. కోమా లోకి వెళ్లి.. తెరుకున్నాము.. ఆ దేవునికి కోటి దండాలు. మీరు మళ్ళీ ఇలా మాట్లాడుతారో లేదోనని ఎంతో భయపడ్డాను. సేఫ్ గా బయట పడ్డారు.. అదే చాలు నాకు. ఎవరికీ ఎటువంటి హాని చెయ్యని మీకు ఇలా జరగడం ఏమిటో?.. "


"మనం వచ్చిన బిజినెస్ ట్రిప్ ఇలాగైందని నేను బాధ పడుతున్నాను.. " అన్నాడు నాయక్. 


"బిజినెస్ ది ఏముందండి.. మళ్ళీ డెవలప్ చేసుకోవొచ్చు లెండి!.. ఇప్పటివరకు మన గురించి ఎవరికీ చెప్పలేదండి.. "


"హలో! లోపలికి రావొచ్చా.. ?"


"ఇన్స్పెక్టర్ గారు రండి.. "


"నిన్న వచ్చారంట.. చెప్పండి.. ఏదో మాట్లాడాలన్నారు?.. ఓకే అలాగే.. కారిడార్ లోకి వెళ్లి మాట్లాడుదాం ఇన్స్పెక్టర్ రామ్"


ఒక కేసు గురించి మీతో మాట్లాడాలి.. ఈ మధ్య సీరియల్ హత్యలు జరుగుతున్నాయి. అందులో ఒక అమ్మాయి డీటెయిల్స్ వెరిఫై చేస్తే, కేర్ ఆఫ్ మీ పేరు ఉంది. 


"ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? నాకు ఒకే అమ్మాయి.. చదువుకుంటుంది.. "


"నాయక్ ముఖం లో ఏదో దాస్తున్నట్లు అనిపించింది రామ్ కి. 'ఓకే' సర్ అని చెప్పి.. అక్కడ నుంచి బయల్దేరాడు..


రామ్ కి నాయక్ చెప్పిన సమాధానం అంతగా కరెక్ట్ అనిపించలేదు. తన నుంచి ఇన్ఫర్మేషన్ గట్టిగా అడగడం ఇప్పుడు కరెక్ట్ కాదని, అనుకున్నాడు. ఒకవేళ అడిగినా, చెప్పడేమో అని అనిపించింది. నాయక్ గురించి ఎంక్వయిరీ చెయ్యాలని అనుకున్నాడు. నాయక్ గురించి ఎంక్వయిరీ చేయగా.. అతని బెస్ట్ ఫ్రెండ్ నంద గురించి తెలిసింది. 


నంద మరియు నాయక్ మంచి మిత్రులు. చిన్నప్పటినుంచి కలిసి చదువుకుని.. ఒకటే బిజినెస్ గోల్స్ ఉన్న మంచి ఫ్రెండ్స్. రామ్ ఎంక్వయిరీ చెయ్యగా, నంద బెంగుళూరు లో ఉన్నట్టు తెలిసింది. 


నంద అండ్ నాయక్ మంచి ఫ్రెండ్స్. బిజినెస్ పార్టనర్స్ కుడా. నాయక్ కు డబ్బు పెట్టగల సత్తా ఉంటే, నంద మంచి తెలివితేటలతో బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. చాలా సంవత్సరాల వరకు వారి బిజినెస్ గొప్ప గా సాగింది. ఇద్దరు డబ్బు బాగా సంపాదించారు. కానీ ఇప్పుడు నంద విడిపోయి వేరే బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది రామ్ కు. నాయక్ గురించి ఎక్కువ తెలిసేది నంద కే. అంత మంచి ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారో?


ఏది ఏమైనా, నంద ను కలిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని.. రామ్ కు అనిపించి బెంగుళూరు బయల్దేరాడు. అక్కడకు చేరుకున్న రామ్ కు నంద ఆఫీస్ లో అతనిని కలవడానికి వెళ్ళాడు. అందమైన గాజు అద్దాలతో మెరిసిపోతున్న పెద్ద ఆఫీస్ అది. అది నంద సొంత ఆఫీస్ నని తెలిసింది. 


రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న రామ్ ను లోపలికి రమ్మన్నాడు నంద. 


"హలో నంద గారు! ఐ యాం రామ్.. "


"హలో రామ్ సర్.. ! ఇక్కడకు రావడానికి కారణం తెలుసుకోవచ్చా? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ.. డ్రింక్స్.. "


"నో.. థాంక్స్.. "


"నాయక్ మీకు తెలుసా?.. "


"బిజినెస్ పర్సన్ నాయక్.. ?”


"అవును.. "


"తెలుసు.. "


"ఇప్పుడు నాయక్ హాస్పిటల్ లో ఉన్నారని మీకు తెలుసా.. ?"


"మొన్ననే తెలిసింది. కోమా నుంచి బయటకు వచ్చాడని.. అంతకు మించి ఏం తెలియదు రామ్ గారు.. "


"ఏం లేదు నందా గారు.. మీకు నాయక్ బాగా తెలుసు కదా.. "


"ఒక్కప్పుడు మేము బిజినెస్ పార్టనర్స్.. "


"ఇప్పుడు?"


"ఇప్పుడు మేము విడిపోయాము.. నేను సెపరేట్ గా బిజినెస్ చేస్తున్నాను.. "


"ఎందుకు విడిపోయారో.. తెలుసుకోవచ్చా?"


"నాకు కొన్ని విషయాలు నచ్చక.. విడిపోయాము.. "


"ఏమిటో ఆ విషయాలు తెలుసుకోవచ్చా?.. "


"అది చాలా పెద్ద కథ సర్. మీకు అవసరం లేదను కుంటున్నాను.. "


"పర్వాలేదు.. చెప్పండి.. మా ఇన్వెస్టిగేషన్ కు చాలా అవసరం.. "


****


నాయక్, నేను మంచి ఫ్రెండ్స్. నాయక్ ది మొదటి నుంచి డబ్బున్న కుటుంబం. వాళ్ళ నాన్నగారు బిజినెస్ లో గొప్ప పేరు సంపాదించి, ఎప్పుడు టాప్ లోనే ఉండేవారు. బాగా ఆస్తి సంపాదించి నాయక్ కు ఆఫీస్ బాధ్యతలు అప్పగించి ఆయన కన్ను మూసారు. అప్పటికి ఆ బిజినెస్ చాలా లాస్ లో ఉండేది. ఆఖరి రోజుల్లో, బిజినెస్ సరిగ్గా నడవక.. నష్టాలలో ఉండేది. నాయక్ బిజినెస్ స్కూల్ లో చదువుకోవడం చేత.. సొంతంగా బిజినెస్ చూసుకునేవాడు. కానీ, కంపెనీ నష్టాలలోనే ఉండేది. 


చదువు అయిపోయిన నేను.. ఒక చిన్న కంపెనీ లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నాయక్ తన బిజినెస్ లో బిజీ గా ఉండేవాడు. ఎప్పుడో కానీ కలవడం అయ్యేది కాదు మా ఇద్దరకూ. కలిసినా.. ఎప్పుడు అమ్మాయిల గురించే ఎక్కువ మాట్లాడేవాడు. బిజినెస్ గురించి ఎప్పుడు నా దగ్గర చెప్పేవాడు కాదు. నేను పెద్దగా ఎప్పుడు అడగలేదు. 


అలా, నేను నా ఉద్యోగంలో చిన్నగా ఎదుగుతూ.. వస్తున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాకు పెళ్ళి చేసి, తన బాధ్యత తీరిపోతుందని అంటే, ఆనందం తో.. అమ్మకు ఓకే చెప్పాను. అమ్మ చాలా సంతోషించి.. ఉన్న నాలుగు మంచి సంబంధాల గురించి నాకు చెప్పింది. అందమైన అమ్మాయి ఐన లత అయితే నాకు చాలా బాగుంటుందని అనిపించింది. వెంటనే అమ్మకు చెప్పి ముహూర్తాలు పెట్టించాను. పెళ్ళిచూపులలో నేనంటే చాలా ఇష్టమని చెప్పింది లత. 


నాయక్ కు ఈ హ్యాపీ న్యూస్ చెబుదామని ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవలేదు. పెళ్ళి కార్డ్స్ కుడా అచ్చయ్యాయి. ఒక రోజు నాయక్ నాకు కాల్ చేసాడు. నా పెళ్ళి విషయం చెప్పగానే, ఒక పక్క సంతోషించినా.. ఎందుకో చాలా ఫీల్ అయ్యాడు. వెంటనే నన్ను ఎప్పుడు కలిసే చోట కలవాలని అన్నాడు. 


ఎప్పుడు మేము కలిసే చోటే కలిసాము. ఆ రోజు నాయక్ మందు కొంచం ఎక్కువే తీసుకుని తన మనసులో మాట చెప్పేసాడు. నాకు పెళ్ళి కుదిరిందని చెప్పి, లత ఫోటో చూపించాను. "అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి.. నువ్వు చాలా అదృష్టవంతుడవు.. నీ జీవితం అంతా ఇంక.. హాపీస్.. రా!" అన్నాడు నాయక్


"నువ్వు కుడా పెళ్ళి చేసుకో నాయక్.. కావాలంటే, నేను ఆగుతాను.. ఇద్దరు ఒకేసారి పెళ్ళి చేసుకుందాం. మంచి అమ్మాయిని చూడమంటావా?"


"ఉన్న ఒక్క నాన్న పోయారు. ఇప్పుడు నా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు?.. "


"నేను చూస్తాను రా.. నీకు మంచి పెళ్ళి సంబంధం.. "


"నా బిజినెస్ బాగా డెవలప్ అయ్యాకే నా పెళ్ళి.. అప్పుడే నాకు సంతోషం రా నందా!.. అంతవరకు.. నో.. "


"దానికి నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు.. ?"


"నువ్వు చాలా తెలివైన వాడివి కదా.. నాతో చేతులు కలిపితే, ఇద్దరమూ బిజినెస్ డెవలప్ చేద్దాము.. పార్టనర్ గా నీకు వాటా ఇస్తాను.. ఏమంటావు నందా?.. "


“ఫ్రెండ్ కోసం ఏమైనా చెయ్యాలనుకుని.. ఓకే అన్నాను.. డబ్బులు గురించి ఏమి ఆలోచించలేదు.. 


ఇంటికి వచ్చిన నేను.. ఈ విషయం మా అమ్మతో చెప్పాను. నాకు అమ్మయినా ఉంది.. కానీ నాయక్ కు ఎవరు లేరు.. అందుకే అమ్మ కుడా ఒప్పుకుంది. వెంటనే ఉద్యోగం మానేసి.. నాయక్ కు హెల్ప్ చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. ఆ రోజు నాకు చాలా హ్యాపీ గా అనిపించింది. నా ఫ్రెండ్ తో కలిసి బిజినెస్ చేస్తాను కదా!


=====================================================================

ఇంకా వుంది.. 

 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ








73 views0 comments

Comments


bottom of page