'The Killer Episode 8' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 16/02/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్.
వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్.
కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్.
సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.
నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు.
నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది. ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్. లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నందా.
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 8 చదవండి.
అంకిత ను కిడ్నాప్ చేసినప్పటినుంచి ఆ ఇంట్లో సందడి లేదు. తల్లి, తండ్రి ఇద్దరు తిండి కుడా సరిగ్గా తినట్లేదు. ఇదంతా చూసిన కొడుకు ఆనంద్.. తన చెల్లెల్ని కిడ్నాప్ చేసింది తన మావయ్యే అనీ, ఇంటికి వెళ్లి మావయ్య ను నిలదీశాడు. తనకి ఏమి తెలియదని చెప్పాడు.
ఈలోపు టీవీ లో ఇంకో బ్రేకింగ్ న్యూస్.. ప్రముఖ బిజినెస్ పర్సన్ నాయక్ కుమార్తె కిడ్నాప్ అని. కోల్‌కాతా లో ఉంటున్న తన కుమార్తె ను ఎవరో కిడ్నాప్ చేసారని సీమా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.
ఇన్స్పెక్టర్ రామ్ చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. అమ్మాయిలు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు.. నాయక్ కు కుమార్తె ఇప్పుడు కిడ్నాప్ అయ్యింది.. మరి చనిపోయిన అమ్మాయి నాయక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకు ఇచ్చినట్టు? ఈ కేసు నేను ఒక్కడినే చేదించడానికి చూడడం వల్ల ఇంత టైం పడుతుందేమో. కానీ.. అలా చేస్తేనే, నాకు ప్రమోషన్, గుర్తింపు వస్తాయి. అందుకే, మరొకర్ని ఈ కేసు లో హెల్ప్ అడగలేను.
సుబ్బారావు గారి అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమైందో తెలియదు. ఈ నల్లటి వ్యాన్ గురించి చాలా మంది చెప్పారు.. కంప్లైంట్ లో కుడా చెప్పారు. ఈ లోపు సిటీ లో ఎక్కడైనా.. నల్లటి వ్యాన్ కనిపిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చెయ్యాలని అనౌన్స్ చేయించాడు ఇన్స్పెక్టర్ రామ్.
ఇదిలా ఉండగా.. సిటీ మారుమూల, ఒక నల్ల వ్యాన్ చూసినట్టు.. ఎవరో సుబ్బారావు కు చెప్పారు. ఆ వ్యాన్ లోనే కదా అంకితను తీసుకుని వెళ్ళింది.. నేను అక్కడకు వెళ్తాను.. అని సుబ్బారావు బయల్దేరాడు.
"వద్దు నాన్న!.. ఒంటరిగా వద్దు.. ఇన్స్పెక్టర్ రామ్ కు చెబుదాము.. "
"హలో ఇన్స్పెక్టర్ రామ్ గారా? నేను సుబ్బారావు.. మా అమ్మాయి అంకిత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. మా అమ్మాయి ఎక్కిన నల్ల వ్యాన్ లాంటిదే చూసినట్టు ఇక్కడ ఎవరో చెప్పారు.. మీరు త్వరగా రండి.. మేము ఆ ప్లేస్ కి దగ్గరగానే ఉన్నాము.. "
"లొకేషన్ షేర్ చెయ్యండి.. ఇప్పుడే వస్తున్నాను.. మీరు అక్కడే ఉండండి.. లోపలికి వెళ్ళకండి.. చాలా డేంజర్.. "
"అలాగే.. సర్"
రామ్ కొంత మంది కానిస్టేబుల్ లతో ఆ ప్లేస్ కు చేరుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టే, నల్ల వ్యాన్ అక్కడ ఉంది.. దాని పై కనిపించకుండా గడ్డి కప్పి ఉంది. ఈ వ్యాన్ కలర్ చేంజ్ చేసుకునే విధంగా డిజైన్ చేసారు. నెంబర్ ప్లేట్ కుడా ఒరిజినల్ కాదు. అందుకే, దీన్ని ట్రాక్ చెయ్యలేకపోయాము. సీసీ కెమెరా లో కనిపించలేదు.
ఇన్స్పెక్టర్ రామ్ లోపలికి వెళ్ళడానికి ముందుకు కదిలాడు. చేతిలో పిస్టల్.. వెనుక ఇద్దరు కానిస్టేబుల్స్. ఆ పై ఆనంద్, సుబ్బారావు కుడా వెనుకే ఉన్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి.. అంకిత ను తాళ్ళతో కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నట్టు చూసారు. చుట్టూ చూస్తే, చాలా భయానకంగా ఉంది. అక్కడ మనుషులు ఉంటారని ఎవరూ ఉహించరు.. అది ఒక పాడు బడ్డ ఇల్లు. లోపల.. చాలా భయంకరంగా ఉంది.. ఇన్స్పెక్టర్ చుట్టూ చూసి, ఎవరు లేరని సైగ చేసాడు. అందరూ లోపలికి వచ్చారు.
అంకిత ను చూసిన.. సుబ్బారావు.. ఆమె దగ్గరక వెళ్ళబోయాడు. ఆమె స్పృహ లో లేదు. ఈ లోపు ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. అందరూ లోపల దాక్కుని చూస్తున్నారు. ఎటాక్ చేస్తే, హంతకుడు తప్పించుకునే, ప్రమాదం ఉందని అనుకున్నారు. అందుకే, ఒక పక్కన ఉన్నారు.
ఈ లోపు ఆ ముసుగు మనిషి అక్కడకు వచ్చాడు. అందరూ ఊహించినది కరెక్టే.. అతని వెనుక ఒక అమ్మాయి ని తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి వయసు కుడా అంకిత వయసే.. నోటికి ప్లాస్టర్ వేసి.. చేతులుకట్టేసి, స్పృహ లో లేదు. ఒక గోనె సంచి లో మోసుకుని వచ్చాడు.
ఈలోపు పోలీసులు చుట్టురా సర్కిల్ చేసారు ఆ ముసుగు మనిషిని. వెంటనే అతని చేతులు కట్టేసి.. కూర్చోబెట్టారు.
సుబ్బారావు తన కూతురి దగ్గరకు వెళ్లి, కట్లు విప్పదీసి.. ముఖం పై నీళ్ళు చల్లాడు. స్పృహలోకి వచ్చిన అంకిత.. నాన్నా అని గుర్తుపట్టింది..
ఇన్స్పెక్టర్ రామ్ ఆ గొనె సంచిలో ఉన్న అమ్మాయిని విడిపించమని చెప్పాడు. మిగిలిన వారు ఆ అమ్మాయి నోటి మీద ప్లాస్టర్ తీసి, కట్లు విప్పారు.. అమ్మాయి ఇంకా స్పృహ లోకి రాలేదు.
"ఎవడ్రా నువ్వు?” అని గట్టిగా రెండు తగిలించాడు ఇన్స్పెక్టర్ రామ్..”ఇన్నాళ్ళు మమల్ని చాలా టార్చర్ పెట్టావు.. "
"నా బ్యాడ్ లక్.. నేను దొరికిపోయాను.. నన్ను ఈ ఒక్కరోజు వదిలేసి చూడు.. రేపు నేనే నీకు లొంగి పోతాను.. "
"ఒక్కరోజు లో ఏం చేస్తావు.. ఇంకో హత్య చేస్తావేమో?.. ఎన్ని తిప్పలు పెట్టావు రా.. అందరినీ.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు రా.. ఇక్కడే ఎన్‌కౌంటర్ చెయ్యాలని ఉంది.. కానీ.. నిన్ను చంపితే, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నీతోనే అంతమైపోతాయి.. " అని రామ్ గట్టిగా అన్నాడు
"నీకు కావలసిన డీటెయిల్స్ ఏమిటో? నిన్ను ఆ రోజే గురి పెట్టాను.. బతికి పోయావు ఇన్స్పెక్టర్ రామ్.. ఇంతవరకు వస్తావని అనుకోలేదు.. నేను చేసిన తప్పు ఒక్కటే! కోల్‌కాతా నుంచి గోనె సంచీలో.. ఈ అమ్మాయిని తీసుకుని వచ్చేవరకు ఇక్కడ నా వ్యాన్ ఉంచడమే.. "
"అదే రా నిన్ను పట్టించేసింది.. ఇటు పక్క ఎవరూ రారని అనుకున్నావు.. కానీ, ఇక్కడకు వచ్చిన కొంత మంది నీ గుట్టు చెప్పారు. నీ పేరేమిటి ? ఇన్ని హత్యలు చేసి ఏమిటి సాధించావు?.. "
"ఇంకా.. రెండు హత్యలున్నాయి.. అవి చేసేస్తే.. నా పగ చల్లారుతుంది.. ” అంటూనే, ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న పిస్టల్ ని కాలితో కొట్టి.. తన చేతిలోకి తీసుకుని.. ఆ ఇద్దరి అమ్మాయిలని కాల్చే ప్రయత్నం చేసాడు. తేరుకున్న రామ్, వారించడం తో.. గురి తప్పి అమ్మాయిల ఇద్దరి చేతికి గాయం అయ్యింది..
వెంటనే ఇద్దరినీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని సుబ్బారావు, ఆనంద్ కు రామ్ చెప్పాడు.. ఇద్దరు వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్ వైపు దారి పట్టారు.
ఈ సారి ముసుగు మనిషి ని గట్టిగా కట్టి.. చుట్టూ రౌండ్ అప్ చేసి.. నిజం చెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామ్.
"ఇప్పుడు చెప్పరా.. ఈ హత్యలు ఎందుకు చేసావు?.. "
"మొదట.. హైదరాబాద్ లో అమ్మాయి ని చంపేసి.. ఊరి చివర పడేసాను. ఆ తర్వాత ముఖం పచ్చడి చేసాను. చాలా గోల చేసింది.. చంప్పొద్దని.. పాపం.. !
తర్వాత.. తమిళనాడు లో ఇంకో అమ్మాయి.. ఇదే తరహా లో చంపేసాను.. తర్వాత.. బెంగుళూరు లో సాఫ్ట్వేర్ అమ్మాయి.. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిని.. షూట్ చేసేసాను.. ఇంకా.. అంకిత.. లెక్క చూసుకో ఇన్స్పెక్టర్ రామ్..
నా ముసుగు స్కెచ్ వేయించిన మనిషి మీకు వేరే బొమ్మ వేసి ఇచ్చాడు. అందుకే నన్ను నువ్వు పట్టుకోలేకపోయావు. అదీ నా తెలివి.. "
"ఎందుకు ఇంతమందిని చంపాలని టార్గెట్ చేసావు రా?.. "
"నీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పనా ఇన్స్పెక్టర్.. ! అది నీ ఇన్వెస్టిగేషన్ లో.. నీకు ఎవరూ చెప్పి ఉండరు.. "
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments