top of page
Writer's pictureMohana Krishna Tata

ది కిల్లర్ - ఎపిసోడ్ 9



'The Killer Episode 9'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 21/02/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్. 


వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్. 


కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్. 


సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. 


నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు. 


నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది. ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్. లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నందా. 

ముసుగు మనిషిని పట్టుకుంటాడు రామ్. 

నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగు మనిషి. 


ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 9 చదవండి. 


నాయక్ తన ఫ్రెండ్ నంద దగ్గర చాలా విషయాలు దాచాడు. అప్పటికే తనకి పెళ్ళి అయినట్టు కుడా చెప్పలేదు. నాయక్ తన ఫ్రెండ్ నంద ని తన కంపెనీ లోకి ఆహ్వానించక ముందే.. పెళ్ళి చేసుకున్నాడు. 


అప్పట్లో, నాయక్ బిజినెస్ టూర్ కోసం ముంబై వెళ్ళినప్పుడు.. అక్కడ పరిచయమైంది మాయ. ఎక్కడో ఒంటరిగా ఉంటున్న మాయ, ఒక సారి రోడ్ క్రాస్ చేస్తుంటే, నాయక్ కార్ కింద పడింది. కొంచం దెబ్బలతో బయట పడింది. వెంటనే, నాయక్ కు కోపం వచ్చినా.. మాయ అందం చూడగానే, నోట మాట రాలేదు. నాయక్ ఎంతో మంది అమ్మాయిలను చూసినా.. తన ఆఫీస్ లో ఉన్న అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంది మాయ. ఆమె సౌందర్యం.. నాయక్ ను కట్టి పడేసింది. ఏమీ అనలేకపోయాడు. 


వెంటనే, కార్ దిగి.. మాయ ను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో తానే స్వయంగా తీసుకుని వెళ్లి.. డాక్టర్ కు చూపించాడు. అవసరమైన అన్నీ టెస్ట్స్ చేయించాడు. మాయ తో దగ్గరగా మాట్లాడడానికి సమయం కోసం చూసాడు నాయక్. 


"ఇప్పుడు మీకు ఎలా ఉంది? 'ఐ యాం వెరీ సారీ'.. నాదే తప్పు.. ఇంతకీ మీ పేరు ఏమిటి?.. "


"నా పేరు మాయ.. "


"నా పేరు నాయక్.. ఇక్కడకు బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను"


"మీరు ఎక్కడ ఉంటారు.. ఏం చేస్తుంటారు?"


"నా పేరు మాయ. నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను. ఆఫీస్ కి వెళ్తుంటే, ఇలా జరిగింది.. "


"మళ్ళీ సారీ అండి.. మీ పేరెంట్స్ కు చెప్పనా?’


"నాకు ఎవరూ లేరండి.. నేను ఒంటరిని.. "


"మీకు ఏం కాలేదు.. జస్ట్ చిన్న దెబ్బ అంతే.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.. నేను కాల్ చేస్తాను.. హాస్పిటల్ బిల్ మొత్తం నేను పే చేసేసాను.. రేపు మీరు డిశ్చార్జ్ అవుతారు. నేను ఫోన్ చేస్తాను.. " అని చెప్పి వెళ్ళిపోయాడు నాయక్


నాయక్ మాయ ఫోన్ నెంబర్ తీసుకుని, హడావిడి గా ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు. 


రాత్రంతా నాయక్ కు నిద్ర పట్టలేదు. మాయ రూపమే తనకు గుర్తొచ్చింది. అంత అందమైన అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని చాలా తపించాడు. ఎలాగైనా, మాయ కు చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు. 


మర్నాడు ఉదయం నాయక్ మాయ కు కాల్ చేసాడు.. 


"హలో మాయ గారు! ఎలా ఉంది ఇప్పుడు?"


"బాగానే ఉంది నాయక్ గారు.. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారుట ఇంకో గంట లో.. "


"నేను వస్తున్నాను.. "


మాయ ను కలిసి.. డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి డ్రాప్ చేసాడు నాయక్. 


"థాంక్స్ నాయక్ గారు.. నన్ను ఇంటికి కుడా డ్రాప్ చేసారు.. "

"ఇంత పెద్ద ఇంటిలో మీరు ఒక్కరే ఉంటారా?"


"అవును.. "


"పెళ్ళి చేసుకోవచ్చు కదా మాయ గారు.. ఇంత ఇంటిలో మీతో ఉండడానికీ.. మీ మనసులో నాకు కాస్త చోటు ఇస్తారా?’


"మీ లాంటి పెద్ద బిజినెస్ పర్సన్.. నా లాంటి సామన్యురాలిని పెళ్ళి చేసుకుంటారా?"


"మీకేమిటి తక్కువ? అందం ఉంది.. మంచితనం ఉంది.. నాకు బాగా నచ్చారు మాయ.. "


"నేను ఒక బిజినెస్ పర్సన్ అని మీరే చెప్పారు.. చాలా బిజీ గా ఉంటాను.. ఈ జీవితంలో నాకూ.. ఒక తోడు కావాలి. రేపటి వరకు టైం తీసుకుని, చెప్పండి.. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను.. "


మాయ ఫోన్ కోసం.. ఎదురు చూస్తూనే ఉన్నాడు నాయక్. చివరకు.. ఫోన్ వచ్చింది. 


"హలో నాయక్! నేను మాయ.. మీరంటే, నాకు ఇష్టమే.. పెళ్ళి కి ఒప్పుకుంటున్నాను. మీతో కొంచం మాట్లాడాలి.. రేపు కలుస్తారా.. ?’


"అలాగే.. రేపు పార్క్ లో కలుద్దాం మాయ.. "


మర్నాడు పార్క్ కి నాయక్ ముందే వచ్చి.. మాయ కోసం వెయిట్ చేస్తున్నాడు. బిజినెస్ గురించి మర్చిపోయాడు పాపం. మాయ కు ఎవరు లేరని నాయక్ కు తెలుసు. అదే అతనికి పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే, తను ఏది చేస్తే, అదే చెల్లుతుంది.. అడగడానికి ఎవరు ఉండరు. పైగా మాయ చాలా సౌందర్య రాశి, అని అలోచించుకుంటూ.. తాను ఎంతో అదృష్టవంతుడని మురిసిపోయాడు. 


ఈలోపు మాయ అక్కడకు వచ్చింది.. 


"రండి మాయ.. ఇప్పుడు ఎలా ఉన్నారు?.. "


"బాగానే ఉన్నాను నాయక్.. "


"ఏదో చెప్పాలని అన్నావు మాయ.. ?"


"మీరంటే నాకు ఇష్టమే.. కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి.. "


"ఏమిటి ఆ షరతులు.. "


"మీరు బిజినెస్ మీద అన్నీప్లేసెస్ కి తిరుగుతారు. నేను ఎక్కడకి రాలేను. ఇక్కడే ఉంటాను. ఇది మా అమ్మా నాన్న కట్టించిన ఇల్లు. వాళ్ళ గుర్తుగా, నేను ఇక్కడే ఉంటాను. అలాగని.. మిమల్ని ఇక్కడే ఉండమని అనట్లేదు. మీరు అప్పుడప్పుడు వస్తే చాలు. మీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోవద్దు.. "


"నాదీ ఒక కండిషన్. నేను ముంబై లో నిన్ను పెళ్ళి చేసుకున్నట్లు ఎక్కడా చెప్పను. అలా చెబితే, నిన్ను శత్రువులు ఎవరైనా టార్గెట్ చెయొచ్చు. అసలే నేను బిజినెస్ పర్సన్ కదా!” అని చెప్పి ఒప్పించాడు నాయక్. “రేపు మన పిల్లలకు కుడా ఇదే నియమం ఉండాలి.. "


"అలాగే.. నాయక్.. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను చూసుకోవడానికి మీరు ఉన్నారు.. అది చాలు నాకు.. "


"నువ్వు ఒప్పుకుంటే, మనం గుడిలో సింపుల్ గా పెళ్ళి చేసుకుందాము మాయ.. "


"అలాగే.. "


"మంచి ముహూర్తం పెట్టించి.. చెబుతాను.. అప్పుడే మన పెళ్ళి.. "


"మీరు ఎలా అంటే, అలాగే.. "


ఒక మంచి రోజున.. నాయక్ పెళ్ళి మాయ తో జరిగింది. అక్కడ ఉన్న కొన్ని రోజులు.. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. 


"మయా!.. ఇక్కడకు నేను వచ్చిన బిజినెస్ పని అయిపోయింది.. నేను ఇక వెళ్ళాలి.. మళ్ళీ త్వరలో కలుస్తాను. నేనే కాల్ చేస్తాను.. "


"అలాగే.. నాయక్.. "


మాయ తో గడిపిన మధురమైన క్షణాలు.. తన మనసు నిండా నింపుకుని.. నాయక్ బయల్దేరాడు. 


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

68 views0 comments

Comentarios


bottom of page