#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #దిస్ట్రీట్వెండర్, #TheStreetVendor, #TeluguAdultStories, #తెలుగుశృంగార కథలు

The Street Vendor - New Telugu Story Written By - Pandranki Subramani
Published In manatelugukathalu.com On 25/01/2025
ది స్ట్రీట్ వెండర్ - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కామరాజు రిలే సైకిల్ ని సర్రు సర్రున తొక్కుతో కాలేజీ క్యాంపస్ లోకి ప్రవేశించి బండిని ఓరగా స్టాండులో పెట్టి, ఒక చేతిలో నోట్ పుస్తకాల సంచీని పొదవి పట్టుకుని మరొక చేతిలో లెదర్ సంచీని భుజాన కెక్కించుకుని వేప చెట్టు క్రింద గుంపుగా నిల్చున్న క్లాస్ మేట్సు వద్దకు వచ్చాడు.
సుచీంద్ర “అక్కడాగు! అక్కడాగు! ” అని వారించాడు. ఎక్కడివాడక్కడ ఆగిపోయి ఏమైందన్నట్టు విస్మయంగా చూసాడు కామరాజు.
“మరేం లేదురా! నువ్విప్పుడు మీ తాత గారు తయారు చేసి అందించిన తైలం బాటిల్స్ వగైరాలు ఆన్లైన్ మెసేజుల ద్వారా డిమాండ్ పెట్టిన వాడకం దారులకు సప్లయ్ చేసి వస్తున్నావు కదూ! ఆ తైలం బాటిల్స్ అన్నిటినీ ఈ లెదర్ బ్యాగులో పెట్టే కదూ సరఫరా చేస్తు న్నావు? ”
ఔనన్నట్టు తలూపుతూ చూసాడు కామరాజు; దానికేమిటంట అన్నట్టు--
మళ్ళీ సుచీంద్ర సాగించాడు- “అందులో రకర కాల తైలం బాటిల్సు మోసుకుని వెళ్ళుంటావుగా!”
దానికేమిటంట- అన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు కామరాజు.
”మరయితే— ఆ తైలాల వాసనలు నీ లెదర్ బ్యాగు నిండా పారించి ఉంటాయి కదా! నువ్విప్పుడిక్కడకు నీవుగా రాలేదు. ఘాటైన తైలం వాసనల్ని కూడా మోసుకొచ్చావన్న మాట— నీకు యింటా బయటా ఆ వాసనలన్నీ అలవాటు కాబట్టి నువ్వు నిశ్చలంగా క్షీర జలపాతంలో ఉన్నట్టు చెక్కు చెదరకుండా నిల్చుంటావు. మరి-- మా సంగతీ-- ఆ ఘాటైన తైలం వాసనలకు ముక్కు పుటాలు యెగిరిపోతాయి. ఇప్పుడర్థమయిందా?”
అప్పుడతని మాటకు సురేశ్ వంతపాడాడు- “ఔనురా కామరాజా! క్లాసులో కూర్చున్నప్పుడు కూడా ఆ బంగారు లెదర్ బ్యాగుని నీ ప్రక్కన పెట్టుకోకుండా క్లాసు రూముకి అవతల పెట్టు. లేకపోతే ఆ ఘాటువాసనలు మమ్మల్నందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి”
సహాధ్యాయుల వేపు నిదానంగా చూసి తనలో తను యేదో అనుకుంటూ అతడు స్పందించ కుండా కదలి వెళ్ళిపోయాడు. మిత్రుల అభీష్టం ప్రకారమే అతడు తనకు కావలసిన నోటు పుస్తకాలు మాత్రం తీసుకుని లెదర్ బ్యాగుని క్లాసు రూముకి అవతల పెట్టి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే అతడి ఆలోచనలన్నీ కామెంట్స్ చేసిన క్లాసుమేట్ల వేపు దూసుకుంటూ సాగిపోయాయి.
అతడి అంతరంగానికి తెలుసు; అందరూ కాకపోయినా వాళ్ళలో కొందరు కావాలనే తనను మోకింగ్ చేస్తూ మాట్లాడారని. ఈనాడు తమ కుటుంబాన్ని వత్తాసుగా ఆదుకుంటున్నది తాతగారు స్వయంగా చేసి సరఫరా చేస్తూన్న తైల మందు బాటిల్సే-- తాతయ్య తన వైద్య పరిజ్ఞానంతో చేసి పంపు తూన్న ఆ తైలపు బాటిల్సు కుటుంబానికి మాత్రమేనా తన కాలేజీ చదువుకి కూడా దన్నుగా నిలుస్తున్నాయి.
తండ్రి ఏవో కార్మిక సంఘాల కొట్లాటలో చిక్కుకుని గాయాల పాలయి నరనరాల కదలికకు దూరమయి ఇంట్లో మంచాన్ని ఆశ్రయించాడు. చెల్లేమో, పదవ తరగతితో చదువుకి స్వస్తి చెప్పి తల్లికి కాయగూరలమ్మడంలో అప్పడాలు ఒత్తడంలో చేదోడుగా ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతో స్పెషలిస్టు సూచన ప్రకారం తండ్రికి మందూ మాకూ కొని తెస్తుంది అమ్మ. కావున, ఆయుర్వేద మందులు—ఇంగ్లీషు మందులూ క్లేష్ కాకూడదని తండ్రికి తాతయ్య చేసిన తైల బాటిల్స్ ఉపయోగించడం లేదు.
అప్పుడతని ఆలోచనా గొలుసుని తెంచుతూ ప్రక్కకు వచ్చి కూర్చున్న వామనరావు గొంతు వినిపించింది- “సారీరా కామూ! కొందరు నీ యింటి పరిస్థితి తెలిసి కూడా అలా అగ్రేసివ్ గా కామెంట్సు చేయ డం కష్టం అని పించిందిరా! ”
కామరాజు చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు- “ఇటీజ్ ఓకే! భరించాలి మరి—తప్పుతుందా! కొందరు నన్ను స్మెల్లీ సేల్స్ మ్యాన్(SMELLY SALESMAN ) అని కూడా కామెంటు చేయడం విన్నాను. తల వ్రాత యెలా వ్రాసుంటే అలాగే కదా సాగుతుంది. ఇదులో మనం నిమిత్త మాత్రులమేగా!”
“నేనిప్పుడు వచ్చి చెప్పబోయే మేటర్ అదికాదు. ఊరటనివ్వటానకి కాదు. పరిష్కారమార్గం చెప్పడానికి-- మాకు మూడవ వీధిలో మా చిన్నక్కయ్యకు తెలిసిన మేడమ్ ఉంది. ఆమెకూ ఆమె అత్తగారికీ ఒంటికి తైలాలు పూసుకునే అలవాటుందట. వాళ్ళిద్దరూ సువాసన గల ఘాటైన తైలాల కోసం వెతుకుతుంటారట. పలు ప్రాంతాల వెండర్స్ కోసం ఆన్ లైన్ లో సహితం సర్ఫింగ్ చేస్తుంటారట, ఖరీదు గురించి పట్టించుకోకుండా-- ఇటువంటి దినుసులు తయారు చేయడంలో మీ తాతగారు సిధ్ధహస్తుడు కదా! ఇదిగో! వాళ్ళింటి అడ్రెస్” అని చీటీ అందించాడు.
దానిని ఆత్రంగా కళ్ళు పెద్దవిచేసుకుని అందుకున్నాడు కామరాజు.
ఆ రోజు సాయంత్రమే అందివచ్చిన ఆఫర్ కి మోకాలడ్డ కూడదనుకుంటూ కుంభేశ్వర రావు వాళ్ళ యింటి ముందు వాలాడు కామరాజు లెదర్ బ్యాగు నిండా వివిధ రకాల తైలం బాటిల్స్ నింపుకుని. ఇంటి వాకిట నిల్చున్నంతనే అతడు గ్రహించగలిగాడు అది ఉన్నవాళ్ళ నివాసమని- కలవారి కుటుంబమని-- కాసులు గలగలలు కురిపించే ఆవాసమని.
అతడు డోర్ బెల్ మ్రోగించిన వెంటనే యింటి పనిగత్తె వచ్చి విషయం తెలుసుకుని లోపలకు వెళ్ళి కబురందించి వచ్చింది. అప్పుడు నడుముకి దోపుకున్న యింటి తాళాల గుత్తిని ఘల్లు ఘల్లున ఆడించుకుంటూ కుంభేశ్వరరావు గారి సతీమణి- మనోన్మణి వచ్చింది. ఆమె గురించి అతడు ముందే విన్నాడు ఆమెది యిక్కడి ప్రాంతం కాదని. స్వంతూరు తంజావూరని.
మంచి పొడగరి. మంచి యెరుపు, వచ్చిన వేంటనే అడిగిందామె తనకు తైలం బాటిల్సు కావాలన్నది అతడికెలా తెలుసుని.
’మనోన్మణి గడసరే—చెక్స్ అండ్ బ్యాలెన్సు సరిచూసుకునే సింగారే’ అనుకుంటూ-- అతడు వామనరావు గురించి చెప్పాడు. అతడిచ్చిన జవాబు విన్నంతనే మనోన్మణి అతణ్ణి తోడుకొని పోయి అత్తగారు మాలాదేవిగారికి పరిచయం చేసింది. ఆమె యెక్కువ సేపు మాట్లాడలేదు. డూప్లికేట్ తైలాలు అంటగట్టి డబ్బు గుంజడానికి ప్రయత్నించకని సూచాయిగా నొక్కి చెప్పింది.
అప్పుడతను వ్యవధానానికి తావివ్వకుండా తైలాల లోని పలు గుణాంశాల గురించి నివారణోపాయాల గురించి చెప్పనారంభించబోయాడు. కాని— మాలాదేవిగారు వినలేదు. అదంతా కోడలు పిల్లకు చెప్పమని మంచానికి అటు ఒత్తిగిల్లింది. అతడలాగే- అంటూ మనోన్మణి దేవిని అనుసరించాడు. ఆమె వెంట నడుస్తూ హాలులో ఆగిపోయి తైలం బాటిల్సు ఉన్న లెదర్ బ్యాగుని తెరవబోయాడు.
కాని— ఆమె అతణ్ణి ఆపింది. అక్కడ కాదని తనగది లోకి రమ్మని చెప్తూ ముందుకు నడిచింది. అతడు వెంటనే కదలకుండా ఆగాడు. మరీ లోపలకు వెళితే బాగుండదేమో! కీడెంచి మేలెంచమన్నారు. రేపు యెప్పుడైనా యేదైనా కనిపించకపోతే తన పైకి రావచ్చు-- అసలే కలవారి కుటుంబంలాగుంది. తన ప్రవేశం వాళ్ళ ప్రైవేసీకి దెబ్బతగులుతుందేమో! ఆమె అలా రివ్వున నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆమె మేని నుండి సంపెంగ నూనె గుప్పు గుప్పుమని వీచనారంభించింది.
అది మనోన్మణి పడక గది. తటపటాయిస్తూ సందేహిస్తూనే ఆమెతో బాటు లోపలకు వెళ్ళి లెదర్ బ్యాగునుండి తైలం సీసాలు తీసి అక్కడ పెట్టి వివరించనారంభించాడు.
“ఈ రెండు సీసాల తైలం సిధ్ధ వైద్యానికి సంబంధించినది. ఈ మూడు సీసాలేమో ఆయుర్వేద వైద్య ప్రక్రియకు సంబంధించినది. ఈ రేండేమో- యునానీ వైద్యానికి సంబంధించినది. మా తాతయ్యకు ఈ మూడింటిలోనూ ప్రవేశం ఉంది మేడమ్. వీటిని సమయానుకూలంగా రుద్దుకుంటే శరీరానికి ముఖ్యంగా స్త్రీ శరీరానికి ఎక్ స్ట్రా సత్ఫలితం కలుగుతుందండి”
“ఎక్ స్ట్రా ఫలితమంటే--” మనోన్మణి అయోమయంగా చూసింది.
“మీరు ఆరోగ్యవంతులు కాబట్టి మీకు కాకపోవచ్చు. కొందరు ఆడాళ్ళకు- విత్ రీజన్ ఆర్ విదౌట్ రీజన్- వంధ్యత్వ లక్షణాలు యెదురు కావచ్చు. ఉదాహరణకు- గర్భోత్పత్తికి అడ్డు తగిలే శుక్రదోషాలు కొన్ని వాటిల్లవచ్చు. వాటి దుష్పలితాలను తాతయ్య తయారు చేసిన తైలాలు తగ్గించి మంచి చేయవచ్చు. అదంతా మీకు మాత్రమే చెప్తే అంత బాగుండదేమో- మీ వారిని పిలిస్తే తైలం రుద్దే పధ్ధతిని వివరిస్తాను. అప్పుడు ఉభయ తారకంగా ఉంటుంది”
ఆ మాటకు ఆమె అదోలా ముఖం పెట్టింది. “ఎప్పుడు చూసినా డబ్బూ దస్కం కోసం ఊళ్లు తిరగడమే తప్ప- ఇంట్లో యెప్పుడు కుదురుగా అందుబోటులో ఉంటాడని-- రాత కేడుద్దునా రాగి మీసాల మొగుడి కోసమేడుద్దునా- అంటారే- అదన్నమాట యిక్కడి సంగతి. అదిగో—ఆ ఫొటోలో కనిపిస్తున్నాడే- అతడే నా బంగారు మొగుడు! ”
ఆ ఫోటో చూసి గ్రుడ్లు తేలేసాడు కామరాజు. “అతడా మీ వారు! ఇంత చిన్నవయసులో అంతటి భారీ కాయమా? మూవ్ మెంట్సు దెబ్బతింటాయి మేడమ్! బీరూ రమ్మూ యెక్కవగా తాగేవారికే అంతటి భారీ శరీరం వస్తుందంటారు”
దానికామె వెంటనే రిటార్ట్ చేసింది- “అతడు వేసుకునేది ఒకటీ రెండు పెగ్గులా—ఫుల్ బాటిల్ గాలిలోకి యెగిరిపోతుంటుంది. ఆ తరవాత చతికిలబడతాడు”
కామరాజు అర్థం కానట్టు అడిగాడు- “ఎవరి ముందు మేడమ్?” అని.
దానికి ఛెళ్ళున బదులిచ్చిందామె—‘ఇంకెవరిముందు? నా ముందే-- ”
“అబ్బే—అది కుదరదండి. మీవారి విషయంలో మూడూ తగ్గించుకోవాలి— బీరూ రమ్మూ దమ్మూ— ప్రతి రోజూ నడక కనీసం నలభై నిమిషాలపాటు సాగించాలి”
ఆమె మరొకసారి ముఖం అదోలా పెట్టింది. “అయ్యో రామ! అతను నడకలోనే కాదు—పడకలోనూ వీకే!”
ఆ మాటంటూ ఆమె అతడి ప్రక్కన ఫ్రెండ్లీగా ఒరసుకుంటూ కూర్చుంది. ఆమె యవ్వన శోభ ఫెళ్ళున సోకిన వెంటనే అతడు ఊపిరి బిగబట్టాడు. తడిసిన మనసున మనో యవ్వన తరంగాలు ఫెళ్లు మన్నాయి. ఆమె మేనినుండి సురభిళ సువాసనలు గుప్పుమని సోకాయి. అదెప్పుడో తెలుగు లెక్చరర్ పలికిన తేట గీత పద్యం నిండు రూపమై కళ్ళముందు నాట్యమాడింది-
“తగిన మగవాని కౌగిట తగిలినట్టి- అలి చికుర(అందగత్తె) యౌవనంబది యౌవనంబు: తగని మగవాని కౌగిట తగలనట్టి అలి చికుర యౌవనంబది యౌవనంబు:”
కామరాజు ఉన్నపళాన ఆలోచనల నుండి తేరుకుంటూ కచ్చితమైన కంఠస్వరంతో అన్నాడు- “అదంతా వీలు పడదు మేడమ్! పడక గురించి తరవాత చూడండి. మొదట నడక గురించి తీర్మానించండి. సతీమణిగా మీ వారిని మీరే నడిపించాలి. సన్నబడేలా చేయాలి. లేకపోతే- బాడీ మూవ్మెంట్సే ఉండవు” అంటూ లేచి ఆమె చేతిలో తైలం సీసాల బిల్లు పెట్టాడు.
ఆమె యిచ్చిన నగదు లెక్కపెట్టుకుంటూ యెత్తి చూసాడతను- “ఆరు వందలు యెక్కువిచ్చినట్టున్నారు మేడమ్”
ఆమె నవ్వి బటన్స్ ఊడేలా అతడి షర్టుని లాగి- “పర్వాలేదు. ఉంచుకోండి. మళ్ళీ తైలం సీసాలతో రావాలి కదా! అప్పుడు బిల్ అమౌంట్ అడ్జెస్టు చేసుకుంటాలే—“
కామరాజు యిల్లు చేరిన తరవాత లెక్కలు కుదురుగా సరి చేసుకున్నాడు. అతడు మనోన్మణికి యిచ్చి వచ్చిన అరోమా తైలపు సీసాలు తదితర మసాజ్ బాటిల్స్ ఎంత జోరుగా యెక్కువగా రుద్దుకున్నా కనీసం వారం రోజుల వరకూ వస్తుంది. కాని, మూడురోజులకే ఆమెనుండి పిలుపు రావడం అతణ్ణి అవధికి మించిన స్థాయిలో ఆశ్చర్యంలో ముంచింది. అంత జోరుగా అంత వేగంగా తైలం పూసుకుందా!
ఒక వేళ ఆమె అత్తగారు కూడా అదే వేగంతో తైలం రుద్దుకుందేమో! ఇద్దరికీ తాతయ్య తయారు చేసిన తైలం మంచి రిలీఫ్ యిచ్చి ఉంటుందేమో! కారణ కార్యాలను ప్రక్కన పెట్టి అతడు వెంటనే పోజిటివ్ మెసేజ్ పంపించాడు అదే రోజు వస్తున్నానని-- ఇకపోతే వాటి ఘోష తనకెందుకు? తనెందుకు సిరికి మోకాలొడ్డి నిల్చోవడం? తనకు కాలేజీ ఫీజు కట్టడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి చేయూత నిచ్చేది ఈ తైల సీసాల వ్యాపారమేగా !
అనుకున్నప్రకారం కామరాజు మనోన్మణి యింటికి లెదర్ బ్యాగుతో చేరి చుట్టూ పరకాయించి చూసాడు. అప్పుడామె కాస్మోటిక్ టబ్ లో గుళాబీ పూలూ లావెండర్ కలిపిన నీళ్ళతో స్నానం చేసి యెదురుగా వస్తూంది. నలువైపులా ఆమె శరీరం నుండి సువాసనలు తెరలు తెరలుగా వ్యాపిస్తున్నాయి. ఎర్రటి మేనినుండి నీటి ముత్యాలు రాలి పడుతున్నాయి. అతడు కళ్ళు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు. కాని వీలులేక పోయింది.
స్త్రీలు కుసుమ కోమలు లంటారు. మరి తడి తడి ఆరబోతలతో కత్తి వాదర వంటి ఈ యవ్వన వతిని యేమనాలి? గదిలోపల నుండి “సుందరాంగ మరువగ లేనోయ్ రావేల- నా అంద చందములు దాచితి నీకై రావేలా” పాట మనోహరంగా వినిపిస్తూంది— కాదు- పిలుస్తూంది.
మరొకసారి తెలుగు లెక్చరర్ గారి శ్రీనాథుడి పద్య పఠనం మనసు ఓరన వినిపించింది- ఊగుతూ ఊరేగింపులా వెళ్తూన్న ఆమె వక్షోజాలను చూసి-- “బిగువై, వట్రువులై, విరాజితములై, బింకంబులై యుబ్బులై నగసాదృశ్యములై మనోహరములై నాగేంద్ర కుంచబులై, సొగసై బంగరు కుండలై, నునుపులై సూనాత్తు చేబంతులై—”
అప్పుడతని ఆలోచనలు పట్టున తెగిపోయాయి ఆమె గొంతువిని- “అదేమిటి అలా చూస్తున్నారు కొత్తగా వింతగా! రండి— లోపలకు—”
అతడలాగే అంటూ ఆమెను అనుసరించాడు. ఆమె యెటువంటి మోహమాటమూ లేకుండా అతడి ముందే చీరను చుట్టుకుంది- “మీతో చిన్నపనుంది కామూ! సహాయం చేస్తారు కదూ? ”
అతడు తలూపుతూనే మనసులో అనుకున్నాడు- ‘ఎందుకు చేయనూ! తైల సీసాలు దండిగా అమ్ముడవుతున్నప్పుడు—’
మనోన్మణి కొనసాగించింది- “మీ తాతగారిచ్చిన అరోమా తైలపు సీసాలు బాగా పనిచేస్తున్నాయి. కాని నాకొక చిక్కొచ్చిపడింది! ”
అదేమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడు.
“నా వీపు వెన్నుపూసపైన తైలం రుద్దుకోలేక పోతున్నాను”
కామరాజు నివ్వెరపాటుతో చూసాడు- “అదేమి పెద్ద భాగ్యం మేడమ్! మీ వారు యెలాగూ వస్తారు కదా—ఆయన చేత మసాజ్ చేయించుకోండి!”
“భలేవాడివే నోయ్! నా బంగారం బాగుంటే నేనెందుకు ఇటువంటి తైలాల కోసం వెంపర్లాడుతానూ? ఇరుగు పొరుగు పేరంటాళ్లు నాకు పిల్లల్లేరన్న కారణం చేత నన్నెందుకు దూరం చేస్తారు!”
అప్పుడతను ఆగండాగండి అంటూ వసారాలోకి వెళ్ళాడు. మళ్ళీ అదే వేగంతో వచ్చాడు—“మీ పనావిడ యెక్కడా లేదు మేడమ్” అంటూ—
అప్పుడామె పెదవుల ఓరన నవ్వుకుంటూ మనసులో అనుకుంది- ‘అదెలా కనిపిస్తుంది? దానిని దరిదాపున కనిపించనీయకుండా బయటకు పంపించేసింది తనేగా!’
కామరాజు మళ్ళీ అన్నాడు- “మరిప్పుడేమి చేస్తారు మేడమ్! పర పురుషుణ్ణి. పడరాని చోట నా చేయి పడకూడదు కదా! మైలు పడతారు కదా!”
“ఆ గ్రహదోషాలూ గుణదోషాలు నాకు విడిచి పెట్టు. వాటి పరిహారం గురించి నేను చూసుకుంటాను. ఇప్పటికీ నువ్వు నేను చెప్పింది వింటే చాలు! ” అంటూ ముఖమల్ పెట్టెనుండి ఘుమఘుమలాడే కిల్లీ తీసి అందించింది.
ఇప్పుడామె అతడి ముందు స్లీవ్ లెస్ నెట్టెడ్ దుస్తుల్లో ఉంది. నీటిలో పొంగే నురగలాగ- నిప్పులో యెగిసిపడే పొగలాగ- మెల్ల మెల్లగా ముంచెత్తుతూన్న మాయలాగ-- పద్య ప్రియుడైన కామరాజు ముందు ఈసారి సుమతీ శతకకారుడు ఫెళ్ళున ప్రత్యక్షమయాడు. “తమలము సేయని నోరును- రమణుల చన్మొనల మీద రాయని మేనును, కమలము లేని కొలకును, హిమధాముడు లేని రాత్రియు హీనము సుమతీ!”
అతడిక ఓపలేక పోయాడు. కార్మోన్ముఖుడయాడు.
రుచి మరిగిన నల్ల పిల్లి అంత త్వరగా అలవాటు పడ్డ వసారానుండి తొలగిపోదు. అలా సాగింది వాళ్ళిద్దరి స్నేహం. ఐతే— ఒకపారి కామరాజు యేకంగా వారంరోజుల పాటు కనిపించేలేదు.
మనోన్మణి గట్టిగా నిలదీసి అడిగింది. “అదేమిటి కామూ! ఒకేసారి శీతకన్ను వేసావు! మసాజ్ బాటిల్స్ లేక నేనంతగా ఇబ్బంది పడ్తున్నానో తెలుసా?”
“నేనేం చేసేది చప్పు మాడమ్! తెలియని వారూ తెలిసిన వారూ అన్నది చూడకుండా వీధులంట తిరిగితేనే కదా— తైలం బాటిల్స్ అమ్ముడయేది. అప్పుడే కదా ఇంటి వెచ్చాలకు సరిపోయేదీ! ”
“సరే—ఇప్పుడర్థమైంది నీ గడ్డు పరిస్థితి. ఇకపైన నువ్వు తైలపు బాటిల్సు పట్టుకుని వీధివీధినా తిరగనవసరం లేదు. ఎప్పుడెప్పుడు మీ తాతయ్య తైలం బాటిల్స్ తయారు చేసి నీకు అమ్మే పని అప్పగిస్తాడో—నువ్వు తిన్నగా ఇక్కడకు వచ్చేయి! ”
అతడు అర్థరహితంగా అడిగాడు- “మీయింటికి వచ్చేస్తే తైలం బాటిల్సు యెలా అమ్ముడు పోతాయి?”
“అదంతా నీకెందుకు? అన్నీ టోకులో నేను కొనుక్కొంటాను. ఇంకా మిగిలిపోతే చుట్టుప్రక్కల వారికి అంటగడతాను. నువ్వు మాత్రం ఎండల్లోవానల్లో వీధులమ్మట తిరక్కు. చాలా! ”
మనోన్మణి ఆఫర్ విని కామరాజు యెగిరి గంతేసాడు. మరొక గంటలో కామరాజు మనోన్మణి వాళ్ళ యింటముందు వాలాడు. ఇచ్చి పుచ్చుకోవడమంటే అదే కదా!
మార్క్స్ మహాశయుడు అనలేదూ—మానవ బంధాలన్నీ ఒక విధంగా వ్యాపార సంబంధాలేనని--
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

"యింటింటా సూర్యకాంతం" కథలో రచయిత కుటుంబ సంబంధాలు, ఆర్థిక వివాదాలు, మానసిక ఒత్తిడిని ప్రతిబింబించాడు. ఈ కథలో పాత్రలు తమ వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక సమస్యలు, జీవితంలోని వివిధ పరిస్థితులపై ఇబ్బంది పడుతుంటారు. రమణి, మమత, పద్మావతి వంటి పాత్రలు తమ భర్తలతో ఆర్థిక వివాదాలు, అవసరాల గురించి వాదిస్తూనే, వారి మధ్య సంబంధాలు క్షీణించాయి. కథలో ఉన్న హాస్యవాదం, వాస్తవికత, వ్యక్తిగత అభిప్రాయాలు సమాజంలోని ఆర్థిక, మానసిక ఒత్తిడిని అంగీకరించేలా చేస్తాయి. ఇది మనం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సంబంధాలపై ఉన్న ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. చివరగా, కథ సమాజంలోని వివిధ తరగతుల మధ్య అన్యోన్య సంబంధాలు, తేడాలు, వాటి ద్వారా వచ్చే మానసిక ఒత్తిడిని చూపిస్తూ, ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.
స్ట్రీట్ వెండర్: పండ్రంకి సబ్రమణి
I) ఫ్యామిలీ కౌన్సిలర్ ల వద్దకు తరచూ వెళితే ... వారే మంచి సలహాలు ఇస్తారు ... ఎలా మంచి మాటలు, చేతలు, ఆచరణ, ప్రైవసీ ల తో ..., జోక్యం లేకుండా ... మంచి కుటుంబ జీవితం సాగించ వచ్చని ... కీచులాటలు లేకుండా.
Ii) పిల్లలు పుట్టకుండా ఉంటే ... దత్తత తీసుకోవాలి... చాలా తేలిక ... ఏ పిల్లలు అయితేనేమి? ... పిల్లలు పిల్లలే ... పసి హృదయాలు, లేత మనస్సులు, వారి మనసే మందిరం.
పి.వి. పద్మావతి మధు నివ్రితి