top of page
Writer's picturePandranki Subramani

ది ట్రాప్ ఎపిసోడ్ 12


'The Trap Episode 12' New Telugu Web Series Written By Pandranki Subramani


(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



గత ఎపిసోడ్ లో

భువనేశ్ కి ప్రమోషన్ తో పాటు కొత్త కారు కూడా వస్తుంది.

ప్రభావతి ఇంట్లో లేని సమయంలో వరూధిని తన కూతురు మందాకినితో భువనేశ్ ఇంటికి వస్తుంది.

ప్రభావతి వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది.

ఇక ది ట్రాప్.. పన్నెండవ భాగం చదవండి…

హోటల్ రాయల్ బేంక్వట్ హాలులో నగర ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు విందు భోజనం యేర్పాటు చేసారు. వరూధిని యెటువంటి సందిగ్ధావస్థకూ లోను కాకుండా కూతురుతో బాటు భువనేశ్ ని కూడా తెలిసిన వారైన కొందరికి, యెదురొచ్చిన మరి కొందరికీ పరిచయం చేసింది. వాళ్ళలో ఆమెకు బాగా పరిచయం ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ భార్య చనువుగా అడిగింది కూడాను-“ఈజ్ హి యువర్ బాయ్ ఫ్రెండ్? ”అని.


నవ్వు చిలకరిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతూ బదులిచ్చింది- ’జస్ట్ లైక్ దట్! ’

“అలాగంటే కుదరదోయ్! ఈజ్ హి ఆర్ నాట్?” అని రెట్టించిందామె.

‘అలాగే అనుకో-’ అంటూ కదలబోయింది వరూధిని.

అతడూహించినట్లే ఆమె వదల్లేదు. నొక్కి అడిగింది చెప్పమని. అటువంటి విషయాలలో ఆడాళ్ళకు రొమాంటికి థ్రిల్ యెక్కువని అతడికి తెలుసు. ఇక తప్పదన్నట్టు అతడి వేపు ఓ చూపు విసిరి సంభాషణ కట్ చేసింది వరూధిని-- “హి ఈజ్ మై మ్యాన్. చాలా! ” అని విసురుగా అంటూ--

దానితో ఆ బిజినెస్ మ్యాన్ భార్య తలవిదిలించి ఆహ్వానితుల్లో కలసిపోయింది. అదే రీతిన వరూధిని మరొక ఇద్దరు బ్రైట్ లేడీ పర్సనాలిటీస్ ని ముఖాముఖి పరిచయం చేసింది. అతడి చూపుని ఆకట్టుకున్నది సితారా అనే యంగ్ లేడీ స్టార్టప్ సి ఈ ఓ— విద్యుత్ తీగలా ప్రవహించే కొండ వాగులా చురుగ్గా సంభాషణ కొనసాగించింది. సింగల్ గా ఉన్న సితార మాటల్ని, విషయ ప్రాజ్ఞతను గమనించి అతడికి తన అమెరికన్ కంపెనీ సహచరుడు, కార్పొరేట్ మెయిన్ ఆఫీసు సహోద్యోగి రాము ఉన్నపళంగా గుర్తుకి వచ్చాడు.

వ్యక్తిత్వంలో, డైనమిజమ్ లో ఇద్దరూ ఒకరికొరు మంచిజోడీ. ఇద్దరూ కలిస్తే వసంత కాలానికి చివుళ్ళు పల్లవించినట్లే— ఇంటా బయటా లైఫ్ టైమ్ అచీవ్మెంటే— ఒకటి కాదు, రెండు మూడు స్టార్టప్ లను విజయవంతమైన కంపెనీలుగా తీర్చిదిద్ది వాటిని సంయుక్తంగా నడిపించగలరు.

రాము గురించి సూచాయిగా ప్రస్తావిస్తూ అతడికున్న డైనమిక్ గుణాంశాలను వివరిస్తూ ముబైల్ లో ఉన్న అతడి పిక్చర్ ని చూపించి ఆమె గురించిన మరికొన్ని వివరాలు సేకరించి ముందుకు సాగిపోయి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు మందాకినిని ప్రక్కన కూర్చోబెట్టుకుని.

అది చూసి వరూధిని మోక్ చేస్తున్నట్టు అడిగింది- “మీ వాలకం చూస్తుంటే మీరు మందాకినిని నిద్రలో కూడా విడిచి పెట్టేటట్టు లేరు. ”

“యు ఆర్ రైట్— కారణం నీకు బాగా తెలుసు. నీకు ఒకే ఒక కూతురు ఉండటాన విడిచి పెట్టేస్తున్నాను. లేకపోతే—“

“చాలు చాలు! ఇక చెప్పకండి. బాగా అర్థమైంది. ”

ఆమె అలా చెప్తూ సంభాషణ కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ ముందు బేరర్ ఎర్రటి ద్రావకంతో నిండిన బాటిల్ ని ఉంచాడు. అతడు దానిని ప్రక్కకు నెట్టాడు. అప్పుడామె భువనేశ్ చేతి పైన చేయి వేసి అంది- “ఇది హై క్యాలిటీ ఫ్రెంచ్ వైన్. చాలామంది దీనిని లైక్ చేస్తారు. ఇక్కడ అరుదుగా లభ్యమవుతుంది. మా మాఁవగారు మరీ యిష్ట పడతారు ఈ రెడ్ వైన్ అంటే. తీసుకునే అలవాటు లేదా!”

“అలాగని కాదు. ఇప్పుడెందుకని--”

ఆమె తల పంకిస్తూ అక్కడ పెట్టిన పానీయంతో బాటు ఉంచిన చిప్స్ మందాకినికి అందిస్తూ అతడి వేపు అదోలా చూసింది-- అంటే—అన్నట్టు ప్రశ్నార్థకంగా--

“మరేమీ లేదు. ప్రభావతి కూడా యింట్లో లేదు కదా! ”

ఆమె అతడి వేపు విస్మయాత్మకంగా చూసింది- “ప్రభావతి లేకపోవడానికీ మీరు కొద్దిపాటి వైన్ సిప్ చేయడానికీ మధ్య యేం సంబంధం ఉందండీ! ”

అతడు బదులివ్వ లేదు. ఇక చర్చల జోలికి వెళ్ళకుండా కొద్ది కొద్దిగా వైన్ చప్పరించనారంభించాడు.

మరి కాసిపటికి షార్ట్ బిజినెస్ మీట్ తో బాటు విందు భోజనం కూడా పూర్తయింది. మస్తు విందు భోజన ప్రభావమో, లేక తీసుకున్న వైన్ మత్తు ప్రభావమో తెలియదు; ఇప్పుడతనికి అందరూ మసగ్గా కనిపించసాగారు. వెళ్తూ వెళ్తూ సితార హాయ్- అని చెప్పడం కూడా అతడు గమనించలేదు. ఎదురుగా వచ్చి నిల్చున్న సితారను గమనించకుండా అడ్డు వచ్చిన వారెవరినో ఢీకొట్టుకుంటూ దాటుకుంటూ ముందుకు సాగిపోయాడు; సారీ చెప్పాలన్నది కూడా మరచి.

ముగ్గురూ కారులో కూర్చున్న తరవాత డ్రైవింగ్ సీటుని ఆమె ఆక్రమించింది. భువనేశ్ వెనుక కూర్చున్నాడు, మందాకిని తల్లిప్రక్కన కూర్చుంది. ఆమె అలా కాసేపు సూటిగా డ్రైవ్ చేస్తూ వెళ్ళి చప్పున బండిని ఆపింది. కూతుర్ని కారులోనే ఉండమని చెప్పి-- అక్కడున్న సాధు సమాజ సంస్థ కార్యాలయం లోపలకు వెళ్ళి అక్కడున్న వాళ్ళతో కాసేపు మాట్లాడి వచ్చి కారులో కూర్చుంది.

అదంతా షార్పుగా గమనిస్తూ వెనుక సీట్లో కూర్చున్న భువనేశ్ ఆమె వచ్చి కూర్చున్న వెంటనే అడిగాడు- “అదేమిటి వరూధినీ.. అక్కడకెళ్లి యేం చేస్తున్నావు? సాధువులతో నీకేమి పని? ”

ఆమె కారుకి ఫ్రిక్షన్ యివ్వడానికి గియర్ ని మారుస్తూ బదులిచ్చింది-“మరేం లేదు. చిన్న పనుండి వెళ్ళాను. ఇంటికెళ్ళిన తరవాత చెప్తాలే!’

“నో! ఐ కాంట్ వెయిట్- ఇప్పుడే చెప్పు. చెప్పిన తరవాతే కారుని కదుపు—“

‘సరే—అలాగే’ అంటూ కారుని స్టార్ట్ చేయకుండా సీటులోనుండి వెనక్కి తిరిగి చెప్పసాగింది-

“మరేం లేదు బాస్! మల్లెతీర్థానికి ముందు మూడు నాలుగు గుళ్ళూ గోపురాలూ ఉన్నాయికదా— ప్రతి యేటా అక్కడ పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి కదా— దూరప్రాంతాల నుండి బైరాగులు సన్యాసులు వస్తుంటారు, అప్పుడప్పుడు ఉత్సవాలకు హిమాలయాల నుండి నాగ సాధువులు కూడా ఏతెంచుతుంటారు.

కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండి మూల విరాట్టులకు ప్రత్యేక పూజలు జరిపి వెళ్తుంటారు. అప్పుడక్కడ వాళ్ళకు విశ్రాంతి చేకూర్చడానికి తగినన్ని పర్ణశాలలు లేవు. నా తరపు,న మా సంస్థ తరపున వాళ్ళకు మూడు పర్ణశాలలు కట్టిస్తానని మాటిచ్చాను. ఇప్పటికే కొంత ముందస్తుగా యిచ్చాను. ఇంకా యెంత కావాలో తెలుసుకోవడానికి వెళ్ళాను. ఇంకేమైనా అడగాలా బాస్? ”

అప్పుడు మందాకిని చప్పున కలుగచేసుకుంది- “నాకడగాలనుందమ్మా! అడిగేదా? ”

ఉఁ అడుగమందామె.

“మంచుకొండల్లో తిరిగే నాగ సాధువులకు ఇక్కడేమి పనమ్మా! అక్కడ మనలా పెద్ద గుళ్లు పెద్ద గోపురాలూ ఉండవా—“

“మేటర్ అది కాదు మందాకినీ—సాధువులకి ఒక చోటే ఉండాలని ఒక గుడినే దర్శంచాలన్న నియమం లేదు. దేశంలో యే మారుమూలకైనా వెళ్ళి వస్తుంటారు. నిజం చెప్పాలంటే—భక్తులు నాగ సాధువుల రాక కోసం యెదురు చూస్తుంటారు కూడాను-“

ఈసారి భువనేశ్ గొంతు ఖంగుమంది- “భేష్! అంతటి హైటెక్ బిజినెస్ వుమెన్వి అయుండి కూడా అటువంటి ఆధ్యాత్మిక సత్కార్యాలు చేస్తుంటావన్న మాట— సంవత్సరానికి యెన్ని చేస్తుంటావేంటి? ”

“లెక్కన ఇన్నని చెప్పలేను బాస్! వీలుని బట్టి తీరికను బట్టి— అప్పుడప్పుడు అవకాశం ఉంటే తిరువణ్ణామలైలో ఉన్న సాధువుల కోసం కూడా విరాళం పంపిస్తుంటాను. ”

“గుడ్ గుడ్! మరి-అప్పుడప్పుడు నాకోసం ముఖ్యంగా మీ ఫ్రెండు ప్రభావతి కోసం కూడా కొద్దో గొప్పో పుణ్యకార్యాలు చేస్తుండు”

“నాకోసం మీ కోసం అని కాదు. మనిందరి కోసమూ చేస్తాను. సరేనా! ”

ఇక పలుకు లేకుండా ఊరకుండిపోయాడు భువనేశ్.

ఇల్లు చేరిన వెంటనే అతడు చేసిన మొదటి పని, బూట్సూ సాక్సూ విప్పి అటు యిటూ తడబడుతూ వాటిని చెరొక వేపూ విసిరి ప్రభావతి గదిలోకి దూసుకు వెళ్ళడం— ఆమె అక్కడ లేక పోవడం గమనించి విస్తుపోతూ అన్నాడు- “నువ్వింకా రాలేదా ప్రభా! ”

అప్పుడక్కడకు చేరుకున్న వరూధిని కొంటెగా కవ్వింపుగా అంది- “అదేంవిటి బాసూ అలా పెళ్లాం పైన బెంగ పెట్టేసు కుంటున్నారు! ప్రభావతి వచ్చుంటే హాలులో మనకు స్వాగతం పలకదూ? అది సరే— మీకేమి కావాలో నాకు చెప్పండి. నేను సమకూరుస్తాను”

“ అన్నీ సమకూరుస్తావా?”

ఆమె అదే కొంటెతనంతో బదులిచ్చింది- “అన్నీను” అని

“థేంక్స్—మెనీ థేంక్సు. ఇప్పుడు నాకు నిద్రముంచుకు వచ్చేటట్లుంది. దారివ్వు--”

“భేషుగా నిద్రపొండి. ఎవరు అడ్డొచ్చారూ! ”

“ఐతే ఒక షరతుపైన నిద్రపోతాను“

ఆమె నవ్వుతూ అడిగింది-“చెప్పండి ఆ షరతేమిటో! ”

“నేనూ నా కూతురూ కలసి నిద్రపోతాం. నువ్వు మధ్యకొచ్చి డిస్టర్బ్ చేయకూడదు. అగ్రీ! ”

ఆమె అలాగే అంటూ అతడికి సమీపించి మొదట టైని వదులు చేసి పిమ్మట షర్టుని ఊడదీసి ఫార్మల్ టీ-షర్టు అందిచ్చి పాన్పుపైన పడుకోబెట్టింది. దిండు పెట్టి మందాకినిని అతడి ప్రక్కకు చేర్పించింది.

అర్థరాత్రి దాటిన తరవాత భువనేశ్ కి చప్పున మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ప్రక్కన మందాకిని లేదు. కళ్ళు చికిలించి చూసాడు. అతడి భార్య ప్రభావతి కూడా కనిపించలేదు. అతణ్ణి ఆనుకుని వరూధిని నిద్రపోతూంది. మొదట ప్రభావతే అనుకున్నాడు.

అతడికి అప్పుడు ఇద్దరూ ఒకేలా గోచరించారు. కళ్ళ నుండి మత్తుని తొలగించుకుంటూ ఆమెపైన చేయి వేసాడు. ఆమె అతడి చేతిని తొలగించ లేదు. దూరంగా జరగలేదు. ఆబగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కళ్ళు విప్పకుండానే- “ఉఁ మెల్లగా!” అని అతణ్ణి పెనవేసుకుంది.

మరునాడు ఉదయం లేచిన వెంటనే భువనేశ్ మందాకిని కోసం వెతికాడు, ఆ పిల్ల గది లోపలి సోఫాలో మాగన్నుగా నిద్రపోతూంది. వరూధిని కోసం చుట్టు ప్రక్కలకు చూపుసారించాడు. అప్పుడే ఆమె గుడ్ మోర్నింగ్ – అంటూ కాఫీ కప్పు లతో ప్రవేశిస్తూంది. ఆమె ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా నిండుగా ఉన్నట్లు తోచింది. అతడామె ముఖంలోకి సరాసరి చూడకుండానే కాఫీ కప్పు అందుకుని- “సారీ! అలా ఔతుందని నేనుకోలేదు వరూధినీ—’

“సారీయా! ఎందుకూ? మనమేమిటి టీనేజర్సుమా తత్తరపాటుకి లోనవడానికి— ఇద్దరమూ అడల్ట్సుమేగా! ”

“మరీ క్యాజ్వువల్ గా మాట్లాడకు వరూధినీ! కంపరం కలుగుతూంది. అప్పటికి నువ్వు ప్రభలా కనిపిస్తేనూ—’

“కనిపిస్తేనూ కాదు... అలా కనిపించడం వల్లనే నాకంతటి ఆనందం యివ్వగలిగారు! స్వర్గలోకపు సరిహద్దుల వరకూ తీసుకెళ్ళ గలిగారు” అని అతడికెదురుగా కుర్చీలో కూర్చుంటూ అతడి పెదవుల్ని ముద్దాడుతూ “థేంక్స్! ” అంది.

థేంక్సా- అంటూ అతడు ఆమె కళ్ళలోకి ఆశ్చర్యంగా చూసాడు.

“ఔను. నిజంగా థేంక్సే—ఎందుకో కారణం చెప్పమంటారా— “

ఉఁ అని తలూపాడాతను.

“మొదటి కారణం-నన్ను మీరు ప్రభావతిలా ట్రీట్ చేసినందుకు. రెండవది— ఒక స్త్రీ శరీరాన్ని మీరు డీప్ యెమోషన్స్ తో— డీప్ రెస్పక్టుతో డీల్ చేసినందుకు—“

“నిజంగానే నన్ను అప్రిసియేట్ చేస్తున్నావా వరూధినీ! ”

ఆమె నవ్వి “ఆడదానిగా నేనింత కంటే యెక్కువేమి చెప్పను? ” అంటూ ఇద్దరి చేతుల్లోనున్న కాఫీ కప్పుల్ని తీసి ప్రక్కన పెట్టి అతడి రెండు చేతుల్నీ అందుకుని కళ్ళకు హత్తుకుంది. అతడు ఆమె కళ్ళలోకి చూస్తూండిపోయాడు. అది యెమోషనల్ ఫీల్ ఆఫ్ లవ్ కాదు. డీప్ ఫీల్ ఆఫ్ గ్రాడ్యుట్యూడ్-- అతడామెను ఉన్న ఫళాన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.

తెలుసో తెలియకనో అతడిప్పుడు మరొక ప్రభావతిని చూస్తున్నాడు. ఎవరి పిలుపో అందుకుని పిన్న వయసులోనే పరలోకం వేపు సాగిపోయిన తన కన్న కూతురు సుభాషిణి మరొక తల్లిని కళ్ళెదుట చూస్తున్నాడు.


పదాలకు అందని ఆనందం అతడిలో ద్విగుణీకృతమైంది.

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



92 views0 comments

Comments


bottom of page