top of page
Writer's picturePandranki Subramani

ది ట్రాప్ ఎపిసోడ్ 9

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'The Trap Episode 9' New Telugu Web Series



(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' తొమ్మిదవ భాగం

గత ఎపిసోడ్ లో

గుడి దగ్గర భువనేష్ నుదుట కుంకుమ పెడుతుంది వరూధిని.

ప్రభావతి ఆ విషయం గమనించదు.

మందాకినీ కోసం కొన్న గిఫ్ట్ లు ఇచ్చి రమ్మని భువనేష్ ని వరూధిని ఇంటికి పంపుతుంది ప్రభావతి.

పరమేశ్వర్ కి ఉద్యోగం రావడంతో ఇంటికి అవసరమైన చాలా వస్తువులు కొంటాడు.

ఇక ది ట్రాప్.. తొమ్మిదవ భాగం చదవండి…

నగరం నలుమూలలా ఉన్న ఆలయాలలో కార్తీక పూజలు జరుగుతున్నాయి. కార్తీక మాస వేడుకలు శుక్రవారం నుండి కోలాహలంగా ఆరంభమయ్యాయి. ఊరంతటా ఆధ్యాత్మిక శోభ అలుముకుంది. ఉదయమే ఆలయాల స్థానాచార్యులందరూ ప్రధాన అర్చకుల ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రావి చెట్టు దగ్గర ముత్తయిదువులూ కన్యలూ కలసి కార్తీక దీపాలు వెలిగించారు. మరి కొద్ది రోజుల్లో శ్రీకృష్ణ తులసీ కళ్యాణం. ప్రభావతి భర్తతో బాటు బయల్దేరింది. పవిత్రోత్సవాలు కావున భాగ్యం కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. అనంత పద్మనాభ స్వామికి మహాభిషేకం పూర్తయిన తరవాత ప్రసాదాలు అంది పుచ్చుకుని ఇల్లు చేరారు.

ఇల్లు చేరిన తరవాత భర్త పరాకుగా ఉండటం గమనించిన ప్రభావతి కాఫీ కప్పు అందిస్తూ అడిగింది- “ఏమయింది అలా పరాకుగా పరధ్యానంగా కనిపిస్తున్నారు! ఏమయిందో కట్టుకున్న దానికి చెప్తే కదా మనసు తేలిక పడుతుంది. ఉఁ చెప్పండి”

“నా తరపున చెప్పడానికి యేమీ లేదు. నిన్ను చూస్తుంటే, నావేపు చూపులు సారించే విధం చూస్తుంటే, యేదో చెప్పాలనుకుని తర్జన పడ్తున్నట్టు కనిపిస్తున్నావు”


“ఉఁ చెప్పాలనే అనుకుంటున్నాను. మరి, మీ మూడ్ యెలాగుందోనని. మీ డిపీసీ వ్యవహారం పూర్తవలేదుగా!”

“దానికేముంది? నీ గోడు నువ్వు చెప్పు. ఏదైనా నోము నోచాలనుకుంటున్నావా! వ్రతాలు పూనుకోవాలను కుంటున్నావా! వాటిలో నన్ను కలుపు కోవాలనుకుంటున్నావా?”


“ఊఁహుఁ! అటువంటివి ఇప్పుడు ఉండవు, ఆలయ దర్శనాలు తప్ప— సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ ఒకటి ఉంది- అంతే--”

“నువ్వింకా మేటర్ కి రావడం లేదు ప్రభా.. స్ట్రెయిట్ గా విషయానికి రా—’


“వస్తున్నాను. విషయాన్ని చెప్ప వలసిన రీతిలో చెప్తేనే కదా రక్తి కట్తుంది. అందవలసిన రీతిలో అందుతుంది. రేపు మనమిద్దరమూ వరూధిని గారింటికి వెళుతున్నాం”.

భువనేశ్ నివ్వెరపాటుతో కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు- “మళ్ళీనా! మొన్ననేగా మనం కలసి గుడి దర్శనం చేసుకుని వచ్చాం- నీకు వరూధిని గారి పట్ల ప్రేమాభిమానాలు ఉండవచ్చు. అలాగని— బుడుంగు బుడుంగున వాళ్ళింటికి మాటి మాటికీ వెళ్ళి డిస్టర్బ్ చేయడమా-- వరూధినిగారు బిజినెస్ మ్యాగ్నెట్ అన్నది మరచిపోకు, మొన్నకూడా మందాకిని కోసం యివ్వడానికి గిఫ్టులు తీసుకెళ్ళినప్పుడు ఆమె చాలా బిజిగా ఒక పంజాబీ అఫీషియల్ తో మాట్లాడుతూ ఉంది. పానకంలో పుడకలా వెళ్ళి ఆమెగారిని డిస్టర్బ్ చేసినట్టు యిబ్బందిగా ఫీలయాను. ఇప్పుడు వద్దుగాని- మరొక వారం రోజుల తరవాత వెళదాం. సరేనా—”

“లేదు. రేపు మనం తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ పిల్లకు యిష్టమైన ఐస్ కోన్స్ తీసుకెళ్ళి యివ్వాలి”


“అంత కచ్చితమైన టోన్ తో చెప్తున్నావు, కారణం చెప్పగలవా.. ఇఫ్ యు డోంట్ మైండ్—”


“కారణం ఉంది. రేపు పుట్టిన రోజు”


“నీకేమయింది ప్రభా? మొన్ననేగా ఆ పాప పుట్టిన రోజుకి వాళ్ళమ్మతో కలసి గుడికి వెళ్ళి ఏవో గిఫ్టులు కూడా ప్రజెంట్ చేసాం. మళ్ళీ పుట్టిన రోజంటావేమిటి--”

“పుట్టిన రోజు మందాకినిది కాదు. మన పాప- స్వర్గం చేరుకున్న మన పాప సుభాషిణిది”.

ఆ చివరి మాట విన్నంతనే పిడుగు పడ్డట్టు లేచి నిల్చున్నాడు. ప్రభావతి వేపు అర నిమిషం పాటు చూస్తూండిపోయి గొణిగి నట్లు అన్నాడు భువనేశ్- “ఐయామ్ సారీ! ”


“ఇందులో సారీ చెప్పడానికేముందండీ! మగరాయళ్ళకు నూరు పనులుంటాయి. ప్లీజ్. సర్దుకుని కూర్చోండి”


“అదికాదు ప్రభా! కన్నతల్లిగా కూతుర్ని నువ్వు గుర్తుపెట్టుకున్నట్లుగా, కన్నతండ్రిగా నేను అమ్మాయి పుట్టిన రోజును గుర్తుపెట్టుకోలేక పోయాను చూడూ--”


ప్రభావతి ఊరడింపుగా అంది-- “ఇందులో నొచ్చుకోవడానికి యేముంది భువనేశ్! నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. బిజినెస్ మీట్సుతో బిజీ లైఫ్- ఇవన్నీ గుర్తు పెట్టుకునేంత తీరిక మీకెక్కడుంటుంది? మరి— మనం రేపు వరూధిని వాళ్ళింటికి వెళ్తున్నాం కదూ! ”


అతడేమీ అనలేదు. ప్రభావతి రెండు చేతుల్నీ అందుకుని పెదవుల వద్ద ఉంచుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. దూరాన గుడిగంటలు మ్రోగడం వినిపిస్తూంది. నాదస్వరం ఉద్వేగపు ఊపుతో అందుకుంది.


మరునాడు ఉదయం దంపతులిద్దరూ పెందలకడే లేచి, భవానీదేవి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని, మందాకిని కోసం వస్తువులు కొనుక్కొని, దారిలో బాలికల స్కూలు వద్ద కారునాపి ఎదురొచ్చిన పిల్లలందరికీ విషయం చెప్తూ చాక్లెట్టు పంచి, వరూధిని వాళ్ళ యిల్లు చేరుకున్నారు.


వరూధిని సంతోషంగా తలుపు తీసి భార్యా భర్తలిద్దరికీ ప్రత్యుత్థానం చేసి తాగడానికి ఇద్దరికీ మంచినీళ్ళిచ్చి స్నేహభావం ప్రస్ఫుటించేలా అంది- “మంచి పనయింది. సమయానికి వచ్చారు. అరగంట తరవాత గాని వచ్చుంటే ఈ పాటికి కంపెనీ చేంబర్ లో ఉండేదానిని—”.


భువనేశ్ అదే స్నేహపూర్వక టోన్ తో స్పందించాడు- “దానికేముంది మేడమ్— మీరు సాఫీ గా వెళ్ళిరండి. మేం మందాకినితో సరదాగా గడిపి వెళతాం. కావాలంటే పాపని స్కూలుకి దిగబెట్టి కూడా వెళతాం. అసలీరోజు మేమిక్కడకి వచ్చింది మందాకినిని పలకరించి వెళ్ళడానికే—“అని కళ్ళు మిటకరిస్తూ నిల్చున్న వరూధినికి విషయం చెప్పాడు సాఫీగా-క్లుప్తంగా--


“ఓ— అదా సంగతి! ఐ యామ్ రియల్లీ సారీ ప్రభావతీ! అంత చిన్న వయసులో పాప పోవడం మనసుని కలచి వేస్తున్నట్లుంది, బైదిబై— పాప ఫొటో ఉందా! చూడాలని చాలా ఫీలింగు కలుగుతూంది”.


“మరొక పోటో యెందుకు? అదిగో వస్తూందే మన మందాకిని.. దీనికి డూప్లికేట్టే సుభాషిణి"


ఆ మాటతో వరూధిని పలుకు లేకుండా మౌనపు పరదాలోకి వెళ్ళిపోయింది. అంకుల్- అంటూ పలకరిస్తూ వచ్చిన మందాకినిని ప్రభావతి రెండు చేతుల్తో అందుకుంది; వెంట తెచ్చుకున్న చాక్లెట్లూ తదితర ఆట వస్తువులూ అందించి అంది- “అమ్మ కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళ వలసి ఉందట— నువ్వు మాతో ఉంటావా? నిన్ను స్కూలుకి దిగబెట్టి క్లాసు విడిచేంత వరకూ అక్కడే ఉండి ఆ తరవాత మన ముగ్గురమూ హోటల్ విస్టాలో మధ్యాహ్న భోజనం చేసి వద్దాం. సరేనా!’

“అయ్యో! ఈరోజు నాకు స్కూలు లేదు కదా! నేనిక్కడే మీతో ఆడుకుంటూ గడపుతాను. మెయిడ్ సర్వెంటు సురేఖ ఉంది కదా.. మనకేమేమి కావాలో చేసిపెడ్తుంది. అంతే కదా మమ్మీ---”


”ఇప్పుడంత సీన్ అవసరం లేదు గానీ. నేను ఈరోజు ఆఫీసుకి ఆలస్యంగానే వెళతాను. ఇంటికి వచ్చిన గెస్టులను అలక్ష్యం చేసి వెళ్ళడమా? నెవర్— ఈ రోజు ఆంటీ అంకుల్ యిద్దరూ మనతో కలసి భోంచేసి వెళతారు. ఈ లోపల వాళ్ళకిష్టమైన వంటల కోసం ఏర్పాటు చేస్తాను. నువ్వేమో అంకుల్ ఆంటీలకు విసుగు కలిగించకుడా చూసుకో! ఓవర్ యాక్ట్ చేయకు”

“అలాగే మమ్మీ! నేను అంకుల్ నీ ఆంటీనీ తీసుకెళ్ళి మన గదులన్నీ చూపిస్తాను” అంటూ ఇద్దర్నీ అంది పుచ్చుకుని మేడ మెట్లవేపు నడిపించింది. మరి కొద్ది సేపట్లో పనిగత్తె సురేఖ రెండు కప్పుల కాఫీ చేసి పట్టుకెళ్ళి యిచ్చింది. కాఫీ కప్పులు అందుకుంటూ రెండు వంద రూపాయల నోట్లు అందిస్తూ అంది- “ఈరోజు అనారోగ్య కారణం వల్ల చనిపోయిన మా అమ్మాయి పుట్టిన రోజు. మా యింటి హౌస్ మెయిడ్ కి యిచ్చినట్లే నీకూ యిస్తున్నాం. క్రింది హాలులో రెండు పెద్ద సైజు చాక్లెట్ బార్ లున్నా యి. వాటిని తీసుకుని మీ యింటి పిల్లలకు యివ్వు--”


సురేఖ రూపాయి నోట్లు అందుకుంటూ అడిగింది- “మీ పాపని చూడాలని ఉందమ్మగారూ!”.


మందాకినిని చూపిస్తూ వరూధినికిచ్చిన బదులే యిచ్చి పాపతో ఆటలో మునిగిపోయింది ప్రభావతి.


మరికాసేపటికి వరూధిని అక్కడకు గలగలా నవ్వుతూ వచ్చింది- “మొత్తానికి అందరూ నా బెడ్ రూములో సందడిగా సమావేశమయ్యారన్నమాట- ఏది యేమైతేనేమి— నా పడక గదిని పావనం చేసారు. సహస్ర కోటి వందనాలు”.


ఆ మాట విన్నంతనే భువనేశ్ జెర్కింగుకి లోనయాడు. “సారీ మేడమ్! నిజంగా సారీ-- నేను పాపతో ఆడుతూ ఆటలో పడిపోయి అదేమీ గమనించలేదు. ప్రభావతి కూడా నాకు గుర్తుచేయ లేదు, ప్లీజ్ డోంట్ థింక్ అదర్ వైజ్—” అంటూ లేచి నిల్చున్నాడు.


దానికి వరూధిని స్పందిస్తూ అంది- “మీరు మరీను భువనేశ్ గారూ! ఇందులో మీరింతగా ఫీలవడానికేముంది? మగాడి ఉనికే లేని బెడ్ రూమ్ కదా— మిమ్మల్ని చూసి కొంచెం తికమక పడ్డట్టున్నాను. అంతే గాని— మరేమీ లేదు. ప్లీజ్! మీరు యిబ్బంది పడుతూ నన్ను యిబ్బంది పెట్టకండి--”


అలా అంటూనే ఆమె అతడి చేతిని చనువుగా అంది పుచ్చుకుని కూర్చోబె ట్టింది. అతడు థేంక్స్- అంటూ యధారీతిన కూర్చున్నాడు. అప్పుడు పనిగత్తె పానీయాలు నిండిన గ్లాసుతో గదిలోకి ప్రవేశించింది. అది గమనించి వరూధిని వాటిని అందుకుంటూ అందరికీ అందివ్వసాగింది. భువనేశ్ గ్లాసుని అందుకోవడానికి లేచి నిల్చోబోయాడు.


వరూధిని వారించింది- “మీరెందుకు లేస్తున్నారు భువనేశ్! నేనందివ్వనూ--’ అంటూ అతడి పైకి వంగి, తాకీ తాకని విధంగా భుజాలు ఒరుసుకుంటూ పానీయం గ్లాసుని అందించింది. అతడు గ్లాసుని అందుకుంటూ అటు మందాకిని ముఖం వేపు తిరిగాడు


“ఆట వండర్ ఫుల్ గా ఆడుతున్నావు సుభాషిణీ- సారీ- మందాకినీ! ”


మందాకిని తలెత్తి అంది- “నిజంగానా అంకుల్! మీరు ప్రక్కనుంటే మాడాడీ ఉన్నట్లే ఫీలవుతాను అంకుల్. ఆ ఉత్సాహంతో జోరుగా ఆడాలనిపిస్తుంది. మరి, మీకు అంకుల్?”

“చెప్పకుండా ఉంటానా! నీ ముందు కూర్చుంటే సుభాషిణిని చూస్తున్నట్లుంది. ఆ రోజుంతా ఎక్కడకి వెళ్ళినా యేమి చేస్తున్నా నీ ముందు కూర్చున్నట్లే ఉంటుంది”.


మందాకిని ఊరుకోలేదు. “ మరి— ఆంటీకి యెలా ఉంటుంది?”


ప్రభావతి తక్షణం స్పందిస్తూ మందాకినిని దగ్గరకు తీసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ అంది- “నేను వేరు— మీ అంకుల్ వేరా! డిటో—డిటో—


అప్పుడు వరూధిని మరొకసారి గలగల నవ్వుతూ “ఇక ఆటా పాటా చాలించండి. రండి— భోజనం చేద్దురు గాని—”

అంటూ ప్రభావతి చేయి పట్టుకుని లాగింది.


గబుక్కున లాగిందేమో— ప్రభావతి పట్టుతప్పి భువనేశ్ పైన పడింది. అదే ఊపున వరూధిని కూడా మరొక వైపున అతడి పైన వాలి జారిపడిపోకుండా మెడను వాటేసుకుంది-“సారీ! రియల్లీ సారీ భువనేశ్—’


“ఇందులో అంత పెద్దగా సారీలు చెప్పడానికేముంది వరూధినీ! కావాలని పడరుగా— నిజానికి ప్రభావతి వల్లనేగా పడ్డారు. ఇట్స్ ఆల్ రైట్—” అంటూ నిటారుగా లేచి గది బయటకు నడిచాడు. అప్పుడు మందాకిని తాడు కొసని అందుకుంది “అదేమిటి ఆంటీ! అమ్మసారీ చెప్పింది. మరి— మీరు అంకుల్ కి సారీ చెప్పలేదే— వై-అంకుల్?”


ఆ క్వరీకి ప్రభావతి పక్కున నవ్వింది. నవ్వుతూనే మందాకిని కళ్ళలోకి చూసింది. ఆ చూపులోని భావస్రవంతి వరూధినికి అర్థమైంది- “నేనూ మీ అమ్మా ఒకటా! ”

భోజనాలయిన తరవాత భార్యాభర్తలిద్దర్నీ సాగనంపుతూ వరూధిని అడిగింది- “ఎలాగుంది భువనేశ్ గారూ! ”


“దేనిగురించి అడుగుతున్నారు వరూధినీ? ఘుమఘుగలాడిన వంట గురించా లేక తళుకులీనిన మీ పడక గది గురించా—”

“ సరదా మూడ్ లో ఉన్నాం కదా-- రెండు ఐటమ్స్ గురించీ చెప్పండి”


“క్లుప్తంగా ఒకే లైనులో చెప్తాను. రెండిట్లోనూ— టేస్టాఫ్ ది ఉమన్- సెంటాఫ్ ది విమన్-- రెండూ నదీ తీరాన వీచే గాలుల్లా పరిమ ళించాయి”


ప్రభావతి భర్త వ్యాఖ్యానానికి మెచ్చుకోలుగా తప్పట్లు కొట్తూ అంది- “మరి నీ తరపున నువ్వేదైనా చెప్పాలి కదా! ” అని వరూధిని వేపు సూటిగా చూసింది.


“ఉఁ. చెప్పాలి. చెప్పొద్దూ మరి- కాంప్లిమేంట్ తీసుకున్న తరవాత మన తరపున కాంప్లిమేంట్ యివ్వాలి కదా! మగటిమి గల రొమాంటిక్ టేస్ట్ మీవారిది. చాలా?”


ప్రభావతి తేలిగ్గా నవ్వుతూ వరూధినిని దగ్గరకు తీసుకుని అంది- “మొత్తానికి మా వారు హీ మ్యాన్ అన్నమాట— ఇంతకంటే ఒక ఆడదానికి యేమి కావాలి”

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం




మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



35 views1 comment

1 comentário


pandrankis
pandrankis
20 de nov. de 2022

మల్లవరపు సీతారాం కుమార్ గారి కథా పఠనం బాగుంది.చక్కటి ఉఛ్ఛరణ.మన:పూర్వక మెచ్చుకోలు

Curtir
bottom of page