top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 11/10/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు.


వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు. మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె. తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది. వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.


చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ కనబడలేదనే వార్త గురించి మాట్లాడుకుంటారు వెన్నెల, ఆమె స్నేహితురాలు యమున. గతంలో మద్యం తాగి వచ్చిన చంద్రంతో మాట్లాడదు వెన్నెల. చంద్రం గురించి మాట్లాడుకుంటారు యమునా, ఆమె భర్త వంశీ. చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల. ఇరువైపుల పెద్దలూ కలుస్తారు. కొడుకునే సమర్థిస్తారు చంద్రం పేరెంట్స్.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 10 చదవండి.



“తొందరపడ్డావేమోనే..” తన భర్త చంద్రం నుంచి నేరుగా వచ్చేసినట్టు వెన్నెల చెప్పడంతో యమున అన్నది..


యమున ఆఫీసు నుంచి వచ్చీరాగానే వెన్నెల ఆ విషయం చెప్పింది. అప్పుడేమీ యమున మాట్లాడలేదు. అవునా అన్నట్లు కళ్ళతోనే అడిగింది, లంచ్‌టైంలో. తినడం ముగించాక అందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళారు. ఇక అక్కడ ఇద్దరే మిగిలి ఉండటంతో యమున అలా అన్నది.


"తొందరపడ్డానా..” వెన్నెల క్షణం ఆలోచించి అన్నది.


"అనిపిస్తోంది నాకు..” సాలోచనగా అంది.


ఇలా వారం రోజులు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానే. అతడిలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి మరీనూ. రోజూ బాగా తాగి వస్తున్నాడు. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు. భరించడం నా వల్ల కావడం లేదు. మా అత్తగారు మాత్రం తనకొడుకు మేలిమి బంగారం అంటోంది. ఎటొచ్చి నేనే మిడిసి పడుతున్నానుట. తన కొడుక్కి విడాకులిస్తే నిమిషాలలో పెళ్ళి చేస్తుందట. ఆడపిల్లలు సంతలో బోలెడు మంది వరసలో నించునట్లు మాట్లాడుతోంది.


ఆ ధోరణి చూస్తే నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇక నా వల్ల కాదు. కావడంలేదు కూడా.. ఏదైతే అది అయ్యిందని మొన్న శనివారం నాడు రాత్రి నేను వేరే ఫ్లాట్‌ కి మారిపోయాను. నీకు నిన్న ఫోన్‌ చేసి చెబుదామనుకున్నాను. ఆదివారం నాడు నీకు తలనెప్పి ఎందుకని చెప్పలేదు. నేను వెళ్ళే ముందు ఒక చీటీ రాసిపెట్టి వెళ్ళాను..


రాత్రి పది గంటలయ్యింది. రాత్రి పదకొండు గంటల కనుకుంటాను. చంద్రం అప్పుడు ఇంటికి వచ్చినట్లున్నాడు. చీటీ చూసి ఫోన్‌ చేశాడు. నేను లిఫ్టు చేయలేదు. నిన్న పొద్దున్న ఫోన్‌ చేశాడు. ‘మంచి పద్దతి కాదు. ఇంటికి రా’ అన్నాడు. నేను రానన్నాను.. ఫోన్‌లో తిట్టాడు. నేనూ తిట్టాను. అంతే ఫోన్‌ కట్‌ చేశాను”

చెప్పింది అశ్రునయనాలతో వెన్నెల.


“అవన్నీ చూస్తూ అక్కడే ఉండమని చెప్పను గానీ.. ఇలా జరిగి ఉండకూడదనిపిస్తోంది నాకు.. " యమున అన్నది.


“అవును! అలా జరిగి ఉండకూడదు.. హాయిగా భర్తతో ముద్దు ముచ్చట్లతో, భర్త కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగి ఉండాలిగానీ.. ఇలా విడివిడిగా ఉండటమేమిటీ? నా ఖర్మ కాకపోతే.. " వెన్నెల అంటూనే ఒక్క ఉదుటున ఏడ్చేసింది.


ఓదార్పుగా చెయ్యి వేసింది యమున.


"శాశ్వతంగా విడిపోవాలని లేదే.. కానీ ఇలా కొంతకాలం దూరంగా ఉంటేనన్నా చంద్రంలో మార్పు వస్తుందేమోనన్న ఆశ. మనిషి లేకపోయినప్పుడే ఆ మనిషి విలువేమిటో తెలుస్తుంది కదా..” చెప్పింది వెన్నెల.


నువ్వన్నది నిజమే ! చంద్రంలో మార్పు వస్తుందని, రావాలని నేను కోరుకుంటున్నాను.. కానీ నీ కాపురం లో ఇలా జరగడం నాకు చాటా బాధగా ఉంది.. యమున

గద్గతిక స్వరంతో అన్నది. కాసేపు ఇద్దరి మధ్యా మౌనరాజ్యం ఏలింది.


“పోయిన వారం రెండు సంచలనాలు జరిగాయి..” సాలోచనగా అన్నది యమున.


“రెండా ! ?.. అమిటీ?" వెన్నెల అడిగింది భృకుటి ముడివేసి.


"భర్తనుంచి నువ్వు వేరే వెళ్ళిపోవడం, కళ్యాణి ప్రేమలో పడడం. "


“అవును కదా! రెండూ సంచలనాలే మరి.. " వెన్నెల అన్నది చిరునవ్వుతో.


ఆ వయసులో ఉన్న ఎక్కువమంది ఆడపిల్లలు చేస్తునట్లుగా నే కళ్యాణి చేసిందని తేలిగ్గానే తీసుకున్నది.


వెన్నెలకు సలహా ఇవ్వగలదే కానీ తను అంతకు మించి ఏమీ చేయలేనని ఆమెకు తెలుసు.


“నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది అవునో కాదో కూడా నేను చెప్పలేను వెన్నూ, కానీ ఇలా జరగకుండా ఉంటే బాగుండునని మాత్రం అనిపిస్తోంది..” యమున

అన్నది.


“ఆ మాటకొస్తే నేను ఖచ్చితంగా చెప్పలేనే యమూ! నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా రైట్‌ అని..” తనూ లేచి అన్నది వెన్నెల.

----------------------------------------

రాత్రి చాలా పొద్దుపోయింది. పదిగంటలు కావస్తోంది. ఎఫ్‌మ్ రేడియో వివిధభారతి పెట్టింది. అనౌన్సర్‌ చెబుతోంది.


అనుపమ సినిమా. గీతరచయిత కైఫీ అజ్మీ( షబనాఆజ్మీ వాళ్ళ నాన్న) సంగీతం హేమంత్‌కుమార్‌. పాడినవారు లతా

మంగేష్కర్‌.


ఆహా ఏమి పాట. ఒకసారి నాన్న ఒళ్ళో కూర్చొని ' భూళేబిస్‌రే గీత్' విన్నపాట. మళ్ళీ ఈ సమయంలో.


ధీరే ధీరే మచల్‌ ఐదిల్‌ - బేకరార్‌, కోయి ఆ తా హై

యా తడప్ కీ న తడపా - ముఝే బార్‌ బార్‌ కోయి ఆతా హై

( కాస్త నెమ్మదించవే మనసా.. ఉద్రేకపడకు.. ఎవరో వస్తారులే)


ఉస్‌ కే దామన్‌ కీ ఖుష్‌ బూ హవాహోం మే హై..

ఉస్‌ కే కదమోం కీ అహట్‌ హవాహోం మే హై..

ముఝుకో కర్నేదే కర్నేదే సోలా సింగార్‌.. కోయి ఆతా హై


( అతడి ఒంటి సుగంధం అంతా గాల్లో వ్యాపిస్తూ ఉంది

అతడి పదన్యాసాల చప్పుళ్ళతో ఆశయమూ ఉంది..

నన్ను అందంగా సింగారించుకోనియ్‌ మరీ.. ఎవరో వస్తారులే)


ముఝుకో.. భూనేలగీ ఉస్‌కీ ఫర్‌ చాయియా

దిల్‌కే నజ్‌దీక్ బజితీ హై షహనాయి యా..

మేరే సప్‌నోంకి ఆంగన్‌ మే గాతీ హై ప్యార్‌.. కోయి ఆతా హై

( అతడి నీడలన్నీ నన్ను తాకుతున్నాయి సుమా..

గుండెనిండా అన్నీ ప్రేమగీతాలే కదా.. ఎవరో వస్తారులే

నా స్వప్నాల వాకిట్లో అన్నీ ప్రేమగీతాలే కదా)


దూర్‌ కే పహలే జీ భర సతావుంగీ హై

జబ్‌ మనాయేంగే లో మాన్‌జాయాంగీ మై..

దిల్‌ పే రక్‌ తా హై ఇసే యే కబ్‌ ఇఖ్తయార్‌.. కోయి ఆతా హై

( ముందుగా అలిగిపోతాను.. బాగా తిప్పలుపెడతాను..

అతడు బుజ్జగించాకే ఒప్పుకుంటాను

ఇలాంటి క్షణాల్లో గుండెమీద ఏం అధికారం ఉంటుంది.

చెప్పు.. ఎవరో వస్తారులే మరి.. )


ఏభైఐదేళ్ళ క్రితం (1966) లో అందాలను ముచ్చట్ల రూపంలో ఆర్తిగా చెప్పాలనుకుంటే విని ఆహా! ఓహో ! అనేవారు ఎందరో ! కాస్తంత ఓపిక చేసుకోవాలి, కాని ఏ తరం వారైనా మురిసిపోయే అందాల ముచ్చట్లు అవి.


రసికమిత్రులారా ! సంగీతం అమరమైనది. తరాలు మారినా కొద్ది హంగులూ, ఢంగులూ మారవచ్చు. కాని అసలు, సిసలు సంగీతము చెవుల్లో జోరీగ గోలలా, లొల్లి సంగీతములా రెండురోజుల రాజవైభోగం అనుభవించి అంతమైపోదు.


ఒక్కమాటలో చెప్పాలంటే అలనాటి బంగారు యుగంలోని గీతాలు నిజంగానే గుండెలో గూడుకట్టుకున్న వరహాల పారిజాతాలు. ఆ గీతాలు, ఆ అందాలు గ్రోలడానికి డాబా మీద వెన్నెల రాత్రులు అవసరం లేదు. మెచ్చిన ఆత్మీయులు "గున్‌గునాయించి నాంచనలు ఆహా! అనుకోని మనస్సు అరుదు"


"అనుపమ అంటే పోల్చలేనిది అని అర్థం. అక్షరాల అదే వాస్తవికత కూడానూ !


హృషీకేశ్‌ముఖర్జీ, హేమంత్‌కుమార్‌, తరుణ్‌ఘోష్‌, షర్మీలాటాగూర్‌ బెంగాలీ జీనియస్‌లు! గీత రచయిత కైఫీ అజ్మీ. వారు భావాలు నరనరాన జీర్ణించుకున్న స్వాప్నిక

వాస్తవం ఎరిగిన కవి. ధర్మేంద్ర " హీమాన్‌" పంజాబ్‌జాట్‌. సినిమా ఎన్నో అవార్డులు రివార్డులతో బాక్సాఫీస్‌ హిట్టయింది.


'కుచ్ దిన్‌ నే కహా ' ధీరేధీరే మచల్‌, లతా పాడింది. ' భీగిభీగి పజా, అనే ఛలాకీ శశికళా గీతం, ఆశాభోంస్లే గొంతుక నుండి జాలువారింది. 'యా దిల్‌ కి సునో' సాక్షాత్ హేమంత్‌కుమార్‌ గీతాల్లో ప్రముఖమైనది. షర్మిలా, ధర్మేంద్ర ల నటనకోసం 'అనుపమ'వెండతెర మీద జ్ఞాపకాల బంగారు తోరణాలు కట్టింది.


అదంతా ఒక ఎత్తు.. పియానో మీద ' సురేఖాపండిట్‌' గోముగా పాడితే ; తరుణ్‌బోస్‌ తన్మయత్వంగా వినే అలనాటి అందాలు పట్టుకోని, అంటుకోని రమ్యమైన ప్రణయగీతం ఇది. ఒక తరం.. ! అంటే ఇంకో తరం 'హూ' అనొచ్చు. కాని ఓపిక చేసుకుని వినేతరం వారైనా సరే జీవితంలో అలనాటి సురేఖాపండిట్‌ తారసపడితే బావుండు అనుకుంటారు. ఇది

నిజం. షరతు ఒక్కటే. మన ఇంటా-బయటా రొమాన్స్‌ ఉండాలి.

-------------------------------

మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది.

' మీ రిద్దరూ ఎన్ని గంటలకు వెళ్ళారు?" ఎ. సీ. పి యాదిరెడ్డి అడిగాడు రవళిని నిధానంగా.


మనోరమ అదృశ్యం కేసుకు సబందించి విచారణలో బాగంగా ఎసీపీ యాదిరెడ్డి ఆ రోజు రవళిని తన కార్యాలయానికి పిలిపించాడు. అంతకు ముందు మనోరమ పని చేసే ఆఫీసుకు వెళ్ళి ఆమె గురించిన వివరాలు తెలుసుకున్నాడు. మనోరమ పని విషయంలో ఏ విషయంలో తేడా లేదని ఆఫీసులో కూడా ఎవ్వరితోనూ, ఎవ్వరేమన్నా మాట్లాడే మనిషి కాదని, మాట పడే స్వభావము కాదని, ఆఫీసుకు ఆలస్యంగా రావడం, పర్మిషన్‌ పెట్టడం లాంటివి అస్సలు చేయదని, ఠంచనుగా ఆఫీసుకు వస్తుందని చెప్పారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోమని, ఆఫీసు పనే

ముఖ్యమని చెప్పారు.


తరువాత మనోరమ ఉండే అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ ను పిలిపించుకొని దర్యాప్తు చేశారు. మనోరమ ఏ అర్దరాత్రో ఫ్లాట్‌కి వస్తుందని అప్పుడప్పుడు తూలుతూ కూడా

వస్తుందని ఇతర విషయాలలో మాత్రం నిక్కచ్ఛిగా ఉంటుందని, మాట పడదని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత రవళిని పిలిపించాడు యాదిరెడ్డి. రవళి మొదట మాట్లా

డకపోయే సరికి ప్రశ్న రెట్టించాడు.


అంతే కాదు " చూడండి.. మీరు ఉన్నది ఉన్నట్లు

చెబితే మీకే మంచిది.. లేదా ఒక పోలీస్‌ ఆఫీసర్‌ను తప్పు త్రోవపట్టించారన్న మీరు తప్పు చేసిన వారవుతారు. దానికి మీరు శిక్ష అనుభవించ వలసి వస్తుంది. ప్లీజ్‌.. ఏం జరిగిందో వాస్తవాలు చెప్పండి " అన్నాడు గంభీరంగా.


"ఆరున్నర, ఏడు గంటలకి వెళ్ళాం సార్‌” చెప్పింది రవళి.

ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది.


'ఎక్కడికి వెళ్ళారు'


' గెస్ట్‌ హౌస్‌, సార్‌'


గెస్ట్‌హౌస్‌ వివరాలు చెప్పింది రవళి.


“అది మినిస్టర్‌ గారి బంధువు గెస్ట్‌హౌస్‌ అనుకుంటాను”.


"తెలీదు, సార్‌.. మినిస్టర్‌ గారబ్బాయి దిలీప్ దని మాత్రం నాకు తెలుసు”.


“ఎందుకు వెళ్ళారు?”


ఏం చెప్పాలో రవళికి తెలీలేదు. పార్టీకని చెప్పాలా. అసలు చెప్పవచ్చా?ఏం చెబుతే ఏం జరుగుతోందని అనుకొంటారు. డైలామా లో పడింది.


“చెప్పండి.. ఎందుకు వెళ్ళారక్కడికి?”

"ఊరికే.. కాలక్షేపానికి వెళ్ళాం, సార్‌..” అంటూ చెప్పగలిగినందుకు హమ్మయ్య అనుకున్నది.


“అలా ఇంతకు ముందు వెళ్ళారా?”


“నేను వెళ్ళలేదు, సర్‌.. వాళ్ళు వెళ్ళారుట..”

"వాళ్ళంటే?"

“ఫ్రెండ్సు. ఇంకో ముగ్గురు సర్‌..”

“ఎవరు వాళ్ళు?"


“మిగిలిన నలుగురిలో మా రమ్ బ్యాచ్‌ లో ఊర్మిళ, మనోరమ మగాళ్ళలో చంద్రం, దిలీప్” ఆమె చెప్పింది భయం భయంగా. యాదిరెడ్డి నోట్‌ చేసుకున్నాడు.


“వాళ్ళలో మినిష్టర్‌గారబ్బాయి ఎవరూ?" అడిగాడు.

“దిలీప్‌ సర్‌”..


"దిలీప్‌.. తరువాత అక్కడ ఏం చేశారు? ఎన్ని గంటలు దాకా ఉన్నారు?” సూటిగా చూస్తూ అడిగాడు రవళిని.


కంగారుపడింది. తడబడింది తను చెబుతున్న విషయాలకు.


"ఊ చెప్పండి? అక్కడ ఏం చేశారు?” ప్రశ్న రెట్టించాడు, ఆమె సమాధానం చెప్పక పోవడంతో.


“వాళ్ళు హాట్‌డ్రింక్‌ పుచ్చుకున్నారు, సర్‌..” గొణిగినట్లు చెప్పింది.


"ఎవరూ.. ఎవరెవరూ.. ?”


ఆమె తల వంచుకుంది. అర్థమైనట్లు తల పంకించాడు.


“ఎన్ని గంటలకు మీరు అక్కడ నుండి బయలు దేరారూ ?”


ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. తాను బాగా తాగి ఒళ్ళు తెలీక అక్కడే పడుకుండి పోయిందామె. విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు.

ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది. చెమటతో తడిసిపోయింది డ్రెస్సు. లో దుస్తులు మరీ దారుణంగా తయారయ్యాయి. చేతి రుమాల్‌ తో ఎంత తుడుచుకున్నా చెమట ఆగడం లేదు. బాగా దాహం వేసింది.


ఆమె పరిస్థితి యాదిరెడ్డికి బాగా అర్థమయ్యింది. అటువంటి కేసులు కొన్ని వందలు చూశాడు తన ఆరేళ్ళ సర్వీసులో. క్రైమ్‌ కేసులు పరిష్కరించడంలో బహు నేర్పరి అని పేరు పొందాడు. ఫలితం ఆరేళ్ళ లో మూడు ప్రమోషన్లు, నాలుగు బదిలీలు అందుకున్నాడు. కానిస్టేబుల్‌ ఇచ్చిన గ్లాసుని అందుకుని గడగడా మంచినీళ్ళు తాగేసింది.

“ఇంకా కావాలా మేడమ్‌?" అడిగాడు కానిస్టేబుల్‌. వద్దని తలూపింది రవళి.


"జరిగింది జరిగినట్లు చెప్పండి.. అప్పుడే మీకు రక్షణ.. లేకపోతే ఈ కేసులో మీరు ఇరుక్కుంటారు. నిజం నిర్భయంగా చెప్పండి.. ఎన్ని గంటలకు అక్కడనుంచి బయలు దేరారు.. మనోరమ కూడా మీతోనే వచ్చిందా?” యాదిరెడ్డి అడిగాడు నిదానం గానే.

వాళ్ళు వెళ్ళిపోయారు సర్‌..” అంది లో గొంతుకతో.


“వాళ్ళంటే?"..


“నేను.. నేను.. పడుకుండిపోయాను.. మిగతావాళ్ళు వెళ్ళిపోయారు..”


అతడికి పరిస్థితి అర్థమయ్యింది.


“వాళ్ళతో బాటే మనోరమ కూడా వెళ్ళిపోయిందా?” అడిగాడు సూటిగా. ఆమె మొహం లోకి సూటిగా చూస్తూ.


“వెళ్ళిపోయిందట.. సర్‌.. నేను పడుకుండిపోయాను. వాచ్‌మెన్‌ చెప్పాడు మర్నాటి ఉదయం..”

ఇంక రవళిని ఏమీ అడగలేదు. ఆమె చెప్పిన సమాధానము తను అడగవలసిన ప్రశ్నలు అన్నీ నోట్‌ చేసి కాగితం మీద ఉత్తరం వ్రాసి ఆమె చేత సంతకం పెట్టించుకున్నాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ లేచింది. తన డ్రెస్సుతో సహా లోదుస్తులు అన్నీ స్నానం చేసినట్లు చెమటతోనే తడిసిపోయాయి. అప్పుడే మరీను మెన్సస్‌ వచ్చేసింది. ఓవర్‌బ్లీడింగ్‌.


'ఛీ దీని స్నేహము చెయ్యడమే తప్పయ్యింది. దీనితో వెళ్ళడ

మే నేను చేసిన పెద్ద తప్పు. వెధవ మందు అలవాటు చేసుకున్నాను.. ఛీ పాడు. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ మనోరమ ఎక్కడ చచ్చిందో కాని నన్ను

చంపుతోంది.. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఈ పోలీసులు. భగవంతుడా’, అనుకుంటూ స్టేషన్‌ నుంచి పరుగెత్తినట్లు బయటపడింది రవళి.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







69 views0 comments

Comments


bottom of page