top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 17/11/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.


కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.


మనోరమ చనిపోయినట్లు, ఆమె శవాన్ని మినిష్టర్ గారి తోటలో పూడ్చి పెట్టినట్లు చెబుతాడు వాచ్‌మెన్‌ యాదయ్య.


మినిష్టర్ గోవిందరావు కేసునుండి తన కొడుకును తప్పించే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. చంద్రాన్ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.


చంద్రాన్ని కలవడానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది వెన్నెల.

అతనికి ధైర్యం చెప్పి బెయిల్ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.


ఇక తొలగిన నీలి నీడలు చివరి భాగం చదవండి.


ఒక కాబినెట్‌ మినిష్టర్‌ కొడుకుని ఆ విధంగా అదుపులోకి తీసుకుని రావడం ఏం బాగాలేదు, యాదిరెడ్డీ!.. రేపు సి. యం. ముందు, హోంమంత్రి ముందు నేను ఏం

సమాధానం చెప్పాలి? ఈ సంగతి ప్రతిపక్షాలకు తెలిస్తే మంత్రిని రాజీనామా చెయ్యమని ఆందోళన చేస్తారు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. ఆ మాత్రము నీకు తెలి

యదా? అసలు ఒక అనామక కేసు విషయం లో నువ్వు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం ఏమిటీ? ఆమె చనిపోవడం వల్ల ఒక కుటుంబం కానీ, ఎవరి కైనా నష్టం కలిగిందా ?


ఇది మంచి పద్దతి కాదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేపు మీడియా ముందు దిలీప్‌ ను తీసుకు రాకు. మనం మంత్రి గారిని గౌరవించాలి. అక్కర లేని కేసులో ఉత్సాహం ప్రదర్శించవా, ప్రమోషన్‌ ఉండదు.. నీ కెరీర్‌ కు కూడా.... దిలీప్‌ ను వదిలెయ్‌”.


నిజానికి ఇటువంటి బోధనలు వినవలసి వస్తుందని ముందే ఊహించుకున్నాడు. దిలీప్‌ ను పట్టుకున్న తరువాతనే ఐజీ లో కదలిక వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి..


దిలీప్‌ ను వదిలివెయ్యడమా ! లేక ఐజీ మాటను లెక్కచెయ్యక పోవడమా?

ఐజీ మాట లెక్క చేయలేదని ట్రాన్స్‌పర్‌ చేస్తారా.. అది అసాధ్యం.. కేసు ఫైనల్‌ స్టేజిలో ఉంది. ఎలా చేస్తారు. చేస్తే ఐజీని కూడా కోర్టుకు లాగాలనుకున్నాడు. తలచుకుంటే లాయర్‌ రవిప్రకాశ్‌ ఇప్పటి కే కేసును బలంగా తయారు చేసుకున్నాడు. మొత్తం కూపీలన్నీ లాగాడు. మనోరమ బాడీకి పోస్ట్‌మార్టమ్ చేయించాడు. ఒంటి మీదున్న

వేలిముద్రలతో సరి చూపించాడు. చంద్రం, యాదయ్య, మల్లమ్మ చెప్పిన సాక్ష్యాలు, మనోరమ శవంని పూడ్చిన జాగా యొక్క ఫోటోలు మొత్తం కోర్టులో సాక్ష్యాలుగా చూప

బడ్డాయి.


చంద్రం ఆ తరువాత ఏసీపి యాదిరెడ్డి, లాయర్‌ రవిప్రకాశ్‌ ల సలహాతో అప్రూవర్‌ గా మారాడు. మొత్తం దిలీప్‌ చేసినట్లు, దానికి వాళ్ళ నాన్న మద్దతిస్తునట్లు వైనం, కేసును ఎలా మాఫీ చేయించుకుంటున్నారో మొత్తం రికార్డ్‌ చేయబడింది.

-------------------

మనోరమ కేసు మొత్తం చాలా పకడ్బందీ గా మారిపోయంది. ప్రథమ ముద్దాయి దిలీప్‌ పేరు. పూర్తిగా పోలీస్‌ కస్టడీ. ఈ లోగా కొడుకు విషయం బయటపొక్కేసరికీ గోవిందుకి ఏం చేయాలో అర్థం కాలేదు.


చట్టం తన పని తాను చేసుకుపోతూంటుంది కదా! ఆ విధంగా గోవిందుని మంత్రి పదవి నుంచి తొలగించారు. పులిమీద పుట్రలాగా అరెస్టు చేయబడ్డాడు. నాన్‌ బెయిలబుల్‌. బెయిల్‌ మీద బయటికి వచ్చిన చంద్రం, యాదిరెడ్డి తన వెంట జీపులో తీసుకెళ్ళాడు. సరాసర్ వెన్నెల ఉంటున్న అపార్ట్‌మెంట్‌ కి తీసుకుని వచ్చాడు.

అప్పుడు సాయంత్రం సంధ్యాసమయము. ఫ్లాట్ దగ్గరకు వచ్చి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు యాదిరెడ్డి. వెన్నెల తలుపు తీసింది. ఎదురుగా భర్త చంద్రం, ప్రక్కనే యాది

రెడ్డి.


"బెయిల్‌ ఇచ్చారు.... " అని ఇద్దరూ ఒకే సారి అన్నారు. లోపలికి రండి అన్నట్లు ప్రక్కకు తప్పుకుంది.


"మీ ఆయన్ని నీకు అప్పగించాను.. , వెన్నెలా.. జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వస్తా... బై... బై..” చెప్పి ఉండమన్నా వినకుండా వాళ్ళిద్దరికీ ఏకాంతం కలిగించి వెళ్ళిపోయాడు.


ఆమె మంచినీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది. యాది ధర్మమా అని మనిషి బాగానే ఉన్నాడు. కొత్త బట్టలు కొన్నట్టున్నాడు. బట్టలు కూడా క్రొత్తగానే కనబడుతున్నాయి. ఆమె కాఫీ కలపడానికి కిచెన్‌ లోకి వెళ్ళింది.


"వెన్నూ, ... " అని పిలిచాడు.


ఆమె వచ్చింది. "మంచి నీళ్ళు కావాలా.. ?” అనడిగింది.


"ఇలా కూర్చో.. " అన్నాడు. తన ప్రక్కన చూస్తూ ఆమె వచ్చి కూర్చుంది.


"సారీ, వెన్నూ.. ఐయామ్‌ వెరీ సారీ... నిన్ను చాలా చాలా బాధ పెట్టాను..” డగుత్తికతో అన్నాడు. ఆమె వైపు ఒక అపరాధభావంతో చూస్తూ.....

కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆమె నవ్వంది. ఆ నవ్వులో హుందాతనం ఉంది. ఓదార్పు ఉంది.... మీరేమీ

క్షమాపనలు చెప్పొద్దు.. మంచిగా ఉండండి.. చాలు అన్నట్లుంది ఆమె చూపులు.


భుజం మీద చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. సున్నితంగా ఆమె పెదవులపై చుంబించాడు. ఆమె ఒడిలో తలపెట్టుకుని అలానే పడుకున్నాడు. ఏ చంటి పిల్లాడిని స్వాంతన పొందినట్లు పొందాడు. అతడి పై వాలి అతడి నుదుటను ముద్దుపెట్టుకుంది.


పావుగంట అయ్యాక అతడు లేచాడు. “పదా! వెన్నూ!” అన్నాడు. ఆమె బయలుదేరింది. ఎలా వున్నది అలానే. చీరకూడా మార్చుకోకుండా.


' సామాను' అన్నాడు చంద్రం...


“తరువాత వచ్చి తెచ్చుకుంటాను..” చెప్పిందామె... తలుపు తాళం వేస్తూ. ముగ్గురి దగ్గర తాళం చేతులుంటాయి. కనుక నా రూమ్మేట్స్‌ వచ్చినా ఇబ్బంది లేదు.


ఇప్పుడు వెన్నెలకి గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఆమె భర్త లో వచ్చిన మార్పు ఆమెకు సంతృప్తి నిచ్చింది. ఇప్పుడు సంతృప్తికరంగా ఉంది. ఆటోలో ఇద్దరూ ఇంటి కొచ్చారు.

"చూశావా ! నువ్వు లేక ఇల్లు కళావిహీనంగా ఉందో. ఎంత భయంకరంగా ఉందో. పాడు పడ్డ పాత దెయ్యాలకొంపలాగా ఉంది".

'అవును కదా !’ అందామనుకుంది. కానీ మనసు వద్దని వారించింది. ఘర్షణ వద్దు అని.... మనషి నీ అధీనం లోకి వచ్చాడు. అంత కంటే కావలసిన దేముంది. ఆమె

మౌనంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. చిరు మందహాసం చేసి ఊరుకుంది.


అలా వాళ్ళ కథ కంచికి వెళ్ళలేదు. ఇంటికి వచ్చింది. మళ్ళీ జీవకళతో వాళ్ళిద్దరి జీవితం “తొలగిన నీలి నీడలు” లాగా

జీవితమే సఫలము, రాగాసుధాభరితము లాగా ప్రారంభించాలనుకున్నారు.


శుభంభూయాత్‌

========================================================================

సమాప్తం


తొలగిన నీలి నీడలు ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link: https://podcasters.spotify.com/pod/dashboard/episode/e2bvin4

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








113 views0 comments

Opmerkingen


bottom of page