top of page
Writer's pictureGadwala Somanna

'తొలకరి జల్లులు' పుస్తకావిష్కరణ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #తొలకరిజల్లులు, #TholakariJallulu, #బాలగేయాలు

సోమన్న "తొలకరి జల్లులు" పుస్తకావిష్కరణ చిత్తూరులో


'Tholakari Jallulu' Pusthakavishkarana - New Telugu Article On Book Of  Gadwala Somanna

Published In manatelugukathalu.com On 08/12/2024

'తొలకరి జల్లులు' పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న రచించిన 58వ పుస్తకం "తొలకరి జల్లులు" పుస్తకావిష్కరణ చిత్తూరు హరివిల్లు లలిత కళావేదిక ఆధ్వర్యంలో విజయం డిగ్రీ కళాశాలలో నాయుడు బిల్డింగ్, మిట్టూరు-చిత్తూరులో ఘనంగా జరిగింది.


ఈ పుస్తకం హరివిల్లు గౌరవాధ్యక్షులు శ్రీ కట్టమంచి బాల కృష్ణారెడ్డి, సభాధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి, కృతి స్వీకర్త శ్రీ వల్లేరి హరి నాయుడు, విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ. ఎల్. కృష్ణారెడ్డి, విశ్రాంత జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ చంద్రశేఖర్ పిళ్ళై మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఆవిష్కరింపబడింది. అనంతరం ఈ కృతిని శ్రీ డా. వల్లేరి హరి నాయుడు దంపతులకు అంకితం ఇవ్వడం జరిగింది.


అనతి కాల వ్యవధిలో 60పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్య కవి పత్తిపాటి రమేష్, గానకోకిల శ్రీమతి సుగుణ మద్దిరెడ్డి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి అరుణ కుమారి, హరివిల్లు కార్యవర్గం శ్రీ గోవింద్, శ్రీ మునిస్వామి, అతిరమహారథులు, ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు, సాహితీమిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 





-గద్వాల సోమన్న








21 views0 comments

コメント


bottom of page